165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్

Posted by తెలుగు'వాడి'ని on Friday, April 17, 2009

వార్త వివరాలు ఇక్కడ చూడండి : పవన్ శపథం 

............... దీనికి మరలా భీషణ/భీష్మ ప్రతిజ్ఞ అని వెధవ కవరింగ్ ఈ మీడియా వాళ్లు ..

మరీ 'అధికారం' లోకి రాకపోతే అనో  లేక 148 రాకపోతే అనో అంటే మరీ దరిద్రంగా ఉంటుంది అని .. 165 అని ఒక తొక్కలో నంబర్ ఒకటి .. వీళ్ల తెలివితేటలే తెలివితేటలు ... ఎంత చక్కగా సెలవిస్తున్నారు వాళ్లు తరువాత చెయ్యబోయేది ఏమిటి అని .... జనాలు ఎంత వెధవలు లాగా కనపడుతున్నారు వీళ్లకి .. అభిమానులు గానీ, ఆశలు పెట్టుకున్న జనాలు గానీ, ఈ సారి కాకపోయినా వచ్చేసారి అయినా మనం కోరుకునే మార్పుకోసం వీళ్లు నిలబడతారేమో అనుకుంటే మాత్రం వీల్లు ఒక్క సారికే కాడి కింద పడేసి పనిచూసుకుంటున్నారు ... ఆహా ఏమి రాజకీయ చతురత!

అధికారంలోకి రాకపోతే వీళ్లందరూ (ముఖ్యంగా చిరంజీవి/పవన్ కళ్యాణ్), ప్రతిపక్ష హోదాలో ప్రజల తరుపునో (నిజంగా సేవ చేద్దామని, వాళ్ల తరుపున పోరాడదామని) లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా (తమ అస్థిత్వం కాపాడుకోవటానికి), బంద్/ధర్నాలు/హర్తాళ్లు/రాస్తారోకోలు [ ఇలా చెయ్యాలి అని నియమం ఉందని కాదు .. లేక ఇవి మాత్రమే మార్గాలని కూడా  కాదు ] లాంటివి చేస్తారు అని కనీసం వాళ్ల అభిమానుల్లో కూడా నమ్మకం ఉండి ఉండదు .. ఇక అంతరాత్మ సంగతి సరేసరి. శాంతిభద్రతల సమస్య వస్తుంది అని (జనాలలోకి వస్తే వారిని అదుపు చేయలేక) లేక ఇలాంటివి ఏవో చెప్పి .. కడుపులో చల్ల కదల కుండా, ఏసి గదుల్లో నుండి, పార్టీ అఫీసులో ఉన్న మీడియా వేదికల నుంచి ఉపన్యాసాలు దంచటం తప్ప, వీరు ఊడబొడిచేది ఏమీ ఉండదు.పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు : ,

PRP అంటే ......... !!!!!!!

Posted by తెలుగు'వాడి'ని on Friday, April 10, 2009

రోజా గారు : పనికి రాని పార్టీ ( Paniki Rani Party)

సాక్షి టివి వారు : పైసలు రాబట్టే పార్టీ ( Paisalu Rabatte Party )
 
....................................
 
ఇప్పటిదాకా ఉన్న వార్తలను బట్టి చూస్తే(నిజానిజాలు ఎలా ఉన్నా) సాక్షి వారి క్రియేటివిటీ బాగానే ఉధ్ధరించినట్టు ఉంది.
 
ఇక ఎన్నికలు అయిపోయిన తరువాత, రోజా గారి వ్యంగ్యాస్త్రం నిజమవుతుందేమో చూడాలి.
..................................పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు : ,

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting