నచ్చిన బ్లాగులు మరియు టపాలు (బ్లాగ్స్ అండ్ పోస్ట్స్)

Posted by తెలుగు'వాడి'ని on Sunday, December 2, 2007

తెలుగు బ్లాగుల రాశి గతకొద్ది కాలంగా బాగా పెరగటం వలన ఎన్నో, ఎన్నెన్నో మంచి టపాలు (Blog Posts) మనలో చాలా మంది కంట పడకుండానే మరుగున పడిపోతున్నాయి. కాకపోతే మనకందరికీ బాగా తెలిసినట్టుగా కూడలి, తేనెగూడు, జల్లెడ, తెలుగుబ్లాగర్స్ మొదలగు వెబ్ సైట్స్ ఉండడం వలన చాలావరకు మనం ఈ బ్లాగ్స్/పోస్ట్స్ గురించి తెలుసుకోవటానికి చక్కటి అవకాశం కలుగుతున్నది.

కానీ నాకెందుకో ఒక బ్లాగ్ పేరు/అడ్రస్ కన్నా ఆ బ్లాగ్ లో నాకు నచ్చిన పోస్ట్ ని (అంటే ఇది ఒక్కటే నచ్చినదని మిగతావి నచ్చలేదని పెడర్ధాలు తీయకండి సుమా) ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడతాను. అందుకు కారణం ఆ బ్లాగ్ లోకి వెళ్లి అందులో ఉన్న పదుల, వందుల టపాలను చదివే తీరిక ఉండకపోవచ్చు లేక ఆ కొద్ది సమయంలో ఆణిముత్యం లాంటి టపాలు కనపడకపోవచ్చు కనుక మన బ్లాగ్ లోకి కొత్తగా వచ్చే ఆ పదిమందికి ఇలాగైనా కొన్ని టపాలు డైరెక్ట్ గా పరిచయం చెయ్యటం మంచిదేమో అనే ఉద్దేశ్యమే నా ఈ చిన్ని ప్రయత్నం.

ఇలా కాకుండా మనకు అందుబాటులో ఉన్న చాలా బుక్-మార్కింగ్ సైట్స్ లో ఏదో ఒకటి ఎంచుకొని మనకు నచ్చిన అన్ని టపాలు (బ్లాగ్ పోస్ట్ ఆర్ సైట్ అడ్రస్) వాటిలో సేవ్ చేసుకున్న తరువాత ఒక అర్.యస్.యస్ ఫీడ్ తో మన బ్లాగ్ లో వాటిని చూపించవచ్చు. (ఇది నిజంగా చాలా మంచి పధ్ధతి కాకపోతే మనం ప్రత్యేకంగా ఆ సైట్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మరియు ప్రతిసారి లాగిన్ అవ్వాలి కొత్త పోస్ట్/సైట్ బుక్-మార్క్ చేసేటప్పుడు).

ఇక్కడ నేను ముఖ్యంగా Two Blogs గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి.

రాధిక గారి 'స్నేహమా' మరియు చేతన గారి 'నా కెమేరా'. మొదటి దానిలో ఆణిముత్యాల వంటి కవితలు, రెండవ దానిలో అధ్బుతమైన చిత్రాలు (photos). ఎన్ని సార్లు చూసినా/చదివినా మరలా మరలా చూడాలి/చదవాలి అనిపించడం వీటి ప్రత్యేకత, అందుకే వీటి గురించి ప్రస్తావించటానికి ముఖ్యకారణం.

సూచన :

రాధిక గారు : మీరు ఈ మధ్య చాలా విరామం తీసుకున్నారు కాకపోతే ఈ రోజే ఒక కొత్త కవిత చూశాను మీ బ్లాగ్ లో ... దీనితో మీ విరామానికి సెలవు చెప్పినట్లైతే అదే మాకు ఆనందం.

చేతన గారు : మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చాలా కాలం అయ్యింది కానీ ఇంకా మార్చలేదు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చెప్పండి.

కరుణశ్రీ గారి పుష్పవిలాపాన్ని వినిపించిన 'వికటకవి' గారికి, ఉషశ్రీ గారి మహాభారత, రామాయణాలను వినిపించిన 'ఆసా'(ఆస్ట్రేలియా నుంచి సాయి) గారికి ప్రత్యేక ధన్యవాదములు మరియు హృదయపూర్వక అభినందనవందనములు.

మనవి : ఈ క్రింద ఇచ్చిన లిస్ట్ నేను గత కొద్ది రోజులలో చదివిన వాటిలో నాకు బాగా నచ్చిన టపాలు.


 • మనసు భాష

 • కొంగుబంగారం
  మన దేశంలో ఎంతో విలువైన కళాసంపదలని కేజీల లెక్కలో అమ్మెస్తుంటాం – అదే విదేశాలలో అయితే, వాళ్ళ కళా సంపదని అపురూపంగా కాపాడుకొంటారు. మనం - తాతల కాలం నుంచి ఇంట్లో ఉన్న పుస్తకాలని సరిగా పరిరక్షించుకోం సరికదా, వాటి విలువ గుర్తించకుండా, పాత సామానులవాడికో, న్యూస్ పేపర్లు కొనేవాడికో, కిరాణా కొట్టువాడికో – పావలాకో, అర్ధకో అమ్మెయ్యటం సర్వ సాధారణం మన దేశంలో......

 • “కరుణశ్రీ” పుష్పవిలాపం మరియు పుష్పాంజలి

  ఈ రాజకీయ ఘోష నుంచి కాస్త హాయిగా తెలుగు సాహిత్యం వైపు పయనిద్దాము. అమృతగుళికల్లాంటి కరుణశ్రీ గారి కలం నుంచి జాలువారిన పుష్పవిలాపం మరియు పుష్పాంజలి విందాం. తెలుగు నేలలో అంతో ఇంతో సాహిత్యంతో పరిచయమున్నవాళ్ళందరికీ ఇది చిరపరిచితమే. ఆశ్చర్యమేమంటే, పద్యాల్లో భావం పుష్పాల యొక్క విలాపమే అయినా, ఆ బాధతో పాటు పద్యాల్లోని తీయనైన సాహితీసంపదను కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో సాహిత్యం, గానం మరియు సంగీతం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. వినండి.

 • బరువు - బాధ్యత

 • నేను - బినీతా - చంద్రబాబు రెడ్డి

 • సినిమా వాళ్ళ మాటలకి అర్థాలే వేరులే!!

 • Sankranti urf పెద్ద పండుగ

 • నా రహస్య ఎజెండా

 • ఔరా! 'రైతు' రాజకీయం.

 • తెలుగువాడి ఆక్రోశం

 • రామాయణం , మహాభారతం - శ్రీ ఉషశ్రీ గారి స్వరంలో

 • ప్రార్ధన

 • ట్రాఫిక్కబుర్లు

 • తొడ కొట్టిన తెలుగు కమల • ఒకవేళ ఇలాంటివే మరికొన్ని బ్లాగులు/టపాలు తెలుసుకోవాలి/చదవాలి అనుకుంటే రెండవ , మూడవ , నాలుగవ భాగాలుగా నేను ప్రచురించిన టపాలలో చదవవచ్చు/చూడవచ్చు.

  :::::::::::::::::::::::::::::::::::::::::::::::
  మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
  :::::::::::::::::::::::::::::::::::::::::::::::
  15 వ్యాఖ్యలు:

  Anonymous on Dec 3, 2007, 5:47:00 PM   said...

  తెలుగు'వాడి'ని గారు: మీ ఈ ప్రయోగం నిజంగా అభినందనీయం. అందుకు కృతజ్ఞతలు. మీరన్నట్టే బ్లాగ్ పేరు/అడ్రస్ కన్నా ఇలా డైరెక్ట్ గా నచ్చిన టపాలు ఇస్తేనే బాగుంది. నిజంగా చాలా బాగున్నాయి ఆ టపాలన్నీ. మీరు ఇలా చెప్పకపోతే నిజంగా ఇవి మరుగున పడిపోయేవి. మీ స్ఫూర్తిగా ఇలాగే మిగతా బ్లాగర్లు కూడా చేస్తే ఇంకా కొన్ని ఆణిముత్యాలను మనం చదువుకునే అవకాశం వస్తుంది.......రావాలని ఆశిస్తూ......


  చేతన_Chetana on Dec 4, 2007, 5:55:00 AM   said...

  Thank you the nice words and thanks for mentioning it in your blog. :-) Thanks offering help, unfunately I may not be able to work othe template until next year. Hope you won't mind if I contact you then. Thanks again!


  రాధిక on Dec 4, 2007, 10:11:00 AM   said...

  మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషమండి.నచ్చిందని చదివేసి వదిలేయక పదిమందికీ తెలిసేలా చేస్తున్నందుకు ఇంకా చాలా చాలా థాంక్స్.చేతన గారికి[వారి కెమేరాకు కూడా] నేను పంకాను.
  ఇలాగే మరిన్ని ఆణిముత్యాలను మాముందుంచుతారని ఆశిస్తున్నాను.


  Rajendra Devarapalli on Dec 4, 2007, 10:13:00 AM   said...

  తెలుగువాడిని గారు,నేను అచ్చం చర్చలకోసమొక బ్లాగు ప్రారంభిద్దామనుకుంటున్నాను.మీ సూచనలు కావాలి.ఇది పేరుకు నాబ్లాగయినా ఒక చర్చావేదిక కావాలి కనీసం కొందరినయినా అలోచనమార్గంలోకి మళ్ళించగలదు అనే ఆశ.దీని టెంప్లేటు,ఉండాల్సిన ఫీచర్సు వగైరా సూచించండి.


  తెలుగు'వాడి'ని on Dec 4, 2007, 10:54:00 AM   said...

  కృష్ణ మనోహర్ గారు: మీ వ్యాఖ్యకు ధన్యవాదములు మరియు కొంచెం ధైర్యం/ఆనందం వచ్చింది ఇలాంటివే మరికొన్ని ప్రచురించటానికి. నా వరకు నేను తప్పక ప్రయత్నిస్తాను అలాగే తోటి బ్లాగర్స్ కూడా చేస్తే అంతకన్నా కావలిసిందేముంది.

  చేతన గారు: You are very welcome. Sure. It's 'Happy Holidays' season :-) Please feel free to drop a comment here any time as I enabled 'Follow-up comments', I will jump right in and help you the best I can. Until then have fun and enjoy Ur time but be come back with many, many beautiful pics.

  రాధిక గారు: మీకు ఎల్లెడలా స్వాగతం..సుస్వాగతం..మీరు మరిన్ని ఆణిముత్యాలను ఆశిస్తున్నారని అన్నారంటే ఇది మంచి ప్రయోగమే అనిపిస్తుంది కనుక తప్పక ప్రయత్నిస్తాను.

  రాజేంద్ర గారు: మీరు అనుకుంటున్న దానికి బ్లాగ్ కన్నా బులెటిన్ బోర్డ్ లేక డిస్కషన్ ఫోరం అయితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇవి కూడా చాలా వరకు ఓపెన్ సోర్స్ లో ఫ్రీ గానే ఉన్నాయి. వివరాలు కావాలంటే చెప్పండి.


  Anonymous on Dec 12, 2007, 4:17:00 AM   said...

  మీ దయవల్ల నేనూ టెంప్లేటు మార్చాను...
  మీరు template master ఆ, హ హ
  3columns ki


  Anonymous on Dec 14, 2007, 5:49:00 AM   said...

  బ్లాగు లొ scrolling smooth ga లేదు ఏమైన వేరే solution వున్నదా?
  ఎన్నొ సంవత్సరాల నుంచి నెట్ని చావగొడుతున్నా తెలుగు బ్లాగులు ఇన్ని వున్నయ్ అన్న విషయం ఈమధ్యే తెలిసింది. కళ్ళు తెరుచుకున్నయి.

  మీ బ్లగ్ కు సర్వధా రుణపడి వుంటాను.
  firefox లొ తెలుగు సరిగా కనపడటానికి ఎమైన plug ins వున్నయా?


  తెలుగు'వాడి'ని on Dec 15, 2007, 9:42:00 AM   said...

  @ ramu garu:

  Current page లో తెలుగు ఎక్కువగా ఉన్నా లేక పొస్ట్ చాలా పెద్దది అయినా scrolling problem అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. We can minimize the problem by loading only parts of the post then tell the user to click a link to load the rest of the post but we need to add additional code changes to the Blog Template so not advisable to all unless they are confident to make changes.

  Koodali, Thenegoodu, Jalleda, TeluguBloggers etc will give you the list of all blogs.

  నా ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా మీకు మరికొన్ని కొత్త తెలుగు బ్లాగ్స్ తెలిసినాయి అని చెప్పినంతనే నా పోస్ట్ ఉద్దేశ్యం పూర్తిగా నెరవేరినట్టే.

  You do not need any special plugins to see Telugu in Firefox. Please check and make sure the current setting from top menu :

  View-> Character Encoding -> Unocode (UTF-8).


  Anonymous on Dec 18, 2007, 9:27:00 PM   said...

  కొత్త in IE is viewed as కొత్ త in FireFox.

  Even Encoding set to UTF-8.

  Farmers meeda naku teleisnde edo,
  http://missionisi.wordpress.com/2007/12/15/indian-farmers-suicides/

  rasanu, mee inspiration tho.
  Complete and comprehensive post twaralone rayagalanu.


  శ్రీనివాసమౌళి on Dec 26, 2007, 2:50:00 AM   said...

  తెలుగువాడిని గారూ...నేను బ్లాగులకి చాలా కొత్త...
  ఎలాగో ఈ మధ్యనే టెంప్లట్ పెట్టాను....నాకు టెంప్లట్ మార్చటం ...ఒక అంశానికి సంబంధించిన విషయాలను సమూహం గా చెయ్యటం ఎలాగో చెప్పగలరా...లేదా ఈ విషయాలపై...సహాయం ఎక్కడ దొరుకుతుందో సూచించగలరు...మరీ చిన్న అంశాలు అడిగాను అని చిన్నబుచ్చుకోకండి...ఎంతైనా చిన్న వాడిని.... :) :)

  ఇది నా బ్లాగు http://aksharaarchana.blogspot.com/


  శ్రీనివాసమౌళి on Dec 26, 2007, 2:53:00 AM   said...

  తెలుగువాడిని గారూ...నేను బ్లాగులకి చాలా కొత్త...
  ఎలాగో ఈ మధ్యనే టెంప్లట్ పెట్టాను....నాకు టెంప్లట్ మార్చటం ...ఒక అంశానికి సంబంధించిన విషయాలను సమూహం గా చెయ్యటం ఎలాగో చెప్పగలరా...లేదా ఈ విషయాలపై...సహాయం ఎక్కడ దొరుకుతుందో సూచించగలరు...మరీ చిన్న అంశాలు అడిగాను అని చిన్నబుచ్చుకోకండి...ఎంతైనా చిన్న వాడిని.... :) :)

  ఇది నా బ్లాగు http://aksharaarchana.blogspot.com/


  తెలుగు'వాడి'ని on Dec 26, 2007, 11:21:00 AM   said...

  శ్రీనివాస మౌళి గారు : ఇందులో చిన్న అంశాలనీ, చిన్న వాళ్లమనీ, చిన్నబుచ్చుకోవటమనే లాంటివి ఏమీ ఆలోచించక్కరలేదు అండి.

  I'm more than happy to share/help out on the things I know. Here is the info that might be of help for what you are looking for :

  For these basic questions, you can always refer to ...

  http://help.blogger.com/
  http://groups.google.com/group/blogger-help

  And also couple of other good blogs which I frequently refer to are :

  http://bloggerfordummies.blogspot.com/
  http://betabloggerfordummies.blogspot.com

  To make it easy for you, here is the exact link :

  http://betabloggerfordummies.blogspot.com/2006/10/how-to-change-template.html

  http://bloggerfordummies.blogspot.com/2006/04/blogger-template-tutorial.html
  http://bloggerfordummies.blogspot.com/2007/12/upgrade-to-new-blogger-template-from.html

  ...................

  You are still using the 'Classic' template with in Blogger customization and you want to go to a 'Layout' template then first you need to decide whether you want to go to a 2 or 3 column template. Once you made up your mind, here is the web site from where you can download 3 Column templates :

  http://webtalks.blogspot.com/2007/04/downlaod-three-column-new-blogger.html

  ...The concepts of Categories is not there in Blogger exactly like it's there in WordPress....

  But if you still want to go for it, here is the link

  http://bloggerfordummies.blogspot.com/2006/04/how-to-do-categories.html

  I think to start with the best thing for you is not to attempt the above link and instead go for Labels concept that's there in Blogger.

  Here is what you should do:

  For posts that are already posted :

  After you login, click on Customization which will takes you to the Options page in which click on 'Posting' tab where you can see all your posts. Then select the post you want to apply/create the Label then from the dropdown of 'Label Actions' select 'New Label' which will prompt you to enter the name of the label. After this if you want to apply the same label to couple of your other posts, select the post and then select the name of the label from the same dropdown . And the removal of the label also can be done in the same way. And also the same instructions applies to the posts that are in Draft state.

  While creating the post:

  You can see a Textbox labelled 'Labels for this post' in which either you can select a Label if you already created labels even for other posts or you can enter new label name here.

  ................

  BTW, you can have/apply more than one Label name to the post.

  ::::::::::::::::::::::::

  Hope this helps. Please let me know if you need any further help.

  Have fun and enjoy blogging and the customization of the blog too :-)


  కొత్త పాళీ on Apr 10, 2008, 5:36:00 AM   said...

  మంచి పని చేస్తున్నారు. అభినందనలు.


  Bolloju Baba on May 13, 2008, 8:17:00 AM   said...

  మీ ఉద్దే్శ్యం చాలా బాగుంది.
  నాబోటి కొత్తబ్లాగర్లకు కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్లీజ్.

  బొల్లోజు బాబా
  http://sahitheeyanam.blogspot.com/


  Bolloju Baba on May 13, 2008, 8:17:00 AM   said...

  మీ ఉద్దే్శ్యం చాలా బాగుంది.
  నాబోటి కొత్తబ్లాగర్లకు కూడా సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్లీజ్.

  బొల్లోజు బాబా
  http://sahitheeyanam.blogspot.com/


  Post a Comment

  స్వాగతాభినందన ధన్యవాదములు

  ప్రేరణ

  తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

            మనోభావ సంకలనంగా ....
            ఊహాక్షర రూపంగా ....
            ఆలోచనల సమాహారంగా ....
  Posts RSSComments RSS
  Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting