నచ్చిన బ్లాగులు మరియు టపాలు (బ్లాగ్స్ అండ్ పోస్ట్స్) - 2

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, January 15, 2008

ఇది నేను గత కొద్ది రోజులలో చదివిన వాటిలో నాకు నచ్చిన బ్లాగులు/టపాల కు సంబంధించి రెండవ భాగం .... ఒకవేళ ఇలాంటివే మరికొన్ని బ్లాగులు/టపాలు తెలుసుకోవాలి/చదవాలి అనుకుంటే మొదటి , మూడవ , నాలుగవ భాగాలుగా నేను ప్రచురించిన టపాలలో చదవవచ్చు/చూడవచ్చు.

బ్లాగులు :

కవిత్వం, సాంకేతిక మరియు Photos కు సంబంధించిన బ్లాగులలో ఫలానా టపా నాకు నచ్చింది అని చెప్పటం అంత అర్ధవంతంగా అనిపించలేదు కనుక ఈ దిగువన ఆ బ్లాగులలోని టపాలు కాకుండా ఆ Blog Address ని direct గా ఇవ్వటం జరిగింది.

1. హృదయ బృందావని గారి కవిత్వం బ్లాగు :

ఒక హృదయం : మనసు మూగదేగానీ బాష ఉంది దానికి ~ చెవులున్న మనసుకే వినిపిస్తుంది ఆ ఇది - ఆత్రేయ

2. ఇది ఒక బ్లాగు కాదు గానీ ఇంటర్నెట్/బ్లాగింగ్ మొదలగు వాటి గురించి విషయాలు అన్నీ తెలుగులో ప్రచురించిన వీరి శ్రమ/కృషిని నలుగురికీ తెలియజేయటానికీ, తద్వారా వారికి ప్రోత్సాహం ఇచ్చినట్లు ఉంటుందేమో అనే ఉద్దేశ్యం అంతే..

నేర్పు : చదువుకొనడం నుండి .. చదువుకోవడం వైపుకు

3. శోధన సుధాకర్ గారి సాంకేతిక బ్లాగు :

Savvy Bytes : Let's Know More !!!


టపాలు :

వీలుంటే అతి త్వరలో మరలా ఇంకొన్ని బ్లాగులు/టపాలతో కలుసుకుందాము ... ఈ లోగా ఆ పైన ఉన్న బ్లాగులు/టపాలు చదవండి .. ఆయా బ్లాగర్లతో మీ అభిప్రాయాలను పంచుకోండి....అంతవరకూ సెలవా మరి!

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
14 వ్యాఖ్యలు:

జ్యోతి on Jan 16, 2008, 6:36:00 AM   said...

మిమ్మల్ని తెలుగువాడు అని పిలవాలంటే ఇబ్బందిగా ఉంది. మీ పేరు చెప్తారా.. నిజంగా మీరు బ్లాగు పోస్టులన్నీ ఒక రిసెర్చిలా చేస్తున్నారు. కీపిటప్..

B O L


జాన్‌హైడ్ కనుమూరి on Jan 16, 2008, 10:51:00 PM   said...

మీ అభిరుచి బాగుంది
అభినందనలు
జాన్ హైడ్ కనుమూరి


తెలుగు'వాడి'ని on Jan 17, 2008, 10:23:00 AM   said...

జ్యోతి గారికి, జాన్ హైడ్ కనుమూరి గారికి......మీ వ్యాఖ్యకు ధన్యవాదములు... ఒకటి, రెండు రోజులకే ఇంతటి మంచి (కనీసం నావరకు) టపాలు కనుమరుగు కాకుండా కాపాడాలనీ, వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చూడాలనే ఓ చిన్న ప్రయత్నమిది...ఇలా అందరూ చేసుకుంటూ పోతూ ఉంటే మన తెలుగు బ్లాగర్ల శ్రమ, ప్రజ్ఞ కు తగిన గుర్తింపు, కొన్ని కొత్త (మరపున పడిన పాత) విషయాలు చదవటం/వినడం వలన కొంతైనా ఆనందం కలుగుతాయనే ఆశ అంతే...


రాధిక on Jan 17, 2008, 1:57:00 PM   said...

చాలా బాగా ఉంది .. నాకు నచ్చింది :: నలుగురికీ చెప్పదగిన బ్లాగు/టపా :)


తెలుగు'వాడి'ని on Jan 17, 2008, 3:58:00 PM   said...

ధన్యవాదములు రాధిక గారు! మీ వ్యాఖ్యకు మరియు ఈ టపా నచ్చినందులకు ... త్వరగానే రెండో టపా వ్రాయగలిగాను చూద్దాం ఈ ఉత్సాహం ఎన్ని రోజులు ఉంటుందో !:-)


సిరిసిరిమువ్వ on Jan 17, 2008, 5:37:00 PM   said...

అభినందనలు. మంచి ప్రయత్నం చేస్తున్నారు. Keep it up.


జ్యోతి on Jan 18, 2008, 2:28:00 AM   said...

వారానికొక బ్లాగులాగా, మంచి మంచి బ్లాగులు వెతికి సమీక్ష రాయకూడదు వివరంగా.. చాలా మందికి ఉపయోపడుతుంది. ఒక్కో బ్లాగు మొత్తం వివరంగా చదివి రాయండి. మీకు చేతినిండా పని .ఓపిక ఉందా మరి??


తెలుగు'వాడి'ని on Jan 18, 2008, 9:21:00 AM   said...

సిరిసిరిమువ్వ గారు : మీ వ్యాఖ్యకు, అభినందనలకు, ప్రోత్సాహానికి హృదయపూర్వక దన్యవాదములు...

త్వరగానే రెండో టపా వ్రాయగలిగాను చూద్దాం ఈ ఉత్సాహం ఎన్ని రోజులు ఉంటుందో !:-)


తెలుగు'వాడి'ని on Jan 18, 2008, 10:45:00 AM   said...

జ్యోతి గారు : ముందుగా ధన్యవాదములు మీ వ్యాఖ్యకు/సూచనకు ... ఇలా వారానికి కొన్ని బ్లాగులను పరిచయం చేసే విధంగా కూడలిలో మార్పులు మొదలగు వాటి గురించి నేను ఇంతకు ముందు వ్రాసిన టపా
'తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 1'

లో ప్రస్తావించాను. వారికేదో సలహా/సూచన ఇచ్చి ఊరుకోకుండా ఇప్పటికే దీని మీద నా కసరత్తు ప్రారంభించాను కానీ మీరన్నట్టు సమీక్షగా మాత్రం కాదు ... ఎందుకంటే సమీక్ష అంటే తప్పులు ఒప్పులు రెండూ చెప్పాలి...ఆహా ఓహొ అంటే అందరికీ ఆనందమే...అలా అనకుండా కొంచెం పక్కకు జరిగామా అంతే ..

ఇక నా నైజం గురించి, నా అర్హత(ముఖ్యంగా దీనిని నేను అప్పటివరకు వ్రాసిన నా టపాల సంఖ్యను బట్టి !?) నిర్ణయించగల/మాట్లాడగల మహానుభావులు ఉన్న బ్లాగ్ప్రపంచమిది....అలాగని మన:సాక్షిని చంపుకుని ఆహా ఓహో అనే వాటి గురించి మాత్రమే వ్రాయాలంటే వ్రాయలేను...ముక్కుసూటిగా పోయి ఇప్పటికే ఒకసారి మునివేళ్లు కాల్చుకున్నాను ఒక టపా ద్వారా ..అది
చాలు.

బ్లాగు విభాగాలను(రాజకీయం, సాహిత్యం, సినిమా, హాస్యం మొదలగునవి) బట్టి వారంలో (ఒకటి నుండి మూడు రోజులు) .. టపాకు (ఒకటి నుండి నాలుగు) కొన్ని కొత్త/నచ్చిన/చదివిన/వైవిధ్యమైన బ్లాగులను పరిచయం చెయ్యాలనే సంకల్పంతో ఇప్పటికే కొంత పని ప్రారంభించాను....చూద్దాం ఎప్పటికి మొదటి టపా పూర్తి చేయగలనో మరియు ఎంత కాలం ఇది కొనసాగించగలనో....


Anonymous on Jan 18, 2008, 11:08:00 AM   said...

అయ్యా తెలుగువాడూ, లాభం లేదు. మీ పేజీ లోడ్ అయ్యేలోపు నేను వేరే టపా ఒకటి చదివి రావొచ్చు. సరంజామా భారీగా తగ్గించాల్సిందే!


తెలుగు'వాడి'ని on Jan 18, 2008, 12:31:00 PM   said...

sreenyvas/వికటకవి గారు : సరంజామా తగ్గించటానికి ఈ వారాంతంలో సమయం కేటాయించాను .. [ దయచేసి ఈ వ్యాఖ్యను సరదాగా తీసుకోండి ] మొదటిసారి మీ వ్యాఖ్య ఒక సూచన లాగా .. ఇప్పటి ఈ రెండో వ్యాఖ్య, చెవి పట్టుకొని వెంటనే చెయ్యమన్నట్టుగా ఉంది ... ఇంకా ఆలశ్యం చేస్తే బెత్తం పట్టుకొని, గోడకుర్చీ వేయిస్తారేమో అని...అన్నీ పక్కన పెట్టి వెంటనే నా బ్లాగులో సరంజామా అంతా తీసివేశానండి :-) ఇప్పుడు చూసి చెప్పండి ఎలా ఉందో ... నాకైతే పేజ్ ఇంతకు ముందుకన్నా చాలా వేగంగా లోడ్ అవుతున్నట్టుగానే ఉంది.


Anonymous on Jan 19, 2008, 8:00:00 AM   said...

కన్నెర్ర చేయకండి. ఇప్పుడు హాయిగా ఉందండీ, స్పీడు పెంచారు మొత్తానికి. "ఇంతెజార్ కా ఫల్ మీఠా హోతా హై" నాకు పడదండీ :-)


ప్రవీణ్ గార్లపాటి on Jan 19, 2008, 10:56:00 AM   said...

బాగుంది టపా...
శ్రీనివాస్ గారు చెప్పినట్టు క్లీనప్ చేసిన తర్వాత బ్లాగు కూడా చూడబుల్ గా ఉంది :)


తెలుగు'వాడి'ని on Jan 19, 2008, 10:55:00 PM   said...

sreenyvas గారు, మీరు స్పీడ్ పెంచాను అని చెప్పారు అంటే హమ్మ్యయ్య ... కొంత relief .. మీ దయకూడా !:-) మరొక్కసారి ధన్యవాదములు.


ప్రవీణ్ గారు : ముందుగా ధన్యవాదములు మీ వ్యాఖ్యకు/టపా బాగున్నందని చెప్పినందుకు. తిట్టకుండానే భలే తిట్టారుగా రాజు గారి రెండవ భార్యలాగా, నా బ్లాగు పూర్వస్థితి గురించి :-) మన తెలుగు బ్లాగులలో పెట్టదగిన కొత్త features గురించి, పాఠకులు / వీక్షకులు మన బ్లాగులో టపాలు చదవటం గురించి పరిశోధన కోసమని ఇంతకు ముందు అందుకే చాలా జత చేశాను ... sreenyvas గారు నాకు గోడకుర్చీ వేయించక ముందే చెప్పాలి అనుకున్నవి చాలావరకు ఇంతకు ముందు టపాలలో చెప్పాను .. అందుకే ఇప్పుడు వాటిని పూర్తిగా తొలగించేశాను ..


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting