ఈటీవీ - సుమన్, ప్రభాకర్ ఔట్ - పూర్తి వివరాలు
TeluguPeople.com అనే వెబ్ సైట్ లో ఈటీవీ సుమన్ ఔట్..! అనే వార్తను చదివిన తరువాత మీతో పంచుకుందామనే ఓ ప్రయత్నమే ఈ టపా ...
ఈటీవీ సుమన్, ప్రభాకర్ అనే ఇద్దరు సకల కళా మహా నటుల గురించి - దూదిలా ఏకిపారేసిన వారిని మన తెలుగు బ్లాగ్లోకంలో ఎంత మందినని లెక్క పెట్టగలం .. ఒకరా, ఇద్దరా, ఎందరో ఎందరెందరో ... ఏదైతే ఏం మొత్తానికి వారిద్దరినీ ముందు ఒకదారి తరువాత చెరో దారి చేశారు ... ముందు ఒకదారి అంటే, ఇద్దరినీ ఈటీవీని వదిలిపెట్టటం ... తరువాత ఇద్దరూ తలో దారి అంటే, సుమన్ అమెరికా పయనం, ప్రభాకర్ నిరుద్యోగిగా మారటం ....
ఈ విషయంపై ఇప్పటి వరకూ నేను చదివిన అన్ని టపాలను బట్టి అందరూ సంతోషించే వారే అనుకుంటా ... ఇలాంటి వారందరూ మరి దేముడుకి కొబ్బరికాయలే కొడతారో, అర్చనలే చేయిస్తారో మీ ఇష్టం కానీ త్వరపడండి ఎంతకాలం ఉంటుందో ఈ అదృష్టం చెప్పలేం కదా ... లేక ఒకరో ఇద్డరో ఎవరైనా బాధపడేవాళ్లు ఉంటే వాళ్లను ఎలా ఓదార్చాలో ఏమిటో (వీరిద్దరివీ ఇంతకు ముందు కార్యక్రమాలలో కొన్ని ఆణిముత్యాలను VCD/DVDs గా మార్చి ఇస్తే సరి) ... పొయ్యి మీద కూర మాడిపోతున్నా పట్టించుకోకుండా, చేతిలో కూర తిప్పే గరిటతో అలాగే టీవీ కి అతుక్కుపోయే వారి పరిస్థితేమిటో..
కానీ ఒక విషయం మాత్రం కొంచెం బాధను, రెండవది ఇంకొంచెం ఎక్కువ బాధను, విషాదాన్ని, మూడవది కొంత భయాన్ని కలుగజేస్తుంది ...
మొదటిది మన బ్లాగ్లోకానికి ఒక ప్రేరణ, టపాలకు సరైన టైటిల్(మీ బ్లాగ్ కు మీరే సుమన్ లాంటి) తగ్గిపోవటం ...
రెండవది రామోజీరావు గారు స్వయంకృషితో స్థాపించిన సామ్రాజ్యపు పునాదులకు ఏ కారణం చేతనైనా ఇలా బీటలు వారటం, లేదా కనీసం ఒక చిన్న పెచ్చు ఊడిపోవటం (లేదా పైనున్న సున్నపు పొర రాలిపోవటం), అందుకు కొద్దో గొప్పో తన సంతానమే కారణం కావటం ... ఇప్పటికిప్పుడు లేదా ఇక ముందు అయినా ఏమీ కాకపోవచ్చేమో (కాకూడదని కోరుకుంటూ) కాని ఇలాంటివి ఒక మాయని మచ్చగా మిగిలిపోవటం ఖాయం ..
మూడవది ఈ సుమన్ ఎలాగూ అమెరికా వచ్చేశాను కదా, ఇక్కడే ఎలాగోలా తిష్టవేసి ఏదో ఒక ఛానల్ ఏర్పాటుజేసి కొంపదీసి ఆ కార్యక్రమాలు అన్నీ ఇక్కడ వీళ్లకు చూపిస్తే భలే ఉంటుంది కదా అని అనుకుంటే ... తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది ... ఇప్పటికే సంవత్సరం మొత్తం కష్టపడితే ఈ ఉద్యోగంలో వీళ్లిచ్చిన బోనస్ మొత్తం, బాగా పెరిగి పోయిన పెట్రోల్, ఉప్పు, పప్పు ధరల దెబ్బకు ఒక్కసారికే సరిపోయినియ్. ఇక ఈ సుమన్/ప్రభాకర్ ల కార్యక్రమాలు చూసి ఆఫీస్ లో పిచ్చి చూపులు చూసుకుంటూ తింగరిగా పనిచేస్తే ఇక చెప్పేదేముంది ..
ఇంకెందుకు ఆలశ్యం పండగ చేసుకోండి ... :-)
ప్రస్తుతానికి ఇంతే సంగతులు ... మరలా కలుద్దాం .. అది ఎప్పుడంటే, ప్రభాకర్ చిరుద్యోగి అయినప్పుడో లేదా/మరియు సుమన్ ఇంకో అవతారం ఎత్తినప్పుడో ... అంతవరకూ శెలవా మరి ....
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
18
వ్యాఖ్యలు:
- Naveen Garla on May 28, 2008, 1:33:00 AM said...
-
సుమన్ ఇంత పెద్ద మూర్ఖుడు అనుకోలేదు. అందరూ సుమన్‌ను కిండల్ చేస్తున్నా నాకు ఏదో మూలలో పాపం కష్టపడుతున్నాడు కదా అని అనిపించేది. తండ్రికి మించినదా ఈ-టీవీ? ఇదేనే తండ్రి ఋణం తీర్చుకోవడమంటే?
- Anonymous on May 28, 2008, 4:18:00 AM said...
-
Ramoji rao gariki gatha konni rendu samvastaraalu ga anni kastaley papam...eppudu edokati adi thana kumarunitho kavadam mari badhaa karam...
- Kolluri Soma Sankar on May 28, 2008, 5:00:00 AM said...
-
ఆనంద మానంద మాయెనే
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com
- సుజాత వేల్పూరి on May 28, 2008, 6:44:00 AM said...
-
ప్రభాకర్ లాంటి 'ప్రతిభావంతుడికి ' సర్వాధికారాలు అప్పగించినపుడే సుమన్ మూర్ఖత్వం బయట పెట్టుకున్నాడు.! అందుకే కాబోలు ఈటివీ లో ప్రభాకర్ కనిపించే ప్రోగ్రాములన్నిటికి బ్రేకులు పడి వాటి స్థానే మంచివో చెడ్డవో సినిమాలు వేస్తున్నారు ! పెరుగుట విరుగుట కొరకే అంటే ఇదే మరి!
పాపం, వాళ్ళిద్దరికీ మన బ్లాగర్ల దిష్టే కొట్టినట్టుంది.
- జ్యోతి on May 28, 2008, 7:33:00 AM said...
-
నాకు తెలుసు సుమన్ ఊరకుండడు. అక్కడ కూడా ఓ చానెల్ మొదలెడతాడూ. ఇక మన అమెరికా తెలుగు వాళ్ళని ఆ భగవంతుడే రక్షించుగాక?
నిజంగ
మాకు ఆనందమానందమాయే ..
మాకూ మంచి రోజులు వచ్చే...
చెత్త ప్రోగ్రాములు తప్పిపోయే...
- రాధిక on May 28, 2008, 7:34:00 AM said...
-
కెవ్వు:కేక:సూపర్:డూపర్:అదిరింది
పాపం, వాళ్ళిద్దరికీ మన బ్లాగర్ల దిష్టే కొట్టినట్టుంది.....nijamea
- Anil Dasari on May 28, 2008, 1:03:00 PM said...
-
సుమన్ కి ఏదో జబ్బు advanced stage లో ఉందని విన్నాను. అతన్ని బాధ పెట్టటం ఎందుకని రామోజీ ఇన్నాళ్లూ ఊరుకున్నాడేమో?
- తెలుగు'వాడి'ని on May 28, 2008, 3:40:00 PM said...
-
నవీన్ గారు : తండ్రి ఋణం అని మీరంటే, స్నేహానికి ప్రాణం/అర్ధం అని తను అంటాడు ... ఇక్కడ సమస్యంతా సుమన్/ప్రభాకర్ల 'అతి'. నాకు తెలిసినంతలో సుమన్ కొంత టాలెంట్ ఉంది, బిజినెస్ మైండ్ ఉంది కాకపోతే 'ఎంతో' ఉంది అనుకోవటం వలన వచ్చిన తిప్పలు ఇవి. అలాగే ప్రభాకర్ కూడా సుమన్ ఇచ్చిన అవకాశాన్ని మితంగా వాడుకొని ఏదో ఒకటో రెండో కార్యక్రమాలతో నాలుగు రాళ్లు వెనకేసుకొని కొద్దో గొప్పో పేరు ప్రఖ్యాతులు అని సరిపెట్టుకుంటే అసలు ఏ బాధా లేదు. ఎంత స్నేహమైనా సమయం చూసుకొని ప్రభాకర్ తోక కత్తిరించ(లే)కపోవటం సుమన్ చేసిన తప్పు.
నవీన్/ mmksworld గారు :
తన తండ్రికి ఇదంతా అప్పనంగా వచ్చింది అయితే ఏదోలే అనుకోవచ్చు .. అసలే మార్గదర్శి, వై.యస్.ఆర్, సాక్షి మొదలగు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్న సమయంలో, ప్రభాకర్ గురించి తెలిసి తెలిసీ తండ్రితో ఇంత దాకా తెచ్చుకోవటం నిజంగా క్షమించరాని విషయం.
- తెలుగు'వాడి'ని on May 28, 2008, 3:48:00 PM said...
-
కొల్లూరి సోమ శంకర్ / జ్యోతి గారు : అవును ఆనందమానంద మాయెనే ... పండగే పండగ ...
జ్యోతి గారు : మరలా ఈ ప్రవాసాంధ్రులు ఇండియాకు వచ్చెయ్యటానికి ఇది ఒక కొత్త కారణం అవుతుందేమో
సుజాత/రాధిక గారు : నరదిష్టి అంటే మరి ఏమనుకున్నారు ... నిజంగా మన దిష్టేనండీ బాబూ
- తెలుగు'వాడి'ని on May 28, 2008, 4:05:00 PM said...
-
అబ్రకదబ్ర గారు : ఈ మధ్యకాలంలో ఆ జబ్బు గురించి వార్త/పుకారు ఎక్కడా వినపడలేదండి ... ఇది కొంత కారణమే అనుకోండి .. కాకపోతే రామోజీ రావు గారికి సుమన్ పుట్టి, కొంచెం పెద్ద అయిన తరువాత బాగా కలిసి వచ్చింది అన్న నమ్మకం ఒకటైతే, ముఖ్యమైన కారణం ఇంకొకటి ఏమిటి అంటే, ఈటీవీ పెట్టేటప్పుడు, పెట్టిన కొత్తలో సుమన్ పాపం చాల బాగా కష్టపడటం, అది చూసి ఈటీవీ అనుకొని రామోజీరావు గారు దానిని సుమన్ కి వదిలిపెట్టటం, వీళ్లిద్దరి ఖర్మకాలి కుడిఎడంగా అదే సమయంలో మన ప్రభాకర్ గారు రంగప్రవేశం చేయటం ఆ తరువాత కధ మీకు తెలిసిందే కదా...
- Naveen Garla on May 28, 2008, 9:26:00 PM said...
-
>> తండ్రి ఋణం అని మీరంటే, స్నేహానికి ప్రాణం/అర్ధం అని తను అంటాడగ
తల్లితండ్రుల కన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. వారిని నొప్పించడం కన్నా వేరే పాపం లేదు. ప్రాణ స్నేహితుడి కోసం కన్న తండ్రిని ఇరుకున పడేసి బాధపెట్టాలని ఎక్కడైనా వ్రాసుందా? వయసులో ఉన్న తండ్రికి కొండంత అండగా ...తోడుగా ఉండాల్సిన కొడుకు ప్రవర్తించాల్సిన పద్దతా ఇది? స్నేహుతుడి కోసం పదవికి రాజీనామా చేస్తే అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు, కానీ క్యాసెట్లు అందకుండా చేసి ఇలా టార్చర్ పెట్టడం తగదు.
- తెలుగు'వాడి'ని on May 28, 2008, 9:44:00 PM said...
-
నవీన్ గారు : మీరన్నది నూటికి నూరుపాళ్లు నిజం. స్నేహితుడి కోసం రాజీనామా మాత్రమే చేసి ఊరుకోవటమో లేక తన తండ్రిని నొప్పించకుండా అదే స్నేహితుడికి ఇంకొక రకంగా సహాయం చేయవచ్చు అనే స్ఫృహలో తను లేడు అన్న విషయం మూర్ఖత్వంగా మొదటినుంచీ ప్రభాకర్ని సపోర్ట్ చేస్తున్నప్పుడే అర్ధమయ్యింది ... ఇప్పుడు కూడా తను తెలుసుకోకపోవచ్చు. స్వయంకృషితో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తన తండ్రి కష్టకాలంలో (లేకపోయినా కూడా) ఉన్నప్పుడు ఏ కారణంచేతనైనా కొడుకే ఇలా ఇంకొక దెబ్బ తీయడం నిజంగా క్షమించరాని విషయం, చాలా బాధాకరం కూడా ...
- venkat on May 28, 2008, 11:51:00 PM said...
-
mi blog bagundi sir
- సుజాత వేల్పూరి on May 29, 2008, 4:29:00 AM said...
-
అసలేం జరిగిందో వివరంగా ఎవరైనా చెప్పండి! ఇలా ఏకపక్షంగా సుమన్ ని ఆడిపోసుకుంటే ఎలా? అసలే ఆరోగ్యం బాగాలేదు. మొత్తానికి రామోజీ టైం బాగాలేదు. ఒక వైపు సాక్షి నుండి ఆత్మరక్షణ, మరో వైపు ఉండవల్లి ఏ రోజు ఏ ఆరోపణలు చేస్తాడో తెలీదు. కొడుకు చూస్తే ఇట్లా! ప్చ్! పాపం.
- సుజాత వేల్పూరి on May 29, 2008, 4:37:00 AM said...
-
తెలుగు వాడిని గారు,
నిన్నటి నుంచి నాకు 'ఈటీవీ సుమన్ ఔట్ ' వార్త లింకు ఓపెన్ కాలేదు. ఇప్పుడే మొత్తం చదివాను. సుమన్ మరీ ఇంత మూర్ఖ శిఖామణా!
- Anonymous on Jul 20, 2008, 1:01:00 AM said...
-
he returned to india
www.eenaduandhra.com
- Anonymous on Jul 26, 2008, 5:50:00 AM said...
-
vallandari paniki malina sodha rayataniki meeku verey emee panileda undi. valla channel vishayalu manakendukandi,pakkavaadu yedustunte mana teluguvallu navvukontamani evaro tamil manishi ante vinnanu. adi mathram aksharala nizam sumandi. me blog lu chustuntee.
raasindi tappayethe manninchandi.
mee.....
bellary.
- sravika on Dec 16, 2009, 12:12:00 AM said...
-
rmojirao garu entho kastapadi ee stage lo vunnaru.alanti aayanaki ilanti koduku vundatam badakaram.