సచిన్, గంగూలీ, ద్రవిడ్ మరియు లక్ష్మణ్ నిజంగానే టి20 కి పనికిరారా లేక వాళ్ల టీమ్స్ మాత్రమే సెమీఫైనల్ కు వెళ్లకపోవటం యాధృచ్చికమా !?
ఎంతో ఘనంగా, వైభవంగా మొదలైన IPL సంబరం సెమీఫైనల్ దశకు చేరుకున్న సందర్భంలో సెమీఫైనల్ కు రాలేకపోయిన టీమ్స్ సీనియర్స్ వే కావటం ఒకింత బాధగానూ, మరికొంత ఆశ్చర్యంగానూ ఉంది.
ఆశ్చర్యానికి కారణం, ఈ నాలుగు టీమ్సే పోవటం ...
బాధకు కారణం ఇప్పుడు వీళ్ల మీద లేనిపోని విశ్లేషణలు మొదలు అవుతాయని ....
వచ్చే సంవవత్సరమైనా వీళ్లు లేదా కనీసం వీళ్లల్లో ఒక్క టీమ్ అయినా ఇంకో అడుగు ముందుకు వెళ్లాలనీ ఆశించటం తప్ప చెయ్యటానికి ఏమీ లేదు ప్రస్తుతానికి ...
ఎందుకు ఇలా అయ్యింది అని వీలైతే ఇంకొకసారి చర్చిద్దాం....
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
4
వ్యాఖ్యలు:
- Anil Dasari on May 27, 2008, 12:29:00 PM said...
-
ఆయా జట్లు సెమీ ఫైనల్స్ కి వెళ్లకపోవటంలో సీనియర్ల ప్రమేయమెంతుందో కానీ, వాళ్ల ఆట తీరుకి T20 పనికిరాదు. అలాగే, చాలా మంది T20 ఆటగాళ్ల ఆట తీరుకి టెస్టులు, వన్డేలు పనికిరావు. ఏది గొప్ప అనే వాదన అటుంచితే, పాత తరం ఆటకి, ఇప్పటి తరం ఆటకి చాలా తేడా ఉంది. సునీల్ గవాస్కర్ అంతటి వాడే వన్డేలకు అంతగా పనికిరానివాడిగా పేరు పొందలేదా? కొన్నేళ్లకి ఈ T-20 పోయి T-10 లేదా మరోటి వచ్చినప్పుడు ఇప్పటి ధోనీలు, రోహిత్ శర్మలు అప్పటి వాళ్ల ముందు జిడ్డుగాళ్లనే ముద్ర వేయించుకోవటం ఖాయం. అంతా కాల మహిమ.
- రానారె on May 28, 2008, 10:18:00 AM said...
-
మొన్న రాజస్థాన్ రాయల్స్ తో ముంబై ఇండియన్ల ఆట చూశాను. మైదానంలో పరుగెత్తే బంతిని సరిగా ఆపి, వికెట్లవైపుగా విసరడం చేతగాక కీపరును నానా తిప్పలూ పెడుతున్న తన జట్టులోని so called youngsters కు కళ్లుచెదిరే diving catch చేసిచూపి స్ఫూర్తినింపిన సచిన్ T20కి పనికిరాడనడం (కనీసం IPL స్థాయివరకూ) సరికాదనిపించింది.
T20లో గంగూలీ బ్యాటింగ్ మీద విమర్శలేమున్నాయి? దాదా దాదాపు ప్రతి మ్యాచ్ చాలాబాగా ఆడాడు. వ్యక్తిగత ప్రతిభతో ప్రతిసారీ క్రికెట్ మ్యాచ్ గెలవడం సాధ్యం కాదు కదా!
- Anonymous on May 28, 2008, 10:12:00 PM said...
-
నాకో అనుమానం. పెద్దన్నల నాయకత్వం (కాప్టన్సీ) లో ఏదో లోపం ఉందేమో అని. వాళ్ళ సొంత బాటింగు బానే ఉంది. టీములు బానే ఉన్నాయ్. ఇంక లోపం ఎక్కడ ? కాప్టన్సీ లోనే...
- తెలుగు'వాడి'ని on May 29, 2008, 10:10:00 PM said...
-
అబ్రకదబ్ర గారు : ఎందుకు పనికి రాదు అనుకుంటున్నారు మీరు? ఇంకొక రెండు/మూడు సంవత్సరాలు పాటు 50ఓవర్లు ఆడగలిగిన వాళ్లు, 20ఓవర్లు ఆడలేరంటారా? అందులో ఈ టి20 లో ఒక పరుగు/బౌండరీ ఆపకపోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు కూడా కదా ... సింగిల్స్ కోసం పరుగెత్తవలసిన అవ్సరం లేదు, ఒకవేళ సింగిల్స్ తీస్తుంటే వేస్ట్ అంటారు ఎలాగు ... ఏకాడికి నుంచొని 4/6 కి ట్రై చేయటమే కదా .. ఫిట్ నెస్ కూడా పెద్దగా ఏమీ అవసరం లేదాయే ... ఇక మీ రెండవ పాయింట్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తా అది రేపు ఇప్పటి ట్20 హీరోల ఆట రేపు టి10/టి5 కి పనికి రాదు అనొచ్చు .. రానారె గారి పాయింట్స్ కూడా చూడండి ... సచిన్ నిజంగా కళ్లు చెదిరే catch పట్టాడు ... గంగూలీ/ద్రవిడ్ అంత దరిద్రంగా కూడా ఏమీ ఆడలేదు .. ఇక జయసూర్య, పొలాక్, గిల్ క్రిస్ట్, మెక్ గ్రాత్ మరియు వార్న్ మొదలగు వాళ్ల గురించి చెప్పేదేముంది.
రానారె గారు : నిజంగా అది sensational/stunning catch. గంగూలీ - ధోనీ ని పక్కపక్కన పెట్టి చూస్తే ధోనీ పెద్ద ఇరగదీసింది ఏమీలేదు .. అలాగే గంగూలీ అంత దరిద్రంగా కూడా ఏమీ లేదు ... కాకపోతే మీరన్నట్టు వ్యక్తిగత ప్రతిభతో ఇక్కడ ఒరిగేది ఏమీలేదు .. అదే పెద్ద తేడా.
రవిగారు : సమస్య ఉన్నట్టు అనిపించటం సమంజసం ఎందుకంటే మన ఈ జాతీయజట్టు ఆటగాళ్లు (ముఖ్యంగా ఈ సూపర్,/సీనియర్లు) లోకల్ టాలెంట్ తో అడితే కదా వాళ్ల స్కిల్స్ తెలిసేది ... గెలిచిన చాలా Teams/Matches లో ఈ కొత్త/లోకల్ కుర్రాళ్లు బాగా ఇరగదీయటమే ఒక ముఖ్య కారణం ... కనుక వచ్చే సీజన్ కి వీళ్లకి మంచి అవగాహన వస్తుంది కనక చిన్న చిన్న సమస్యలు పోయి ఇంకా రంజుగా ఉంటాయి Matches..
చివరిగా ఇంకొక విషయం ఏమిటి అంటే ... అన్ని Matches ను పరిశీలిస్తే నిజంగా చెప్పాలి అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవబోయే ముందు అందరూ ఊహించినట్టు 200-400 స్ట్రైక్ రేట్ అక్కరలేదు అని తేలిపోయింది ఇప్పుడు ... కుడిఎడంగా 150 ఉంటే చాలు ... మరి మన సీనియర్ ప్లేయర్స్ ఆమాత్రం కొట్టలేరు(దు) అంటారా ...