వారు-వీరు, వీరు-వారు అయితే మాకేంటి !
ఈ రోజు (04/29/08) సాక్షి దిన పత్రికలో, Glamour section లో ఒకే page లో కనిపించిన ఈ రెండు photos చూసిన తరువాత సరదాగా మీతో పంచుకుందామనే ఓ చిన్న ప్రయత్నమే ఈ టపా ...
మొదటి ఫొటో :
ఈ నాయికను ప్రతి ఒక్కరూ చాలా తేలికగానే గుర్తు పడతారనే అనుకుంటున్నా ...
మతి చెడగొట్టే అందమైతేనూ ...
మరి
మరిచిపోయేటట్టు చేస్తుందా
అసలు మరిచిపోయే అందమా(!) అది
గుర్తు పట్టలేని ఒకరిద్దరు కోసం .. వీరు ఛార్మి గారు
రెండవ ఫొటో :
తొలి చూపులోనే మరి ఈ నాయికను(!?) గుర్తు పట్టగలిగారా ....
వేసుకున్న బట్టలని బట్టి కాదు ఆలోచించాల్సింది ...
మొహంలో కల్లి చూసి ...
సరే ఇప్పటికైనా గుర్తుకు తగిలిందా .. లేదా
ఇంత ఉపన్యాసం/నస ఎందుకు గానీ ... వీరు ముమైత్ ఖాన్ గారు ...
ఎవరిని చూసి ఎవరు మారితే మనకెందుకు ... ఒక్కరన్నా ఉన్నారు కదా అదే పదివేలు మనకు ... కన్నుల పండుగగా చేసేటందుకు ... ఇద్దరూ కూడబలుక్కొని సమ్మె చేస్తే సమస్య గానీ ...
ఆగండాగండి .. ఇప్పుడు ఆ సమస్య కూడా లేదండోయ్ కొత్తగా వచ్చిన IPL పుణ్యమా అని ... వారేనండి ...
చీరలు లేని లీడర్స్ ... చీరలంటే ఏంది అనే లీడర్స్ ...
ఒకప్పటి క్లబ్ డాన్సర్స్ యొక్క దుస్తులు, హావభావాలు ఈనాటి కధానాయికలు (ఈ పదం తప్పేమో కదా ... అసలు కధ ఎక్కడ ఏడిసి చస్తుంది ఇప్పుడు ... కనుక పాటలనాయిక అంటే బాగుంటుందేమో) పూర్తిగా వంటబట్టించుకొని వారి స్థానాలకి ఎసరుబెట్టారు ... ఇప్పుడు ఈ cheer leaders వచ్చి మీ హీరోయిన్ల కన్నా మేము ఒక ఆకు(ఒకటి ఏమిటిలే ఖర్మ చాలానే) ఎక్కువే చదివాము అని, అసలు ప్రపంచమే ఓ పెద్ద రంగస్థలం ( All the world's a stage ... మాకు ఇట్లాగే చెప్పారు మరి ) అయినప్పుడు మా ప్రతిభాపాటవాలు నాలుగ్గోడల మధ్య బంధించిన వెండితెర మీద మాత్రమే చూపించటం ఏమిటి అని ఆరుబయటకు తీసుకువచ్చి ఆరవేసి చూపిస్తున్నారు.
ఇప్పుడు మన నాయికల తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఏమిటో ...
వీళ్ల దెబ్బకు మనం చాలంలే అని ... ఉండంతలో పొందికగా ఉంటూ (విప్పుకుంటూ పోతే మిగిలేదేముంది) నాలుగు రాళ్లు వెనకేసుకుందామని ముమైత్ ఖాన్ లా మారిపోతారా ..
ఏందబ్బా మనం వెనకడుగేసేది ... ఇదేమన్నా నటనా నటించలేకపోవటానికి, హావభావవిన్యాసాలా ప్రదర్శించలేకపోవటానికి .... కురచ దుస్తులూ .. అంగాంగ ప్రదర్శనేగా ... ఇది మనకి పూర్తిగా కొట్టిన పిండే .. ఇన్నాళ్లూ ఏదో అని వదిలి పెట్టాము గానీ ఇప్పుడు చూడండి ఇక ... కొంచెం కొసరుగా ఇప్పటికి ఈ ఫొటో ... అదేనండీ ... ముందు ముందు చూపిస్తాం పూర్తిగా (మా తడాఖా) అని ఛార్మీలా వస్తారా ...
ఏది ఏమైనా ఇది పూర్తిగా సంధి కాలం ... ఇండియాలో .. క్రికెట్ లో ఛీర్ లీడింగ్ అయినా, సినిమాలో వల్గర్ exposing అయినా, యువతీయువకుల్లో సెక్స్ ప్రేరేపిత సమాచారం/ఆలోచనలు/కోరికలకైనా, పబ్ సంస్కృతికైనా ....
చూద్దాం కాలమేగతిన సమాధానం చెపుతుందో .... అంతవరకు కొద్దిపాటి నియంత్రణ, సంయమనం, వివేకవంతమైన ఆలోచన సమస్య తీవ్రతను తగ్గించవచ్చేమో...
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
3
వ్యాఖ్యలు:
- Kottapali on Apr 30, 2008, 5:09:00 AM said...
-
అయ్యా మీరేలోకంలో ఉన్నారో .. 1980 లలో రాధ, విజయశాంతి ఇత్యాదులు తెలుగు వెండితెరనేలుతున్న సమయంలోనే ఈ "ట్రెండ్" సెటిలైంది. పనిలో పనిగా సుశీల జానకిలు మేమూ చాలా బ్రాడ్ మైండెడ్ అని ఈ ప్రదర్శనలకి తగిన బూతు పాటలు పాడేందుకు రెడీ ఐపోయారు.
- తెలుగు'వాడి'ని on Apr 30, 2008, 8:21:00 AM said...
-
కొత్తపాళీ గారు : మీరు భలే వారే ... మేమూ అదే లోకమండీ ... ట్రెండ్ అప్పుడే మొదలైనా అనేది overlapping చాలా తక్కువ ఉండి ఎవరి పని/పసతో వారు ప్రేక్షకులను రంజింపజేసేవారు. ఇప్పుడు ఎవరు ఎవరో తే(పో)ల్చుకోవటం కష్టం అయిపోతుంది ...
అప్పుడప్పుడూ సినిమాకి వచ్చేవాళ్లు : 'ఏందిరా ఈ పిల్ల మొన్న ఆ సినిమాల హీరోయిన్ గందరా ఇంతలోకే ఇట్టా అయిపోయిందేంది' అన్నా,
ఒక జనరేషన్ తప్పించి సినిమాకు వచ్చిన వాళ్లు : 'ఉరేయ్, మొదటి పాటకే క్లబ్ డాన్సర్ వచ్చిందేందిరా, చివర్లో గందా రావాల్సింది' అన్నా
ఏమీ అనలేని/అనుకోలేని స్థితి.
- కొత్త పాళీ on Apr 30, 2008, 10:02:00 AM said...
-
ఇది నిజమే. నాకు స్వయంగా అనుభవం కూడానూ :-)