అతిధి రివ్యూ : Direction (Extras, Ordinary) but Mahesh is Extraordinary

Posted by తెలుగు'వాడి'ని on Monday, October 22, 2007

ఒక వేళ మీకు ఈ అతిధి సినిమా గురించి మన టిపికల్ తెలుగు వెబ్ సైట్స్ రివ్యూలు కావాలి అంటే దయచేసి ఈ లంకెను క్లిక్కండి. ఆతిధి సినిమా రివ్యూలు - అన్ని సైటుల నుంచి ఒకే చోట

సైనికుడు సినిమా చూసిన తరువాత ఇంతకన్నా ఎక్కువ బాధ, ఆవేశం, కోపం వచ్చినా కూడా అంతలోనే తమాయించుకోవటం జరిగింది ఎందుకంటే ఆ సినిమా తీసిన అశ్వనీదత్ గారి జీవిత ధ్యేయం( ఈ మధ్య కాలంలో మాత్రమే) ఏమిటో మనకందరికి తెలిసినదే .... అది ఏ హీరో అయితే మంచి ఫామ్ లో ఉండి, సూపర్ డూపర్ హిట్స్ ఇస్తున్నాడో, అతనితో సినిమా తీసి ఇంత వరకు వాళ్ల కెరీర్ లోనే రాని/లేని అట్టర్ ఫ్లాప్ ను వాళ్లకి అంటగట్టటం....

కానీ ఇప్పుడు సొంత ప్రొడక్షన్ లో, మహేష్ అన్న గారే నిర్మాతగా వచ్చిన ఈ సినిమా ఇంత దరిద్రంగా, పరమ చెత్తగా, భీభత్స-భయానక హింస-రక్తపాత దృశ్యాలతో ఉండటం చూసి తట్టుకోలేక పెల్లుబికిన ఆవేశమే నా ఈ సమీక్షకు ప్రేరణ...

ఒక సినిమా చూసిన తరువాత ఆ సీను అలా ఉంటే బాగుండేది, ఈ ఫైటు ఇలా తీస్తే అదిరేది, ఆ సీను అలా లేకపోతే, ఈ సీనుని ఈ యాంగిల్ లో తీసుంటే, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యుండేది ... ఇలా ఎన్నో ఎన్నెన్నో చెప్పవచ్చు ... అలా చెప్పటం కూడా చాలా తేలిక మన లాంటి ప్రేక్షకులకి (ఎన్ని సినిమాలు చూడలేదు మనం)....

కానీ ఈ అతిధి సినిమా చూసిన తరువాత వీటన్నిటి కన్నా మన మైండ్ ని (ఇంకా ఏమన్నా మిగిలున్నా, లేక మోకాలు/అరికాళ్ల దాక వెళ్లి ఆగిపోయి ఉన్నా, కొద్దో గొప్పో పని చేస్తూ ఉన్నా) తొలిచి వేసేది ఒకటుంది ... అది మామూలు సినిమా కన్నా ఒక 20-40 నిముషాలు ఎక్కువ నిడివి తీసుకోని అసలు కొంచమైనా కూడా కామెడీ-రొమాంటిక్ సన్నివేశాలు చూపించటానికి ప్రయత్నం చేయకపోవటానికి, ఆ ఎక్కువ సమయాన్ని కూడా అంతా హింస-రక్తపాతంతో మాత్రమే నింపివేసి, హీరో-దర్శక-నిర్మాతలు ఎలాంటి రిజల్ట్ ఆశించి ఈ సినిమాను మన మీదకు వదిలారో అన్నదే...

ముందుగా ఈ చిత్ర దర్శకుడికి కొన్ని సూటి ప్రశ్నలు :

1. మహేష్ లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుని సినిమాలో అసలు ఇంత తీవ్రస్థాయిలో భీభత్స-భయానక హింస-రక్తపాత దృశ్యాలను చూపించటం వెనుక మీ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

2. ఈ చిత్రం యొక్క నిడివిని ఒక మామూలు సినిమా కన్నా 20-40 నిముషాలు పెంచి కూడా, హాస్యానికీ మరియు హీరో-హీరోయిన్ల మధ్య రసమయ ప్రేమ సన్నివేశాలకీ ఒక పది-పదిహేను నిముషాలు కేటాయించలేకపోవటానికీ కారణమేమిటి?

3. మహేష్ చేత కత్తి పట్టించి కుడి-ఎడంగా ఒక 50 మందిని ఏకబిగిన చంపించి తెరమీద అంతా రక్తపాతంతో నింపి చూపించటం అనేది మీ దృష్టిలో తనకి సూపర్ మాస్ ఇమేజ్ ఆపాదించటానికేనా?

4. లక్ బాగుండి సినిమా హిట్ అయితే అందరూ మీవల్లే మహేష్ కి ఇలాంటి ఇమేజ్ వచ్చింది అని చెప్పుకోవాలనా లేక తాను పట్టిన కుందేటికి రెండున్నర కాళ్లే అనుకుని మీ పంధా మార్చుకోకుండా మీకు తెలిసిన ఆ రెండు ఫైట్లు, 50 మందిని పొడవటం, 20 లీటర్ల రక్తం, ముప్పావు గంట క్లైమాక్స్ తో సినిమాని చుట్టేయటమా?

5. అసలు క్లబ్ సాంగ్ కు డాన్స్ వేసే వాళ్లు ఎలా ఉండాలో అనే బేసిక్ పాయింట్ ని ఎలా మర్చిపోతారండి మీరు? అసలు మీరు తెలుగు సినిమాలు చూడరో, ఒకవేళ చూసినా ఇదో వెరైటీ అనుకున్నారో గానీ, చెంచాడు కండ కూడా లేని మలైకా అరోరా సెలక్షన్ ని చూసిన తరువాత మీకు కళాపోషణ పూర్తిగా నష్టి (సున్న, శూన్యం) అని మాత్రం అర్ధమయ్యింది. మీరు అనుకునే ఏ సెంటర్లలో (A, B, C, D ...) ప్రేక్షకుడి అభిరుచి అయినా ఈ విషయంలో ఒకటే ...కండపుష్టితో, ముద్దుగా-బొద్దుగా, 35/70 MM(మరీ ఇంత కాదు అనుకోండి) లో చూసి సరిపెట్టుకోవలసి వస్తుందే అని బాధపడేటట్టుగా ఉండే అలనాటి జయమాలిని-జ్యోతిలక్ష్మి, ఒకనాటి సిల్క్-స్మిత లేక ఈనాటి ముమైత్ ఖాన్ లా ఉండాలి బాబూ. మలైకాకు 15 లక్షలు ఇచ్చినది నిజమే అయితే, దాని బదులు చిలకలూరిపేట/నరసరావుపేట/అమలాపురం/పెద్దాపురం దరిదాపుల్లో ప్రభలపై డాన్స్ వేసే వాళ్లని తీసుకువచ్చినట్లైతే (1500-15000) అంత రంజుగా ఉన్న పాటని ఒక ఊపు ఊపే వాళ్లు.

నా అభిప్రాయం ఏమిటంటే, ఎంతో టాలెంట్ ఉండి కూడా, ఒకటో రెండో పాయింట్లతో(నరకటం, రక్తపాతం) సినిమా మొత్తాన్ని చుట్టెయ్యటం, హాస్యానికి, లవ్ సీన్లకి అసలు ప్రాధాన్యతే లేదన్నట్టు వాటిని పక్కన పెట్టెయ్యటం చాలా శుధ్ధతప్పు. మీరు తీస్తున్నది మహేష్ తో అని, తన సినిమాలంటే మహిళలు-పిల్లలకు కూడా యువతకు ఉన్నంత క్రేజ్, ఫాలోయింగ్ ఉన్నది అని మర్చిపోయి సినిమా మొత్తాన్ని హింస-రక్తపాతంతో చుట్టెయ్యటం ఇంకా తప్పు.

నిర్మాత రమేష్ గారు!

పోకిరి లాంటి ఒక సూపర్ సెన్సేషనల్ హిట్ తో, అనితర సాధ్యమైన నటనతో ఆశేష తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో కనీవినీ ఎరుగని ఇమేజ్ ని సృష్టించుకున్న మీ సొంత తమ్ముడైన మహేష్ తో సినిమా ఇలానా ఉండేది....ఒక్క క్షణం అలోచించి చూడండి. (ఖచ్చితంగా అశ్వనీదత్ లా ఫ్లాప్ సినిమా తీసే ఉద్దేశ్యమైతే కాదు గదా మరి ఏమిటండీ ఇది)

మహేష్ గారూ,

మేము మీకు చెప్పదలచుకున్నది ఒకటే ... ఒక సినిమాను ఒప్పుకున్న తరువాత మీరు పూర్తిగా డైరెక్టర్స్ బాయ్ అయిపోయి, దర్శకునిపై ఉన్న నమ్మకమనే ఉలికి మీలో నటుడు అనే శిలను అప్పగించి తనకు ఎలా కావాలో అలా మలచబడటానికి, ఒదిగిపోవటానికి.. మేమే కాదు మాతో పాటు మీతో పని చేసిన ప్రతి దర్శకుడూ చెయ్యెత్తి జై కొడుతున్నాము..చప్పట్ల వర్షం కురిపిస్తున్నాము ...

కానీ ... ఇకముందు దర్శకుడు మీ చేతికి కత్తి ఇచ్చినపుడు దయచేసి కనీసం కొన్ని వివరాలు, ఎంత మందిని నరకమన్నారు, ఎన్ని లీటర్ల రక్తం లేక ఎరుపు రంగు వాడబోతున్నారో కనుక్కొని, ఆయా సన్నివేశాలలో నటించండి. ఇవ్వాళ తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న కొద్ది మంది (కుర్ర)హీరోలలో, సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా, కేవలం మీకోసం అంటే మిమ్మల్ని చూడటం కోసమే సినిమాకు వచ్చే వాళ్లు కోకొల్లలు అందులో ఎంత మంది యూత్ ఉంటారో, కుడి-ఎడంగా అంతే మంది మహిళలు-పిల్లలు కూడా ఉంటారనే విషయాన్ని మీరు మర్చిపోకుండా మీ దర్శకుడికి కూడా చెప్పండి.

మహేష్ వీరాభిమానులూ,

మీరు మాత్రం ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోవటానికి గల కారణాలు తెలుసుకోని కూడా దయచేసి ఊరికే వదిలిపెట్టవద్దు. ఈ చిత్ర దర్శకుడినీ, హీరో అన్న గారు అయినందుకు మరీ ఎక్కువగా ఈ చిత్ర నిర్మాతనీ మీరు ఎలాగైనా కడిగి పారెయ్యండి, మరలా మరలా ఇలాంటి పనికి మాలిన సినిమాలు అంటే బాక్సాఫీసు దగ్గర గారంటీగా పల్టీకొట్టే (మొదటి రోజు 6.15, మూడు రోజులకి 13, నాలుగు రోజులకి 16.73 కోట్లు వసూళ్లు రావచ్చు గాక .. For more records and collection details, please click Prince Mahesh - Athidhi Collection Records ... Actual figure of Athidhi is Rs.17 Cr. but here is the latest update from UTV : Athidhi tots Rs 125 mn in 1st (First)week)), మరీ ముఖ్యంగా ఉండవలసిన అన్ని హంగులూ అంటే కామెడీ, రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా సినిమా తీసినందుకు...ఇక ముందు సినిమాలు తీయకుండా ఉండేలా చేసేందుకు....

వీరాభిమానులంటే సినిమా విడుదలప్పుడు కటౌట్స్ కట్టి, పాలాభిషేకాలు చేసి, రంగు కాగితాలు కట్టి, గుడ్డలు చించుకోని మొదటి ఆట సినిమాకు వెళ్లేవాళ్లు మాత్రమే కాదు అనీ వాళ్ల అంచనాలకు, ఆశించినదానికి విరుధ్ధంగా ఉంటే ఎదురుతిరిగి చీల్చిఛెండాడే వాళ్లు అని కూడా తెలియచెప్పవలసిన తరుణమిదే. (ఇది చిరంజీవి వీరాభిమానులకు కూడా అండి ... ముఖ్యంగా ఆ శంకర్ దాదా జిందాబాద్ లో హీరోయిన్ ని చూసినప్పుడల్లా రక్తం ఉడికిపోతూ ఉంటుంది)

చివరిగా ఒక్క మాట ... మహేష్ నటనాకౌశలం, హావభావ విన్యాసాలు, స్క్రీన్ ప్రెజన్స్, హెయిర్ స్టైల్ ఇలా మహేష్ కు సంబంధించినంత వరకు ఎంత చెప్పుకున్నా తక్కువే...అవన్నీ అధ్బుతం ...నిరుపమానం... అనితరసాధ్యం...అతనికి అతనే సాటి.

కానీ వీటన్నిటి గురించి, నాకు తెలిసినంతలో తెలుగు సినీ ప్రేక్షక, విమర్శక, సమీక్షక లోకంలో గానీ, ఆ మాటకొస్తే వేరే నటీనటులలో గానీ, వారి అభిమానులలో గానీ, వేరే అభిప్రాయం ఉంటుంది అని నేను అనుకోవటం లేదు.

కాదూ మహేష్ బాగా నటించి ఉంటాడా, స్క్రీన్ మీద బాగుంటాడా etc అని సినిమాకు వచ్చే వాళ్లు ఉంటారు అని దర్శక-నిర్మాతలు భావించి జస్ట్ వాటి కోసమే ఈ సినిమా తీయటం జరిగితే మాత్రం .. అది ఎలా ఉంటుంది అంటే ....

(నాలుగైదు సంవత్సరాల క్రితం కుడి-ఎడంగా 2002 వరకు లెండి) చిరంజీవి గారి సినిమాకి, ఆ సినిమాలలో పాటలుంటాయో లేవో చూద్దామని, ఉన్నా కూడా పాటలలో ఆయన స్టెప్స్ వేస్తారో లేదో, వేసినా గూడా అసలు ఎలా వేస్తారో అని...వెళదాము అనో....లేక రాఘవేంద్ర రావు గారి సినిమాకి, హీరోయిన్ ని అసలు ఎక్స్-పోజ్ చేస్తారో లేదో .. చూపించినా బొడ్డు చూపిస్తారో లేదో, బత్తాయిలు, ఆపిల్స్, ద్రాక్షలు హీరోయిన్ కి వేసి కొడతారో లేదో అని..వెళదాము అనో ... అనుకునే వాళ్లు ఉంటారు అని భ్రమ పడేంత....

అలాగే మహేష్ పేరు/నటన/స్టైల్, చిరు స్టెప్స్/ఫైట్స్, దర్శకేంద్రునిచే హీరోయిన్ బొడ్డు ఎక్స్-పోజింగ్, ఫ్రూట్స్ వాడటం ... ఒక సినిమాని హిట్ చేయలేవు అని ఇప్పటి దాకా ఫ్లాప్ అయిన వాళ్ల సినిమాలని చూసి కూడా నేర్చుకోక పొతే ఎలా అండి.


[ ఇప్పుడే అందిన వార్త ఈ మద్య విడుదలైన తెలుగు సినిమాలు హిట్టా-ఫట్టా: ఆంధ్రాకేఫ్ వారి లేటెస్ట్ ట్రేడ్ టాక్ ]

కనుక మీరు ఎక్కువ క్రియేటివ్ గా ఆలోచించ కుండా, ఉండవలసిన నాలుగు అంశాలు అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకుంటూ, మహేష్ బాబు వీరాభిమానుల అంచనాలకు కొద్దిగా అటూ-ఇటుగా ఉండేలా జాగ్రత్త పడుతూ, మహిళలు-పిల్లలు కూడా మహేష్ మానియాలో ఒక భాగమే అని మరచిపోక, మహేష్ ని ఒక్క 'పోకిరి' గానే కాకుండా, ఒక 'అతిధి' లానో (ఇది సర్దుకున్నట్టు గానే ఉంది), 'మిర్చి' లానో, రాబోయే మరో పాత్ర/సినిమాలాగానో గుర్తుంచుకునేలా చేయటానికి ఇక రాబోయే దర్శక-నిర్మాతలు కృషి చేయటానికి ఏ కొంచమైనా ఇది ఉపయోగ పడాలని, ఉపయోగపడుతుందనే ఆశ...ఆకాంక్ష...పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

నిర్మాత - దర్శకులను ఇబ్బంది పెడుతున్న ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మీపతి తదితరులు

Posted by తెలుగు'వాడి'ని on Sunday, October 21, 2007

Producers council bans Prakash Raj

Prakash Raj ousted from Athidhi?

Prakash upsets Pawan's Jalsa?

Venu Madhav Coming to Sets in Drunken State!

Brahmanandam Kicked Out By EVV For Idlis

నా ఈ ఆవేదన, ఆవేశం, స్పందన ఒక్క ప్రకాష్ రాజ్ వార్తకు మాత్రమే కాదు .. ఇంతకు ముందు చదివిన/విన్న ఇతర నటుల (బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మీపతి తదితరులు) ప్రవర్తన గురించి కూడా...... (మన హీరోయిన్ల అతి - వారి తల్లుల (అక్కడక్కడా/అప్పుడప్పుడూ కొంచెం వెరైటీగా ఆర్తిఅగర్వాల్ తండ్రిలాంటి వాళ్ల) డబుల్ అతి, ఆ బాధల గురించి ఎంత చెప్పుకున్నా అదో పెద్ద తరగని గని....వీలుంటే ఇంకొకసారి వాటి గురించి కూడా చర్చించుకుందాము.)

ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, వేణుమాధవ్, లక్ష్మీపతి తదితరులు :

1. మీకన్నా గొప్ప గొప్ప వాళ్లు ఎందరో, ఎందరెందరో కాలగర్భంలో కలిసిపొయారు, మీరొక లెక్కా ... నాలుగు రోజులు దాటితే మీకు ఉన్న ఆ నాలుగు సినిమాలతోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది...నాలుగు కాలాలు నిలిచేలా, నలుగురూ గుర్తు పెట్టుకొనేలా చేసేది తెరపై ఒక్క నటనే కాదు ... తెర వెనుక మీ ప్రవర్తన కూడా అన్నది మరువకండి.

2. ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి...ఆలీ, సునీల్ లాంటి వాళ్ల గురించి (ముఖ్యంగా ఆలీ) ఎందుకు ఇలాంటి వార్తలు (గాసిప్ అయ్యుండచ్చు) రావటంలేదో .. వాళ్లు నిర్మాతల నటులుగా, అందరితో ఎలా, ఏ అరమరికలు లేకుండా నటించగలుగుతున్నారో.

3. మీలో కొందరు నిర్మాతలు-దర్శకులయ్యారు-కొడుకులను నటులను చేయ ప్రయత్నించారు ... ఒక్క నిముషం అలోచించండి, అప్పుడు మీకు ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఎదురుకాలేదో ... లేక కనీసం ఇలాంటివి ఎదురైతే మీకు ఎలా ఉండేదో ...


తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు:


ఏందర్రా మీ బాధ! ఎందుకు మీ తోళ్లు ఇంత మందంగా తయారవుతున్నాయి? మీ శరీరంలోని అణువణువూ ఇంతలేసి మూర్ఖత్వంతో నిండిపోతుంది. మీ కళ్లకు ప్రతి రోజూ ఎన్ని వందల పొరలు కమ్ముకుంటున్నాయి? చూడబోతే మీరు ఎప్పటికీ మారరురా బాబు అనిపిస్తుంది!

ఆ పై వార్తల్లో లేశమాత్రమైనా నిజముంటే మాత్రం, మీరు దయచేసి కళ్లు తెరవండి....మన తెలుగు పరిశ్రమని(కి), మన తెలుగువాడైనా, తెలుగుకి వలస వచ్చిన వాడైనా, ఎవడైనా సరే, నిర్మాతల మనిషిగా, ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేసేవాడిలా ఉండేటట్లు చెయ్యాలి గానీ, వీళ్ల చుట్టూ లక్షల-లక్షల చెక్స్ పట్టుకొని పిచ్చి కుక్కల్లా తిరగకండి.

ఒప్పుకుంటాము మేము వీరంతా గొప్ప నటులనీ, పాత్రలలో జీవిస్తారనీ, ఆయా పాత్రలకి జీవం పోస్తారనీ, వారు తెర మీద కనిపించినంతసేపు వారి నటనకు, హావభావ విన్యాసాలకు, నవ్వులకు మన కళ్లు తెరకు అతుక్కుపోయేలా చేయగలరు అనీ...కానీ కొన్ని విషయాలు ఎందుకు మీరు మర్చిపోతున్నారో, లేక మర్చిపొయినట్టు నటిస్తున్నారో మీకే అర్ధం కావాలి.

1. చిరు ఛరిస్మా అయినా, చిరుతనయుడి ఆరంగ్రేటమైనా, మహేష్ పోకిరి క్రేజ్ అయినా, జూనియర్ NTR సింహాద్రి మాస్ ఇమేజ్ అయినా...ఇలాంటివి ఎన్ని ఎన్నెన్ని ఉదాహరణలు అయినా చెప్పచ్చు......ఒక సినిమా ఆడటానికి ఇలాంటివే ఎందుకూ పనికి రాకుండా పోతుంటే, ఆఫ్టరాల్ ఈ ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం మరియు వేణుమాధవ్ etc గాళ్లు ఎంత? వాళ్లు మాత్రమే చేయగలిగిన కాంట్రిబ్యూషన్ ఎంత ఒక సినిమా విజయవంతమవ్వటానికి (అసలు లేదు అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు), హీరోల పవర్ ఫుల్ ఇమేజ్, వారికున్న ఫాలోయింగ్, కాంబినేషన్ క్రేజ్ కన్నా ఎక్కువేమి కాదుగా.

2. వీరంతా ఒకనాడు వీళ్ల సినీప్రస్థానాన్ని ఎలా మొదలు పెట్టారు, ఎక్కడ నుంచి ఆరంభించారు, ఎక్కడ నుంచి ఎక్కడకు ఎదిగారు? వాళ్లతో పాటు మీరూ మర్చిపోతే (మర్చిపోయినట్లు నటిస్తే/నటిస్తుంటే) ఇలాంటి అనర్ధాలే జరుగుతాయి. తెలియజెప్పండి వీళ్ల్లకి వీళ్ల స్థానమేమిటో/స్థాయి ఏమిటో....దించండి వీళ్ల కొవ్వుని, కండకావరాన్ని, అహంకారపు జాడ్యాన్ని మరియు జయం/డబ్బు తో వచ్చిన మత్తుని, కొంచం కొంచంగానైనా.....

3. ఒక్కసారి...కనీసం ఒక్కసారి ... చెవులు రిక్కించి, కళ్లు విప్పార్చి చందమామ సినిమా చూడండి ... లేకపోతే కనీసం వందల కొలది ఉన్న సైట్స్ లో రివ్యూస్ చదవండి....అందులో ఆహుతి (క్షమించండి ఇప్పటి నుంచి అది చందమామ ప్రసాద్) ప్రసాద్ గారి అద్భుత, విలక్షణమైన నటనకు జన, విమర్శకుల, సమీక్షకుల నీరాజనాలను స్వయంగా చూసి తెలుసుకోవటానికి/చదివి తరించటానికి...అంటే అవకాశం ఇస్తే, దర్శకుడు మలచుకోగలిగితే ఎలాంటి నటనైనా రాబట్టుకోవచ్చు మనకు అందుబాటులో ఉన్న నటులలో నుంచే...

4. ముఖ్యంగా హీరోలూ, తమరు ఎలాగూ డైరెక్షన్-స్క్రిప్ట్ లో వేళ్లు-కాళ్లు పెట్టి తెప్పించే/కలిగించే తలనొప్పులకు తోడు ... ఈ కేరెక్టర్ నటుల ఎంపికలో, లేదంటే కనీసం వీళ్ల అతిని నియంత్రించే పనులు ఏదన్నా చేసి ఉధ్ధరించండి బాబూ ...

ఈ మధ్యనే చదివా, కృష్ణవంశీ మరియు EVV లు వాళ్ల సినిమాలలో (చందమామ, పెళ్లయింది కానీ) నటించటానికి అంగీకరించి ఇలాంటి అతి చేస్తున్న వాళ్లని శుభ్రంగా తీసి పక్కన పెట్టి వేరే వాళ్లకి అవకాశం కల్పించారని .....Bravo ... Kudos .. Great ... అందుకోండి ఇవే నా హృదయపూర్వక అభినందనలు. చూసినేర్చుకోండి కొంచమైనా అలాంటి దర్శకులను చూసి-ఏం చెయ్యాలో, ఎలా గుణపాఠం నేర్పాలో ....

చివరిగా ఒక్క నిముషం అలోచించండి ... పరభాషలలో వీరు నటిస్తున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు అక్కడి నిర్మాతలకు ఎందుకు కలగజేయటంలేదో ... అప్పుడు మీకే అర్ధం అవుతుంది మన తెలుగు సినీ పరిశ్రమను (ముఖ్యంగా మిమ్మల్ని) ఎంత వెధవల కింద జత కట్టి ఆడిస్తున్నారో ... మన పరిశ్రమ అన్నా, మీరన్నా వీరికి ఎంత చులకన భావమో ...

చిట్ట చివరిగా, ప్రేక్షకుడిగా మేము చెప్పేది ఒకటే ... ఇలాంటి వాళ్లు సినిమాలలో లేనంత మాత్రాన మేము సినిమాలు చూడటం మాని వెయ్యమండి, మొదటి వారం కలెక్షన్స్ కి ఎలాంటి లోటు రానివ్వము .... చూస్తూనే ఉంటాము, మీరేమీ బెంగపడకండి .... మీరు ధైర్యంగా సినిమాలు తీయండి...కొత్తవారికి అవకాశాలు కల్పించండి ...... వీళ్ల అతి అనే బూజుని మాత్రం పూర్తిగా అందరు కలిసికట్టుగా వదల్చండి.....

ఆ రోజు కోసం ఎంతో ఆతృతతో ఎదురు చూసే, చూస్తూ ఉండే ...
ఓ సగటు తెలుగు సినీ అభిమాని / ప్రేక్షకుడు / శ్రేయోభిలాషి.పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

నాయకుల పైత్యం - మన కవిత్వం

Posted by తెలుగు'వాడి'ని on Friday, October 19, 2007

1) పందేరానికి కొత్త రూట్లు .... ఇచ్చేది మంత్రులు - పుచ్చుకునేది పార్టీ వాళ్లు .... ఇస్తే తప్పేంటి : మంత్రి దామోదరరెడ్డి

పూర్తి వివరాలు ఉన్న ఈనాడు పత్రికలోని లింకు : పందేరానికి కొత్త రూట్లు

మన వ్యాఖ్యానం :

మీకు ఎందులోనూ, అందునా పంచుకోవటంలో ఏమీ తప్పుండదు-తప్పుదొరకదు దామోదరా!!!! తప్పంతా నాలుగేళ్ల నాడు మిమ్మల్ని ఆమోదించిన మాదే నాయనా! సాగించుకోండి మీ ఆటలు మరి కొన్నినాళ్లు ... అటు పిమ్మట వేచి చూడండి ఎవరి 'నాడి'కీ అందని ఈ తెలుగు'వాడి-వేడి' తఢాఖా ఏమిటో చూద్దురు గానీ..........


2) గన్ మెన్ కళ్లు కప్పి ... చెంగుమన్న చెంగల


పూర్తి వివరాలు ఉన్న ఈనాడు పత్రికలోని లింకు : గన్ మెన్ కళ్లు కప్పి ... చెంగుమన్న చెంగల

రాజకీయంలో ఉండగా ఇంతలేసి చిన్నవాటికి .... అక్కరలేదు దూకుటకు శిక్షణ
పూర్వానుభవమే అండగా ఉన్నచో వీటి(రి)కి .... అవసరంలేదు చూపుటకు సాధన

3) వరికి మధ్ధతు ధర సాధించే వరకు పోరు ఆగదు - బాబు

పూర్తి వివరాలు ఉన్న ఈనాడు పత్రికలోని లింకు : తెలుగు'వాడి'కి ఢిల్లీ చూపిద్దాం

అప్పుడు తెగిపడిన ఆడపడుచుల పుస్తెలు చూసైనా,
కరగలేదు నీ మనసు

ఇప్పుడు వరిపంటకు అదే రైతన్నల మధ్ధతు ధరకే,
హూంకరిస్తుంది నీ అరుపు

అప్పుడు తొమ్మిదేళ్లు ఉండి మరచినావు ఇదే రైతులను,
అందుకే చవిచూశావు ఆ తెలుగు'వాడి'

ఇప్పుడు కట్టిననూ ఏ పల్లెనైనా ఇదే రైతుతో జోడి,
అర్ధం కా(దు)నివ్వరు నీకు ఈ తెలుగు'నాడి'

...........................పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

ఆస్తుల లెక్కలపై సవాళ్లు :: విచారణ నియమావళి-విధానము-నివేదిక (భాగము - రెండు)

Posted by తెలుగు'వాడి'ని on Thursday, October 18, 2007

ఇది రెండవ భాగం అండి....కనుక దయచేసి ముందు మొదటి భాగం చదవండి పూర్వాపరాలు అర్ధం కావాలంటే ... ఒకవేళ అది మిమ్మల్ని నవ్వించలేక పోతే, అంతే సంగతులు ... కనీసం దీంట్లో కొంచమన్నా నవ్వు రాక పోతుందా అని ఆశ ఉంటే (మిమ్మల్ని ఆ దేముడే కాపాడాలి) ఇక ఆలస్యం ఎందుకు చదివెయ్యండి.

ఈ దిగువన ఇచ్చినది, మాకు దొరికిన నకలు (మేము సేకరించిన విశ్వసనీయ సమాచారం ప్రకారం) ... లేక ఇలా ఉంటుంది అనే మా ఊహ అనో, ఎలా అనుకున్నా ఫర్వాలేదండి :-)

విచారణాధికారి నియామకం :

ఎవరు : రిటైర్డ్ / సిట్టింగ్(రన్నింగ్,జాగింగ్) జడ్జి ... ఎవరో ఒకరు (ఎవరైనా ఊడేది ఏమీ లేదు ... ఏదో ఒక పేరు లాటరీ తీయండి)

ముందుమాట :

మీరు ఊరికే ఆవేశపడి బట్టలు చించుకోకుండా, ముందు ఈ నియమ-నిబంధనలను పూర్తిగా చదివి(అర్ధం చేసుకోవాలి బాబూ, మాలాగ చూడ/చదవకుండా సంతకాలు పెట్టటం కాదు) ఉధ్ధరించండి. ఇది మీకు మేము పెట్టే పరీక్ష...ఇందులో మీరు పాస్ అయ్యి, ఒక ప్రమోషనో లేక ఎంతో కొంత వెనకేసుకోవాలి అనుకుంటే మేము చెప్పేది తూ.చ. తప్పకుండా పాటించండి.

నియమావళి :

1. మీరు హైదరాబాద్ దాటి ఎక్కడికీ వెళ్లవలసిన పని లేదు (వెళ్లటానికి వీలులేదు). ఒక వేళ వెళ్లవలసి వస్తే మీరు ఏఏ బంధువుల, స్నేహితుల, విహారయాత్రల సిటీ/విలేజ్ పేర్లు రాసుకొని అక్కడికే వెళ్లి విచారించండి...స్వామి కార్యం - స్వకార్యం అయిపోతుంది.

2. ఇడుపుల తోట - హెరిటేజ్ కోట లాంటి ప్రదేశాలకు వెళ్లండి (కనీసం వీటికి కూడా వెళ్లక పోతే బాగోదు కాబట్టి) మీ కుటుంబంతో కలిసి - మిగతా ఏర్పాట్లు మేము చూసుకుంటాము.

3. ఇంకు లేని పెన్ను, తెల్లకాగితాలు ఉన్న ఫైలు పట్టుకొని బాగా హడావుడిగా తిరుగుతూ కనిపించాలి. అలాగే, మైకు (అదే లేండి మీడియా)చూడగానే పూనకం వచ్చినట్టు ఊగిపోకుండా, మేము రాసిచ్చిన డైలాగులు మాత్రమే అప్పచెపుతూ ఉండాలి.

4. ఇంతకు ముందు వేసిన అన్ని కమీషన్లు/విచారణల గతి ఏమయ్యిందో, వాళ్లు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయో, వాటిపై మా (ముందు లేక వెనుక వచ్చే ఏ ప్రభుత్వాలది అయినా అందరిదీ అదే బడి) స్పందన ఏమిటో పూర్తిగా అర్ధం చేసుకోండి. అంటే మీరు ఊరికే పెద్ద చించుకోవద్దు అని మా ఉద్దేశ్యం / సలహా.

***ఇది నియమావళి తొలి కాపీనే అండి....మాకు గుర్తుకు వచ్చినపుడు వీటికి కలుపుకుంటూ పోతూ ఉంటాము.

విచారణ కాలపరిధి :

పదిహేను నుంచి ఇరవైఒక్క నెలలు (బాబు బండారం ఏదన్నా బయట పడితే (ఎట్టాగూ పడదు .. కాకపోతే ఏదో ఆశ) ఎన్నికలల ముందు జనాలకు/మీడియాకు వదలటానికి వీలుగా...) ... కానీ ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది(తొందరగా ముగించటం లాంటిది మాత్రం ఉండదు) కనుక మీరు ప్రశాంతంగా మీకు అందుబాటులో ఉన్న అన్ని రాజభోగాలనూ సంపూర్తిగా అనుభవిస్తూ ఉండండి.

నివేదిక :

ఇది మీరు సేకరించిన మరియు మాకు ఇచ్చిన వివరాలలో ఒక్కముక్క కూడా దీంట్లో ఉండదు ఎందుకంటే మా బండారం మేమే బయట పెట్టుకోనే వెధవల స్థాయికి ఇంకా దిగజారలేదు కాబట్టి. దీంట్లో ఏమి ఉండాలో మేము పూర్తిగా అలోచించి (ఒకసారి బాబు తో కూడా మాట్లాడి .. 2009 లో ఏమవుతుందో ఎవడికి తెలుసు), కర్ర విరక్కుండా - పాము చావకుండా, నాలుగు పనికిమాలిన వివరాలు ఉండేలా చూసుకుంటూ మేమే ఒక నివేదికను సిధ్ధం చేసి ఉంచుతాము కనుక మీరు నిశ్చింతగా ఉండండి.

ఈ వివరాలన్నిటితో, రాజు గారు బాబు గారికి ఈ-టపా పంపించటం, బాబు గారు చదవటం, వెంటనే ఎనిమిది వేళ్లతో (కుడి చేతిలో రెండు వేళ్లు V ఆకారంలో బిగుసుకుపోయాయి కదా...అప్పుడే మర్చిపోతే ఎలాగండి) రాజు గారికి రిప్లై ఇవ్వటం, రాజు గారు అది చదవటం అందరూ హాపీ-హాపీ గా ఉండటం జరిగిపోయాయి.

కొసమెరుపు :

బాబు గారు మామూలు మూడ్ లోకి వచ్చారని అనుకున్న తరువాత రాజు గారు, అసలు బాబు అవేశానికి కారణం కనుక్కుందాము అని బాబు సెల్లుకి ఫోన్ చేయగా.......

రాజు గారు : ఏం బాబూ! నా ఈ-టపా చూసాక కొంచెం నవ్వు మొహం వచ్చి ఉంటుంది అని అనుకొని, అసలు నువ్వు నా ఆస్తులపై గొడవకు దిగటానికి కారణం కనుక్కుందామని చేశానయ్యా ఈ ఫోన్ కాల్.

బాబు గారు : ఏం చెప్పమంటావయ్యా రాజూ! నిన్నటి దాకా తొమ్మిదేళ్లు సి.యమ్ అని, బాగానే వెనకేశాము అని మేము జబ్బలు చరుచుకుంటూ బ్రతికాము నువ్వేమో నిన్న గాక మొన్న వచ్చి లేటెస్ట్ సినిమాలో హిట్టైన డైలాగులన్ని కొట్టేస్తుంటే తట్టుకోలేకే ఈ గొడవంతా........

వినండి ఆ డైలాగులు ఏందో:

ఎప్పుడొచ్చామన్నది కాదమ్మా ... ఎంత వెనకేశామన్నదే ముఖ్యం.

ఎవ్వడి అవినీతి గురించి చెపితే .. దిమ్మతిరిగి పోతుందో వాడే(రే) రాజు గాడు(రు)

ఇది చూసి మేము కూడా సినిమా స్టైల్ లో ఏదన్నా చేద్దామని ఆ శివాజీ వెంట బడితే అది కాస్తా తుస్సుమంది.

ఈలోపు నువ్వేమో, ఇలియానాలా ఊపుకుంటూ తిరుగుతుంటే, మా బతుకేమో, నిన్ను చూసి

బస్తాలు, బస్తాలు డబ్బులు పోగేసి వెనకెయ్యటమే గానీ, ఏదోలే మాజీ సి.యమ్, మరలా అధికారంలోకి వస్తాడేమో, ఎప్పుడైనా కొంచెం ఉంచుదాం అనే ఆలోచనే రాదాయె నీకు ... ఇలాగయితే ఎలా చచ్చేది. మరి కాలక ఏం జేస్తది మాకు.

..............................

అక్కడయితే ఇలియానా బాక్స్ ఇచ్చి (కోపంతో అయినా) వెళ్లిపోయింది. మరి ఇక్కడ రాజు గారు కొన్ని బస్తాలన్నా మిగులుస్తారో లేదో ఇంకొక 18 నెలలు ఆగితే కానీ తెలియదు. ( ఏమవుతుందో మన కందరికీ జగమెరిగిన సత్యమే :-) )

మనవి : రాజు గారు ఇలియానా కాదు ...బాబు/రాజు గార్ల ఇద్దరిలో ఏ ఒక్కరూ మహేష్ కాదు.పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

ఆస్తుల లెక్కలపై సవాళ్లు :: విచారణ నియమావళి-విధానము-నివేదిక (భాగము - ఒకటి)

Posted by తెలుగు'వాడి'ని on Monday, October 15, 2007

బాబు గారి ఇంట్లో ఒక గది :

ఏమిట్రా బాబూ ఈ కష్టకాలం....ఏ పార్టీవాడూ ఏ సమస్యనూ లేపడేంది...ఇలా అయితే మనకు హైజాక్ చెయ్యటానికి
ఏమీ దొరకటం లేదు. జనాలు మర్చిపొతారు మన గురించి, మన పార్టీ గురించి. ఏదో ఒకటి చెయ్యాలి...చెయ్యాలి అని గడ్డం నుండి నల్లవెంట్రుకలు పీక్కుంటూ ఆలోచిస్తున్న సమయంలో హఠాత్తుగా, సంకలు గుద్దుకుంటూ, ఎడమ చేత్తో పిల్లిమొగ్గల వేసుకుంటూ(కుడిచేతి రెండు వేళ్లు వి ఆకారంలో చూపించుకుంటూ) గదిలోంచి బయటకు వస్తే.... ఎదురుగా ఉన్న భువన ఈయన గారి వైపు, గది వైపు అనుమానంగా చూస్తుంటే అదేమీ లేదు అని మొహం పెట్టి .... ఆహా! దొరికింది ఒక కొత్త టాపిక్కు : రాజు గారి గంటలవారీ సంపాదన....అని అరుచుకుంటూ, ఎర్రన్న, దేవన్న, దయన్న, సీతన్న, రాజత్త, రోజక్క అందరి సెల్లులకి రింగులిచ్చి, వారి ద్వారా అన్ని మీడియాలకూ సెల్లు కాల్స్, యస్.యమ్.యస్, ఈ-టపాలు, పేజర్లు ఇచ్చి విలేకరుల సమావేశంలో --- గంటకు కోటన్నారు, మొత్తం ఒక ముఫ్పై వేల కోట్లు అన్నారు - విచారణ పెట్టాలన్నారు - అందరికీ మరలా ఆ రెండు వేళ్లు ఎప్పటిలానే చూపించి వెళ్లారు.

ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక గది :

ఇది విన్న/చదివిన మన రాజు గారు ఒక రకంగా నవ్వుకుంటూ (ఎప్పటినుంచో ఆస్తి మొత్తం లెక్కపెట్టటానికి ఎవడినో ఒకడిని నియమిద్దాము అనుకుంటుంటే బాబు తన శ్రమను తగ్గించాడు కదా అని) వెంటనే కొంచెం కోపంతో - వీడెమ్మ కడుపు కాలా (వెంటనే తెలుగు నిఘంటువు తీయబోయి అంతలోనే అసలు ఈ రాష్ట్రం మొత్తం మీద మన కన్నా తెలుగు బాగా వచ్చినవాడు ఎవడూ లేడు కదా అని గుర్తుకు వచ్చి), ఈ బాబు ఇంత పని చేశాడేందబ్బా అని పంచె సవరదీసుకుంటూ, చేతులు తిప్పుకుంటూ కుర్చీలో ఊగుతూ - "నువ్వు రెండెకరాలతో మొదలెట్టావు, తొమ్మిదేళ్లు ఉన్నావు - అదన్నాడు, ఇదన్నాడు మొత్తానికి బాబు దగ్గర కూడ కుడి-ఎడంగా అన్నే వేలకోట్లు ఉన్నాయి గదా" అని అదే మీడియాకు మొత్తం చిట్టా విప్పాడు..........ఈయన గారు కూడా విచారణకు సై అంటే సై అన్నారు.

ప్రజలనే పిచ్చోళ్లు:

ఆ తధాస్తు దేవతలు ఈ ఒక్క సారికైనా మా మాట విని ఏదో పుణ్యం కట్టుకోని ఈ లెక్కలు-తొక్కలు ఏవో తేల్చేసి వీరిద్దరి పిచ్చి కాస్తా కుదిర్చి (లేకపొతే ఇంకా ఒక 18 నెలల్లో మేము ఎలాగూ కుదురుస్తాము అని మనసులో అనుకుంటూ) ఆ కోట్లేవో ఆ రైతులకో, పౌష్టికాహారం చాలని పిల్లలకో, ప్రాధమిక విద్యకో, ఆరోగ్య పరిరక్షణకో, ఆడపడుచుల ఆర్ధిక స్వాతంత్ర్యానికో,మనల్ని రక్షించటానికో లేక ఏదో ఒక మంచికో ఉపయోగపడేలా చేస్తే ఒక పని అయి పోతుంది కదా అని, కనపడిన కనపడని దేముళ్లను-దేవతలను ప్రార్ధిస్తున్నారు.

బాబు గారి మాజీ మంత్రుల, యమ్.యల్.ఏ ల, పార్టీ కార్యకర్తల,, అనుచరుల సణుగుళ్లు :

ఈ లెక్కలు ఇప్పుడు చెప్పి మాకు పుండు మీద కారం రాయటం కాకపోతే ఏమిటి బాబూ అని ఒక వైపు... మొత్తానికి రేపు అధికారం లోకి వస్తే మనకి ఆదర్శం ఎవరు/ఏమిటి, మన సంపాదన ఏ రేంజ్ లో ఉండాలి అని చెప్పినందుకు ఆనందం మరొక వైపు ...

రాజు గారి మంత్రుల, యమ్.యల్.ఏ ల, పార్టీ కార్యకర్తల, అనుచరుల సణుగుళ్లు :

ఇప్పటి దాకా మేము పెద్ద పుడింగుల్లా కటింగులు దొబ్బుకుంటూ (మాకు అందుబాటులో ఉన్నంతలో మాక్సిమం చాలా వరకు ఒక దారి చేశాము అని), కాలరు ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఇంటికి వెళ్లి మా పెళ్లాలకి/మొగుళ్లకి మొహం చూపించాలంటేనే ఒక రకంగా ఉంది (బాబు అనవసరంగా ఇప్పుడు చెప్పాడే ఈ లెక్కలు అనుకొని) అనే బాధ ఒక వైపు ... ఇంకా మిగిలిన 18 నెలల్లో ఏమేమి చెయ్యాలో, ఎక్కడెక్కడ నొక్కెయ్యాలో అని సాధ్యమైనంత స్పీడుగా ఆలోచించుకుంటున్న ఆనందం (ఇప్పటికైనా చెప్పి కళ్లు తెరిపించినందుకు) ఒక వైపు..

ఒక్కొక్కరూ (అదేనండి పైవారు అందరూ) విడి విడిగా :


కలగాపులగమైన ఆలోచనలతో వారు కూడా ఏదో పూనకం వచ్చినట్టు (మీడియాను చూస్తే ఆటోమాటిక్ గా వస్తుంది లేండి) ఊగి నాలుగు పనికిమాలిన ముక్కలు మాట్లాడి ఇంటికి (అదేలేండి బారు కి) వెళ్లారు.

ఇక అసలు విషయంలోకి వస్తే ....

బాబు / రాజు గార్ల అవేశం కొద్దిగా చల్లారిన తరువాత, వారి సవాళ్లు-ప్రతి సవాళ్లు గుర్తుకి వచ్చి కొంచెం టెన్షన్ పెరగబోయే సమయంలో ... ఒకరి సెల్లు నుంచి ఇంకొకరి సెల్లుకి ఒకే సారి కాల్ వచ్చింది.

రాజు : ఏమయ్యా బాబు! గంటకి కోటన్నావ్-మొత్తం ముప్పై వేల కోట్లన్నావ్...అంతవరకి ఏదో ఓ.కె అనుకుంటే, మధ్యలో ఈ కమీషను, ఎంక్వైరీ అంటావేందయ్యా, అన్నీ తెలిసికూడా? ఇలా అయితే మనం ఏమి అయిపోవాలి?

బాబు : ఏంది రాజూ నువ్వు మరీనూ, తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి ఆ మాత్రం (అన్నిట్లో కాదులే) ఆలోచించకుండా ఎలా మాట్లాడతాననుకుంటావయ్యా, అందులో ఈ ఆస్తిపాస్తుల విషయంలో....

రాజు : ఇంతకీ ఏందయ్యా నువ్వు అనేది

బాబు : అదేనండి ... నేను సిట్టింగ్ జడ్జి అంటాను ... మీరు జాగింగో లేక రన్నింగ్ జడ్జో అనండి ... ఇలా ఒక వారం సాగదీశామా ఎవడూ దీని గురించి పట్టించుకోడు ... అంతే ..(కనపడదు అని తెలిసి కూడా మరొక్కసారి తన రెండు వేళ్లు చూపిస్తూ) ...... సరేకానయ్యా, నేనంటే ప్రతి పక్షంలో ఉన్నాను ఇలా చించుకోవాలి కాబట్టి చించుకుంటా....నువ్వేంది అంతే అవేశపడి, అన్నింటికీ సిధ్ధం అంటావు....

రాజు :
ఒక్కసారిగా నవ్వుతూ ... అంతలేదులేవయ్యా బాబూ, అసలు ఈ కమీషన్, ఎంక్వైరీలు ఎట్లా పనిచెయ్యాలొ నువ్వు చూపెట్టిన, ఆచరించిన నియమావళికి, నేను కొంచెం మార్పులు-చేర్పులు చెయ్యమని మా అధికారులను ఇప్పటికే ఆదేశించాను ... అది పూర్తి అయిన తరువాత ఒక కాపీ నీకు కూడా పంపిస్తాను అప్పుడు నీకు పూర్తిగా అర్ధమవుతుందిలే...

ఇంతలోపే ... అధికారులు ఎందుకైనా మంచిది అని (ఎలాగూ రాజు/రామచంద్రం గార్ల దగ్గరి నుంచి ఆదేశాలు వస్తాయని తెలుసు కాబట్టి) అసలు ఈ కమీషన్, ఎంక్వయిరీలకు ఒక సరికొత్త నియమావళిని, ఎలా పనిచేయాలి, నివేదికలో ఏమి-ఎలా ఉండాలి అని రూపొందించే పనిలో పడ్డారు.

................................

ఒకవేళ ఈ మొదటి భాగం మిమ్మల్ని కొంచమైనా నవ్వించి ఉంటే లేక కనీసం రెండో భాగంలో అయినా నవ్వు రాక పోతుందా అని ఆశ ఉంటే (మిమ్మల్ని ఆ దేముడే కాపాడాలి) ఇక ఆలస్యం ఎందుకు చదివెయ్యండి...ఇదిగో ఆ రెండో భాగం లంకె : ఆస్తుల లెక్కలపై సవాళ్లు :: విచారణ నియమావళి-విధానము-నివేదిక (భాగము - రెండు)పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

విహారి గారు వ్రాసిన - 'మీ టపా హిట్టా-ఫట్టా' పై ఓ విశ్లేషణ

Posted by తెలుగు'వాడి'ని on Saturday, October 13, 2007

నా ఈ విశ్లేషణకు ముఖ్య కారణం, ఈ మధ్య తరచుగా మన తెలుగు బ్లాగు/జాబు/వ్యాఖ్యలలో అసలు ఈ బ్లాగులు ఏర్పడిన ఉద్దేశ్యం ఏమిటి అనేది మరచి పోయి మెల్లమెల్లగా ప్రక్కదారి పడుతున్నామేమో అనే బాధ అంతే.

ఇదే (విహారి గారు వ్రాసిన - 'మీ టపా హిట్టా-ఫట్టా) అంశంపై మన cbrao గారు కొంచెం వివరణతో, మరి కొంచెం విశ్లేషణతో, ఇంకొంచెం సూచనలతో, వెరసి జాబు ప్రయోజనమేమిటో, ఇప్పటికే ఒక జాబును (
హిట్ల కోసం టపాలు )ప్రచురించి ఉన్నారు.

Definition and/or primary purpose of the Blog, just as a recap :

*** Short for Web log, a blog is a Web page that serves as a publicly accessible personal journal for an individual. Typically updated daily, blogs often reflect the personality of the author.

*** A BLOG is a publication of personal thoughts, experiences, and web links. It is updated frequently and is usually a mixture of what is happening in a person's life and what is happening on the web or in the media.

*** A blog is a personal diary. A daily pulpit. A collaborative space. A political soapbox. A breaking-news outlet. A collection of links. Your own private thoughts. Memos to the world.

The best one ...

*** The heart and soul of blogging is the individual and/or the group of individuals opining on the fly and responding post-haste to one and all.

ఇక మనం విషయంలోకి వెళితే, విహారి గారు బ్లాగు/జాబుల్లోని రకాలను ఒక షడ్రుచుల భోజనం గా వండి-వడ్డించి, జాబులకు వచ్చే హిట్లను, వ్యాఖ్యల సంఖ్యను బట్టి ఆ బ్లాగు/జాబు హిట్టా-ఫట్టా అని చెప్ప చూడటం, తినబోయే ముందు, తరువాత పచ్చి కాకరగాయ ముక్కను నోటికి అందించినట్లుగా ఉంది.

ఇంతకు మునుపు దొంగ హిట్లు సృష్టించి Google AdSense ను ముంచివేసిన దాఖలాలు మనకు చాలా తెలుసు. కానీ ఇప్పుడు పైత్యం ప్రకోపించి, మన బ్లాగ్ప్రంచంలోకి వ్యాఖ్యలు అమ్మే sites వచ్హాయి. ఇలాంటి వాటి ద్వారా వారు ఇప్పటికే బ్లాగోద్దేశ్యపు లక్ష్మణ రేఖను దాటినట్టే ... కనీసం మన తెలుగు బ్లాగ్ప్రంచపు సభ్యులకైనా, మరీ ఎక్కువగా ఈ హిట్లు-వ్యాఖ్యలు-వ్యాఖ్యల సంఖ్యలు గురించి ఆలోచనలు రానీయకుండా, బ్లాగోద్దేశ్యాన్ని కాపాడాలనే నా ఈ ప్రయత్నం (ఒక్క విహారి గారి జాబు, లేక ఇలాంటి జాబుల వలన, నిజంగా మనం వెనువెంటనే అటువైపు దూకేస్తామనో, లేక దూకేసేలా ప్రోత్సహిత్సాయనో చెప్పడం నా ఉద్దేశ్యం కాదు సుమా) ....

నా దృష్టిలో ఒక జాబు ఎలా ఉండాలీ అంటే, మనం వ్యక్తపరచిన భావం కనీసం ఒక్కరితోనైనా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వగలిగితే, ఆ బ్లాగు అజరామరం...వ్రాసిన బ్లాగరి ఉద్దేశ్యం పరిపూర్ణం...అతని జీవితం ధన్యం.

మచ్చుకి కొన్ని అజరామర జాబులు :

చదువరి గారి - ట్రాఫిక్కబుర్లు

ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించ దలచాను ఈ జాబు గురించి ....

1. ఈ జాబు చదివిన తరువాత మనం ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఇరుక్కు పొయినపుడు ఈ జాబులోని ఏదో ఒకటి మన కళ్ళ ముందు జరుగుతుంటే ఖచ్చితంగా ఈ జాబు గుర్తుకు వచ్చి ఒక చిన్న దరహసం మన పెదవులపై కదలాడుతుందే అదే ఈ జాబుకు విజయ సంకేతం ...

2. అలాగే ఈ జాబు చదువుచున్నపుడు ఒకనాడు మనకు జరిగిన ఇలాంటి అనుభవాలు గుర్తుకు వచ్చి, ఆ చదువుచున్న కొద్ది నిముషాలు నవ్వించ గలిగితే(కామెంట్ రాయక పోయినా), లేక ఈ జాబు ప్రేరణతో వారి వారి బ్లాగులలో ఒక కొత్త జాబు రాయటమో జరిగితే అదే ఈ జాబుకు విజయ సంకేతం ...

జ్యోతి గారి - పెళ్ళైన వారికి మాత్రమే

ఈ జాబుకి వచ్చిన వ్యాఖ్యలలో, నిజాయితీగా జాన్ హైడ్ కనుమూరి-చాణుక్య జివి గార్లు, ఒకరు గుర్తుకు వచ్చింది అని, మరొకరు కనువిప్పు కలిగింది అని ఒప్పుకున్నారు...ఈ రెండు చాలు ఈ జాబోద్దేశ్యపు లక్ష్యం నెరవేరింది అని, అదే ఈ జాబు విజయ సంకేతం అని చెప్ప టానికి.

అలాగే ఒక కామెంటు ఇప్పుడు రా(య)కపోయినా, ఏ ఒక్క ఇల్లాలు అయినా మనసులో జ్యోతి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటే ..అటు పిమ్మట (హఠాత్తుగా తన భర్త గుర్తు పెట్టుకొని బహుమతి, పూలు, పళ్ళు తీసుకు వెళితే, ఈయన గారు చెప్పక పొయినా, సాధించి అయినా భార్యలు తెలుసుకుంటారు మన జ్యోతి గారి జాబు గురించి)ఈ జాబుకి వచ్చే వ్యాఖ్య అయినా లేక జ్యోతి గారికి వచ్చే ఈ-టపా అయినా చాలు ఈ జాబు విజయ సంకేతం అని చెప్ప టానికి.

రెండు రెళ్ళు ఆరు గారి - నేను - బినీతా - చంద్రబాబు రెడ్డి , బరువు - బాధ్యత

...................

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ "జెస్ట్ రిలాక్స్" (ఫోటో గ్యాలరీ) లింకు చూస్తే, క్లిక్కకుండా మనం ఉండలేం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సైటులకు ఎక్కువ హిట్లు రావచ్చు...కానీ వెళ్ళిన వారిలో 97 శాతం మంది అక్కడ ఉన్న పాతచింతకాయ లాంటి ఫొటోలు చూసి (మొదటి ఫొటో తప్ప) తిట్టుకోవటమో లేక వెంటనే బ్రౌజరు మూయటమో చేస్తారు...(కానీ అప్పటికే ఒక హిట్టు సంఖ్య పెరిగింది)...మిగిలిన ఒక శాతం మంది ఇంకొక సారి చూశాము అన్న ఆనందం...ఇంకా ఒక శాతం మంది ఆ కొత్తదైన మొదటి ఫొటో చూశామన్న ఆనందం....మిగిలిన ఒక శాతం మంది ఆ ఫొటోలన్నీ మొదటి సారి చూశామన్న ఆనందం.....

ఇప్పుడు చెప్పండి .. ఆ పైన ఉన్న లింకు కలిగిన జాబు హిట్టా? కానే కాదు. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు అసలు బ్లాగొద్దేశ్యం ఇది(హిట్లు, కామెంట్లు జనరేట్ చేయటం)కాదు కాబట్టి. అదే ఇది ఒక రెగ్యులర్ వెబ్ సైటు అయితే సూపర్ హిట్ అనాలి అంత క్యాచీ టైటిలు పెట్టినందుకు ..

బ్లాగటం మొదలు పెట్టిన తొలినాళ్ళలో వచ్చే హిట్టుల-వ్యాఖ్యల గురించి కొంత ఉత్సుకతను చూపటంలో తప్పులేదు ఎందుకంటే అవి మనం వ్రాసేవి కూడా చదివేవాళ్ళు ఉన్నారు అన్న ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఎంత అయినా మానవమాతృలం గదా!

కానీ ఇలా వచ్చే హిట్టుల సంఖ్యను బట్టి మీ జాబు హిట్టా-ఫట్టా అని అందులో 150+ హిట్టులు వస్తే సూపర్ హిట్ అనీ, 100-150 వస్తే హిట్ అనీ అలా అలా ఇంకా ఏవేవో వ్రాసే జాబులు ఇప్పటి దాక బ్లాగర్లలో లేని ఆలోచనలను కలిగించటం వలన వచ్చే లాభాల కన్నా, నష్టాలే ఎక్కువ.

కనుక నా విజ్ఞప్తి ఒక్కటే ... హిట్లు రాలేదనో, వ్యాఖ్యలు లేవనో ... లేక మీ బ్లాగు ఫ్లాపు అని ఎవరన్నా చెప్పారనో అర్ధం-పర్ధం లేని అలోచనలతో నిరుత్సాహం తెచ్చుకోకండి....బ్లాగటం ఆపకండి.

బ్లాగు పరమోద్దేశ్యాలివే :

ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడో, చదివినప్పుడో వెనువెంటనే మీకు కలిగే స్పందనకు యధాతధపు...

మీ బ్రతుకు పుస్తకం లోని మధుర స్మృతుల, తీపి జ్ఞాపకాల, అనుభవాల దొంతరల పుటలకు, అందులోని పేజీలకు...

మీ అభిరుచులు, ఇష్టాయిష్టాలు, ఆశలు, ఆశయాలు, ఊహలు, ఊసులు, బాసలకు...

అవనీ-ఇవనీ ఒకటని ఏమిటి, దేనిమీదైనా, వేటిమేదైనా మీరు పంచుకోదలచిన వాటికి...


                     అక్షరరూపం.

ఇవన్నీ మీ అందరికీ నాకన్నా ఎక్కువగా తెలిసినా ఇక్కడ ప్రస్తావించటానికి ఒక ముఖ్య కారణం ఏమిటంటే....

కర్ణాటక సాహిత్యం పైనో, కధాకళి నృత్యం పైనో బ్లాగు వ్రాస్తే హిట్లు-వ్యాఖ్యలు రాలేదనో, ఇలాంటి విచిత్రమైన వివరణలతో సింపుల్ గా ఫ్లాప్ అని మనంతట మనలనే నిర్ధారించుకొనమని, ఫ్లాప్ కనుక వెంటనే ఇంకొక జాబు రాయుటకు ఉపక్రమించటం ఉత్తమమని సూత్రీకరించడమే అసమంజసం. అలాకాక మీరు చెప్పదలచుకున్నది చెప్పారు...జనాలు చదివారా, హిట్లు-వ్యాఖ్యలు వచ్చాయా అన్నది పట్టించుకోక మీరు తదుపరి జాబు రాయుటకు ఉపక్రమించటం ఉత్తమమని చెప్పి ఉంటే చాలా బాగుండేది.

ముగింపుగా నేను చెప్పేది ఒకటే ....

మీరు చెప్పదలచుకున్న దానికి, పంచుకోదలచిన వాటికి ఒక అక్షరరూపం ఇచ్చారు... జనాలు చదివారా, హిట్లు-వ్యాఖ్యలు వచ్చాయా అన్నది పట్టించుకోక ముందుకు సాగండి... బ్లాగులు సృష్టించండి ... జాబులు లిఖించండి.

ఎన్ని రాశాము అన్నది ముఖ్యం కాదు .... కనీసం ఒక్క సారైనా మీ జాబులోని విషయం మరొకరితో ఎమోషనల్ గా కనెక్ట్ కాగలిగితే మీ బ్లాగు-జాబు అజరామరం. ఒకవేల అలా కనెక్ట్ కాకపోయినా, ఎల్లప్పుడూ మీ మదిలో కదలాడుతున్న బ్లాగోద్దేశ్యానికి మీరిచ్చిన అక్షర రూపం మీరు చూసుకున్న, చదివిన క్షణాన మీ కళ్ళల్లో కనిపించే, మోములో వికసించే వెలుగులు, మీ పెదవులపై పలికే చిరునగవులు అమృతతుల్యమైనవి ... వెలకట్టలేనివి ....

అవే చాలు, రాని హిట్లు-వ్యాఖ్యల నిరాశలు అనబడే, బంధు-మిత్ర-హిత-సన్నిహితులను చంపలేననే అర్జునుడైన మీకు మీ బ్లాగ్ప్రపంచపు మహాభారత సంగ్రామంలో తదుపరి పదనిర్ధేశానికి కర్తవ్య భోధన చేసే భగవద్గీత లోని కృష్ణోపదేశం లాంటివి.పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

నవ్వితే నవ్వండి (మోడ్రన్ భక్తుని ప్రార్ధనకు ఆల్ట్రా-మోడ్రన్ దేముని వరం)

Posted by తెలుగు'వాడి'ని on Friday, October 12, 2007

బ్లాగు రాతలతో, బ్రౌజింగు చేతలతో విసుగు పుట్టిన వేళో లేక విరామం కోరుకున్న వేళో, మన లాంటి ఒక తెలుగువాడు హఠాత్తుగా దేముణ్ణి ప్రార్ధించడం మొదలు పెట్టాడు ....

దేముడా ... ఓ మంచి దేముడా !

ఆ రోజు విధినిర్వహణలో ఉన్న మన దేముడుంగారు టపటపా బ్రౌజరు ఓపెన్ చేసి వీడు ఏ మెస్సెంజరులో ఆన్-లైన్ ఉన్నాడో లేక ఏ సైటు లో దొరుకుతాడో వెదుకుతున్నాడు ఎందుకంటే వీడిని ఎలాగన్నా అడగబోయే కోరిక నుంచి డైవర్ట్ చేద్దామని లేదూ ఖచ్చితంగా ఇవ్వవలసి వస్తే ఇక్కడి నుంచే పని కానిచ్చేద్దామని... కానీ మన వాడు ఎక్కడా దొరకక పోయేటప్పటికి ఇదేదో కొంచెం సీరియస్ వ్యవహారమే అనుకొని మన గూగుల్ సెర్చ్ అల్గారిథం లాంటి ఒక మనోవేగపు వాహనంపై మన వాడు ఉన్న ప్రదేశానికి ప్రత్యక్షంగా వచ్చాడు ....

మన వాడు తెలుగువాడు కాకపోతే కిందకు దిగకుండా ఏదో ఒక ప్రత్యామ్నాయ మార్గం అలోచించేవారే, కానీ మన వాడు దేముడు గారిని తడిమి చూసి, సవాలక్ష యక్షప్రశ్నలు వేసి సమాధానాలు సరిచూసుకొని గానీ వదిలి పెట్టడని ఆ దేముడి గారికి పూర్తిగా తెలుసు....

మనవాడి యక్షప్రశ్నల భయం ఒక వైపు, క్రిందకు వెళ్ళిన తరువాత ఎలా సంభోధించాలి, ఏమని మాట్లాడాలి అనే టెన్షన్ ఒక వైపు....కానీ వీటన్నిటి మధ్యలో ఒక పేద్ద ఆనందం ఏమిటి అంటే, ఇన్ని రోజులకి తను ఇష్టపడి కొనుక్కున్న ఐపాడ్, పాకెట్ పిసి, సెల్ ఫోన్, బ్లూటూత్ హెడ్/మైక్రో ఫోనులు, మోడ్రన్ డ్రస్ అన్నీ వేసుకొని చూసుకొని అందరికీ చూపించే అవకాశం వచ్చినందులకు (ప్రక్క వారు చూస్తే కుళ్ళుకుంటారనో, లేక నేను బయటకు తీసుకు వెళితే మర్చిపోయో, పారవేసి వస్తాననో మా భార్యామణి నేను పెట్టుకోవటానికి పడనివ్వలేదాయె ....

నిత్య బ్లాగరీ, అనునిత్య బ్రౌజరీ ! ఏమి నీ కోరిక?

పిలుపు క్రొత్తది, పలుకు పాతది ... క్రిందకు వచ్చే మార్గమధ్యంలో క్రొత్తగా వచ్చిన, తను చూసిన, మన యమదొంగ, యమగోల సినిమాలు గుర్తుకు వచ్చి మధ్యేమార్గంగా వెళితే మంచిది అని ఇలా డిసైడ్ అయిపోయారన్నమాట.


స్వామీ! నాకు తక్షణమే ఒక సంచి నిండా డబ్బులు, ఒక ఉద్యోగం, ఒక వాహనం మరియు దాని నిండా అమ్మాయిలను ప్రసాదించండి.


మన వాడి కోరిక విన్న దేముడిగారికి ఎంతకీ లోడ్ అవ్వని మనకు కావలసిన పేజీలా, చాల ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు హేంగ్ అయిపోయే కంప్యూటర్ లా, దిమ్మతిరిగి పోతూ ఉన్న సమయంలో, సునామీ లాంటి భయం ఒకటి మనసును, మదిని ఆవహించింది. అది, ఇంతకు మునుపు అయితే వరం ఇవ్వక పోతే, ఎర్రబడ్డ కళ్ళతోనో, కమండలంలోని నీళ్ళతోనో చాలా సింపుల్ గా ఒక జన్మకి సరిపోయే శాపంతో అయిపోయేది. తరువాత ఆవేశం తగ్గేదాకా ఉండో లేదంటే పైకి వెళ్ళి పెద్దాయనకి అసలు విషయం చెప్పి శాపవిమోచనా విధానం కనుక్కుని, వీలుంటే కొంత శిక్ష తగ్గించుకొనో లేక సూపర్ ఫాస్ట్ గా శాపం నుంచి బయటకు రావటమో జరిగిపోయేది. ఇప్పుడు అదేమిటో ఇంటర్నెట్ యుగమట ఒక్క సారి మన గురించి అందులో ఏమి వచ్చినా, వ్రాసినా, వ్రాయబడినా ఇక అంతే సంగతులట.....ఎన్నెన్ని జన్మలకయినా అది అలాగే ఉండునట....మంచి అయినచో అందరికీ సంతోషమే .. చెడు అయినచో కింకర్తవ్యము? మరలా ఆ పెద్దాయన నన్ను ఒక వైరస్ గా ఈ లోకంలోకి పంపించిననూ, మనకు గెలుపు మీద నమ్మకము లేదాయె ... అప్పుడంటే శత్రువు కళ్ళకెదురుగా కనిపించెను కనుక మనకు ఇచ్చి పంపించిన దివ్యశక్తులతో కొంచెము నాటకీయతను జోడించి సులభముగా గెలిచినాము అనే భావన రాకుండా జాగ్రత్త పడితిమి. ఎదురుగా యున్నది తెలుగువాడాయె, ఈ రోజులలో ఎక్కడ చూసిననూ వీరి పాండిత్యము అమోఘము...ఈ ఇంటర్నెట్ టెక్నాలజీయందు వీరితో మనము పోటీ పడజాలము కనుక ఈ భక్తునకు కోపము రాక మునుపే, కావలసినది ఇచ్చి, కుదరకపోతే ఎదో బురిడీ కొట్టించి ఇచ్చినట్లు నటించి తొందరగా మనము వెనుకకు వేగవలె. లేనిచో, వీడు నాకు జన్మజన్మలకై ఈ ఇంటర్నెట్ శాపమును ఒసంగిన నాకెవరు దిక్కు?

ఇవన్నీ మెదడులో, మనసులో సుడులు తిరుగుతున్న సమయంలో ఒక సారి మన వాడి వైపు కళ్ళు తిప్పి చూస్తే అప్పుడే వీడు పళ్ళు కొరకటం, కళ్ళు ఎర్రబడనీయటం కనపడనీయక మెల్లగా కంప్యూటర్ దగ్గరకు వెళ్ళే ఉద్దేశ్యం ఉన్నట్టు అనిపించగానే, మన దేముడు మనోనేత్రాన్ని విప్పి మన వాడి ఆలోచనలలోకి తొంగిచూసి, ఒక్కసారిగా భూనభూనోంతరాలు దద్దరిల్లిపోయేలా పొలికేక పెట్టి, వేనవేల సునామీల వేగంతో వెనువెంటనే మనవాడితో ..........

తధాస్తు నాయనా! నీ కోరికను మన్నించు చుంటిని. పూర్తి వివరములతో నీకు ఒక ఈ-టపా పంపించెదను.

అని దీవించి మనవాడి అలోచనలను కొద్దిగా డైవర్ట్ చేసి, మరికొద్దిగా శాంతింపజేశాను అని స్థిమిత పడిన తరువాత ఇందాకటి పొలికేకకు ఫ్లాష్ బాక్ లోకి వెళితే .... దేముడు గారికి కనపడిన మనవాడి మాస్టర్ ప్లాన్ ఏమిటి అంటే...

వీడు అప్పుడే దేముడు వరం ఇవ్వకపోవటం పై ఎన్ని బ్లాగులు రాయాలి (ఎప్పుడూ మనసుకు హత్తుకునే సున్నితమైన కవిత్వాలు వ్రాసే మా రాధిక అక్కకు, .... పుట్టిన రోజో మరి పెళ్ళి రోజో గుర్తుంచుకోలేదనో లేక బహుమతి కొనలేదనో నిన్ననే బావ గారి మీద బాగా కోపంతో ఉన్న జ్యోతక్కకు (ఇలా ప్రస్తావించినందులకు మనసు నొప్పించి ఉంటే క్షమించండి..నిన్ననే చదివాను, గుర్తు ఉంది అందుకే ఇలా వాడాను, ఇలాంటి వాళ్ళందరినీ కూడగట్టి, నా కేసును కొద్దిగా బాగా స్ట్రాంగుగా ప్రెజెంటు చేసి, ఎలాగైనా ఒప్పించి (కామన్ గా బావ గారి పేరు చెప్పి, దేముడి పేరు చెపితే చీపురు తిరగేస్తారు....బావగారి పేరు అయితే, లైటు దెబ్బలు, స్ట్రాంగ్ తిట్లతో సరిపెట్టచ్చు), ఛండప్రఛండమై, అక్షరాలలో అగ్నికీలలు కనిపించే, పదాలలో విష్ఫులింగాలు పలికించే కవితలో, జాబులో రాయించ గలిగితే దేవత గారి తరపు నుంచి సెంటిమెంటు కలిసి వస్తుంది...మహిళాలోకమంటే దేముడు గారికి భయం వేస్తుంది.) , ఏఏ బ్లాగు సైన్యాల సమూహాన్ని (చదువరి, కొత్తపాళీ, శోధన , విహారి, రానారె, ఒరెమూనా తదితరులు .. ఇప్పుడిప్పుడే బుడిబుడి నడకల తప్పటడుగులతో అడుగిడిన నాకు, తరచుగా తగిలిన పేరులు మాత్రమే ఉదహరించాను ... వీలు చిక్కినపుడు మరలా కొందరి పేరులు ఇక్కడ ప్రస్తావించెదను...అంతవరకూ క్షంతవ్యుడను) కూడ గట్టాలి, ఏఏ బ్లాగు కూడలి, జల్లెడ, తెలుగుబ్లాగర్స్ సైటులకి ఈ బ్లాగును, జాబులను జత చేయాలి, ముఖ్యంగా ఒక పదో-పదిహేనో స్పామ్ ఇంజన్లు పెట్టి ఆ దేముడు గారి ఈ-టపా వ్యవస్థను మొత్తాన్ని అతలాకుతలం చెయ్యాలనీ, అన్నిటికన్నా ముఖ్యంగా నలుగురైదుగురు హాకర్లను పెట్టి, ఆ దేవత గారు ప్రతి రోజూ చదివే పోసుకోలు కబుర్ల, సౌందర్యాలంకరణ, నగలు-చీరల, కూరలు-పిండివంటల, అనునిత్యం వీక్షించే ఐ.పి.టి.వి తెలుగు సినిమాల,సీరియల్స్ సైటులపై సంపూర్తిగా దాడి చేసి, ఆ సైటుల్లోని ఏ పేజీలలోకి వెళ్ళినా మన దేముడి గారి మార్ఫింగ్ చేసిన బొమ్మలు-రాతలతో నింపిన పేజీలు చూపించే విధంగా ప్లాన్ చేసినట్లుగా కనపడినది. (దేవత గారి ముందు పాయింటు వరకు ఒట్టి పొలికేక, దేవత గారి తరువాత పాయింటుతో పెద్ద సునామీ ).

మనవాడు వరమును పొందిన ఆనందంలో అమిత సంతోషుడై(మన దేముడి గారి గురించి అప్పుడే పూర్తిగా మర్చి పోయిన వాడై), యధావిధి తన కొత్త జాబు రూపకల్పనలో నిమగ్నమై, చిరుదరహాసంతో టైపుతున్న వేళ, మన దేముడు గారు ఆ చిరుదరహాసాన్ని గమనించిన వారై, ఏదో సంశయం మనసుని పట్టి పీడించుచున్నందువలన, ఇప్పటి దాకా భూలోకంలో ఉన్న ప్రభావమున, అలవాటులో పొరపాటుగా మనవాడి భుజం మీదుగా కంప్యూటర్ లోకి తొంగి చూస్తే అప్పటి దాకా మనవాడు టైపినది చూసి మరొక్క సారి ఢమాల్, ఢమాల్...ఇటు దేముడి గారి డంగు అటు తనకు ఈ-టపా వచ్చిన ట్రింగు ... మనవాడు, ఎంత అయినా తెలుగువాడు కదా, ముందు ప్రాధాన్యం దేముడు గారికే ఇచ్చి ఆయనను నీళ్ళు కొట్టి లేపి, వాహనమును సిధ్ధము చేసి పైకి సాగనంపెను.

ఇప్పటి ఢమాల్ కు మరలా ఫ్లాష్ బాక్ లోకి వెలితే .... మన దేముడి గారికి మనవాడి కొత్త జాబులో కనిపించింది ఏమిటి అంటే .....

టైటిలు : దేముడి నుంచి వరం పొందటం ఎలా - సింపుల్ చిట్కా !!!

తోటి బ్లాగర్లూ! మీరు దేముడిని ప్రార్ధించడం, తను క్రిందకు దిగి రావడం, మీరు వరం అడగటం, ఆయన సీరియస్సుగా ఆలోచిస్తున్నట్లు భంగిమలో ఉండటం, మీలో సహనం నశించి, ఆవేశం పెరిగి పోతూ ఉండటం....ఇంతవరకు చాలా రొటీను...ఇది మీకు అందరకూ తెలిసిందే.....కానీ ఇక్కడే ఉంది అసలు చిట్కా ... ఇదే సమయంలో మన దేముడు గారు తన మనోనేత్రం తెరవబోతారు...అదే సమయంలో మీరు మీ ఆలోచనల రంగులరాట్నాన్ని తిప్పండి .... అంతే మనం కోరుకున్న వరం మనకు సొంతం ...

పాపం మన దేముడు గారు మన రాజకీయ నాయకులను చూసి నేనూ అలాంటి వాడినే అని భ్రమపడి నా మాస్టర్ ప్లాన్ అంతా నిజమే అని భయపడి వరం ప్రసాదించారు. కానీ తనకు తెలియని నిజం ఏమిటి అంటే, మనది తెలుగు బ్లాగర్ల రక్తం...రాజకీయం కాని స్వఛ్చమైన తెలుగు రక్తం...మనం ఎప్పుడూ అలాంటి మాస్టర్ ప్లానుల జోలికి వెళ్ళము ఒక వేళ వరం ఇవ్వకపోయినా....మరొక ప్రయత్నానికి ఆయత్తం అవటం తప్ప....ఆ మాస్టర్ ప్లాన్ అంతా ఉత్తిత్తిదే.....

ఇంతలో దేముడు గారు వెళుతూ, వెళుతూ ఇందాక వరమొచ్చినపుడు నా పెదవులపై కనిపించిన అదే చిరుదరహాసంతో టా-టా, బై-బై చెపుతూ హాయిగా, ప్రశాంతంగా పైకి వెళుతుంటే, ఎందుకో ఒక చిన్న సందేహం మది పొరలలో....అంతే సవాలక్ష సందేహాలతో, శతకోటి భయాలతో, పట్టుతప్పి పోతున్న చేతులతో ఎలాగో కష్టపడి ఇంతకు ముందు దేముడి గారి నుంచి వచ్చిన ట్రింగు ఈ-టపా ను ఓపెన్ చేసి చూస్తే ... ఇందాకటి పొలికేక, సునామీలను కొన్ని వందల, వేల, లక్షల, కోట్లతో వెచ్చించిననూ సరిపోదేమో ...

దేముడి వద్ద నుంచి వచ్చిన ఈ-టపా :

నే నొసంగిన వరప్రసాద ఫలితము : నీకు తక్షణమే మన ఏ.పి.యస్.ఆర్.టి.సి లో, మహిళలకు ప్రత్యేకము అన్న బస్సులో కండక్టరు ఉద్యోగం లభించుట.

భక్తా ! అప్పుడే అయిపొలేదు నాయనా ఈ ఈ-టపా ... కొంచెం కష్టపడి ఎడమ చేతితో వణుకుతున్న కుడిచేతిని గట్టిగా పట్టుకొని మూషికము సహాయమున నేర్పుగా బాగా క్రిందకు వెళ్ళుము.

అలా వెళ్ళగా, వెళ్ళగా, మరలా వెళ్ళగా, ఇంకా వెళ్ళగా కనిపించిన చివరి వాక్యాలు :

మీరే కాదు నాయనలారా! నేను కూడా వికీపెడియా, గూగుల్ సెర్చ్ మరియు అన్ని తెలుగు బ్లాగులు అను నిత్యం చదువుతూ మా విజ్ఞాన సంపదను అభివృధ్ధి చేసుకుంటూ ఉన్నాము ఎందుకంటే మీలాంటి వారికి ఇలాంటి విరుగుడు కనిపెట్ట వలసి వస్తుందని ... ముందు జాగ్రత్త!పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

ధుర్యోధన ఏకపాత్రాభినయం : వై యస్ ఆర్

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, October 10, 2007

అన్న గారి కిలో 2 రూపాయల బియ్యం పథకం మన ప్రియతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు హైజాక్ చేస్తున్నారని వార్త చదివిన తరువాత, ఇదే తరహాలో ఒక వేళ మన వై.యస్.ఆర్ గారు మన అన్న గారి దానవీరశూరకర్ణ లోని ధుర్యోధనుని ఏకపాత్రాభినయం చేస్తే ఎలా ఉంటుంది అని అనుకోకుండా నాకు వచ్చిన సరదా ఊహకు ప్రతి రూపమే ఇది.
........................................

ఏమంటివి, ఏమంటివి! అవీనీతి నెపమున నా వెన్నంటిఉన్న నా వాళ్ళకు ప్రభుత్వపు సొమ్ము దోచుకొనుటకు అర్హత లేదందువా ... ఎంతమాట, ఎంతమాట! ఇది మీరు పిచ్చి పట్టి ఎన్నుకొన్న ప్రభుత్వమే కానీ మిమ్ములను అందలమెక్కించు ప్రభుత్వము కాదే, కాదూ .. కాకూడదూ ఈ ప్రభుత్వమంతయూ అవినీతి మయమేయందువా?

మీ తాత తండ్రులను పరిపాలించిన పాలకులది కాదా అవినీతి? మిమ్ములను పరిపాలించిన ఆ ప్రభుత్వాలది కాదా అవినీతి? ఆవినీతి ప్రపంచంలో పుట్టి పెరుగుతుంటివి కదా, ఇదా పెద్ద అవినీతి?

ఇంత ఏల! అవినీతి ఆదిమాత, అధికారదుర్వినియోగ రాజమాత అయిన మా ఇందిరమ్మ అవినీతీకి బీజం వేసి మా పార్టీకి వారసత్వంగా అందించలేదా.. ఆమె చేసినదీ తప్పేనందురా.

నాతో చెప్పుంటివేమయ్యా మా నవతరం నాయకులకు ప్రతినిధి అయిన మా రాజీవుడు బోఫోర్స్ ఉదంతంతో అవినీతికి కొత్త చరిత్ర మొదలుపెట్టలేదా ..

ఆ తల్లీ-తనయుల నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్న మా మర్రి, ఆయనను అనుసరించిన మా మల్లి, అటు పిమ్మట పీఠాన్ని ఎక్కిన మా కోట్ల వీరంతా అదే వారసత్వాన్ని పెంచి పోషించలేదా...

దానినే అందిపుచ్చుకున్న నేను మా కొడుకు జగన్ కు , మా మిత్రుడు గాలికి, సహచరుడు రామచంద్రునకు, మా మంత్రులు బొత్స-పొన్నాల-ఆలీ-సంభాని-కన్నా-దివాకర్ కు, నా వద్ద అయిన నేమి, మా దివాకర్ వద్ద అయిన నేమి, పనిచేసే సూరీడు లాంటి వారికి ఎవరు ఏమన్ననూ, ఏ ఆధారాలు చూపించననూ ఎదురుదాడితో తిప్పికొట్టి ప్రభుత్వ ఆస్తిపాస్తులను పంచుటలేదా...

సందర్భావసరములను బట్టి, పార్టీ-వ్యక్తిగత-మిత్ర-హిత-సన్నిహిత-బంధు-మంత్రుల-సహచర-అనుచర-కార్యవర్గ ప్రాధాన్యాలను బట్టి అవినీతి, ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి, లంచగొండితనం, అధికారదుర్వినియోగం ఇవి అన్నీ మా ప్రభుత్వంలో ఏనాడో భాగమై పోయాయి.

కాగా నేడు అవినీతి, అవినీతి అని లేనిపోని వ్యర్ధ వాదమెందులకు? పనికిమాలిన పత్రికల సాక్ష్యాలెందులకు? పస లేని ప్రతిపక్షాల విమర్శలెందులకు?

ఓహొ! అధికారమా .. నేల-నింగి-కొండ-గుట్ట-వనము-ఖనిజము-ధనము-ధాన్యము-గనులు-మణులు దోచుకునుటకు అర్హతను నిర్ణయించునది ... అయినచో మా రాష్ట్రములో సస్యశ్యామలమై, సంపద విరాళమై, ఖనిజ సంవృధ్ధి అయి, నూతన భవన నిర్మాణ-రోడ్ల విస్తరణారృమై, వెలుగొందు అన్ని ప్రాంతములను ఇప్పుడే అధికారికముగా ధారదత్తము చేయుదను.

సోదరా వివేకా! అక్రమంగా మీరు ఎన్ని రాజ సౌధాలు నిర్మించుకుంటారో, ఎన్ని పరగణాలు ఆక్రమించుకుంటారో తొందరగా నిర్ణయించుకొని మీరు మంది-మార్బలముతో ఆ పని మీద నిమగ్నమవ్వండి.

బావా మేయర్ రవీంద్రా! మన పరగణాలో పచ్చని భూములు కనిపించనందువలన సామంత రాజ్యంలాంటి పక్క పరగణాలలో పచ్చగా కనిపించే ఊరికి ఊర్లే ఆక్రమించుకోండి. గట్టిగా అడిగితే ఏదో ఒక కర్మాగారం పేరు చెప్పేయండి.

కుమారా జగనా! మన రాజ్య సంరక్షణా బాధ్యతను యువరాజు అయిన నీకు అప్పజెప్పుటకు మన మహామంత్రి రామచంద్రుని సలహామేరకు మేము నిర్ణయించితిమి. సైనిక రక్షణ కవచ, శిరస్త్రాణాల, ఆయుధాల తయారీకై నీవు సొంతంగా ఒక కర్మాగారమును స్థాపించవలసి రావచ్చు కనుక మీకు సైనిక నిధి కింద ఒక 2,000 ఎకరాలను అతి తక్కువ వెలకు ఇచ్చుటకు నిర్ణయించితిమి. శత్రు దుర్భేద్యంగా మన రాజ్య నిర్మాణ-నిర్వహణకు, ముఖ్యంగా మన శత్రువులైన రామాంధ్రచంద్రజయశేఖరనారాయణరాఘవదత్తుల వ్యాఖ్యలు-వ్యాఖ్యానాలను సమర్ధవంతంగా తిప్పికొట్టుటకు, అవసరమున్ననూ-లేకున్ననూ ముందుగా మనమే వారిపై ఎదురుదాడి చేయుటకు, దిన-వార-పక్ష-మాస-త్రైమాసిక-అర్ధ సంవత్సర-సంవత్సర పత్రికలను, వేగుల-వార్తాహరులను, ఆధునీకరించిన మాయాదర్పణ చందపు వ్యవస్థను (టి.వి ఛానల్స్)కొంగొత్త స్థాయిలో ఏర్పాటు చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. కానీ ఈ విషయాలు ఎక్కడా బయటకు పొక్కనీయక, ఇదంతయూ మీ స్వయంశక్తి సామర్ధ్యాలపైనే నిర్వహిస్తున్నారన్న భావన మన సామ్రాజ్య జనవాహినికి కలిగించినచో యువసామ్రాజ్య పట్టాభిషేకానికి తుది ఘడియల శుభసూచికలవే.

మిత్రమా గాలీ! మీరు మా కోసమైనా, మేము మీ కోసమైనా లేక మన కోసం మరెవరైనా ఆట-పాట-వేట కోసమో అశ్వారూఢులై గజ పదాతి దళాలతో ఆటవిడుపుగా మన విడిదికే విచ్చేసినప్పుడు వారి, వాటి ప్రయాణ సౌకర్యార్ధం ఒక పది సహస్రముల భూమిని ఈనాముగా ఇచ్చుచున్నాము. విడిది చుట్టుప్రక్కల కాలక్షేపం కొరకు, విడిది లోని విలాసాల ఖర్చుల కొరకు, కనుచూపు మేరలో కనిపించే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, వనములు, ఖనిజములు, గనులు, మణులు అన్నియునూ మీకే ధారాదత్తం చేయుచున్నాను.

అనుచరులారా! మీ ప్రాంతాలకే పరిమితం కాకుండా మీ శత్రు భీభత్స భయానక యుధ్ధ శిక్షణానునుభవ-ప్రతిభాపాటవాలతో దందాగిరులతో వర్తమాన-భవిష్యత్తులో నివాసయోగ్యమగు ప్రాంతాలను ఎక్కడ కావాలంటే అక్కడ ఆక్రమించుకోండి.

పార్టీ కార్యకర్తలారా! మేము ప్రవేశపెట్టబోయే / పెట్టిన అన్ని పథకాలలో మీ పేరును జొప్పించుకోండి. అందినకాడికి దండుకోండి. అడ్డువచ్చిన వాడిని తొలగించుకోండి. అడ్డంగా మాట్లాడేవాడిని బూతుల బురద చల్లండి.

వంధిమాగధులారా! మీరు నా పై చూపే వెలకట్టలేని అభిమానానికి, మీ శక్తియుక్తులన్నీ సర్వవేళ సర్వావస్థలయందు నా సార్వభౌమాధికార పరిరక్షణకు వినియోగిస్తున్నందుకు, నెలనెలా మీకు కప్పం చెల్లించేటట్లుగా నా కోశాదికారిని ఆజ్ఞాపిస్తున్నాను. మీ తనయులు విల్లంబులు, బాణాలు చేతబూని ఎప్పుడు ఎక్కడ ఎలా సంచరించిననూ, ఉపయోగించిననూ ఏ సైనికాధికారీ తప్పుపట్టకుండా, అసలు విచారణ, శిక్షలే ఒక ప్రహసనంగా మార్చివేయమని సరి కొత్త శాసనాన్ని చేయించుచున్నాను.

మంత్రులారా! జలయజ్నాలనీ, రధాల కర్మాగారాలనీ, అర్ధంకాని , అర్ధంలేని నగరాల పేర్లతోనూ, విదేశీ విహారయాత్రలతోనూ మీకు తోచిన ఏ రూపేణానైనా అందినంత వెనకేసుకోండి.

ప్రభుత్వాధికారులారా! సంవత్సరానికి 365 రోజుల చొప్పున, దినమునకు 24 గంటల పర్యంతం అనుక్షణం మేము ఇచ్చే , అర్హతలతో పనిలేని, నిభందనలకు విరుధ్ధమైనా, నియమాలకు నీళ్ళు వదిలి అయినా, మీరు కాలంతో పోటీపడుతూ మా ఆదేశాలకనుగుణంగా నేను ఇప్పటివరకు ఉదారంగా ప్రకటించిన అన్నింటికీ సత్వరమే మా అంగీకార పత్రాలను క్రొంగొత్త తాటాకులపై సిద్ధం చేసి తీసుకురండి.

నేనీ ప్రత్యక్ష ప్రసారమును వీక్షించుచున్న తొమ్మిది కోట్ల మహాజనుల సమక్షమున, ప్రింటు-ఎలక్ట్రానిక్-మొబైల్ చిత్రీకరణకు విచ్చేసిన వార్తాహర బృంద సభ్యుల మధ్యమున, సర్వధా సర్వధా శతధా సహస్రధా ఈ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, లంచగొండితనం లేకుండా ఈ ప్రభుత్వం ఉంటుంది అని భావించే పిచ్చి జనాల భావజాలాన్ని శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను.పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

గల్ఫ్ బాధితులకు మన రాజకీయ పార్టీల, నాయకుల, సగటు పౌరుని విషయ వివరణ లేఖ

Posted by తెలుగు'వాడి'ని on Sunday, October 7, 2007

గల్ఫ్ బాధితులారా

కష్టాల కడగండ్లతో పరాయి దేశంలో నిస్సహాయులుగా కన్నీటికే కన్నీరు తెప్పించే హృదయ విదారకమైన బాధతో స్వదేశి పయనానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ,అన్ని రాజకీయ పార్టీల, రాజకీయనాయకుల, మానవతావాదుల సహాయానికై చెవులు రిక్కించి ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్న మీకు అన్ని వర్గాల, పార్టీల , ప్రభుత్వాల, నాయకుల, సగటు పౌరుని సహాయ నిరాకరణకు సవివరణ కారణాలు ఇవే.

అన్ని పార్టీలు , ప్రభుత్వాలు, నాయకులు ఒకే మాటగా ప్రకటించే విషయాలు :

1. ఊహలకే పరిమితమైన మధ్యంతర ఎన్నికలు, లేక సమీప భవిష్యత్తులో ఊరిస్తున్న విధాన సభ ఎన్నికలకు ఓటరు గుర్తింపు పత్రములు ఇప్పటికే పూర్తి అయిపోయాయి. కనుక మిమ్మలని ఇక్కడకి తీసుకురావటము వలన మాకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదు, కనుక గాలిలో దీపము పెట్టి ఆకాశము వైపు చూడండి.

2. ఒక వేళ ఇప్పుడు కొత్త ఓటరుగా రిజిస్ట్రేషణ్ కి వీలు ఉన్నది అనుకున్నా , మీరు ఖఛ్చితముగా ఏ పార్టీ వారో మా దగ్గర ఎలాంటి వివరాలు లేవు కనుక మీ చావు ఏదో మీరు చావండి.

3. కనీసము మిమ్మలని తీసుకువస్తే మీ భార్య , పిల్లల ఓట్లు అన్నా మాకు వస్తాయి అంటే, మీరు అక్కడ ఉద్యోగాలు ఊడగొట్టుకుని డబ్బులు లేకుండా మీరు ఇక్కడికి వస్తున్నారు ఇంక మీ మాట మీ భార్య , పిల్లలు ఎలా వింటారు.... ఈ విషయంలో మీకు మాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే ఎన్నికలలో ఓడిపోయి ఇంటికి వెళ్ళినా (ఒకప్పుడులే) లేక సాయంత్రానికి 1 లేక 2 కోట్లు ( కప్పుకునేవి, వేసుకునేవి కాదు బాబు ...దేవుడి పాలనలో నిజముగా డబ్బులే) మాకు తిండి, మంచము, తలుపు తీయటములాంటివి ఉండటము లేదు. కనుక మీకు ఆ దేముడే దిక్కు.

4. అన్నిటికన్న ఒక ముఖ్య విషయము ఏమిటి అంటే , తీసుకువచ్చి మీకు ఓటు హక్కు పుట్టించి , మా భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టే బదులు , ఎలాగు దొంగ ఓట్లు , బినామి పేర్లతొ ఆ ఓట్లేవో మేమే గుద్దేసుకుంటాము.... కనుక తూరుపుకి తిరిగి దండము పెట్టండి.

5. పార్టీ ( ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలది ఒకటే మాట బాట ఇలాంటి వాటిల్లో ) మీటింగు పెట్టి సీరియస్ గా చర్చిస్తే తేలింది ఏమిటి అంటే, మీకు ఒక్కొకరికి పది, పదిహేను వేలు పెట్టి మిమ్మలని తీసుకువచ్చి మీరు ఓటు వేస్తారో చస్తారో తెలియక టెన్షన్ పడే బదులు అదే డబ్బుతో మేము ఐదారు ఓట్లు కొనుకోవచ్చు. (కంగారు పడకండి ... ఏంటి మీరు ఈ దేశము వదిలి బయలుదేరేముందు 2 సారా పాకెట్లు , 500 -1000 రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోయేదిగా అనుకుంటున్నారా... దేవుడి పాలనలో వీటికి కూడా స్టాండర్డ్ ..పెంచారులే)...

కాంగ్రెస్ (రాజశేఖర్ రెడ్డి మరియు వందిమాగధులు):

అసలు నిజముగా ఆలోచిస్తే మీరంతా 3 లేక 4 సంవత్సరాల ముందు వెళ్ళినవారే అంటే మీరు మాకు ఓటు వెయ్యకుండానే వెళ్ళారన్నమాట.. కనుక మీరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు కనుక , మేము ఏటి చేత్తామ్..ఒక్క చెయ్యి ఇవ్వటము తప్ప.

టిడిపి (చంద్రబాబు నాయుడు మరియు కంపెనీ):

నేను సి.యమ్ గా ఉన్నప్పుడో లేక ఎన్నికలు దగ్గరలో ఉన్నప్పుడో వెళ్ళి , నేను మీకు, మీలాంటి పేద, బడుగు, రైతు వర్గాలకు ఏమి చెయ్యలేదు అని అందరికి తెలిసేలా చేస్తారా... నేను మీ మీద అలిగాను అని మీకు తెలియ జేసుకుంటున్నాను...కనుక నేను ఉత్తరాల మీద ఉత్తరాలు ప్రధానమంత్రికో, ఇంకొకరికో పంపిస్తూనే ఉంటాను అని మీకు విన్నవించుకుంటూ...మీరు చెప్పేది విందాము అనుకునేలోగా ఆ సోనియా అమ్మ ఏదో మధ్యంతరము అంటూ ఉంది.......అదీ కాక ఈ మధ్య నేను ఏ విషయం, సమస్య మీద అయినా ఎక్కువ సేపు ఆలోచించడం లేదు ఎందుకంటే మిగతా పార్టీల వాళ్ళు లేవదీసిన సమస్యలన్నిటినీ మనం హైజాక్ చెయ్యాలి గదా ...కనుక మీ గురించి ఇంకొక సారి ఆలోచిద్దాములే..

టి.ఆర్.యస్ (చంద్రశేఖర్):

ఓరి నా తెలంగాణా బిడ్డలారా మీరేందిరో పెద్ద లొల్లి చేసి నా తల(ఏందిరా ఒకడు నా మోకాలికల్లి ఇంకొకడు నా అరికాలి కల్లి చూస్తా ఉండారు ఇంకొకడు శూన్యంలోకి చూత్తా ఉండాడు నేను తల అనగానే) బొప్పిగట్టిస్తుండురు మీరు...నేనేదో మీ పేర్లు చెప్పుకుని ఇంక ఒక రెండు మూడు వేల మందిని అక్కడికే తోలి డబ్బులు దొబ్బుతూ ఉందాము అనుకుంటిని కదా... మీరు ఇట్లా చేస్తా ఉండారు... మిమ్మలని తీసుకువస్తే నాకు ఏందయ్యా..మీరు అక్కడే ఉంటే నేను రోజుకి ఒక్కడిని తిట్టి పోస్తా ఉంటా మీరు తెలంగాణా బిడ్డలు అనే వీళ్ళు తీసుకురావటము లేదు అని.....అందుకనే అక్కడే చావండి మీరు .

బి.జె.పి(బండారు):

నేను ముందు రాసిన 73 ఉత్తరాలకి రిప్లై రాక నేను చస్తా ఉన్నా ఇక్కడ... కావాలంటే మీ కోసము ఇంకొకటి పొడుస్తా వై.యస్.ఆర్ కి... అంతే గాని అంతకి మించి మనము పెద్దగా చేసేది ఏమి లేదు...

కమ్యూనిస్ట్స్:

మా పార్టీ ప్రకారము మిమ్మలని తీసుకురావాలి అని ఉంది కాని ... మీరు ఇప్పటికి ఇప్పుడు వస్తే మీ అడాళ్ళు, పిల్లా-జెల్లా , ముసలి ముతక ఎవరూ మా పోరాటాల్లోకి రారేమో అని మా భయము... అసలే ఈ మధ్య దేవుడు గారు లాఠీ గట్టిగానే విదిలిస్తున్నారు ... ఏమి చేస్తాము మాకు కొద్దిగా ఆలోచించుకునే సమయము ఇవ్వండి... మేము చించి అదే పోరాడి అప్పుడు మీకు చెప్తాము. అప్పటిదాక లాల్ సలామ్.

లోక్ సత్తా (జయప్రకాష్):(జయప్రకాష్ మీద కామెంట్ చేసినందుకు క్షమించండి ఎందుకంటే సమకాలీన రాజకీయ నాయకులలో అసంబద్దముగా మాట్లాడని, ప్రతి దాన్ని రాజకీయము చెయ్యకుండా , సమస్య కి పరిష్కారము చూపేదిశగా ఆలోచించే ఒక గొప్ప వ్యక్తి కాబట్టి)

మిమ్మలని ఇక్కడికి తీసుకురావటము ప్రధానమైన సమస్య కాదు... అసలు మీరు అక్కడికి ఎలా వెళ్ళారు ... వెళ్ళి ఏమి చేశారు... సేవింగ్స్ లో ఎందుకు డబ్బులు లేవు... వీటంన్నిటి మీద మేము ఒక అధ్యయన కమిటీ వేసి , పూర్తి సమాచారము సేకరించి , విశ్లేషించి అప్పుడు మేము మా నిర్ణయాన్ని వెలువరిస్తాము.. అంత వరకు ఏదో చేసేయ్యాలి కదా అని చెయ్యటము మా పార్టీ ఉద్దేశము / లక్ష్యము కాదు.

సగటు పౌరుడు:

300 మంది MLAs , 40 మంది MPs మరియు MLCs (ఈ లెక్క మనకి కరక్ట్ గా తెలియదు)... వీళ్ళంతా వాళ్ళ సొంత డబ్బులు వేసుకోకపోయినా, ఒక మూడు నాలుగు నెలల జీతభథ్యాలు తీసుకోకుండా ఉంటే, ఆ గల్ఫ్ లో ఉన్నవాళ్ళని ప్రశాంతముగా తీసుకురావచ్చు అని మేము సలహా ఇద్దాము అంటే మన మాట వాళ్ళు వింటారా ... అదీ కాక వాళ్ళకి తీసుకొవటమే కానీ ఇలా ఇవ్వటం అలవాటు లేదు అని మీకు కూడా బాగా తెలిసిన విషయమే కదా...

ఒక వేళ మేమే చందాలు పోగుచేసి తెద్దాము అని ప్రయత్నము చేద్దాము అనుకుంటే, కావలసింది 4 కోట్లు అయ్యితే మేము కనీసము ఒక 15 కోట్లు పోగు చెయ్యలేకపోతే , వెళ్ళవలసిన 4 కోట్లు మీ దాక చేరవు అని భయము మాది.

అన్నిటికన్నా ముఖ్యంగా మీరు బాగా మనస్సు పెట్టి ఆలోచించవలసిన విషయము ఏమిటంటే, మీరు అక్కడే ఉంటే కనీసము మీకు తెలుస్తుంది ఎలా చావబోతున్నారో... మీరు ఇక్కడికి వస్తే, మక్కా మసీదో, ముదిగొండో, లుంబినీనో, గోకుల్ చాటో, ఇవన్నీ కాక పోతే ఏదో ఒక ఫ్లై ఓవరో.. ఇలా ఇక్కడ అయితే మీరు ఎలా చావబోతున్నారో మీకే తెలియదు.. కనుక ఏ చావు బెటరో మీరే తేల్చుకోండి.పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting