Andhacafe.com లో తెలుగు సినిమాల reviews అన్నీ ఒకే చోట
గత సంవత్సరకాలంలో విడుదలైన తెలుగు సినిమాలపై ఆంధ్రాకేఫ్.కాం అనే సైట్ ప్రచురించిన రివ్యూస్ అన్నింటినీ ఇక్కడ ఒకే టపాగా ...
వందల కొద్దీ ఉన్న సైట్స్, బ్లాగ్స్ మరియు ఫోరమ్స్, ముఖ్యంగా మనమందరం కొంచెం విరివిగా చూసే సైట్స్ లల్ ప్రచురించే తెలుగు సినిమాల రివ్యూస్ ఎలా ఉధ్ధరిస్తున్నాయో (కొంచెం సూటిగా నిక్కచ్చిగా చెప్పాలి అంటే ఎంత పక్షపాతధోరణితో, ఒక్కొక్కసారి వాళ్లు ఇచ్చే రేటింగ్స్ చూస్తే ఆ సైట్ మీద పూర్తిగా అసహ్యం వేసే స్థాయిలో ఉంటున్నాయో ... ఇక్కడ నేను అన్యాపదేశంగా ప్రస్తావిస్తున్న సైట్స్ ఏవో, మనలో చాలా మందికి ఈ పాటికి అర్ధం అయ్యే ఉంటుంది కనుక నేను వాటి పేర్ల జోలికి వెళ్లదలచుకోలేదు) ప్రత్యేకించి ఇక్కడ మరలా ప్రస్తావించవలసిన అవసరం లేదనే అనుకుంటున్నా..
ఈ తెలుగు సినిమాల మీద వచ్చే రివ్యూస్ గురించి నేను కొంచెం interest తో చదివే సైట్ ఏదన్నా ఉంది అంటే అది ఆంధ్రాకేఫ్.కాం లో ప్రచురించేవి మాత్రమే ... ముఖ్యంగా ఈ సైట్ వారు రివ్యూ చివరలో (చాలా సార్లు రివ్యూ టైటిల్ లో కూడా) వ్రాసే final verdict అంటే నాకు చాలా ఇష్టం ...
ఒక్క ముక్కలో సినిమా రివ్యూ మొత్తాన్ని ముచ్చటగా చెప్పటానికి చేసే ప్రయత్నం, అందులోనే ఆ సినిమా ఎలా ఉందో చెప్పటానికి చేసే సాహసం, ఒకవేళ మనం కూడా ఆ సినిమాను చూడటం జరిగితే, చాలా వరకు/సార్లు వీరు చెప్పిన దానితో మన అభిప్రాయం సరిపోతుంది .... అందుకే ఇది నావరకైతే ఎంతో బాగా నచ్చుతుంది ..
ఆ సైట్ లో కుడి ఎడంగా ఈ రివ్యూస్ అన్నీ వ్రాసిన గణేష్ రావూరి గారికి వేనవేల అభినందనలు, ప్రశంసలు, పొగడ్తలు మరియు కొన్ని విమర్శలు.
కాకపోతే ఈ మధ్య కొంచెం వీళ్లకి పైత్యం ముదిరి, హద్దు దాటి (అంటే సినిమాను సినిమాలా కాకుండా, ఒక powerful భూతద్దంలో నుంచి చూస్తూ) మరీ ఎక్కువగా విశ్లేషిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు ... కాకపోతే ఇంకా కొంత కాలం కొంచెం వేచిచూసే ధోరణిలో ఉందామనే ఉద్దేశ్యంతో దీని గురించి ఇంతకు మించి ప్రస్తుతానికి ఎక్కువ వ్రాయటం లేదు.
ముఖ్య గమనిక : ఒకవేళ మీరు ఆయా సినిమాల రివ్యూస్ చదవాలి అనుకుంటే ఎడమ వైపున ఉన్న లంకెను (మీకు లంకె లాగా అనిపించకపోవచ్చు :-( ఎందుకంటే అవి images తో కూడిన లంకెలు కాబట్టి) నొక్కండి.
గత సంవత్సరకాలంలో విడుదలైన సినిమాలు, వాటి రివ్యూస్ మరియు ఆంధ్రాకేఫ్ వారి final verdict :
గమనిక : రానారె గారు! ఎడమ వైపున ఉన్న రంగులు ఈ సారి నా సొంత పైత్యం కాదు .. అవి ఆ సైట్ లో వారు పెట్టిన రంగులను యదాతధంగా అక్కడ నుంచి copy చేయటం జరిగింది :-)
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
1 వ్యాఖ్యలు:
- Naveen Garla on Apr 2, 2008, 11:17:00 PM said...
-
మొన్న ఓ సారు బస్సులో వెళ్ళేటప్పుడు 'సీమ శాస్త్రి' సినిమా వేశాడు. చూడక తప్పలేదు. అంత దారుణంగా ఏమీ లేదు సినిమా. గొప్ప సినిమా కాకపోయినా ఇందులో నవ్వులకు కొదవేమీ లేదు. తెలుగు సినిమా పరిశ్రమలోని గండర గండలైన హాస్య నటులందరు ఇరగదీశారు. టైంపాస్ కోసం ఓ సారి చూడచ్చు.
( http://gsnaveen.wordpress.com )