సాక్షి దినపత్రిక ఫ్యామిలీ విభాగంలో
ఈ రోజు (మే 31, 2008) రెండు ఆర్టికల్స్ కు సంబంధించి ఒకే ఫొటో వాడారు ... ఇలా వాడటం తప్పు అని కాదు కానీ చూడగానే ఏమిటో కొంచెం వెరైటీగా అనిపించింది ... నాకైతే ఇదే ప్రధమం ఇలా చూడటం ప్రముఖ పత్రికలకు సంబంధించి ... సరే అయిన దానికీ కాని దానికీ ఈ బ్లాగ్ ఒకటి ఉంది కదా సరే దీనిలో పడేద్దామని ఇలా ఒక టపాగా వేస్తున్నా ... అలాగే మీతో కూడా పంచుకుంటున్నట్టు ఉంటుంది కదా అని ...
ఇది కొత్త ప్రక్రియకు శ్రీకారమేమో ... ఎవరికి తెలుసు .. లేక రెండు ఆర్టికల్స్ కు ఈ ఇమేజ్ బాగా అతికినట్టు అనిపించిందేమో ...
ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం ... ఈ ఫొటోను ఎడిట్/రీసైజ్ చేసిన వీళ్ల తెలివితేటలను అభినందించవలసిందే ... వీలైతే కేజీల లెక్కన అమ్మితే పోతుందేమో ...
మీలో ఎవరైనా ఈ రోజు సాక్షిలో ఈ ఫ్యామిలీ విభాగాన్ని చదివి ఉంటే ఇది ఇంటర్నెట్ విభాగంలోనే ఇలా ఉందా లేక అచ్చు వేసిన దానిలో కూడా ఇలాగే ఉందా అనేది తెలియజేయగలరా ... తెలుసుకోవాలి అనుకోవటానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు కానీ నాకు ఎందుకో ఇది అనుకోకుండా ఇంటర్నెట్ ఎడిషన్ లో మాత్రమే దొర్లిన తప్పు అనిపిస్తుంది ... ఊరికే తెలుసుకుందామనే కుతూహలం అంతే ...
తెలియజేసిన వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
2
వ్యాఖ్యలు:
- Anonymous on May 30, 2008, 11:47:00 PM said...
-
ప్రింట్ ఎడిషన్ లో వేర్వేరు బొమ్మలే ఉన్నాయి.
- తెలుగు'వాడి'ని on May 31, 2008, 1:16:00 PM said...
-
కిషోర్ గారు : మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదములు ... ప్రింట్ ఎడిషన్ లో ఇలా జరగటమనేది చాలా అసాధారణం.