వారు-వీరు, వీరు-వారు అయితే మాకేంటి !

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, April 29, 2008

ఈ రోజు (04/29/08) సాక్షి దిన పత్రికలో, Glamour section లో ఒకే page లో కనిపించిన ఈ రెండు photos చూసిన తరువాత సరదాగా మీతో పంచుకుందామనే ఓ చిన్న ప్రయత్నమే ఈ టపా ...

మొదటి ఫొటో :

ఈ నాయికను ప్రతి ఒక్కరూ చాలా తేలికగానే గుర్తు పడతారనే అనుకుంటున్నా ...

మతి చెడగొట్టే అందమైతేనూ ...

మరి

మరిచిపోయేటట్టు చేస్తుందా

అసలు మరిచిపోయే అందమా(!) అది

గుర్తు పట్టలేని ఒకరిద్దరు కోసం .. వీరు ఛార్మి గారు

రెండవ ఫొటో :

తొలి చూపులోనే మరి ఈ నాయికను(!?) గుర్తు పట్టగలిగారా ....


వేసుకున్న బట్టలని బట్టి కాదు ఆలోచించాల్సింది ...


మొహంలో కల్లి చూసి ...


సరే ఇప్పటికైనా గుర్తుకు తగిలిందా .. లేదా


ఇంత ఉపన్యాసం/నస ఎందుకు గానీ ... వీరు ముమైత్ ఖాన్ గారు ...



ఎవరిని చూసి ఎవరు మారితే మనకెందుకు ... ఒక్కరన్నా ఉన్నారు కదా అదే పదివేలు మనకు ... కన్నుల పండుగగా చేసేటందుకు ... ఇద్దరూ కూడబలుక్కొని సమ్మె చేస్తే సమస్య గానీ ...

ఆగండాగండి .. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదండోయ్ కొత్తగా వచ్చిన IPL పుణ్యమా అని ... వారేనండి ...

చీరలు లేని లీడర్స్ ... చీరలంటే ఏంది అనే లీడర్స్ ...

ఒకప్పటి క్లబ్ డాన్సర్స్ యొక్క దుస్తులు, హావభావాలు ఈనాటి కధానాయికలు (ఈ పదం తప్పేమో కదా ... అసలు కధ ఎక్కడ ఏడిసి చస్తుంది ఇప్పుడు ... కనుక పాటలనాయిక అంటే బాగుంటుందేమో) పూర్తిగా వంటబట్టించుకొని వారి స్థానాలకి ఎసరుబెట్టారు ... ఇప్పుడు ఈ cheer leaders వచ్చి మీ హీరోయిన్ల కన్నా మేము ఒక ఆకు(ఒకటి ఏమిటిలే ఖర్మ చాలానే) ఎక్కువే చదివాము అని, అసలు ప్రపంచమే ఓ పెద్ద రంగస్థలం ( All the world's a stage ... మాకు ఇట్లాగే చెప్పారు మరి ) అయినప్పుడు మా ప్రతిభాపాటవాలు నాలుగ్గోడల మధ్య బంధించిన వెండితెర మీద మాత్రమే చూపించటం ఏమిటి అని ఆరుబయటకు తీసుకువచ్చి ఆరవేసి చూపిస్తున్నారు.

ఇప్పుడు మన నాయికల తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏమిటో ...

వీళ్ల దెబ్బకు మనం చాలంలే అని ... ఉండంతలో పొందికగా ఉంటూ (విప్పుకుంటూ పోతే మిగిలేదేముంది) నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ముమైత్ ఖాన్ లా మారిపోతారా ..

ఏందబ్బా మనం వెనకడుగేసేది ... ఇదేమన్నా నటనా నటించలేకపోవటానికి, హావభావవిన్యాసాలా ప్రదర్శించలేకపోవటానికి .... కురచ దుస్తులూ .. అంగాంగ ప్రదర్శనేగా ... ఇది మనకి పూర్తిగా కొట్టిన పిండే .. ఇన్నాళ్లూ ఏదో అని వదిలి పెట్టాము గానీ ఇప్పుడు చూడండి ఇక ... కొంచెం కొసరుగా ఇప్పటికి ఈ ఫొటో ... అదేనండీ ... ముందు ముందు చూపిస్తాం పూర్తిగా (మా తడాఖా) అని ఛార్మీలా వస్తారా ...

ఏది ఏమైనా ఇది పూర్తిగా సంధి కాలం ... ఇండియాలో .. క్రికెట్ లో ఛీర్ లీడింగ్ అయినా, సినిమాలో వల్గర్ exposing అయినా, యువతీయువకుల్లో సెక్స్ ప్రేరేపిత సమాచారం/ఆలోచనలు/కోరికలకైనా, పబ్ సంస్కృతికైనా ....

చూద్దాం కాలమేగతిన సమాధానం చెపుతుందో .... అంతవరకు కొద్దిపాటి నియంత్రణ, సంయమనం, వివేకవంతమైన ఆలోచన సమస్య తీవ్రతను తగ్గించవచ్చేమో...

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

'చిరు' కి జూనియర్ యన్.టి.ఆర్ చెక్ పెట్టగలడా !? - ఈనాడుఆంధ్ర పోల్

Posted by తెలుగు'వాడి'ని on Saturday, April 26, 2008

ఈరోజు యాధృశ్చికంగా ఈనాడుఆంధ్ర.కాం (courtesy : కొత్తపాళీ గారి తెలుగు భీభత్సం టపా) అనే వెబ్ సైట్ కి వెళ్లగా అక్కడ కనబడిన ఈ చిరు vs యన్.టి.ఆర్ అనే పోల్ కనబడటంతో దాని ఫలితం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించటంతో మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ....

పైన ఆశ్చర్యం అని ఎందుకు అన్నాను అంటే మనం చూసే/చదివే అన్ని(కుడి-ఎడంగా) ప్రముఖ పత్రికలలో మరియు/లేదా వెబ్ సైట్స్ లో ఇంత పెద్ద తేడాతో చిరు కి వ్యతిరేకంగా ఫలితం ఉండటమే ... అందునా నాకు తెలిసి ఇదే ప్రధమం ...

సరే ఇక ఫలితం విషయానికి వస్తే ... క్రింద చూడండి మరి లేదా ఆ సైట్ లోనే చూడాలి అంటే ఈనాడుఆంధ్ర పోల్ ఫలితాలు : 'చిరు' కి జూనియర్ యన్.టి.ఆర్ చెక్ పెట్టగలడా?



ఇది ఇప్పుడిప్పుడే అంత తొందరగా తేలే విషయం కాదు కాబట్టి ... ప్రస్తుతానికి దీనిని కాలక్షేపం బఠాణీలు క్రింద జత కట్టేసి/చేసి కొంత కాలం ఇలాంటి టాపిక్స్ తో కాలం వెళ్లబుచ్చుదాం ...

ఎలాగూ కాలమే (అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా) అన్నిటికీ సమాధానం చెపుతుంది .. అప్పటిదాకా మనది ప్రేక్షకపాత్రే ... అంతవరకు మనం నిమిత్తమాత్రులమే ...

రాబోయే రాజకీయ సం'కుల' సమరం లో తారల సినీ డైలాగులతో కూడిన బురద జల్లుడు తమాషా కోసం ఎదురు చూసే వారికి ఎలాంటి వినోదాన్ని/చెవులకు విషాదాన్ని పంచుతుందో చూద్దాం

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

నన్ను విపరీతంగా నవ్విస్తున్న (ఎప్పుడు చదివినా, గుర్తుకువచ్చినా) మీ వ్యాఖ్యలు/వాక్యాలు

Posted by తెలుగు'వాడి'ని on Friday, April 25, 2008

అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు, ఈ మధ్య నాకు తరచుగా మన బ్లాగుల్లోని టపాలలోని కొన్ని వాక్యాలు మరియు ఆయా టపాలకు వచ్చిన వ్యాఖ్యలు విపరీతంగా నచ్చేయటమే కాకుండా స్కూల్/కాలేజి మరియు ఉద్యోగంలో చేరిన కొత్తల్లో స్నేహితులతో గడిపిన/పంచుకున్న మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తుండటంతో .. అలా వాటిని గుర్తుకు తెప్పించిన ఆయా మీ వ్యాఖ్యలు/వాక్యాలు కొన్నిటిని ఇక్కడ మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ....

ఏమిటి వీడు .. నచ్చిన బ్లాగులు, టపాలు అంటూ ఏదో రాసుకునే వాడు ఇప్పుడు వ్యాఖ్యలు/వాక్యాలలోకి వచ్చాడు అనుకుంటున్నారా .. ఏమి చేస్తాం .. పుర్రెకో బుధ్ధి : జిహ్వకో రుచి ;-)


1)ముందుగా మొన్నీ మధ్యనే కొత్తపాళీ గారు వ్రాసిన మరియు మీ అందరికీ ఇంకా గుర్తున్న 'కల్తీ లేని చెత్త' టపా గురించి ప్రారంభిస్తా ....

నాగబాబు గురించి :

కొత్తపాళీ గారు :: నాకు తెలీకడుగుతానూ, నాగబాబుకి తాను నటించగలనని భ్రమపెట్టిన వాళ్ళెవరో?

indianminerva గారు : ఐనా నాగబాబుని poster మీద చూసి కూడా cinema కి వెళ్తే ఆ తప్పు director దటండీ? ఇదేం బాలేదు. నాగబాబు ని చూపిస్తున్నారూ అంటేనే director మనల్ని హెచ్చరిస్తున్నట్టు.

ఛార్మీ గురించి :

కొత్తపాళీ గారు : ఛార్మీని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ చేసిన వాణ్ణి ఆర్టీసీ చౌరాస్తా నడిబొడ్డున కొరత వెయ్యాలి!

జ్యోతి గారు : చార్మి ఈ నాటి యువతరానికి బాగా నచ్చుతుంది(అది ఎందుకో మీకు అర్ధమయ్యే ఉంటుంది)


2) నిరంజన్ పులిపాటి గారి బ్లాగ్ లోని సాక్షి - పుచ్చు వంకాయ !!! టపాలో ...

సాక్షి - జగన్ - వై.యస్.ఆర్ గురించి :

Dr. Ram$ గారు : సాక్షి వాడి కి బుర్ర యెక్కడ వుందో గత రెండు మూడు రోజుల నుండీ వాడు రాస్తున్న మొదటి పేజి ఆర్టికల్స్ చెపుతున్నాయి.. యిది వ్యాపారము, నేను 2 రూ కే అమ్ముతున్నాను, బోలెడంత బొక్క పడుతుంది.. మీరు మాత్రము ఎందుకు పెట్టిచ్హుకోరు అని, తెగ గింజుకుంటున్నాడు..నీకు "ఫ్రజా సేవ" చేయాలని వుండి నువ్వు 2 రూ కే ఇస్తున్నావ్, అలాగని అందరని చేయమంటే..నిజంగా మెంటల్ కేసు లా వున్నారు..వాళ్ళ అబ్బ కి ఏ మాత్రము తీసి పోడు కొడుకు.. నిజం గా వాడి కోరిక మేరకు, మిగితా తెలుగు దినపత్రిక లు 2 రూ కే ఇస్తే, ఈ వెధవ పేపర్ కొనేవాడు ఎవడు వుండడు..ఈ మాత్రము బుర్ర కూడ లేని వెధవలు పది లక్షలు సర్క్యులేషన్ గల పత్రిక నడుపుతున్నాడు, వాళ్ల అబ్బ ఏమో మనళ్ళని పాలిస్తున్నాడు.. దేవుడా..!!

3) నేను ఇంతకు ముందు ఒక Andhacafe.com లో తెలుగు సినిమాల reviews అన్నీ ఒకే చోట లో చెప్పినట్టు నేను క్రమం తప్పకుండా చదివే తెలుగురివ్యూ సైట్ లలో andhracafe.com ది ప్రధమ స్థానం. అందులో ఇప్పుడే ప్రచురించిన దొంగ సచ్చినోళ్లు రివ్యూ లో కొన్నిటిని చూద్దాం ..



4) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి ' "మెగా" కాకపోవడానికీ కావడానికీ మధ్య....' టపాలో


తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు : హీరోని అన్ని ఫ్రేముల్లోను అందంగా చూపించాల్సిన పనిలేదు (చివరికి ఇదెలా దారి తీసిందంటే ఇప్పుడు మనం అల్లు అర్జున్ లాంటి సగటు ముఖాల్ని కూడా హీరోలుగా అంగీకరించే పరిస్థితి వచ్చింది)

5) నవతరంగం లో రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి నికోలస్ కేజ్ ఎన్నిసార్లు తొడకొట్టాడు? టపాలో :


Raj గారు : Antha bagane undi gani. Thoda kottadam manaki culture paramga alavatu ayyindani, ippudu kothaga kanipettindi kadani meeku thelisi unte…ee lekkalu vese unde varu kadunukunta.

Calculator thisukoni battery ayypoindaka lekkalu veyyadam kadu…..aa lekka veyocho ledo kuda alochinchandi.

Edanna upayogapade panulu cheyandayya swami. Palleturla lo fans ani buthulu thittukune vallu oka side…..net lo mee lanti vallu oka side…..ekkadaina bhava daridram matram ade.


6) ప్రవీణ్ గార్లపాటి గారి నా మదిలో బ్లాగ్ లో మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ? టపాలో ..


ప్రవీణ్ గార్లపాటి గారు : అరె! ఇక్కడేదో "పోరంబోకు పెంట నాయాల" సినిమా మొదలయింది. తర్వాత మాట్లాడుకుందాం. .................. రే ఎవడ్రా అక్కడ నా అభిమాన హీరో సినిమా బాగాలేదని రాసింది. వేలి గోటితో నరికేస్తా....

చదువరి గారు : ఓ సందేహం.. వచ్చే ప్రతి సినిమానీ చూసి డోక్కునేవారు, డోక్కుంటూనే వచ్చే ప్రతి సినిమానీ చూసేవాళ్ళదే వర్గం? (పాపం.. సమీక్షకులనవచ్చేమో!)

7) విశాఖతీరాన బ్లాగ్ లో రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి ఈటీవీలో... ఈయన ఎవరు? టపాలో :

Prakash గారు : ఈయనే ఈ టీవీ రెండో సుమన్. ఈ టీవీ ప్రేక్షకుల పాలిట విలన్.

****************************

ఇంకా చాలా ఉన్నాయండీ ... వీలైతే అతి త్వరలో మరలా కలుద్దాం. అంతవరకూ శెలవా మరి !

గమనిక : ఈ టపా ఎవరినీ కించపరచటానికి ఉద్దేశించినది కాదు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

IPL : India లో కూడా Pillulaమే League

Posted by తెలుగు'వాడి'ని on Monday, April 21, 2008

ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా వందల-వేల కోట్ల రూపాయల ఆటగా ప్రారంభించిన IPL లో ఇప్పటివరకు మన వాళ్ల ప్రతిభా పాటవాలను ఒక్క సారి పరికిద్దామనే చిన్న ప్రయత్నమే ఈ టపా ..

మనం కొద్దిగా తీరిక చేసుకొని టపాగా మార్చేలోగా ఈనాడు పేపర్ వాడు ఖాళీగా కూర్చుంటాడా ... దీని గురించే వాళ్లు ఇప్పటికీ ఒకటి వదిలారు మన మీదకు : స్వదేశీ లీగ్ ... విదేశీ హవా

అసలు / మొదలు పెట్టినపుడు :
IPL : Indian Premier League

కొన్ని matches తరువాత (ఇప్పటివరకు) :
IPL : India లో కూడా Pillulaమే League

Tournament అయిపోయేటప్పటికైనా :
IPL : India లో ఎప్పుడూ Pulalaమే League ......... అని నిరూపిస్తే అందరికీ సంతోషమే :-)

ఒకవేళ మీకు ఆయా జట్లు మరియు అందులోని ఆటగాళ్ల వివరాలు తెలుసుకోవాలి అంటే ..

Bangalore Royal Challengers
Kolkata Knight Riders
Kings XI Punjab
Chennai Super Kings
Delhi Daredevils
Rajasthan Royals
Deccan Chargers
Mumbai Indians

కొంచెం ఓపికగా వివరాలలోకి తొంగిచూస్తే ............

ఇప్పటిదాకా ఇచ్చిన Man/Player of the Matches :

6. SR Watson (Rajasthan Royals)
5. MV Boucher (Bangalore Royal Challengers)
4. DJ Hussey (Kolkata Knight Riders)
3. MF Maharoof (Delhi Daredevils)
2. MEK Hussey (Chennai Super Kings)
1. BB McCullum (Kolkata Knight Riders)

ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు మన వాడు .... ఆ! ఈ విదేశీ ఆటగాళ్లకి కొంచెం అతి ఎక్కువ కాకపోతే, ఆడకపోతె డబ్బులేమన్నా వెనక్కి తీసుకుంటారా మరెందుకో ఓ ఇరగదీసుకుంటారు తెగ .. మరీ professional గా ఆడేద్దామని చూస్తా వుంటారు ... వాళ్లే నేర్చుకుంటారులే తొందరలో .. Ricky Ponting ను చూడండి తనని వేలంలో తక్కువకి పాడారని ఇప్పుడు హాయిగా ఎక్కువ సేపు పెవిలియన్ లో నే కూర్చోవటానికి ఇష్టపడుతున్నాడు.

Highest Scores from each team in each game:



ఇక మన కొమ్ములు తిరిగిన వీరాధివీరుల పరుగుల ప్రవాహం చూద్దామా :

Sourav Ganguly : 10 and 14
Rahul Dravid : 2 and 32
Yuvaraj Singh : 57 and 23
Virendar Sehwag : 12
VVS Lakshman : 0
MS Dhoni : 2

మన వాళ్ల జాడ్యం పాపం Ricky Ponting (20 and 0) కి కూడా పట్టుకున్నట్టే ఉంది :-(

తమలో ఉన్న ప్రతిభ, వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఏదో సుడి కాదని నిరూపించిన వాళ్లు :

Ishant Sharma : 3 overs, 0 maidens,7 runs, 1 wicket
Ishant Sharma : 3 overs, 1 maiden, 9 runs, 1 wicket
Suresh raina : 32 runs, 13 balls, 2 fours, 3 sixes, 214.81 strike rate
Gautham Gambhir : (not out) 58 runs, 46 balls, 7 fours, 1 six, 126.08 strike rate
Robin Uthappa : 48 runs, 38 balls, 5 fours, 1 six, 126.31 strike rate

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వాళ్లు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ల పేర్లు మనకు ఇంకా బాగా తెలియదు కాబట్టి ఇక్కడ ఇవ్వటం జరుగలేదు ... ఇంకా tournament లో చాలా matches ఉన్నాయి కాబట్టి వీరి గురించి కూడా తప్పక తెలుసుకుందాం.

నాకు బాగా నచ్చిన అంశమేమిటి అంటే ... మన వాళ్లలో ఉన్న న్యాయకత్వ లక్షణాలను వెదకటం మరియు సాన పెట్టటటానికి ఈ టోర్నమెంట్స్ బాగా ఉపయోగపడతాయి అనిపించటం ... అలాగే ఎక్కువ మందికి అవకాశం కల్పించగలగటం ..

ఒక చెడు అంశమేమంటే ... చివరిదాకా ఉండి జట్టు మంచి స్కోర్ చేయటానికి, గెలవటానికి కారణమైన వాడిని ఆ కొంచెంసేపే గుర్తుంచుకొని ... వీరబాదుడు, కొద్దో గొప్పో సుడితో సునామీలా రెండు 4s, మూడు 6s కొట్టిన వాణ్ని మీడియా/కామెంటేటర్లు అమాంతం పైకెత్తెయ్యటం ...

ఇప్పటి వరకు అయిపోయిన Matches వివరాలు ........

#1 : B'lore Royal Challengers v Kolkata Knight Riders
#2 : Kings XI Punjab v Chennai Super Kings
#3 : Delhi Daredevils v Rajasthan Royals
#4 : Kolkata Knight Riders v Deccan Chargers
#5 : Mumbai Indians v B'lore Royal Challengers
#6 : Rajasthan Royals v Kings XI Punjab

చూద్దాం ఇంక ముందు ముందు ఏమి జరుగుతుందో ... అంతవరకూ శెలవా మరి !!!

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

నచ్చిన బ్లాగులు మరియు టపాలు (బ్లాగ్స్ అండ్ పోస్ట్స్) - 4

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, April 9, 2008

ఇది నేను గత కొద్ది రోజులలో చదివిన వాటిలో నాకు నచ్చిన బ్లాగులు/టపాల కు సంబంధించి నాలుగవ భాగం .... ఒకవేళ ఇలాంటివే మరికొన్ని బ్లాగులు/టపాలు తెలుసుకోవాలి/చదవాలి అనుకుంటే మొదటి , రెండవ , మూడవ భాగాలుగా నేను ప్రచురించిన టపాలలో చదవవచ్చు/చూడవచ్చు.

రైతు-సంక్రాంతి పురుషుడు -రాజకీయ నాయకుడు
అవధానం - విధివిధానం

షరతుల పెళ్ళికొడుకులు - I
ప్రోత్సాహం ఓ గొప్ప వరం!
ప్రాయోజితాలు - పేరడీలు
ఓ సినీమా కధ

మనిషి
యేందిబ్బా యేమర్థంగాల్యా!
డెమ్మ డెక్క డాలి

మాతృభాషకి ఉష్ట్రపక్షుల సేవలు
తరలి రాద తనే వసంతం ?
ఇంధనాల భవిష్యత్తు

బ్లాగుల పుస్తకం ...
బ్లాగు పుస్తకం ఇదుగో ...

ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా
అభినవ భువనవిజయము - అంతర్జాలములో అపూర్వ కవిసమ్మేళనము
‘సినిమా’లో విధ్వంసమవుతున్న సీమ సంస్కృతి
జనవరి నెల తెలుగు బ్లాగుల కథా కమామిషూ!

రేపు మన వంతు...
శ్రీ గగన కుసుమోపాఖ్యానము

వీలుంటే అతి త్వరలో మరలా ఇంకొన్ని బ్లాగులు/టపాలతో కలుసుకుందాము ... ఈ లోగా ఆ పైన ఉన్న బ్లాగులు/టపాలు చదవండి .. ఆయా బ్లాగర్లతో మీ అభిప్రాయాలను పంచుకోండి....అంతవరకూ సెలవా మరి!

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

నచ్చిన బ్లాగులు మరియు టపాలు (బ్లాగ్స్ అండ్ పోస్ట్స్) - 3

ఇది నేను గత కొద్ది రోజులలో చదివిన వాటిలో నాకు నచ్చిన బ్లాగులు/టపాల కు సంబంధించి మూడవ భాగం .... ఒకవేళ ఇలాంటివే మరికొన్ని బ్లాగులు/టపాలు తెలుసుకోవాలి/చదవాలి అనుకుంటే మొదటి , రెండవ , నాలుగవ భాగాలుగా నేను ప్రచురించిన టపాలలో చదవవచ్చు/చూడవచ్చు.

తెలుగులో రాప్

హేరీ పాటర్లో ఏముంది?

కబుర్లూ... కాకరకాయలూ...: డైసీలూ, ఇంపలూ

తెలుగులో ఏముందయ్యా...పెద్ద...?

హ్హ! హ్హ! హ్హ

ఏడువారాల నగలు ..

పాడిగేదెలు..దున్నపోతులు

భ్లాగులో ఏముంది?

ఆర్కుట్:ఇంకా సులభం గా వాడటం ఏలా?

బ్లాగు పూల మొక్క

ది ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ఎన్ ఎక్సెల్లంట్ పర్సనల్ బుక్ లైబ్రెరి

పదమూడు పర్వముల మన పెళ్ళిపుస్తకం

ఫైర్ ఫాక్స్ కు తెలుగుదనం

Corporate Lingo

శ్రీ శోధన ప్లగ్‌ఇన్

ఆకాశానికి నిచ్చెనలు

బ్లాగర్ ఇప్పుడు తెలుగు రాత సౌకర్యంతో మీ కోసం

తెలుగు సినిమా - Myth and The Reality

కనుగొంటి కనుగొంటి

ఈ “రైళ్ళ” గొడవ ఏమిటి “అన్నయ్యా” ???

అమెరికాలో శివాజీ సినిమా: తటస్థ Review

ఆంధ్రజ్యోతి చమత్కారాలు!!

నేటి సినిమా

What we talk about really when talk about reality

ఇప్పుడు మనందరం సాక్షులం!

వీలుంటే అతి త్వరలో మరలా ఇంకొన్ని బ్లాగులు/టపాలతో కలుసుకుందాము ... ఈ లోగా ఆ పైన ఉన్న బ్లాగులు/టపాలు చదవండి .. ఆయా బ్లాగర్లతో మీ అభిప్రాయాలను పంచుకోండి....అంతవరకూ సెలవా మరి!

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

తెలుగు (మిగతా భారతీయ) సినిమాల నిర్మాణం, విడుదల మరియు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటే బాగుంటుంది !?

Posted by తెలుగు'వాడి'ని on Sunday, April 6, 2008

మన భారతీయ సినిమాలలో(ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ మొదలగు) ఉండే వైవిధ్యమైన అంశాల(పాటలు, ఫైట్లు, హాస్యం, పాటలలో వస్త్రధారణ మొ:) వలన ప్రస్తుతం ఉన్న సినిమాల తయారీ/నిర్మాణాన్ని ఎలా మారిస్తే బాగుంటుందో అని ఆలోచించగా నాకు తట్టిన కొన్నిటిని ఇక్కడ మీముందుకు ...

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఆరాధించబడుచున్న/చెలామణి అవుతున్న ఒక్కరికీ (ఏవో కొన్ని సన్నివేశాలలో లేదా ఒకటో రెండో సినిమాలలో తప్ప ... అది కూడా నటన అనబడేదానికి standards చాలా తక్కువ ఎత్తులో ఊహించుకొని ఆలోచిస్తే తప్ప) అసలు వారు camera ముందు చేసేదేమిటో (తద్వారా తెరపై కనిపించేది, మనం చూసేదేమిటో), దానికి ఒక అర్ధం పర్ధం ఉందా, దానికి నటన అనే పదం వాడొచ్చా అంటే మనకన్నా ముందు వారే తెల్లమొఖాలు పెట్టేస్తారు అంటే అతిశయోక్తి కాదేమో... ఇక అలాంటిది అసలు వాచకం, ఆంగికం, ఆహార్యం, అభినయం అనే పదాలు ఉన్నాయనీ, ఒకటో రెండో పదాలు ఉన్నాయని తెలిసిన(విన్న)వారికి కూడా పదాల అర్ధం ఖచ్చితంగా తెలిసి ఉండదు అనటం నూటుకి నూరుశాతం సబబుగానే/నిజమే కదా అనిపించటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో .. మరి అలాంటప్పుడు మనం నటీనటుల నటన(?) గురించీ, వారిని పెట్టి సినిమాలు తీస్తున్న వారినీ, సినిమాల గురించి ఆలోచింటం, విశ్లేషించటం, బాధపడటం, పతనమై పోతున్న అంశాల గురించి ఆవేదన చెందటంలో అర్ధంలేదేమో .. కాకపోతే మానవ మాత్రులం కనుక ఎక్కడో చురుక్కుమనటం తదనుగుణంగా ప్రతిస్పందించటం పడుతున్న బాధను వ్యక్తపరచటం సహజాతిసహజం.

నాకు అర్ధం కాని ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నటీనటులు ఆయా సినిమాలలో వివిధ సన్నివేశాలలో ప్రదర్శించే నటనకు(?) ఒకటి కన్నా ఎక్కువ టేకులు తీసుకోవటం .. అదేమంటే perfection కోసం, సీను బాగా పండటం (పండించటం కోసం) అని చెప్పటం చూస్తుంటే (వింటుంటే, చదువుతుంటే) నాకు అసలు నవ్వు ఆగదు సుమండీ ... వీళ్ల బొంద మండ ... వీళ్ల నటనకి మరలా extra takes ఒకటి ... ప్రేక్షకులు ఏదో వీళ్ల దగ్గర నుంచి అధ్భుతాలు ఆశిస్తున్నట్టు వెధవ బిల్డప్ ఒకటి....

పైన చెప్పినట్టుగా అసలు కాలం నటీనటుల నుంచి నటనను గానీ, సన్నివేశాలలో/పాటలలో వారి ముఖకవళికల గురించి గానీ, దర్శకత్వ ప్రతిభను గానీ ఆశించి మనం సినిమాకు వెళ్లటం లేదు కనుక, సినిమాల నిర్మాణాలకు సంబంధించిన వారు ముఖ్యంగా నిర్మాత కొంచెం సృజనాత్మకంగా ఆలోచించి, ఏదో తొక్కలో perfection (ఒకటో రెండో ముఖ్యమైన సన్నివేశాలను తప్పించి) అనే పేరు మీద ఉన్న కాల్షీట్స్ అన్నీ వృధా చేసుకునే కన్నా వాటిని ఇంకొక విధంగా సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరూ చూసి ఆనందించగల సినిమాలు ఎలా తీయవచ్చో చూద్దామా.....నా ఉద్దేశ్యం ప్రకారం క్రింది విధంగా చేయవచ్చు అని ...

ముఖ్యంగా మన తెలుగు (మిగిలినవి కూడా అంటే ముఖ్యంగా హిందీ, తమిళం, కన్నడ మొదలగు) సినిమాను కుటుంబసమేతం, యువత, మాస్ (నా దృష్టిలో క్లాస్ అనే దానిని ముందు ఉన్న మూడిటితో కలిపి క్రింద చెప్పబడిన వాటికి అన్వయించటం వలన పెద్ద ఉపయోగం ఉండదు లేక అలా చేయాలనుకోవటం ఒక వృధా ప్రయత్నం) అనే వర్గాలవారిని దృష్టిలో ఉంచుకొని తీసినట్టుగా మరియు వర్గాల వారి ఆదరాభిమానాలను చూరగొనాలంటే ఎలా తీయవచ్చో అనే పంధాలో అందరూ వెళుతున్నారు గనుక ...

స్థూలంగా ఇప్పటి సినిమా (కొంచెం కుడిఎడంగా) ... ఒక కాబరే డాన్స్ పాట, ఒకటో రెండో పరమ బూతు/శృంగార సన్నివేశాలు, రెండుమూడు బూతు హాస్య సన్నివేశాలు, మూడునాలుగు వెకిలి/చెత్త/రోత సన్నివేశాలు, నాలుగయిదు ఫైటులు, అయిదారు పాటలు, ఆరేడు కారెక్టర్ నటీనటుల డైలాగులు/సన్నివేశాలు, ఏడెనిమిది విదేశీ/స్వదేశీ లోకేషన్స్, హీరోహీరోయిన్లకు ఒక పదిపదిహేను దుస్తులు, క్లైమాక్స్...

పైన చెప్పిన వాటన్నింటికీ సినిమా చూసే వర్గాలలో ఏది ఎవరికి ఎంత డోస్ లో ఉండాలో కాగితం మీద చక్కగా రాసుకొని (అన్ని వర్గాలకు కామన్ గా ఉండే సన్నివేశాలను, డైలాగులను తప్పించి)... మనం నటీనటుల నటన గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకుండా అంటే ఎక్కువ perfection కోసం తపించకుండా ....[టేకుల మీద టేకులు తీసుకుని ఏడిస్తేనే వీళ్ల నటన ఇలా అఘోరించింది ఇక ఒకే టేకులో ఓకే చేస్తే మనకు థియేటర్లలోనే వాంతి వస్తుందేమో అంటారా .. అదీ నిజమే సుమండీ ... ఇప్పుడు లోపల్లోపల తిప్పుతూ ఉంది అప్పుడు పూర్తిగా బయటకు వస్తుంది .. అంతే .. ఇలా అయితే కాస్త ఉపశమనంగా అన్నా ఉంటుంది] ఆయా సన్నివేశాలన్నింటినీ ఉన్న కాల్షీట్స్ లోనే(కావాలంటే కొంచెం ఎక్కువ ... డబ్బులు ఎక్కువ కాకుండా) పైన చెప్పిన మూడు/నాలుగు వర్గాలకు అనుగుణంగా చిత్రీకరించాలి... ఇప్పుడు వీటిని ఏమి చేయాలో చూద్దామా మరి...

1. విడి విడిగా సినిమాలు

అలా ఒకే సన్నివేశాన్ని మూడు-నాలుగు రకాలుగ తీసిన తరువాత వాటిని ఆయా వర్గాల వారిగా ఒక సినిమాగా జత చేసి అంటే మూడు-నాలుగు సినిమా ప్రింట్స్ లాగా మార్చి అన్నింటినీ ఒకేసారి విడుదల చేయాలి....ఇక్కడ చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఆయా వర్గాల వారి సినిమాను విడుదల చేసిన theaters వివరాలు చక్కగా వివరించాలి.

2. On Demand / Set Top Box / DTH / IPTV Services

సినిమాలన్నింటినీ పైన చెప్పిన services అన్నింటి ద్వారా అందుబాటులోకి తేవాలి. అప్పుడు ఎవరికి కావలసిన సినిమాను వారు చూసుకునే అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు, ఇంటిల్లిపాదీ ఒకేసారి సినిమా చూడాలి అనుకుంటే, పైన చెప్పిన/లభ్యమవుతున్న వర్గాలలో నుంచి 'కుటుంబ సమేతంగా' అన్న సినిమాను, ఒకవేళ ఇంటిలో టీన్స్ ఉండి ఉంటే వారు 'youth' వర్గానికి సంబంధించిన సినిమాను చూడవచ్చు.

3. Dynamic Assembly (Make your own movie)

ఇంకా కొంచెం విప్లవాత్మకమైన అవకాశం కల్పించాలి అనుకుంటే ... అన్ని వర్గాలకు సంబంధించిన clips అన్నింటినీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచాలి. అప్పుడు ప్రేక్షకుడు ఏయే సన్నివేశాలు తనకు వర్గం వాటికి దగ్గరగా చూడాలి అనుకుంటాడో వాటినే select చేసుకొని అప్పటికప్పుడు సినిమాను assemble చేసుకొని చూసుకునే అవకాశం కలుగుతుంది. Web site లో విధంగా తయారు చేసుకునే అవకాశం కల్పించటం చాలా తేలిక కనుక internet అందుబాటులో ఉన్నవారు అందరూ దీని నుంచి లాభం పొందవచ్చు. ఇక ఎలాగూ రానున్న యుగమంతా పైన చెప్పిన రెండవ point లో ఉన్న సేవలే ... ముఖ్యంగా IPTV కాబట్టి, ఇలా తయారు చేసుకున్న సినిమాను మనం direct గా మన account లోకి upload చేసుకుని ఇంటినుంచే చూసుకోవచ్చు.

4. Digital Movie and advertisements (both location based)

అతి త్వరలో మన కళ్ల ముందు సాక్షాత్కరించబోయేది ... డిజిటల్ విప్లవం ... ఇందులో రీలు డబ్బాలు/పెట్టెలతో పని లేదు ... కొద్దో గొప్పో అర్ధం అయ్యేలా ఉన్న క్రింద ఉన్న చిత్రాన్ని చూడండి.


ఒక వేళ మీకు ఈ డిజిటల్ సినిమా గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే .. Digital Cinema : Wikipedia Link

ఇందులో థియేటర్ ఉన్న ప్రదేశం/ప్రాంతాన్ని బట్టి dynamic గా ఏ copy ని (పైన చెప్పినట్టుగా ఒక సినిమాకు సంబంధించి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే) కావాలంటే దానినే ప్రదర్శించేలా చేయవచ్చు. అలాగే ప్రకటనలు కూడా dynamic గా ఎంపిక చేసుకోని చూపవచ్చు.

5. Mobile and Web based content (from extras)

ఉన్న కాల్షీట్స్ లో నుంచి అనుకున్న వాటి కన్నా ఎక్కువ సన్నివేశాలు(ముఖ్యంగా పాటలు, హాస్య సన్నివేశాలు, నాయికానాయకుల స్టిల్స్) చిత్రీకరించటం వలన వాటిని ring tones, wall papers మొదలగు వాటిగా మరియు పాటల వీడియోలు వాటిని Mobile మరియు Web లో ప్రదర్శించి అంతో ఇంతో డబ్బులు సంపాదించుకోవచ్చు.

ప్రేక్షకుల స్పందన ఎలా ఉండాలి :

మార్పు అనేది రావాలి లేక వచ్చేలా మనం చెయ్యాలి అనుకుంటే అది ఇక్కడ నుంచే(USA, UK, Australia, Dubai మొదలగు దేశాల నుంచి) మొదలవ్వాలి.....ఇప్పటికే మనకి BATA, ATA, తీట, తొక్క, తోలు, రక్కటం, అరవటం (ఈ మధ్య ఇవి చాలవన్నట్టు pro/anti తెలంగాణా, చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి అనేవి కూడా మొదలు పెట్టారు...) అనే చాలా సంఘాలు ఉన్నాయి కదా ... వీటికి ఇంకొకటి చేరితే వచ్చే పెద్ద నష్టమేమీ లేదు కనుక ప్రస్తుత తెలుగు సినిమా తీరు తెన్నులపై మధనపడేవారు, మంచి(నిర్వచించటం కష్టం) సినిమాలు రావాలి అని కోరుకునే వారు, తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా సినిమా కొరకు మనం ఖర్చు పెట్టిన డబ్బు మరీ దారుణంగా వృధా అవలేదు అనిపించే సినిమాలు రావాలని కోరుకునే వారు ... ఒక సంఘంగా ఏర్పడి .. ఒక web site ఏర్పాటు చేసుకొని సభ్యులుగా చేరండి .... రాబోయే కొత్త సినిమాలు ఏవి వస్తున్నాయో వాటిలో ఎవరెవరు ఏ సినిమాలు చూడాలి అనే ఉత్సుకతతో ఉన్నారో తెలియ చెప్పాలి / select చేసుకోవాలి ... అలా ఉన్న వారిలోనుంచి different demographics Youth/bachelors (MS చేస్తూనో, లేక కొత్తగా ఉద్యోగంలో చేరిన వారో), ఇప్పుడే India నుంచి వచ్చిన వారు, just married, married but yet to have kids, 6-8+ years kids ఉన్న వారు, పిల్లలు settle అయిన వారు, retirement/దగ్గరైన వారు ఇలా వైవిధ్యమైన విభాగాలలో నుంచి ఒక 15-50 మంది సభ్యులను/కుటుంబాలను (అన్ని దేశాలలో కలిపి ఇండియా కాకుండా, వీలైతే ఇండియాను చేర్చే దాని గురించి తరువాత ఆలోచించుకోవచ్చు) ని ఎన్నుకొని వాళ్లను మాత్రమే సినిమాకు పంపించాలి ... సినిమా అయిపోయిన వెంటనే వాళ్లు అందరూ తమ రివ్యూలు వీలయినంత వెంటనే తెలపాలి .. వ్రాయటం కష్టం అనుకుంటే మీ అభిప్రాయాలు record చేసి(మీ cell phone/PDA ల లో ఉన్న voice recorder ద్వారా లేదా చాలా web sites లో ఈ సౌకర్యం ఉంది) upload చేయవచ్చు ... ముఖ్యంగా ఈ రివ్యూలలో కనపడవలసినవి ఏమిటి అంటే ... టికెట్ కి అంత డబ్బులు/శ్రమ పెట్టి వెళ్లవలసిన అవసరం ఉంది అనిపించే దమ్మున్న సినిమానా అని ... ఒక్కొకసారి మన కళ్ల/మనసుతో చూస్తే ఈ 15-50 మంది వ్యక్త పరచిన అభిప్రాయాలు కొద్దిగా అటూ ఇటూ ఉండవచ్చు .. నా ఉద్డేశ్యం ప్రకారం ఒకటో రెండో ఇలా మనం సినిమా థియేటర్లలో చూడకపోతే వచ్చే నష్టం ఏమీలేదనే అనుకుంటున్నా ... ఇంకొక విషయం ఏమిటి అంటే నిజంగా సినిమా లో అంత దమ్మే ఉంటే ఆయా థియేటర్లలోకి ఇంకొక సారి ఎలాగూ వస్తుంది ...కావాలంటే అప్పుడే చూడొచ్చు..

ఇలా మనం నాలుగు అయిదు సార్లు వరుసగా ఒక ఝలక్/షాక్ ఇస్తే ముందు ఇక్కడ మన సినిమాల distributors కి దిమ్మతిరిగిపోతుంది .... ఆ దెబ్బ అక్కడ పడుతుంది (పృష్ట తాడన్ దంత భంగః టైపు లొ) ...ఇప్పటికే వీళ్లకి బాగానే వత్తి ఆరిపోయింది 2007 లో ... కావాలంటే ఈ రిపొర్ట్ Abroad Box-office in 2007 చూడండి.

అలాగే ఆంధ్రప్రదేశ్(ఇండియాలో ... హిందీలో కొంచెం బాగానే ఉధ్ధరిస్తున్నట్లే ఉంది ఈ మధ్య) లో సినీ ప్రేక్షకుడిని వినియోగదారునిగా పరిగణించేలా చట్టం రావాలి ... సాధారణ వినియోగదారునిలా తను డబ్బులు పెట్టి కొన్న వస్తువు సరిగా (పని చేయటం) లేదనో, తను ఆశించిన స్థాయిలో లేదనో అనుకుంటే తను కొన్న వస్తువుని వెనుకకు ఇచ్చే వీలు లేదూ అంటే మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పరమ దరిద్రంగా అనిపించినప్పుడో లేదా కళ్లు తిరిగిపోయే ప్రచారార్భాటంతోనో, హోరెత్తిపోయిన వ్యాపార ప్రకటనల వలన కొనుక్కొన్న వస్తువు వారు చూపించిన/వినిపించిన దానికి దరిదాపుల్లో లేకపోతే మనం (ముఖ్యంగా ఆడవారు) అ వస్తువు ఎంత దరిద్రంగా ఉందో అనీ, ఎవరూ కొనద్దు అనీ వాయుమనోవేగాలను మించిపోయే రీతిలో ఎలా ప్రచారం కల్పిస్తారో ... ఈ సినిమాలకు కూడా దానిని అన్వయించి ఈ హీరో దర్శక నిర్మాతల తుప్పు సమూలంగా వదిలించాలి.... మనం కొనే సినిమా టికెట్ ధర (ఉదాహరణకి రూ: 50 అనుకుంటే) లో నిర్మాత, పంపిణీదారులకు లాభం ఒక పదో పదిహేనో రూపాయలను పక్కన పెడితే కనీసం ఆ మిగిలిన 35-40 లకు అయినా సరైన న్యాయం చేయలేదు అనిపిస్తే మూకుమ్మడిగా అందరూ సినిమా చూడటం మానివెయ్యాలీ .. (సామూహక సమ్మె లాగా)

ఈ సరికొత్త విప్లవం మనలో తొందరగా రాకపోతే కనుచూపు మేరలో ఒక ఉపద్రవం ముంచుకోస్తుంది ... అదీ డిజిటల్ రూపంలో సినిమాలు ప్రదర్శించటం మరియు అతి ముఖ్యమైనది ఏమిటి అంటే సంవత్సర సభ్యత్వంతో (రు: 100), ఎవరి దగ్గర అయితే మనం సభ్యత్వం తీసుకున్నామో వారిచే ప్రదర్శితమైన సినిమాలు మనం ఎన్ని అయినా చూడొచ్చు .... కానీ ఇందులో మనకు కొంత లాభం ఉన్నట్టు అనిపించినా (ఒక సంవత్సరంలో ఎన్నైనా చూడొచ్చు...అలాగే నెలకు ఒకటి వేసుకున్నా ఒక 10-15 సినిమాలు అంటే ఒక 300-500 దాకా పెట్టాలి కానీ ఇలాగయితే ఒక 100 తోనే అయిపోతుంది) అసలు జరగబోయే నష్టమేమిటంటే వారికి ముందుగానే డబ్బులు చేతిలో పడ్డాయి కాబట్టి సినిమా గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు కనుక ఇక రాబోయే సినిమాల గతి ఏ విధంగా ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం కాదనుకుంటా (నేను చదివిన వార్త ప్రకారం ఇప్పటికే ఈ విధానం తమిళనాడులో మొదలయ్యింది మరియు ఒక కోటి సభ్యత్వ కార్డ్స్ ఇప్పటికే అమ్మటం జరిగింది .. ఆంధ్రప్రదేశ్ లొ కూడా వీరి టార్గెట్ కోటి మందిని చేర్చుకోవటం) ..

నేను పైన చెప్పినవన్నీ ఆచరణ సాధ్యం కావు అని, కొన్ని హాస్యాస్పదంగా ఉన్నాయనీ కొంత(లేదా చాలా/అందరూ) మంది భావించవచ్చు .. ప్రస్తుతానికి నేను నాకు వచ్చిన ideas అన్నీ ఇక్కడ పొందుపరచటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ... మరలా సమయం దొరికినప్పుడు వీటిని refine చేయటానికి ప్రయత్నిస్తాను ..

అంత వరకు ఇంతే సంగతులు చిత్తగించవలెను !

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting