నన్ను విపరీతంగా నవ్విస్తున్న (ఎప్పుడు చదివినా, గుర్తుకువచ్చినా) మీ వ్యాఖ్యలు/వాక్యాలు
అసలు కన్నా కొసరు ముద్దు అన్నట్టు, ఈ మధ్య నాకు తరచుగా మన బ్లాగుల్లోని టపాలలోని కొన్ని వాక్యాలు మరియు ఆయా టపాలకు వచ్చిన వ్యాఖ్యలు విపరీతంగా నచ్చేయటమే కాకుండా స్కూల్/కాలేజి మరియు ఉద్యోగంలో చేరిన కొత్తల్లో స్నేహితులతో గడిపిన/పంచుకున్న మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తుండటంతో .. అలా వాటిని గుర్తుకు తెప్పించిన ఆయా మీ వ్యాఖ్యలు/వాక్యాలు కొన్నిటిని ఇక్కడ మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ....
ఏమిటి వీడు .. నచ్చిన బ్లాగులు, టపాలు అంటూ ఏదో రాసుకునే వాడు ఇప్పుడు వ్యాఖ్యలు/వాక్యాలలోకి వచ్చాడు అనుకుంటున్నారా .. ఏమి చేస్తాం .. పుర్రెకో బుధ్ధి : జిహ్వకో రుచి ;-)
1)ముందుగా మొన్నీ మధ్యనే కొత్తపాళీ గారు వ్రాసిన మరియు మీ అందరికీ ఇంకా గుర్తున్న 'కల్తీ లేని చెత్త' టపా గురించి ప్రారంభిస్తా ....
నాగబాబు గురించి :
కొత్తపాళీ గారు :: నాకు తెలీకడుగుతానూ, నాగబాబుకి తాను నటించగలనని భ్రమపెట్టిన వాళ్ళెవరో?
indianminerva గారు : ఐనా నాగబాబుని poster మీద చూసి కూడా cinema కి వెళ్తే ఆ తప్పు director దటండీ? ఇదేం బాలేదు. నాగబాబు ని చూపిస్తున్నారూ అంటేనే director మనల్ని హెచ్చరిస్తున్నట్టు.
ఛార్మీ గురించి :
కొత్తపాళీ గారు : ఛార్మీని తెలుగు సినిమాల్లో హీరోయిన్ చేసిన వాణ్ణి ఆర్టీసీ చౌరాస్తా నడిబొడ్డున కొరత వెయ్యాలి!
జ్యోతి గారు : చార్మి ఈ నాటి యువతరానికి బాగా నచ్చుతుంది(అది ఎందుకో మీకు అర్ధమయ్యే ఉంటుంది)
2) నిరంజన్ పులిపాటి గారి బ్లాగ్ లోని సాక్షి - పుచ్చు వంకాయ !!! టపాలో ...
సాక్షి - జగన్ - వై.యస్.ఆర్ గురించి :
Dr. Ram$ గారు : సాక్షి వాడి కి బుర్ర యెక్కడ వుందో గత రెండు మూడు రోజుల నుండీ వాడు రాస్తున్న మొదటి పేజి ఆర్టికల్స్ చెపుతున్నాయి.. యిది వ్యాపారము, నేను 2 రూ కే అమ్ముతున్నాను, బోలెడంత బొక్క పడుతుంది.. మీరు మాత్రము ఎందుకు పెట్టిచ్హుకోరు అని, తెగ గింజుకుంటున్నాడు..నీకు "ఫ్రజా సేవ" చేయాలని వుండి నువ్వు 2 రూ కే ఇస్తున్నావ్, అలాగని అందరని చేయమంటే..నిజంగా మెంటల్ కేసు లా వున్నారు..వాళ్ళ అబ్బ కి ఏ మాత్రము తీసి పోడు కొడుకు.. నిజం గా వాడి కోరిక మేరకు, మిగితా తెలుగు దినపత్రిక లు 2 రూ కే ఇస్తే, ఈ వెధవ పేపర్ కొనేవాడు ఎవడు వుండడు..ఈ మాత్రము బుర్ర కూడ లేని వెధవలు పది లక్షలు సర్క్యులేషన్ గల పత్రిక నడుపుతున్నాడు, వాళ్ల అబ్బ ఏమో మనళ్ళని పాలిస్తున్నాడు.. దేవుడా..!!
3) నేను ఇంతకు ముందు ఒక Andhacafe.com లో తెలుగు సినిమాల reviews అన్నీ ఒకే చోట లో చెప్పినట్టు నేను క్రమం తప్పకుండా చదివే తెలుగురివ్యూ సైట్ లలో andhracafe.com ది ప్రధమ స్థానం. అందులో ఇప్పుడే ప్రచురించిన దొంగ సచ్చినోళ్లు రివ్యూ లో కొన్నిటిని చూద్దాం ..
4) తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి ' "మెగా" కాకపోవడానికీ కావడానికీ మధ్య....' టపాలో
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు : హీరోని అన్ని ఫ్రేముల్లోను అందంగా చూపించాల్సిన పనిలేదు (చివరికి ఇదెలా దారి తీసిందంటే ఇప్పుడు మనం అల్లు అర్జున్ లాంటి సగటు ముఖాల్ని కూడా హీరోలుగా అంగీకరించే పరిస్థితి వచ్చింది)
5) నవతరంగం లో రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి నికోలస్ కేజ్ ఎన్నిసార్లు తొడకొట్టాడు? టపాలో :
Raj గారు : Antha bagane undi gani. Thoda kottadam manaki culture paramga alavatu ayyindani, ippudu kothaga kanipettindi kadani meeku thelisi unte…ee lekkalu vese unde varu kadunukunta.
Calculator thisukoni battery ayypoindaka lekkalu veyyadam kadu…..aa lekka veyocho ledo kuda alochinchandi.
Edanna upayogapade panulu cheyandayya swami. Palleturla lo fans ani buthulu thittukune vallu oka side…..net lo mee lanti vallu oka side…..ekkadaina bhava daridram matram ade.
6) ప్రవీణ్ గార్లపాటి గారి నా మదిలో బ్లాగ్ లో మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ? టపాలో ..
చదువరి గారు : ఓ సందేహం.. వచ్చే ప్రతి సినిమానీ చూసి డోక్కునేవారు, డోక్కుంటూనే వచ్చే ప్రతి సినిమానీ చూసేవాళ్ళదే వర్గం? (పాపం.. సమీక్షకులనవచ్చేమో!)
7) విశాఖతీరాన బ్లాగ్ లో రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారి ఈటీవీలో... ఈయన ఎవరు? టపాలో :
Prakash గారు : ఈయనే ఈ టీవీ రెండో సుమన్. ఈ టీవీ ప్రేక్షకుల పాలిట విలన్.
****************************
ఇంకా చాలా ఉన్నాయండీ ... వీలైతే అతి త్వరలో మరలా కలుద్దాం. అంతవరకూ శెలవా మరి !
గమనిక : ఈ టపా ఎవరినీ కించపరచటానికి ఉద్దేశించినది కాదు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
8
వ్యాఖ్యలు:
- Anonymous on Apr 26, 2008, 7:13:00 AM said... 1
-
మీ ఓపిక కి నా కృతజ్ఞతలు....వంద బ్లాగులు చదివి ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోవడం కన్న మీ లాంటి వాళ్ళ రివ్యూ చదివితే బాగుంటుంది....కనుక మీరు నెల కోసారి మంచి లింకుల ను ఇవ్వగలరా ?
- రాధిక on Apr 26, 2008, 9:56:00 AM said... 2
-
నాకూ ఈ కామెంట్లు చూడగానే తెలియకుండానే కిసుక్కున నవ్వు వచ్చేసింది.మేమందరం మరొక్కసారి నవ్వుకోడానికి మీరిలాంటి టపాలు బోలెడు రాయాలని కోరుకుంటున్నాను.
- Anonymous on Apr 26, 2008, 10:45:00 AM said... 3
-
బాగు బాగు మీ ఈ విహంగ వీక్షణాలు బాగున్నాయి. మీ ఓపికే ఓపిక. ధన్యవాదాలు.
- తెలుగు'వాడి'ని on Apr 26, 2008, 4:35:00 PM said... 4
-
VIJAYABHASKAR గారు : ఏదైనా నచ్చటం/నచ్చకపోవటం అనే దానిలో ఎవరి అభిరుచి వారిది అన్న విషయం మీకు కూడా తెలిసినదే అయ్యుంటుంది కనుక ...
వీలుంటే దిగువన ఉన్న టపాలు చూడండి .. cbrao గారికి మరియు నాకు బాగా నచ్చిన బ్లాగ్స్/పోస్ట్స్:
దీప్తిధార బ్లాగ్ నుంచి :
బ్లాగ్వీక్షణం
బ్లాగ్వీక్షణం -2
బ్లాగ్వీక్షణం -3
బ్లాగ్వీక్షణం -4
నా బ్లాగ్ నుంచి :
నచ్చిన బ్లాగులు మరియు టపాలు
నచ్చిన బ్లాగులు మరియు టపాలు - 2
నచ్చిన బ్లాగులు మరియు టపాలు - 3
నచ్చిన బ్లాగులు మరియు టపాలు - 4
ఏమో, వీటిలో మీకు కొన్ని అయినా నచ్చవచ్చేమో ... నచ్చితే సంతోషం ... నచ్చకపోతే ఇంతే సంగతులు - చిత్తగించవలెను :-)
- తెలుగు'వాడి'ని on Apr 26, 2008, 4:45:00 PM said... 5
-
రాధిక గారు : ముఖ్యంగా ఈ మధ్య మన తోటి బ్లాగర్లకి ఇలాంటి కళాపోషన బాగా ఎక్కువైనట్లు అనిపిస్తుంది .. ఇది నిజంగా శుభపరిణామమే .. ఉండటానికి చాలా ఉన్నాయండి ... చూద్దాం ఎంత వరకు రాయగలనో .. తప్పక ప్రయత్నిస్తా ...
వికటకవి గారు : ఓపికను అభిరుచి అప్పుడప్పుడు డామినేట్ చేస్తుంటుంది
- జ్యోతి on Apr 26, 2008, 10:41:00 PM said... 6
-
నిజంగా కొన్ని బ్లాగు టపాల కంటే వ్యాఖ్యలు భలే ఉంటాయి. నా టపా క్రేజీ కాంబినేషన్స్ లో అందరు ఇచ్చిన రుచులు చూసి కొత్తపాళిగారు అందరికి ఆశకురుపులు రావాలని అంటే , నాగరాజుగారు వాటిని పెద్దగా చేసారు.
కొత్త పాళీ said...
మీకందరికీ ఆశ కురుపుల్లేస్తాయి.
మండుతున్న జఠరాగ్నికి ఈ టపా, దాని కామెంట్లూ ఆజ్యం వాయువూ లాగ తోడయ్యాయి.
లంచి టైము ఇంకో ముప్పావు గంటకి కానీ రాదు!!!ప్చ్
ముందుగా కొ.పాగారి ఆశకురుపులు మరికాస్త పెద్దవి చేయటానికి - బిట్టూర్ బ్రేక్-ఫాస్ట్ గుర్తుందా మాస్టారూ? కమ్మటి గడ్డ పెరుగులో వేడి వేడి జిలేబీలు? భలే ఉంటుంది. నాకైతే్ జిలేబీలు టీలో ముంచుకు తినడం అలవాటు. ఆపైన హొటల్లో ఇడ్లీలోకి ఇచ్చే సాంబారులో వాడిచ్చే కొబ్బరిపచ్చడి కలిపితే భలే రంజుగా ఉంటుంది. గారెల్లోకి పరమాన్నం, పప్పులోకి పెరుగూ, బొబ్బట్లలోకి మజ్జిగ పులుసూ..
- Unknown on Apr 27, 2008, 7:15:00 AM said... 7
-
మీ ఓపికకి/పరిశీలనా శక్తికీ జోహార్లు...
భలే ఉన్నాయి వ్యాఖ్యలు.
- e.bhaskaranaidu on Nov 29, 2008, 8:29:00 PM said... 8
-
maa baaga raasaare/ inkaa konni ituvantivee peelustaara?