'చిరు' కి జూనియర్ యన్.టి.ఆర్ చెక్ పెట్టగలడా !? - ఈనాడుఆంధ్ర పోల్

Posted by తెలుగు'వాడి'ని on Saturday, April 26, 2008

ఈరోజు యాధృశ్చికంగా ఈనాడుఆంధ్ర.కాం (courtesy : కొత్తపాళీ గారి తెలుగు భీభత్సం టపా) అనే వెబ్ సైట్ కి వెళ్లగా అక్కడ కనబడిన ఈ చిరు vs యన్.టి.ఆర్ అనే పోల్ కనబడటంతో దాని ఫలితం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించటంతో మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ....

పైన ఆశ్చర్యం అని ఎందుకు అన్నాను అంటే మనం చూసే/చదివే అన్ని(కుడి-ఎడంగా) ప్రముఖ పత్రికలలో మరియు/లేదా వెబ్ సైట్స్ లో ఇంత పెద్ద తేడాతో చిరు కి వ్యతిరేకంగా ఫలితం ఉండటమే ... అందునా నాకు తెలిసి ఇదే ప్రధమం ...

సరే ఇక ఫలితం విషయానికి వస్తే ... క్రింద చూడండి మరి లేదా ఆ సైట్ లోనే చూడాలి అంటే ఈనాడుఆంధ్ర పోల్ ఫలితాలు : 'చిరు' కి జూనియర్ యన్.టి.ఆర్ చెక్ పెట్టగలడా?



ఇది ఇప్పుడిప్పుడే అంత తొందరగా తేలే విషయం కాదు కాబట్టి ... ప్రస్తుతానికి దీనిని కాలక్షేపం బఠాణీలు క్రింద జత కట్టేసి/చేసి కొంత కాలం ఇలాంటి టాపిక్స్ తో కాలం వెళ్లబుచ్చుదాం ...

ఎలాగూ కాలమే (అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా) అన్నిటికీ సమాధానం చెపుతుంది .. అప్పటిదాకా మనది ప్రేక్షకపాత్రే ... అంతవరకు మనం నిమిత్తమాత్రులమే ...

రాబోయే రాజకీయ సం'కుల' సమరం లో తారల సినీ డైలాగులతో కూడిన బురద జల్లుడు తమాషా కోసం ఎదురు చూసే వారికి ఎలాంటి వినోదాన్ని/చెవులకు విషాదాన్ని పంచుతుందో చూద్దాం

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


6 వ్యాఖ్యలు:

chandramouli on Apr 26, 2008, 11:22:00 PM   said...

అయినా చెక్ పెట్టడం అంటే.... రాజకీయపరంగానా.... తెలుగు ఇండస్ట్ర్రీ రీప్లేస్ మెంట్... గురించా???? ఎదయినా......
ఇది మరీ దారుణమయిన పోలిక..... ఎంత కులాంతరమయితే మాత్రము....నాలుగు సినిమాలు హిట్టయి, ఎన్టీవోడి వంశ వృక్షంలో మిగిలిన ఆశాజీవి అయితేమాత్రము....
అలా పోల్చటం అంత సరికాదని నా అభిప్రాయం....( చిరుఫ్యాన్ నా కాదా అన్నది ఇక్కడ ప్రశ్నకాదు)......

బాలయ్యబాబు బాగా తొడకొడతాడా....అల్లు అర్జున్ బాగా కొడతాడా(తొడ కాదు).... అంటే... ఎంత డోకువస్తుందో... దీనికి అలానే అనిపిస్తుంది....


Naveen Garla on Apr 28, 2008, 8:53:00 AM   said...

చంద్రమౌళి గారు, జూ.ఎన్టీఆర్‌ మీద ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తక్కువ అంచనా వెయ్యొద్దు (నేను పక్కా చిరు ఫ్యాన్). ఈ విషయం గత ఎన్నికల్లోనే ఋజువు అయ్యింది కదా. చిరు సపోర్టు ఉన్నా అశ్వినీదత్తు దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జూ.ఎన్టీఆర్‌ సపోర్టు చేసి, ప్రచారం చేసిపెట్టిన అభ్యర్తి కొడాలి నాని గుడివాడలో గెలిచాడు. కృష్ణా జిల్లాలో తెదేపా గెలిచిన ఏకైక సీటు అదే అనుకుంటా. దీన్నేమంటారు?


తెలుగు'వాడి'ని on Apr 28, 2008, 12:15:00 PM   said...

నవీన్ గారు : సూటిగా, సరళంగా చక్కగా మంచి ఉదాహరణతో చెప్పారు. దన్యవాదములు

చంద్రమౌళి గారు : నా వ్యక్తిగత అభిప్రాయమైతే చిరంజీవి కన్నా కూడా జూనియర్ యన్.టి.ఆర్ తన అధ్బుత వాక్పటిమతో, అనర్గళ ప్రసంగ చాతుర్యంతో, తనకు తెలుగు భాష మీద ఉన్న పట్టుతో, ఎక్కువ ప్రభావితం చేయగలుగుతాడు రాజకీయ సభలకు వచ్చిన వారిని చివరివరకు కూర్చోబెట్టటంలో మరియు వాళ్లు వినేలా చేయటంలో (స్వర్గీయ అన్నగారికి మిగతా వారికీ హస్తిమశకాంతరం తేడా ఉన్నది ఇక్కడే)

చివరిగా అసలు మీకు రాజకీయంగానా లేక సినిమారంగమా అనే సందేహమెందుకు వచ్చిందో ...

పోలికలో తప్పేమీ లేదండి ... రాజకీయాలకి ఇద్దరూ కొత్తే .. రేపు నిజంగా చిరు రాజకీయ రంగ ప్రవేశం జరిగితే పైన నవీన గారు చెప్పిన పోలిక/ఫలితం తప్పక చర్చక వచ్చి తీరుతుంది.(ఇప్పటికే చాలా సార్లు వచ్చింది కూడా) .. పైపెచ్చు దొందూ దొందే ...

మీ వ్యాఖ్యకు కూడా దన్యవాదములు


godari on May 2, 2008, 6:06:00 AM   said...

ఎంటీఆరే ఓడిపోయాడు.
విజయవాడలో దత్తు వీకు. గుడివాడలో నాని స్ట్రాంగ్.
తెలుగు దేశానికి చిరు మద్దతివ్వడం అభిమానులకు నచ్చలేదు.
అభ్యర్ధి గెలుపుకు చాలా విషయాల ప్రభావం ఉంటుంది.
అయినా ఎవరి దమ్మేంటో ఫలితాలు వచ్చాక తెలుస్తాయి.


Rajendra Devarapalli on May 2, 2008, 12:00:00 PM   said...

ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీవందానూటపాతికేళ్ళచరిత్రా,తెలుగు దేశం పార్టీని స్తాపించిన యన్ టీఆర్,నడుపుతున్న చంద్రబాబుల నాయకత్వం,స్థానికకార్యకర్తల శ్రమ,అభ్యర్ధులు పెట్టిన ఖర్చు,ప్రచారం,రాజకీయ పక్షాల ఎన్నిక ప్రణాళికలూ,అక్కడి సమస్యలు,ఇలా సవాలక్ష అంశాలను కాదని ఒకరు మద్దతిస్తే ఓడారని,మరొకరు మద్దతిస్తే గెలిచారు అనటమూ ప్రజాస్వామ్యవిధానాన్ని పరిహాసం చేసినట్లే.
ప్రపంచంలో ఏ రాజకీయపార్టీకి లేని విధంగా తెలుగు దేశం పార్టీకి చలనచిత్రపరిశ్రమ మద్దతు ఉంది.కానీ మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలు కాకుండా తారలెవరూ ఆపలేకపొయారు.స్టార్ నిర్మాత రామానాయుడుకు వెంకటేష్ తో సహా ఎందరో ప్రచారం చేసినా అక్కడ ఓటమి తప్పలేదు.మీ వాదనల ప్రకారం అందరికంటే ధర్మవరపు సుభ్రమణ్యం గొప్పవాడనాలి,అతను ఒంటరిగా కాంగ్రెసుకు ప్రచారం చేసారు.అన్ని చోట్లా (దాదాపు) ఆ అభ్యర్ధులు నెగ్గారు,మరి దానిని ఏమంటారు?


Anonymous on May 3, 2008, 8:03:00 AM   said...

aina ippudu unna parasthitulalo cine glamour politics lo pani cheyyadu ani naa abhiprayam. chirenjeevi aina jr ntr aina evaraina prajalu valla meeda vunna abhimanam tho votlu veyyaru .prajalu chala telivi aina vallu.sr ntr meed vunna abhimanam tho aayana fans balakrishna, jr ntr la anni cinemalanu hit cheyyaru kada.alage chiranjeevi fans kooda aayana anni cinemalni hit cheeyaru kada.politics lo kuda ante.evaru manchi vallu ,evaraite prajalaku seva cheyygalaru ani valuu anukunte vallake votlu vestaru.taruvata vallu adhikaramloki vacchaka emi seva cheyyaka pote next elections lo vallaku deposits kuda dakkavu.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting