స్టెఫీ గ్రాఫ్ - నా అభిమాన టెన్నిస్ తార

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, February 18, 2009

నాకు మొదటి నుంచీ ఏడుపు గొట్టు సీరియల్స్, కుటుంబ (అను)బంధాలు, వైషమ్యాలు, వాళ్ల బొంద వాళ్ల బోలె, అందులోనూ వీళ్లు జత చేసే హై/మెలో డ్రామా అవీ చూడటమంటే మా చెడ్డ చిరాకు ..

మరి టివి అంటూ ఉంటే మరి ఏదో ఒకటి చూడాలి కదా .. అలా అలా ఆ రోజుల్లో చిత్రలహరి, అప్పుడప్పుడూ వచ్చే ఆదివారం తెలుగు సినిమా లాంటి కార్యక్రమాలు చూసే రోజుల్లో నాకు మెల్లమెల్లగా ఈ ఆటల మీదకు బాగా మనసుపోయింది .. అందుకు ప్రధమ కారణం మనం చూసేటప్పుడు ఊహించటానికి అతి తక్కువ అవకాశాలు ఉండటమే అంటే ముందు ఏమి జరుగుతుందో/జరగబోతుందో తెలియదు కాబట్టి చివరి వరకు ఉత్కంఠగా ఉంటుంది .. వచ్చిన ఏ సినిమాను వదిలి పెట్టకుండా చూస్తూ ఉంటే .. అందులోనూ మన తెలుగు సినిమా కధాక్రమం, ముగింపు అన్నీ ఎలా ఉంటాయో తెలిసిందే కదా ... అన్నీ అలా కళ్లకి కట్టినట్టుగా కనపడుతుంటే అంటే తరువాతి దృశ్యం ఏమిటో అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా ...

క్రికెట్ చూడకపోతే (కొద్దిగా, ఆడకపోతే కూడా) అదో పెద్ద నేరం అన్నట్టు ఉండేది కాబట్టి క్రమం తప్పకుండా అంటే ఏ  match వదిలి పెట్టకుండా చూస్తూ ఉండటం అలవాటు అయిపోయింది .. మరి మ్యాచెస్ లేనప్పుడు ఏమి చెయ్యాలి అని గోళ్లు గిల్లుకుంటున్నాప్పుడు హఠాత్తుగా ఈ టెన్నిస్ మన కంట్లో పడింది ... పడటం కూడా అలాంటి ఇలాంటి ప్లేయర్ కాదు .. స్టెఫీ గ్రాఫ్ .. ఇక అంతే ... తన మ్యాచ్ అంటే మనం టివి సెట్స్ కి పూర్తిగా అతుక్కుపోవటమే ... అందమొక్కటే కారణమా అంటే ఖచ్చితంగా కాదు .. కాకపోతే మొదటి కారణం మాత్రమే సందేహమే లేదు. ఆ రోజుల్లో చాలా మందికి సబాటిని నచ్చేది మరి ... కానీ నాకెందుకో అంతగా ఎక్కలా .. స్టెఫీ అందం ముందు దిగదుడుపులాగా అనిపించటమేమో ...

అసలు ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు రావటానికి కారణం ఏవో పాత వీడియోలు చూస్తుంటే స్టెఫీ గ్రాఫ్ కు సంబంధించిన ఈ వీడియో కనపడింది.

Will you marry me?

orSpontaneous గా తను స్పందించిన తీరు చూస్తే అబ్బురమనిపించక మానదు.

తన అసాధారణం, అధ్భుతమైన ప్రతిభతో అప్రతిహతంగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న రోజులు .. ఆ ప్రతిభ కు తోడైన అందం నన్ను నిజంగా కట్టిపడేశాయి.

తను ఒక్క పాయింట్ పోగొట్టుకున్నా ఎంత బాధ వేసేదో .. అలాంటిది అప్పుడే కొత్తగా వచ్చిన మోనికా సెలెస్ చేతిలో తరచుగా ఓడిపోతుంటే తట్టుకోవటం తనకు ఎలా ఉండేదో మాకైతే నిజంగా నరకప్రాయమే ..

స్టెఫీ గ్రాఫ్ గురించి పూర్తి వివరాలకు లో ఉన్న ఈ వికీపెడియా ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ నేను చూసిన/చదివిన వాటిల్లో సాధ్యమైనంత సవివరంగా ఉన్నది అంటే అతిశయోక్తి కాదేమో ..
 ..........................................................పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

బుర్ర ఎక్కువ ఉపయోగించకుండా, తేలికగా/సులభంగా చేయగలిగిన ఉద్యోగం ఏది !?

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, February 17, 2009

నాకు తెలిసినంతలో, ఈ మధ్య కాలంలో తరచుగా చదువుతున్న విషయాలను బట్టి ఇదిగోండి ఇలా ..

ఉద్యోగం ఏది అంటారా ...

                 పత్రికారంగంలో పనిచేయటం ...

                ఈ రంగంలో

                అన్ని ఉద్యోగాలు అంటారా ..
                                   అబ్బే కాదండీ ...
                                          ఒక్క ఆటలకు సంబంధించిన వార్తలు రాయటం ....

                అన్ని ఆటలు అంటారా ...
                                  అయ్యో కాదండీ ..
                                        ఒక్క టెన్నిస్ కు సంబంధించి రాయటం  ...

                అన్ని దేశాల ఆటగాళ్లు/ఆటగత్తెల గురించి అంటారా ..
                                  అయ్యయ్యో కాదండీ ...
                                            ఒక్క ఇండియాకు సంబంధించి మాత్రమే రాయటం ...
               అందరి గురించి అంటారా ....
                                  హన్నన్నా కానే కాదండీ ...
                                            ఒక్క సానియా మీర్జా గురించి రాసే ఉద్యోగం ....

ఎలాగంటే/ఎందువలనంటే ....

పాపం ఈ అమ్మాయి ఎక్కువగా  మొదటి రౌండే దాటదు ... ఒకవేళ సచ్చీ చేడీ దాటినా రెండో రౌండ్ మాత్రం దాటాలి అనుకోదు ... [ ఎందుకులే నా టెన్నిస్ కు సంబంధించి వార్తలు రాసుకుని హాయిగ బతికేస్తున్న విలేఖరి ఆనందం మీద నీళ్లు పొయ్యటం అనుకుంటుంది అనుకుంటా ]

ఈ ఉద్యోగానికి కావలసిందల్లా Find/Replace ఎలా చేయాలో తెలిసి ఉండటమే ... టోర్నమెంట్ పేరు, రౌండ్(మొదటి/రెండు), స్కోర్(ఇది కుడి ఎడంగా ఎప్పుడూ ఒకటే ఉంటుంది), ముందంజ/నిష్క్రమణ .... ఇలాంటివన్న మాట ...

లేదూ రెండు వెర్షన్స్  ని (మొదటి/రెండవ రౌండ్ లో ముందంజ/నిష్క్రమణ) రాసి దగ్గర పెట్టుకున్నా కూడా ఓకే ...

హోరాహోరీగా పోరాడింది .. చేతులెత్తేసింది ... ఇలాంటి వాక్యాలు షరా మామూలే ... 

ఉదా : చూడండి లేటెస్ట్ వార్తా స్రవంతి సానియా మీర్జాపై ..

 
................................................................................... పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

ప్రజారాజ్యం పార్టీ మొదటి టివి ప్రకటన

Posted by తెలుగు'వాడి'ని on Thursday, February 12, 2009

 ఇది ఇంతకు ముందు వచ్చిందో లేదో తెలియదు .. కానీ నేను చూడటం మాత్రం ఇదే ప్రధమం ..

వీడియో నేను చూసినది ఈనాడుఆంధ్ర అనే సైట్ లో .. వీలుంటే ఆ సైట్ ను సందర్శించండి ...
లేదంటే ఈ కింద ఉన్న లంకెను నొక్కండి ...

ప్రజారాజ్యం పార్టీ మొదటి టివి ప్రకటన

ఆ ప్రకటనలో ఉన్న వివరాలు ఇక్కడ :


అదొక్కటే పరిష్కారమా అంటే కాదు ...

రోడ్ షో ల పేరు చెప్పి రోజుకో/ఊరికో/షోకో ముగ్గురి,నలుగురిని లేపెయ్యెటం కూడా ఒక రకమైన పరిష్కారమే ... [

చేతిలో/జేబులో ఒకటో/రెండో లక్షలు పెట్టుకోవటం, మరుసటి రోజు పేపర్లో ఆ డబ్బులు ఇచ్చిన ఫొటో వచ్చేలా

చూసుకోవటం మరచిపోవద్దు సుమా]

--------------------------------------------------------------------------పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

ఈ రోజు 'సాక్షి'లో 'నారా చంద్రబాబు'పై ఒక సూపర్ కార్టూన్

Posted by తెలుగు'వాడి'ని on Monday, February 2, 2009

నాకు బాగా నచ్చింది ఈ కార్టూన్ ... ఈనాడులో శ్రీధర్ కార్టూన్ కి దీటుగా ఉండగలిగే రీతిలో ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో కూడా కొన్ని కార్టూన్స్ వస్తున్నాయి ...

ఇదిగోండి సాక్షిలోని కార్టూన్ ..

 
ఇంకొక సారి కలుద్దాం... పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

కంటి చూపుకే చస్తారు : బాలయ్య !?

Posted by తెలుగు'వాడి'ని on Sunday, February 1, 2009

ఈ రోజు అన్ని మాధ్యమాలలో వచ్చిన వార్త ఇది ..

....................తాను మీసం మెలేసి, కన్నెర్ర చేస్తే ఆ కంటి చూపుకే రాష్ట్ర ద్రోహులంతా చస్తారని ఆయన తొడకొట్టి హెచ్చరించారు.

::::::::::::

మీసాలు, కళ్లు, తొడలు అయిపోతే ... ఆలస్యం చేయకుండా నా గన్ బయటకు తీస్తా ... 

                  [ కాకర్ల సుబ్బారావు గారికి ఫోన్ చేయటం మరచిపోనులేవయ్యా ... 

                                  అట్లాగే 
                    ఆల్రెడీ వసుంధరకి సాక్ష్యాలు మాయచేయటం గురించి కూడా గుర్తుచేసేశా.  ]


ఎగస్పార్టీ లో వాళ్లు అన్న ముక్క ఈయన చెప్పటం మర్చిపోయాడో లేక ఈ మాధ్యమాల వాళ్లు రాయలేదో గానీ ...  

           [ పనిలో పని బాబు వగైరాలు  కూడా ఒకదారి అయిపోతే ఇక ఆ కుర్చీ మనదే అనుకుంటున్నాడో ఏమో  ]

ఏది ఏమైనా రాజకీయంలో ఉన్న వాళ్లు బాలయ్య బాబుకు .. కనుచూపు మేరలో సంగతి దేముడెరుగు గాని, ఖచ్చితంగా గన్ రేంజ్ లో మాత్రం ఉండకూడని రోజులు వచ్చాయి ..

 ***************                  తస్మాత్ జాగ్రత్త           ******************పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting