IPL లో Cheer Leaders దరిద్రం వదిలించాలి అంటే !?
IPL లో ఈ Cheer Leaders (ఛీ.లీ)యొక్క అర్ధనగ్న దుస్తులు, నృత్యాలు గురించి బాధ పడేవాళ్లు ఎవరైనా ఉంటే .. ఊరికే కూర్చోకుండా ఏదో చెయ్యాలి అనుకుంటే ఏవో నాకు తోచిన ఒకటో రెండో ఉచిత సలహాలు వారికోసం వదులుదామనే ప్రయత్నమే ఈ టపా ...
ఛీ.లీ చేతుల్లో Pom Poms బదులు వేపమండలు పెట్టండి ... అప్పుడప్పుడూ పసుపు నీళ్లు, కుంకుం నీళ్లు, రెండూ కలిపిన నీళ్లు మనం హోలీ రోజున వసంతం నీళ్లలా వీళ్ల మీదో, వీళ్ల చుట్టుపక్కలా చల్లుతూ ఉండాలి. మధ్యమధ్యలో సాంబ్రాణీ పొగ మరచిపోవద్దు సుమా ...
ఈ ఛీ.లీ కి పిచ్చి పట్టింది అనీ, పిచ్చి పట్టించిన వాళ్లు ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యమనీ స్టేడియంలో ఉన్న జనాలలో ఒక సగం మందికి పూసగుచ్చినట్టుగా వివరించండి. అదే సమయంలో జనాలకి కూడా వేపమండలు, సాంబ్రాణీ అందుబాటులో ఉంచి, ఎవరైతే తొందరగా ఆ పిచ్చి కుదురుస్తారో వారికి అధ్బుతమైన బహుమతి ఇవ్వబడుతుంది అని చెప్పాలి. ఈ పిచ్చి, బహుమతి గురించి కి ముందు కూడా బాగా ప్రచారం చేయాలి.
మిగిలిన సొగం మందికి ఈ ఛీ.లీ కి అమ్మవారు పట్టిందనీ, ఆ ఫ్రాంచైజ్ యాజమాన్యం అదంతా వట్టిదనీ మరియు అవహేళన చేస్తున్నారనీ ... ఎవరైతే ముందు వెళ్లి వారిని దర్శించుకుని, యాజమాన్యాన్ని వీరబాదుడు బాదుతారో వారికి ఈ ఛీ.లీ చేత భూత-భవిష్యత్-వర్తమానాల గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పండి.
ఈ ఛీ.లీ కి మరియు ఫ్రాంచైజ్ యాజమాన్యానికి స్టేడియంలో జనం వేపమండలుతో ఊగిపోతునప్పుడు మీరు కూడా ఊగండి..గెంతండి అని గట్టిగా చెప్పాలి.
స్టేడియంలో ఉన్న జనాలని మాంఛి సమయం చూసుకోని వీళ్లమీదకు ఒకేసారి వదలాలి.
పోలీసులకి మాత్రం ఏం చెప్పాలి అంటే .. ఈ ఛీ.లీ కి పట్టిన పిచ్చి ఏదో కొత్తగా ఉంది అనీ పోలీసులను చూస్తే తన్నటం, తిట్టటం, కొరకటం చేస్తున్నారు అనీ .. వేపమండలతో బాదిపారేస్తున్నారనీ .. ఎంత తొందరగా పారిపోతే మంచిది అనీ...
ప్రస్తుతానికి అంతే ... ఇంకొక సారి వీలైతే ఈ ఛీ.లీ గురించి వేరే కోణంలో చర్చించుకుందాం. అంతవరకు శెలవా మరి!
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
::::::::::::::::::::::::::::::::::::::::::::::
3
వ్యాఖ్యలు:
- Ray Lightning on May 6, 2008, 10:22:00 PM said...
-
జాతర టైములో రికార్డింగు కంపెనీ డాన్సులు ఎప్పుడూ చూసినట్టులేదు మీరు ? చీరలు జారిపోతూవుంటే ముందున్న మగవాళ్ళు డబ్బులు విసిరేవారు ట్రాక్టరుపై ఎక్కి నర్తిస్తున్న భామలపైకి. ఆ డాన్సర్ల ప్రయత్నం ఈ ఛీర్ లీడర్సు మళ్ళే ఎవ్వరో ఆటగాళ్ళలో ఉత్సాహం నింపడానికి కాదు, ఉద్దేశ్యం కేవలం మగవాళ్ళని కవ్వించడానికే.
మన భారతదేశం సంస్కృతీ అని ఢాంభికాలు పోయేముందు ఒకసారి మన చరిత్ర తెలుసుకుందాం. దేవదాసీలని చెప్పి ముక్కుపచ్చలారని అమ్మాయిలచే గ్రామం మొత్తానికి వ్యభిచారం చేయిపించిన ఘనత మన దేశానిదే.
సరిదిద్దుకోవలసిన లోపాలు లక్షలలో ఉండగా పాశ్చాత్య సంస్కృతీ, ఛీర్ లీడర్లు అంటూ ఉద్రేకం తెచ్చుకోవడం ఏమిటీ ?
- RG on May 7, 2008, 12:28:00 AM said...
-
I totally agree with Ray Lightning. ఆ మంత్రి ఎవరో "స్త్రీలను పూజించే దేశం" అని జోకినట్టుగానే ఉంది ఇది కూడా.
- తెలుగు'వాడి'ని on May 11, 2008, 2:58:00 PM said...
-
ముందుగా మీ వ్యాఖ్యకు ధన్యవాదములు మరియు ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షంతవ్యుడను
అయ్యా Ray Lightning (మరియు rsg) గారు : మీ లాంటి వాళ్లు కూడా నేను టపాలో ఎవరికోసం చెప్పానో చూడకుండా వ్యాఖ్యానించటం అంత బాగాలేదు. మరొక్కసారి చదవండి మీకే అర్ధం అవుతుంది. ఒకవేళ ఇది నా అభిప్రాయమే అయితే కుండబద్దలు కొట్టి ముక్కుసూటిగా చెప్పగలను ... దాచిపెట్ట వలసిన అవసరం లేదు .. అసలు మన పంధానే కాదు డొంకతిరుగుడుగా చెప్పటం.
జాతరలో రికార్డింగ్ డాన్సులు చూడకుండానే అతిధి సినిమాలోని క్లబ్ సాంగ్ కు మలైకా అరోరా బదులు వీళ్లకి ఎవరికో ఒకరికి అవకాశం ఇస్తే ఇరగదీసుండేవాళ్లని చెప్పేవాడినా ;-)
ఇక విషయానికి వస్తే అసలు నేను వీటికి వ్యతిరేకమే కాదు...కాకపోతే లోకల్ టాలెంట్ కి అవకాశం ఇవ్వాలి అంటా ...