సాక్షి దినపత్రిక ఫ్యామిలీ విభాగంలో

Posted by తెలుగు'వాడి'ని on Friday, May 30, 2008


ఈ రోజు (మే 31, 2008) రెండు ఆర్టికల్స్ కు సంబంధించి ఒకే ఫొటో వాడారు ... ఇలా వాడటం తప్పు అని కాదు కానీ చూడగానే ఏమిటో కొంచెం వెరైటీగా అనిపించింది ... నాకైతే ఇదే ప్రధమం ఇలా చూడటం ప్రముఖ పత్రికలకు సంబంధించి ... సరే అయిన దానికీ కాని దానికీ ఈ బ్లాగ్ ఒకటి ఉంది కదా సరే దీనిలో పడేద్దామని ఇలా ఒక టపాగా వేస్తున్నా ... అలాగే మీతో కూడా పంచుకుంటున్నట్టు ఉంటుంది కదా అని ...

ఇది కొత్త ప్రక్రియకు శ్రీకారమేమో ... ఎవరికి తెలుసు .. లేక రెండు ఆర్టికల్స్ కు ఈ ఇమేజ్ బాగా అతికినట్టు అనిపించిందేమో ...

ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ... ఈ ఫొటోను ఎడిట్/రీసైజ్ చేసిన వీళ్ల తెలివితేటలను అభినందించవలసిందే ... వీలైతే కేజీల లెక్కన అమ్మితే పోతుందేమో ...

మీలో ఎవరైనా ఈ రోజు సాక్షిలో ఈ ఫ్యామిలీ విభాగాన్ని చదివి ఉంటే ఇది ఇంటర్నెట్ విభాగంలోనే ఇలా ఉందా లేక అచ్చు వేసిన దానిలో కూడా ఇలాగే ఉందా అనేది తెలియజేయగలరా ... తెలుసుకోవాలి అనుకోవటానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు కానీ నాకు ఎందుకో ఇది అనుకోకుండా ఇంటర్నెట్ ఎడిషన్ లో మాత్రమే దొర్లిన తప్పు అనిపిస్తుంది ... ఊరికే తెలుసుకుందామనే కుతూహలం అంతే ...

తెలియజేసిన వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

ఈటీవీ - సుమన్, ప్రభాకర్ ఔట్ - పూర్తి వివరాలు

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, May 27, 2008


TeluguPeople.com అనే వెబ్ సైట్ లో ఈటీవీ సుమన్ ఔట్..! అనే వార్తను చదివిన తరువాత మీతో పంచుకుందామనే ఓ ప్రయత్నమే ఈ టపా ...


ఈటీవీ సుమన్, ప్రభాకర్ అనే ఇద్దరు సకల కళా మహా నటుల గురించి - దూదిలా ఏకిపారేసిన వారిని మన తెలుగు బ్లాగ్లోకంలో ఎంత మందినని లెక్క పెట్టగలం .. ఒకరా, ఇద్దరా, ఎందరో ఎందరెందరో ... ఏదైతే ఏం మొత్తానికి వారిద్దరినీ ముందు ఒకదారి తరువాత చెరో దారి చేశారు ... ముందు ఒకదారి అంటే, ఇద్దరినీ ఈటీవీని వదిలిపెట్టటం ... తరువాత ఇద్దరూ తలో దారి అంటే, సుమన్ అమెరికా పయనం, ప్రభాకర్ నిరుద్యోగిగా మారటం ....

ఈ విషయంపై ఇప్పటి వరకూ నేను చదివిన అన్ని టపాలను బట్టి అందరూ సంతోషించే వారే అనుకుంటా ... ఇలాంటి వారందరూ మరి దేముడుకి కొబ్బరికాయలే కొడతారో, అర్చనలే చేయిస్తారో మీ ఇష్టం కానీ త్వరపడండి ఎంతకాలం ఉంటుందో ఈ అదృష్టం చెప్పలేం కదా ... లేక ఒకరో ఇద్డరో ఎవరైనా బాధపడేవాళ్లు ఉంటే వాళ్లను ఎలా ఓదార్చాలో ఏమిటో (వీరిద్దరివీ ఇంతకు ముందు కార్యక్రమాలలో కొన్ని ఆణిముత్యాలను VCD/DVDs గా మార్చి ఇస్తే సరి) ... పొయ్యి మీద కూర మాడిపోతున్నా పట్టించుకోకుండా, చేతిలో కూర తిప్పే గరిటతో అలాగే టీవీ కి అతుక్కుపోయే వారి పరిస్థితేమిటో..

కానీ ఒక విషయం మాత్రం కొంచెం బాధను, రెండవది ఇంకొంచెం ఎక్కువ బాధను, విషాదాన్ని, మూడవది కొంత భయాన్ని కలుగజేస్తుంది ...

మొదటిది మన బ్లాగ్లోకానికి ఒక ప్రేరణ, టపాలకు సరైన టైటిల్(మీ బ్లాగ్ కు మీరే సుమన్ లాంటి) తగ్గిపోవటం ...

రెండవది రామోజీరావు గారు స్వయంకృషితో స్థాపించిన సామ్రాజ్యపు పునాదులకు ఏ కారణం చేతనైనా ఇలా బీటలు వారటం, లేదా కనీసం ఒక చిన్న పెచ్చు ఊడిపోవటం (లేదా పైనున్న సున్నపు పొర రాలిపోవటం), అందుకు కొద్దో గొప్పో తన సంతానమే కారణం కావటం ... ఇప్పటికిప్పుడు లేదా ఇక ముందు అయినా ఏమీ కాకపోవచ్చేమో (కాకూడదని కోరుకుంటూ) కాని ఇలాంటివి ఒక మాయని మచ్చగా మిగిలిపోవటం ఖాయం ..

మూడవది ఈ సుమన్ ఎలాగూ అమెరికా వచ్చేశాను కదా, ఇక్కడే ఎలాగోలా తిష్టవేసి ఏదో ఒక ఛానల్ ఏర్పాటుజేసి కొంపదీసి ఆ కార్యక్రమాలు అన్నీ ఇక్కడ వీళ్లకు చూపిస్తే భలే ఉంటుంది కదా అని అనుకుంటే ... తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది ... ఇప్పటికే సంవత్సరం మొత్తం కష్టపడితే ఈ ఉద్యోగంలో వీళ్లిచ్చిన బోనస్ మొత్తం, బాగా పెరిగి పోయిన పెట్రోల్, ఉప్పు, పప్పు ధరల దెబ్బకు ఒక్కసారికే సరిపోయినియ్. ఇక ఈ సుమన్/ప్రభాకర్ ల కార్యక్రమాలు చూసి ఆఫీస్ లో పిచ్చి చూపులు చూసుకుంటూ తింగరిగా పనిచేస్తే ఇక చెప్పేదేముంది ..

ఇంకెందుకు ఆలశ్యం పండగ చేసుకోండి ... :-)

ప్రస్తుతానికి ఇంతే సంగతులు ... మరలా కలుద్దాం .. అది ఎప్పుడంటే, ప్రభాకర్ చిరుద్యోగి అయినప్పుడో లేదా/మరియు సుమన్ ఇంకో అవతారం ఎత్తినప్పుడో ... అంతవరకూ శెలవా మరి ....

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

చనిపోయిన అన్నగారి మరియు బతికున్న అభిమానుల ఆత్మక్షోభిస్తుంది వీటిని చూస్తే

ఇప్పుడే GreatAndhra.com అనే వెబ్ సైట్ లో స్వర్గీయ అన్నగారి పుట్టినరోజు(మే 28) సందర్భంగా కెనడా లో ఉంటున్న అన్న గారి లేదా/మరియు తెలుగుదేశం అభిమానులు జరిపిన కార్యక్రమంలోని కొన్ని ఫొటోలు చూసిన తరువాత నా స్పందన ఇక్కడ ఈ టపాగా ...

ముందుగా తెలుగు అక్షరాలతో ఉన్న ఈ ఫొటొ చూడండి:

'మ' కు .... 'య' కు, తేడా తెలియకపోవటమో లేక రాయటంలో పొరపాటేమో అని సరిపుచ్చుకోవచ్చు కొన్ని సార్లు ... కాకపోతే ఇలాంటి తప్పు జరిగింది ఏ 'తెలుగు' వాడి ఆత్మగౌరవ నినాదాన్ని ఒక ప్రభంజనంలా చేసి, తెలుగు వారంటే మదరాసీలు కాదనీ, వారికంటూ ఒక గుర్తింపును తీసుకువచ్చి, వారి ఖ్యాతిని ఖండాంతరాలలో వ్యాపింపజేసి, ముఖ్యంగా గ్రాంధికాన్ని సైతం (తను మాట్లాడితే చాలు అర్ధం కాకున్నా కూడా వాటిల్లో మన తెలుగక్షరాలున్నాయన్న ఆనందం ఒకవైపు మాట్లాడుతున్నది తను అని ఇంకొకవైపు) తన పౌరాణిక చిత్రాల ద్వారా జనసామాన్యానికి దగ్గరచేసిన ఆ అన్నగారికి సంబంధించిన కార్యక్రమం కావటం నిజంగా శోచనీయం ... స్వర్గలోకంలో ఉన్న తన ఆత్మ ఖచ్చితంగా క్షోభిస్తుంది ....

సరే వీరందరూ ప్రవాసాంధ్రులు కదా ... పాపం ... తెలుగు మర్చిపోవటమో లేక ఇంగిలిపీసు మీడియాలలో చదువు వెలగబెట్టారేమో అని సరిపుచ్చుకొని మిగిలిన మరికొన్ని ఫొటోస్ చూస్తే అక్కడా ఇదే బాపతు ... అదికూడా చూడండి.

వీళ్లకి అన్నగారి ఇంటిపేరు తెలియదా లేక స్పెల్లింగ్ రాదా ... అసలు ఏమిటి సమస్య .. లేక కలిపిరాయటం / గొలుసుకట్టులో 'n' అనే అక్షరం కనపడకుండా రాయగలిగిన ప్రతిభావంతులా ..

గమనిక : అన్న గారి పేరులో 'తారక' అనే పదం ఈ ఫొటోలో కనపడటం లేదు గానీ ఆ పదమయితే ఉంది ... కనపడుతుంది వేరే ఫొటోలలో ...

దీనిని బట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటి అంటే .. వీళ్లకి ఏ భాషా సరిగ్గా రాకపోయన్నా ఉండాలి లేకపోతే టక్కులు చేసుకొని, పళ్లు బయట పెట్టి ఫొటో దిగటం మీద ఉన్న శ్రధ్ధ వీటిమీద లేకపోయన్నా ఉండాలి.

ఇంకా మీకు మిగతా ఫొటోస్ చూసే ధైర్యముంటే లేదా ఈ కార్యక్రమం జరిపించిన వారి ముఖారవిందాలు తిలకించాలి అనుకుంటే ఇదిగోండి దాని లంకె : అన్నగారి పుట్టినరోజు ఫొటోస్ - కెనడా ప్రవాసాంధ్రులచే

ఈ కార్యక్రమం నిర్వహించిన వారి పేర్లు :

Anil Lingamaneni
Chari Samanthapudi
Kesavrao Yelamanchali
Khaleel baig
Ravi Kovirineni
Gangadhar Sukhavasi

అయ్యా, మిమ్మల్ని అవమానించాలి అనేది నా ఉద్దేశ్యం కాదు ... కాకపోతే అన్నగారి లాంటి వారికి సంబంధించిన కార్యక్రమాలలోనైనా ఇలాంటి తప్పులు జరగకుండా ప్రయత్నించండి... లేకపోతే ఇవి ఆయననే కాదు, మీకు, మీలాంటి మిగతా అభిమానులను కూడా అవమానించినట్టే ... అగౌరవపరచినట్టే ... ఒక్కసారి ఆలోచించండి.

మీలో ఎవరికన్నా వీరు తెలిసుంటే వీరికి అసలు విషయం చెప్పి పుణ్యం కట్టుకోండి ... వచ్చే సంవత్సరమైనా కొంచెం జాగ్రత్తగా ఉండమనీ .. అలా ఉంటారని ఆశిద్దాం...

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..

సచిన్, గంగూలీ, ద్రవిడ్ మరియు లక్ష్మణ్ నిజంగానే టి20 కి పనికిరారా లేక వాళ్ల టీమ్స్ మాత్రమే సెమీఫైనల్ కు వెళ్లకపోవటం యాధృచ్చికమా !?

ఎంతో ఘనంగా, వైభవంగా మొదలైన IPL సంబరం సెమీఫైనల్ దశకు చేరుకున్న సందర్భంలో సెమీఫైనల్ కు రాలేకపోయిన టీమ్స్ సీనియర్స్ వే కావటం ఒకింత బాధగానూ, మరికొంత ఆశ్చర్యంగానూ ఉంది.

ఆశ్చర్యానికి కారణం, ఈ నాలుగు టీమ్సే పోవటం ...

బాధకు కారణం ఇప్పుడు వీళ్ల మీద లేనిపోని విశ్లేషణలు మొదలు అవుతాయని ....

వచ్చే సంవవత్సరమైనా వీళ్లు లేదా కనీసం వీళ్లల్లో ఒక్క టీమ్ అయినా ఇంకో అడుగు ముందుకు వెళ్లాలనీ ఆశించటం తప్ప చెయ్యటానికి ఏమీ లేదు ప్రస్తుతానికి ...

ఎందుకు ఇలా అయ్యింది అని వీలైతే ఇంకొకసారి చర్చిద్దాం....

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.


:::::::::::::::::::::::::::::::::::::::::::::::పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

IPL లో Cheer Leaders దరిద్రం వదిలించాలి అంటే !?

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, May 6, 2008

IPL లో ఈ Cheer Leaders (ఛీ.లీ)యొక్క అర్ధనగ్న దుస్తులు, నృత్యాలు గురించి బాధ పడేవాళ్లు ఎవరైనా ఉంటే .. ఊరికే కూర్చోకుండా ఏదో చెయ్యాలి అనుకుంటే ఏవో నాకు తోచిన ఒకటో రెండో ఉచిత సలహాలు వారికోసం వదులుదామనే ప్రయత్నమే ఈ టపా ...

ఛీ.లీ చేతుల్లో Pom Poms బదులు వేపమండలు పెట్టండి ... అప్పుడప్పుడూ పసుపు నీళ్లు, కుంకుం నీళ్లు, రెండూ కలిపిన నీళ్లు మనం హోలీ రోజున వసంతం నీళ్లలా వీళ్ల మీదో, వీళ్ల చుట్టుపక్కలా చల్లుతూ ఉండాలి. మధ్యమధ్యలో సాంబ్రాణీ పొగ మరచిపోవద్దు సుమా ...

ఈ ఛీ.లీ కి పిచ్చి పట్టింది అనీ, పిచ్చి పట్టించిన వాళ్లు ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యమనీ స్టేడియంలో ఉన్న జనాలలో ఒక సగం మందికి పూసగుచ్చినట్టుగా వివరించండి. అదే సమయంలో జనాలకి కూడా వేపమండలు, సాంబ్రాణీ అందుబాటులో ఉంచి, ఎవరైతే తొందరగా ఆ పిచ్చి కుదురుస్తారో వారికి అధ్బుతమైన బహుమతి ఇవ్వబడుతుంది అని చెప్పాలి. ఈ పిచ్చి, బహుమతి గురించి కి ముందు కూడా బాగా ప్రచారం చేయాలి.

మిగిలిన సొగం మందికి ఈ ఛీ.లీ కి అమ్మవారు పట్టిందనీ, ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యం అదంతా వట్టిదనీ మరియు అవహేళన చేస్తున్నారనీ ... ఎవరైతే ముందు వెళ్లి వారిని దర్శించుకుని, యాజమాన్యాన్ని వీరబాదుడు బాదుతారో వారికి ఈ ఛీ.లీ చేత భూత-భవిష్యత్-వర్తమానాల గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పండి.

ఈ ఛీ.లీ కి మరియు ఫ్రాంచైజ్ యాజమాన్యానికి స్టేడియంలో జనం వేపమండలుతో ఊగిపోతునప్పుడు మీరు కూడా ఊగండి..గెంతండి అని గట్టిగా చెప్పాలి.

స్టేడియంలో ఉన్న జనాలని మాంఛి సమయం చూసుకోని వీళ్లమీదకు ఒకేసారి వదలాలి.

పోలీసులకి మాత్రం ఏం చెప్పాలి అంటే .. ఈ ఛీ.లీ కి పట్టిన పిచ్చి ఏదో కొత్తగా ఉంది అనీ పోలీసులను చూస్తే తన్నటం, తిట్టటం, కొరకటం చేస్తున్నారు అనీ .. వేపమండలతో బాదిపారేస్తున్నారనీ .. ఎంత తొందరగా పారిపోతే మంచిది అనీ...

ప్రస్తుతానికి అంతే ... ఇంకొక సారి వీలైతే ఈ ఛీ.లీ గురించి వేరే కోణంలో చర్చించుకుందాం. అంతవరకు శెలవా మరి!

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

::::::::::::::::::::::::::::::::::::::::::::::పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
విషయ సూచికలు :

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting