చనిపోయిన అన్నగారి మరియు బతికున్న అభిమానుల ఆత్మక్షోభిస్తుంది వీటిని చూస్తే

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, May 27, 2008

ఇప్పుడే GreatAndhra.com అనే వెబ్ సైట్ లో స్వర్గీయ అన్నగారి పుట్టినరోజు(మే 28) సందర్భంగా కెనడా లో ఉంటున్న అన్న గారి లేదా/మరియు తెలుగుదేశం అభిమానులు జరిపిన కార్యక్రమంలోని కొన్ని ఫొటోలు చూసిన తరువాత నా స్పందన ఇక్కడ ఈ టపాగా ...

ముందుగా తెలుగు అక్షరాలతో ఉన్న ఈ ఫొటొ చూడండి:

'మ' కు .... 'య' కు, తేడా తెలియకపోవటమో లేక రాయటంలో పొరపాటేమో అని సరిపుచ్చుకోవచ్చు కొన్ని సార్లు ... కాకపోతే ఇలాంటి తప్పు జరిగింది ఏ 'తెలుగు' వాడి ఆత్మగౌరవ నినాదాన్ని ఒక ప్రభంజనంలా చేసి, తెలుగు వారంటే మదరాసీలు కాదనీ, వారికంటూ ఒక గుర్తింపును తీసుకువచ్చి, వారి ఖ్యాతిని ఖండాంతరాలలో వ్యాపింపజేసి, ముఖ్యంగా గ్రాంధికాన్ని సైతం (తను మాట్లాడితే చాలు అర్ధం కాకున్నా కూడా వాటిల్లో మన తెలుగక్షరాలున్నాయన్న ఆనందం ఒకవైపు మాట్లాడుతున్నది తను అని ఇంకొకవైపు) తన పౌరాణిక చిత్రాల ద్వారా జనసామాన్యానికి దగ్గరచేసిన ఆ అన్నగారికి సంబంధించిన కార్యక్రమం కావటం నిజంగా శోచనీయం ... స్వర్గలోకంలో ఉన్న తన ఆత్మ ఖచ్చితంగా క్షోభిస్తుంది ....

సరే వీరందరూ ప్రవాసాంధ్రులు కదా ... పాపం ... తెలుగు మర్చిపోవటమో లేక ఇంగిలిపీసు మీడియాలలో చదువు వెలగబెట్టారేమో అని సరిపుచ్చుకొని మిగిలిన మరికొన్ని ఫొటోస్ చూస్తే అక్కడా ఇదే బాపతు ... అదికూడా చూడండి.

వీళ్లకి అన్నగారి ఇంటిపేరు తెలియదా లేక స్పెల్లింగ్ రాదా ... అసలు ఏమిటి సమస్య .. లేక కలిపిరాయటం / గొలుసుకట్టులో 'n' అనే అక్షరం కనపడకుండా రాయగలిగిన ప్రతిభావంతులా ..

గమనిక : అన్న గారి పేరులో 'తారక' అనే పదం ఈ ఫొటోలో కనపడటం లేదు గానీ ఆ పదమయితే ఉంది ... కనపడుతుంది వేరే ఫొటోలలో ...

దీనిని బట్టి నాకు అర్ధమయ్యింది ఏమిటి అంటే .. వీళ్లకి ఏ భాషా సరిగ్గా రాకపోయన్నా ఉండాలి లేకపోతే టక్కులు చేసుకొని, పళ్లు బయట పెట్టి ఫొటో దిగటం మీద ఉన్న శ్రధ్ధ వీటిమీద లేకపోయన్నా ఉండాలి.

ఇంకా మీకు మిగతా ఫొటోస్ చూసే ధైర్యముంటే లేదా ఈ కార్యక్రమం జరిపించిన వారి ముఖారవిందాలు తిలకించాలి అనుకుంటే ఇదిగోండి దాని లంకె : అన్నగారి పుట్టినరోజు ఫొటోస్ - కెనడా ప్రవాసాంధ్రులచే

ఈ కార్యక్రమం నిర్వహించిన వారి పేర్లు :

Anil Lingamaneni
Chari Samanthapudi
Kesavrao Yelamanchali
Khaleel baig
Ravi Kovirineni
Gangadhar Sukhavasi

అయ్యా, మిమ్మల్ని అవమానించాలి అనేది నా ఉద్దేశ్యం కాదు ... కాకపోతే అన్నగారి లాంటి వారికి సంబంధించిన కార్యక్రమాలలోనైనా ఇలాంటి తప్పులు జరగకుండా ప్రయత్నించండి... లేకపోతే ఇవి ఆయననే కాదు, మీకు, మీలాంటి మిగతా అభిమానులను కూడా అవమానించినట్టే ... అగౌరవపరచినట్టే ... ఒక్కసారి ఆలోచించండి.

మీలో ఎవరికన్నా వీరు తెలిసుంటే వీరికి అసలు విషయం చెప్పి పుణ్యం కట్టుకోండి ... వచ్చే సంవత్సరమైనా కొంచెం జాగ్రత్తగా ఉండమనీ .. అలా ఉంటారని ఆశిద్దాం...

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::




19 వ్యాఖ్యలు:

Anonymous on May 27, 2008, 6:52:00 PM   said...

అలాంటి సంబరాలు జరిపారు, అది ముఖ్యం గాని అక్షరాల తప్పులు కాదు
కాని తెలుగు వాడికి అదే ముఖ్యం, ఏదయినా airport కాని మరేదయిన ప్రజలకి ఉపయోగ పడే పధకం గాని పెట్టారు అని సంతోషం ఉండదు, దానికి ఎ పేరు పెట్టారు అనే గోల తప్ప
పేర్లు, స్పెల్లింగులు కరెక్టు గా ఉండడం కాదు ముఖ్యం
అభిమానం , ప్రజలకు సేవ సేవ చెయ్యాలనే ఉద్దేశం ముఖ్యం , వాటిని గమనించి ప్రోత్సహించండి
తప్పులు పట్టడం చెయ్యాలంటే అన్నిట్లోని చెయ్యచ్చు


తెలుగు'వాడి'ని on May 27, 2008, 7:56:00 PM   said...

Anonymous గార్లు :

అన్నగారి మీద అభిమానం లేకపోతే, ఈ కార్యక్రమం ఎవరు చేశారో అన్న ఉత్సుకత లేకపోతే, ఎలా చేసి ఉంటారో అన్న ఆసక్తి లేకపోతే, ఆ ఆర్టికల్/ఫొటోస్ ఎందుకు చూస్తాము, చదువుతాము అండీ ......

వ్యాఖ్య కొంచెం ఆలోచించి వ్రాయండి ... మూర్ఖత్వంగా సమర్ధించకండి. అలాగే మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టకండి ... అర్ధం ఉండాలి మీరు వ్రాసేదానికి ...

ఒకటికి రెండు సార్లు నేను నా టపాలో నొక్కివక్కాణించా 'కనీసం అన్నగారి లాంటి వారికి సంబంధించిన కార్యక్రమాలలోనైనా అని' .. ఇందులో మీకు అర్ధంకానిది ఏంది ... ప్రోత్సహించే ఉద్దేశ్యమే లేకపోతే టపా మొదటి లోనే అ ఫొటోస్ కు సంబంధించిన లంకె ఎందుకు ఇస్తాము అలాగే వచ్చే సంవత్సరమైనా జాగ్రత్తగా ఉండమని ఎందుకు కోరుకుంటాం .. ఉండాలని ఎందుకు ఆశిస్తాం ...

అంతటి మహానుభావుడికి సంబంధించిన కార్యక్రమాలలో ఇలాంటి తప్పులు లేకుండా చూడగలిగితే ఇంకా బాగుంటుంది అని అంతే ...


Chaks on May 27, 2008, 9:41:00 PM   said...

తెలుగు’వాడి’ని గారు: మీరుచెప్పింది సబబే. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు అందునా అది తెలుగు పత్రికలలో, అంతర్జాలంలో వచ్చేఅవకాశంవున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుంటే బాగుండేది. మీరన్నట్టు ఆర్గనైజర్స్ ఈవిషయంలో తప్పు చేసినా పాల్గొన్నవారన్నా కొంచెం హెచ్చరించవలసింది, లేదా రాసినదాన్ని మరొకరిచేత రివ్యూ చేయించవలసింది.
అనానిమస్ గారు: విమర్శని అర్ధం చేసుకొని దానికి తగినట్లుగా స్పందించడం అర్దవంతం అంతేగానీ వితండవాదం మంచి పద్దతికాదు. మీరన్నట్లు "తప్పులు అందరూ చేస్తారు", కానీ అది తప్పు అనిచెప్పేవాళ్ళు ఎవరూ లేకపోతే జీవితాంతం వాళ్ళు అదే తప్పు చేస్తూనే వుంటారు. వ్యాసకర్త ఈ చిన్న తప్పులు జరగకుండావుంటే బాగుండేదన్నారు,వచ్చేసారన్నా తప్పుదిద్దుకోమన్నారు కానీ ఈ ప్రోగ్రామే చెత్త అనిఅనలేదుకదా? ఈ చిన్న తప్పులే ఎప్పటికీ ఫోటోలరూపంలో మన భాషాపాండిత్యాన్ని వెల్లడిచేస్తుంటాయని మర్చిపోకండి.


Anonymous on May 27, 2008, 11:44:00 PM   said...

ఆత్మలు క్షోబించే తప్పులు కాదని నా అభిప్రాయం
ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల పుట్టిన రోజులే గుర్తు ఉండవు , గుర్తు ఉన్నా వాటిని ఆ రోజు కాకుండా దగ్గరలో ఉన్నా సెలవు రోజుల్లో జరుపుకుంటున్నాం
అలాంటిది వాళ్ళు సంబరాలు జరిపితే వాటి గురించి నిజమయిన అభిమాని నాలుగు మంచి ముక్కలు రాయాలి ,
తప్పులు చెప్పదలుచుకుంటే సున్నితం గా ఉండాలి మీరు మార్పు కోరుకుంటే
నాకు కావలసింది మార్పు కాదు , తప్పు పట్టేను అన్న సంతృప్తి అంటే ఇలా ఎన్నయినా రాసుకోవచ్చు


సుజాత వేల్పూరి on May 28, 2008, 12:16:00 AM   said...

తెలుగు 'వాడి ' ని గారు,

మీరే కరక్టు! కావాలని ఎన్ టీ ఆర్ ని అందులోనూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎలుగెత్తి పోరాడిన వ్యక్తిని ఎవరూ కించపర్చరు. పైగా భాష పట్లా ఆయనకు పట్టింపు ఎక్కువ. హైదరాబాదులో 'టెక్సి స్టెండ్' (taxi stand) అనే బోర్డు చూసి తెల్లబోయిన రామారావు గారు మండిపడి ఆ బోర్డులన్నీ తిరగ రాయించారట. కనీసం ఆయన్ను తల్చుకునే సభలోనైనా ఇలాంటి తప్పులు లేకుండా జాగ్రత్త పడాలి! ఎన్ టీ ఆర్ గారి ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంటే మాత్రం ఇవి చూస్తే బాధ పడుతుంది.


Anonymous on May 28, 2008, 4:27:00 AM   said...

anna anonymous.. akkada program ntr ni gurthu pettukovadaaniki chesinatlu ga kanapdatam ledu.. ntr jayanthi dwara vachina avakaasam sadviniyogam chesukondam .. andari kanusannallo melagaali annatlu vu ee videsi nritdp leaders chooputunna atyustsham tappa.. manaspurthi ga chesina daakalalu levu. ntr gaari janmadinam okkka nritdp vaalle jarupukovalsina avasaram ledu. canada lo vunna andaru telugu vaallu jarugukovaslina karyakramam. aa organizers photos ki, cakes cutting lo pose lu ichi.. vaatini GA and other websites ki same day pampinchadam lo choopinchana shraddha banner and cake meeda peru vishayaM lo choopinchi vunte bavundedi.


Kottapali on May 28, 2008, 4:59:00 AM   said...

ఎంత అమాయకులండీ! ఈ సభని జరిపించిన సంస్థ పేరు చూశాక అయినా మీకు నిజం అర్ధం కాలేదా? ఇది NTR మీద అభిమానం కాదూ, పిండాకూడు కాదూ. ఆయన మీద NRIలలో ఇంకా కాస్త మిగిలి ఉన్న అభిమానాన్ని తమ రాజకీయ ఉన్నతికి వాడుకోవాలనే కక్కుర్తి తప్ప ఏం కాదు. ఇంకా భాష ఎవడీకి పట్టింది?


Anonymous on May 28, 2008, 8:17:00 AM   said...

అడ్డడ్డడ్డే.. భలే వారే సార్. వాళ్ళేదో పాపం వాళ్ళ ఫోటోలు చూపెట్టుకోడానికి చేస్తే మీరేంటి తెలుగు అంటారు. ఎన్నారైలు ఆ మాత్రం రాసినందుకు సంతోషించాలి గానీ.

ఇలాంటివి కోకొల్లలు జరుగుతుంటాయి ప్రవాసాంధ్ర తెలుగు సంస్థలలో. ఓ సారి ఇలాంటి వాటిలో చెయ్యి పెట్టి చూడండి.

-- విహారి


Unknown on May 28, 2008, 1:08:00 PM   said...

శోచనీయమే...
ఇది అక్కడ మాత్రమే ఉన్న జాడ్యం కాదనుకుంట. ఇక్కడా గమనించాను.

సంబరాలు జరపడం ఏదో మాట వరసకి, దాని వెనక ఇంకేదో ఆశించే బాపతులే ఎక్కువ కనబడతాయి.


తెలుగు'వాడి'ని on May 28, 2008, 4:50:00 PM   said...

anonymous-3 గారు : ఆత్మలు క్షోభించేటంత తప్పులు కావు అన్నది మీ అభిప్రాయం అన్నారు బావుంది .. ఎవరి అభిప్రాయం వారిది .. పుట్టిన రోజులు మర్చిపోవటం ఏమిటి, సెలవుల్లో చేసుకోవటం ఏమిటి .. ఏం చెప్పదలచుకున్నారు మీరు - మెదడు మోకాల్లోకి/అరికాల్లోకి వచ్చినప్పుడు ఇలా బ్లాగుల మీద పడి వ్యాఖ్యలు వ్రాయకండి (కనీసం నా బ్లాగులోనైనా) .. ఆ కార్యక్రమం నేనో, నా స్నేహితులో, తెలిసినవాళ్లో చేసుంటే లేదా కనీసం నేను ప్రత్యక్షంగా చూసుంటే/పాల్గొని ఉంటే, మీరన్నట్టు చాలా బాగా చేశారు అని నాలుగు మంచి ముక్కలు రాసి ఈ తప్పులు జరగకుండా చూసి ఉంటే ఇంకా బాగుందేది అని చెప్పి ఉండేవాడినేమో ...

సున్నితంగా చెప్పాలి అన్నారు ... మీ సూచన/సలహాకు ధన్యవాదములు ... నేను మరొక్కసారి నా టపాను సమీక్షించుకుంటా ... మరీ 'అతి' గా చెప్పాను అనుకుంటే ఖచ్చితంగా మార్చుకుంటా ...

chaks మరియు నా వ్యాఖ్య చూసిన తరువాత కూడా 'తప్పులు పట్టాను అన్న సంతృప్తి కోసం' ఇది నేను రాశాను అని మీరు అంటున్నారు అంటే మీరు ఇది రాసిన సమయంలో మీ మానసిక పరిస్థితిపై జాలిపడటం కూడా వృధానే


తెలుగు'వాడి'ని on May 28, 2008, 4:55:00 PM   said...

Chaks/సుజాత/anonymous-4 గారు : అర్ధం చేసుకున్నందుకు, సపోర్టివ్ గా ఉన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు.


తెలుగు'వాడి'ని on May 28, 2008, 5:17:00 PM   said...

కొత్త/విహారి/ప్రవీణ్ గార్లపాటి గారు : మనకు తెలియని కొత్త విషయాలేమీ కాదు కదండీ ... ప్రయోజనం ఏదైనా ఆ చేసేది కొంచెం జాగ్రత్తగా చేయవచ్చు కదా .. కొంత సంయమనం పాటించి, చెప్పదలచుకున్న విషయం పక్కదోవ పట్టకుండా ఇలా రాస్తేనే, పైన ఉన్న anonymous-1/2/3 గార్ల వ్యాఖ్యలు చూశారు కదా ... ఇంక ఏమి చెప్తాం అలాంటి వాళ్లకి ..

విహారి గారు : మా బాగా చెప్పారు ... చెయ్యా, పాడా కనీసం గోరు పెట్టే ఆలోచన కూడా లేదండీ ... నేను ఇలాంటి వాటికి చాలా దూరం..

ప్రవీణ్ గార్లపాటి గారు : అభిమానం, దానిని వ్యక్తపరచటం ఎప్పుడైతే ప్రధమ కారణాలు కాకుండా పోతాయో, అలాగే 'కొత్త' గారు చెప్పిన ఆ కారణమైనా లేక విహారి గారు అన్నట్టు ఈ కారనమైనా అసలు కారనాలు అవుతాయో ఇవి ఎక్కడైనా ఇలాగే ఉంటాయిలేండి.


Anonymous on May 28, 2008, 9:48:00 PM   said...

తెలుగు 'వాడి ' ని గారూ, మీకు నేనూ సపోర్టు. పేరు కూడా సరిగ్గా రాయకపోవడం మరీ ఘోరం. అది కూడా ఓ తరహా అభిమానం ఐతే ఇంక ఏమీ చేయలేము.


Anonymous on May 29, 2008, 10:18:00 AM   said...

బాబు తెలుగు వాడిని ! అన్నగారిమీద నీకు వీరాభిమానం స్థాయి దాటి వీర పైత్యంలెవెల్లోకి పోయింది. చిన్న అప్పుతచ్చుకి ఇంత లొల్లి ఎందుకు?


తెలుగు'వాడి'ని on May 29, 2008, 9:30:00 PM   said...

రవి గారు: అర్ధం చేసుకున్నందుకు, సపోర్టివ్ గా ఉన్నందుకు మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు.


తెలుగు'వాడి'ని on May 29, 2008, 9:41:00 PM   said...

అయ్యా anonymous-5: నేనేమన్నా ఇది పెద్ద,భీభత్స,భయంకరమైన తప్పనీ లేక/మరియు దీని వలన మూడో ప్రపంచ యుధ్ధం వస్తుందని చెప్పానా !? నేను కూడా ఇలాంటి అప్పుతచ్చులు లేకుండా ఉంటే మరియు వచ్చే సంవత్సరం లేకుండా చేస్తే ఇంకా బాగుంటుందనే చెప్పాను కదా ... ఇక ఈ లొల్లి ఎందుకు అంటారా, నాది వీరాభిమానం నుంచి వీరపైత్యమని చెప్పి, ఈ లొల్లి ఎందుకు అని ప్రశ్నించటం ద్వారా మీ 'దూల' తీర్చుకునే అవకాశం కల్పిద్దామని ... ఇప్పటికి మీకు 'తీరిపోయినట్టే' ఉంది కదా ఇక పని చూడండి.


Anonymous on Aug 31, 2009, 10:17:00 AM   said...

I am one of the participants in the above function. Here are the facts on the subject:

a)The difference between "ma" and "ya" are un noticeable and it was intended to write as "YA". I am not sure how many telugu kids can write correctly the telugu grammer in A.P. One should appreciate the telugu youngsters who have been here in canada more than a decade and attempted to write in Mathru basha.

I pity on those who commented, this was done for pictures and publicity. Dogs always bark for the giant elephant like this kind of events done far away from the mathru bhumi.

b)The last name of 'NTR' was written on the "cake". Cake was ordered in the local store and name was given on the phone to the cake maker. Cake maker was an english person. These people in North America always have troubles in talking or writing our names.

c)The cake was brought in the last minute of the function from the store and celebrated the birthday of our great leader.

I am very happy this event has been circulated very well, and known to lot of people with these mistakes. Just to let you know Advertisement companies here in North America do mistakes wantedly to have more attention. It seems this event got more attention.

We celebarted this event whole heartedly and that's what NTR athma looks at, like lord shiva looks at the real bakthi of "Kannappa".


మంచు on Aug 31, 2009, 1:52:00 PM   said...

తప్పులు చిన్నవయినా.. మరీ 'నదమూరి ' అని చదవలేక పొతున్నాం. ఎంకెవరి విషయం లొ అయిన ఈ తెలుగు తప్పులు చిన్నవెమో కానీ, తెలుగు బాషకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన రామారావు సభ లొ తెలుగు బాషా తప్పులు జరగడం .... ఎమో నాకు నచ్చలేదు. నిర్వాహకులు ఈ తప్పులు ఏమాత్రం గుర్తిచినా డేమజ్ కంట్రొల్ చెసెవారు.. లాస్ట్ మినెట్ ఎముంటుంది ..కావాలెంటె ఇది కరెక్ట్ చెయ్యడానికి ఒక అరగంట ఆగలేరా.. బహుశ ఎవరు చూసి వుండరు.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting