బుర్ర ఎక్కువ ఉపయోగించకుండా, తేలికగా/సులభంగా చేయగలిగిన ఉద్యోగం ఏది !?
నాకు తెలిసినంతలో, ఈ మధ్య కాలంలో తరచుగా చదువుతున్న విషయాలను బట్టి ఇదిగోండి ఇలా ..
ఉద్యోగం ఏది అంటారా ...
పత్రికారంగంలో పనిచేయటం ...
ఈ రంగంలో
అన్ని ఉద్యోగాలు అంటారా ..
అబ్బే కాదండీ ...
ఒక్క ఆటలకు సంబంధించిన వార్తలు రాయటం ....
అన్ని ఆటలు అంటారా ...
అయ్యో కాదండీ ..
ఒక్క టెన్నిస్ కు సంబంధించి రాయటం ...
అన్ని దేశాల ఆటగాళ్లు/ఆటగత్తెల గురించి అంటారా ..
అయ్యయ్యో కాదండీ ...
ఒక్క ఇండియాకు సంబంధించి మాత్రమే రాయటం ...
అందరి గురించి అంటారా ....
హన్నన్నా కానే కాదండీ ...
ఒక్క సానియా మీర్జా గురించి రాసే ఉద్యోగం ....
ఎలాగంటే/ఎందువలనంటే ....
పాపం ఈ అమ్మాయి ఎక్కువగా మొదటి రౌండే దాటదు ... ఒకవేళ సచ్చీ చేడీ దాటినా రెండో రౌండ్ మాత్రం దాటాలి అనుకోదు ... [ ఎందుకులే నా టెన్నిస్ కు సంబంధించి వార్తలు రాసుకుని హాయిగ బతికేస్తున్న విలేఖరి ఆనందం మీద నీళ్లు పొయ్యటం అనుకుంటుంది అనుకుంటా ]
ఈ ఉద్యోగానికి కావలసిందల్లా Find/Replace ఎలా చేయాలో తెలిసి ఉండటమే ... టోర్నమెంట్ పేరు, రౌండ్(మొదటి/రెండు), స్కోర్(ఇది కుడి ఎడంగా ఎప్పుడూ ఒకటే ఉంటుంది), ముందంజ/నిష్క్రమణ .... ఇలాంటివన్న మాట ...
లేదూ రెండు వెర్షన్స్ ని (మొదటి/రెండవ రౌండ్ లో ముందంజ/నిష్క్రమణ) రాసి దగ్గర పెట్టుకున్నా కూడా ఓకే ...
హోరాహోరీగా పోరాడింది .. చేతులెత్తేసింది ... ఇలాంటి వాక్యాలు షరా మామూలే ...
ఉదా : చూడండి లేటెస్ట్ వార్తా స్రవంతి సానియా మీర్జాపై ..
7
వ్యాఖ్యలు:
- చైతన్య.ఎస్ on Feb 17, 2009, 8:09:00 PM said...
-
"ఓటమికి సాకులు చెప్పదలచుకోలేదు. కానీ... ఫైనల్ కు ముందు శనివారం జరిగిన సింగిల్స్ మ్యాచ్ చాలా సుదీర్ఘంగా సాగింది. తర్వాత డబుల్స్ ఆడాల్సి వచ్చింది. బాగా అలసిపోయాను. ఈ మ్యాచ్ కు ముందు కాస్త విశ్రాంతి లభించి ఉంటే బాగుండేది. "----సానియా :)
- Praveen Mandangi on Feb 17, 2009, 9:45:00 PM said...
-
నేను ఇప్పటి వరకు సన్యాసం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏ శ్రమా చెయ్యకుండా హుండీలు నింపుకుంటారు కదా. టైటిల్ చూసి మీరు కూడా దొంగ సన్నాసులు గురించి వ్రాసారనుకున్నాను. తీరా చూస్తే మీరు వ్రాసింది క్రీడా వ్యాసాలు వ్రాసే వాళ్ళ గురించి.
- లక్ష్మి on Feb 17, 2009, 10:19:00 PM said...
-
హ హ హ :) భలే చురకలేశారు కదా...బాగుంది
- పరిమళం on Feb 17, 2009, 11:18:00 PM said...
-
:) :)
- Anonymous on Feb 18, 2009, 12:15:00 AM said...
-
Right now, President of India post seems to be perfect fit for this ;)
- Anonymous on Feb 18, 2009, 4:20:00 AM said...
-
:)
- Anonymous on Feb 19, 2009, 11:11:00 AM said...
-
:) ఎక్కడ అప్లై చెయ్యాలండీ ఆ వుద్యోగానికి?