165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్
వార్త వివరాలు ఇక్కడ చూడండి : పవన్ శపథం
............... దీనికి మరలా భీషణ/భీష్మ ప్రతిజ్ఞ అని వెధవ కవరింగ్ ఈ మీడియా వాళ్లు ..
మరీ 'అధికారం' లోకి రాకపోతే అనో లేక 148 రాకపోతే అనో అంటే మరీ దరిద్రంగా ఉంటుంది అని .. 165 అని ఒక తొక్కలో నంబర్ ఒకటి .. వీళ్ల తెలివితేటలే తెలివితేటలు ... ఎంత చక్కగా సెలవిస్తున్నారు వాళ్లు తరువాత చెయ్యబోయేది ఏమిటి అని .... జనాలు ఎంత వెధవలు లాగా కనపడుతున్నారు వీళ్లకి .. అభిమానులు గానీ, ఆశలు పెట్టుకున్న జనాలు గానీ, ఈ సారి కాకపోయినా వచ్చేసారి అయినా మనం కోరుకునే మార్పుకోసం వీళ్లు నిలబడతారేమో అనుకుంటే మాత్రం వీల్లు ఒక్క సారికే కాడి కింద పడేసి పనిచూసుకుంటున్నారు ... ఆహా ఏమి రాజకీయ చతురత!
అధికారంలోకి రాకపోతే వీళ్లందరూ (ముఖ్యంగా చిరంజీవి/పవన్ కళ్యాణ్), ప్రతిపక్ష హోదాలో ప్రజల తరుపునో (నిజంగా సేవ చేద్దామని, వాళ్ల తరుపున పోరాడదామని) లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా (తమ అస్థిత్వం కాపాడుకోవటానికి), బంద్/ధర్నాలు/హర్తాళ్లు/రాస్తారోకోలు [ ఇలా చెయ్యాలి అని నియమం ఉందని కాదు .. లేక ఇవి మాత్రమే మార్గాలని కూడా కాదు ] లాంటివి చేస్తారు అని కనీసం వాళ్ల అభిమానుల్లో కూడా నమ్మకం ఉండి ఉండదు .. ఇక అంతరాత్మ సంగతి సరేసరి. శాంతిభద్రతల సమస్య వస్తుంది అని (జనాలలోకి వస్తే వారిని అదుపు చేయలేక) లేక ఇలాంటివి ఏవో చెప్పి .. కడుపులో చల్ల కదల కుండా, ఏసి గదుల్లో నుండి, పార్టీ అఫీసులో ఉన్న మీడియా వేదికల నుంచి ఉపన్యాసాలు దంచటం తప్ప, వీరు ఊడబొడిచేది ఏమీ ఉండదు.
1 వ్యాఖ్యలు:
- Anonymous on May 4, 2009, 11:18:00 AM said...
-
Comment chese badulu nuvvelli podavachu kada emyna