చిరంజీవి లెజండ్ కాదు అని నాకు అ(క/వి)నిపించిన ఒక కారణం

Posted by తెలుగు'వాడి'ని on Sunday, January 13, 2008

చిరంజీవి గారు 'లెజెండ్' అనే దానికి అర్హులు అన(చూప)టానికి తెలుగు సినీ ప్రరిశ్రమపై అంతో ఇంతో అవగాహన ఉన్నవారు సైతం (ఇక (వీరా)అభిమానులు, సినీ పెద్దలు, బంధుమిత్రహితసన్నిహితులు, విమర్శకులు, సమీక్షకులు మొ: వారి గురించి చెప్పేదేముంది లేండి) వందల, వేల కారణాలతో ముందుకు దూకే సమయంలో, అర్హుడు కాదు అనేదానికి నాకు క(అ/వి)నిపించిన ఒక కారణాన్ని ఇక్కడ మీకు అందించే ప్రయత్నమే ఈ టపా ...

వివాదరహితుడిగా, అజాతశతృవుగా, నొప్పించక తానొవ్వక, వినయ విధేయతలతో, అందరినీ కలుపుకు పోయే వానిగా ... ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక మనిషిగా అందరూ గౌరవించే, అభిమానించే వ్యక్తిగా మన్ననలు అందుకుంటున్న చిరంజీవి, మొదటి సారిగా-ఒక వ్యక్తిగా (నటునిగా (గత ఆరేడు సంవత్సరాలుగా) అంటారా ..అదో పెద్ద తేనెతుట్ట దానిని ఇప్పుడు కదిలించవద్దు వీలుంటే మరలా ఇంకొక సారి చర్చిద్దాం) చూడగా అతనిపై ఒక రకమైన ఏహ్యభావం కలిగిన క్షణమిది....

ఎప్పుడో అయిపోయిన దానిని ఇప్పుడు మరలా లేవనెత్తటానికి కారణం ... మిత్రుడొకరు సుమారుగా రెండు నెలల క్రితం 'శ్రీజ-శిరీష్' ల ప్రేమ-పెళ్లి వ్యవహారం వెనుక మోహన్ బాబు హస్తం ఉందేమో అనే ఒక వార్త ను చదివి దాని గురించి ఇంకా వేరే ఎవరైనా రాశారేమో అని గూగ్లిస్తే అనుకోకుండా తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంలో మోహన్ బాబు ప్రసంగంపై పవన్ కళ్యాణ్ ప్రసంగం యొక్క You Tube వీడియో లంకె ను నాకు పంపటానికి ఆ వీడియో క్రింద ఉన్న ఈ వ్యాఖ్యే ( At 2:42 see the Chiranjeevi reaction for the pavan's words,such an indecent guesture in public) ప్రధమ కారణం......

పవన్ కల్యాణ్ ప్రసంగ వీడియో : (2:42 నిముషాల వద్ద చిరంజీవి నవ్వు చూడండి)




ఇంతకు మునుపు ఈ వజ్రోత్సవం గొడవ గురించి నేను కూడా చదివాను...మోహన్ బాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి గారుల ప్రసంగాల వీడియోలను కొద్ది సేపు చూశాను కాకపోతే వారి మీద వీరు..వీరి మీద వారు ఏదో చెత్త అంతే కదా అని నేను ఎక్కువ interest చూపించలేదు కానీ మిత్రుడు పైన చెప్పిన వ్యాఖ్యతో కూడిన వీడియో లంకెను పంపించిన తరువాత పూర్తిగా ఈ వీడియోలను చూడటానికి ముఖ్య కారణం ఆ వ్యాఖ్య చిరంజీవి పై ఉండటమే ..

ఇక్కడ నేను అయా హీరొల ప్రసంగాలలో తప్పొప్పుల జోలికి వెళ్లదలచుకోలేదండి ... మోహన్ బాబు, పవన్ కల్యాణ్ ల దుడుకు స్వభావం, ప్రవర్తన గురించి (ఈ సందర్భంలో గానీ బయట చాలా సందర్భాలలో) మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే/ఆలోచిస్తే అంత మంచిది అనే ఉద్డేశ్యంతో..

నేను చెప్పదలచుకున్నది ఒకటే ... చిరంజీవి గారి లాంటి వ్యక్తి సభ్యత మరచి అంత సంస్కారహీనంగా, తన స్థాయి (ముఖ్యంగా వ్యక్తిగత)ని దిగజార్చుకొని(నేలా) ఒక Public Meeting లో అలా ప్రవర్తించటం నిజంగా శోచనీయం...ముఖ్యంగా తనపై direct or indirect గా ఎవరైనా (మోహన్ బాబు కావచ్చు మరెవరైనా కావచ్చు) వ్యాఖ్యానించి ఉంటే తనకు తానుగా తేల్చుకోవాలి అంతే గానీ తన తమ్ముడో, బావమరిది కొడుకో చేసిన వ్యాఖ్యలకు, తన ప్రవర్తన దిగజారుడుతనాన్నే సూచిస్తుంది. మిమ్ములని ఓ శక్తి అనో, మీరు పంచేది 'ప్రేమ ... ప్రేమ ... ప్రేమ ...ప్రేమ ... ప్రేమ' అనో లేక మీరు కత్తో, కటారో అనో, మీరు అడుగేస్తే కెవ్వు, మీరు చెయ్యెత్తితే కేక అనో అంటే వచ్చే ముసిముసి నవ్వులు మీ ఇష్టం.

చిరంజీవి గారు !

మీరు హడావుడిగా ఇంటికి వెళ్లి మీ బావమరిదో, మరొకరో రాసిచ్చిన డైలాగులను బాగా బట్టీయం పట్టి...కళ్లు ఎర్ర జేసుకోని, ముక్కు, మూతి చీదుకుంటూ ... స్టేజ్ మీద ఊగిపోతూ చేసిన ప్రసంగానికి మీపై ఎంత సానుభూతి కురుస్తుందో ... అలాగే పైన ప్రస్తావించిన మీ పైశాచిక ఆనందాన్ని బయటపెట్టే సన్నివేశాలు కూడా మీ స్థాయిని, మీపై తటస్థులుగా చూపే అభిమానాన్ని తగ్గిస్తాయనే నా అభిప్రాయం. ఒక్క సారి ఆలోచించి చూడండి.

ఇక పై మీ ప్రవర్తన ఎలా ఉండాలో మీ విజ్ఞతకే వదిలివేస్తున్నాము ... మరొక్క విషయం ఏమిటి అంటే ఇలాంటి సందర్భాలలో నవ్వకుండా నిభాయించుకోవటంలోనే (ముఖ్యంగా మీ తమ్ముడో, మరో రక్త సంబంధీకుడో మాట్లాడినప్పుడు) ఒక లెజెండ్ కి, సగటు మనిషి/నటుని కి తేడా కనపడవలసింది.... కాకపోతే Internet/Electronic Media బాగా popular అయిన తరువాత ఇలాంటి వాటిని కొన్ని వేళ కళ్లు పరిశీలిస్తున్నాయన్న విషయం మరువరనే ఆశ అంతే...

ఈ ఒక్క కారణానికే చిరంజీవి లెజెండ్ కాకుండా పోతాడు అని చెప్పటం నా ఉద్డేశ్యం కాదు సుమా.....ఒకవేళ రేపు ఎవరైనా చిరంజీవి లెజెండ్ కి అనర్హతలేమిటి అని అడిగితే ఈ వికృతమైన నవ్వు మాత్రం మొదటి పది స్థానాలలో వరుసగా ఒక మూడు స్థానాలను తప్పక ఆక్రమించి తీరుతుంది.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


11 వ్యాఖ్యలు:

Anonymous on Jan 13, 2008, 9:20:00 PM   said...

నా మటుకు నేను చిరు పంకాని కాదు. ఆ మాటకొస్తే, గత ఏడేళ్ళలో బహుశా నాకు ఆయన గారి సినిమా ఒక్కటో, రెండో నచ్చి వుంటాయి. ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, ఇక్కడ ఆయన హావభావాలు (2:42) పూర్తిగా అసంకల్పితము మరియు సహజము అని నేను విశ్వసిస్తున్నాను. మోహన్ బాబుని తమ్ముడు అని సంభోధించటం ఖచ్చితంగా అప్పుడు అందరికీ ఓ హాస్యాన్ని పంచే సంభోధనే. అంతగా నవ్వాలా అంటే, చెప్పానుగా, ఆ జోక్ అక్కడ బానే పేలింది. కకపోతే, "తమ్ముడు" మోహన్ బాబు మరో తమ్ముడి ఈ దుశ్చర్యని భరించి, ఈ దారుణమయిన దెబ్బని తట్టుకొని ఎలా అక్కడ కూచోగలిగాడా అన్నది విశేషం. అది తప్ప పవన్ కల్యాణ్ మిగతా చెత్తంతా ఎప్పుడూ వినేదే.


తెలుగు'వాడి'ని on Jan 13, 2008, 9:47:00 PM   said...

వికటకవి గారు : మీ వ్యాఖ్యకు ధన్యవాదములు ... జోక్ బాగా పేలింది అనటంలో ఎలాంటి సందేహం లేదు...అందరూ విరగబడి నవ్వుకునేలా ఉంది....కానీ ఏమో ! నాకు మాత్రం చిరంజీవి ఆ సందర్భంలో నవ్వటం ఎందుకో నచ్చలేదు ....ఇక మీరన్నట్టు మోహన్ బాబు నిజంగా ఎలా తట్టుకోని నిలబడ్డాడో ... అందులోనూ మధ్యలో తను ఖర్చీఫ్ తో నుదురు తుడుచుకునే సీన్ అయితే మరీనూ (కొంతమంది, చూశారా పవన్ చెమట పట్టించాడుగా అని!) :-)


రాధిక on Jan 14, 2008, 8:32:00 AM   said...

చిరు గాలి ఉదృతం గా వీస్తున్న ఈ రోజుల్లో ఇలా టపా రాయడానికి ఎంత ధైర్యం మీకు?చూసుకోండి ఇప్పుడు మీ బ్లాగుకి హిట్లు,మీకు తిట్లు ......తట్టుకోవడం కష్టమే.:)


తెలుగు'వాడి'ని on Jan 14, 2008, 9:20:00 AM   said...

@ రాధిక గారు : ధన్యవాదములు. మీరంటున్న ఆ చిరు 'గాలి' గురించి అసలు టపాలు 'ఢ్రfట్' మొడె లో చాలా కాలం నుంచి నా బ్లాగులో మూలుగుతున్నాయి అండి ... అప్పుడు అసలు తిట్ల హోరు, జోరు, ఉధృతి మొదలయ్యేది ... ఇప్పుడు వచ్చేవి 'చిరు తిట్లు' మాత్రమే అనుకుంటున్నా .. చూద్దాం ... ప్రస్తుతానికి 'వికటకవి' గారు చిరు పంకా కాకపోవటం వలన వదిలి పెట్టారో లేక ఈ టపాకు మరియు మీరంటున్న ఆ చిరు గాలికి సంబంధం లేదనుకున్నారో ప్రస్తుతానికి వదిలిపెట్టారు :-)


Anonymous on Jan 14, 2008, 7:55:00 PM   said...

ఈ చిరు పంకా తనాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరి సొత్తుగా జమ చేసెయ్యటానికి మా టీవి వుండనే వుంది. దానికి పోటీగా ఇతర మీడియా పోటీ. రజనీకాంత్ తో పోలిస్తే చిరు నిజంగా చిరునే. వ్యక్తిత్వంలోనయినా, స్థిరత్వంలో నయినా. నేను ముందర నా బ్లాగులో రాసిందే చెప్తున్నాను. చిరంజీవి మంచి నటుడు. మహా నటుడైతే ఖచ్చితంగా కాదు. మంచి మనిషి. మహా మనీషి అయితే ఖచ్చితంగా కాదు. గాలివానలో కొట్టూకుపోయే వాడు గడ్డి పరకనయినా ఆనందంగా పట్టుకుంటాడు, ఇప్పుడు జరుగుతున్నది అదే.

అంతెందుకు, తన మీద అన్ని స్పెక్యులేషన్స్ అవుతున్నా స్పందించాలన్న కామన్ సెన్స్ లేదా చిరు కి? లేదా రాజకీయనాయకుడి లక్షణాలు పుణికిపుచ్చుకుంటున్నాడా?


తెలుగు'వాడి'ని on Jan 14, 2008, 9:23:00 PM   said...

సుధాకర్ గారు : ముందుగా ధన్యవాదములు మీ వ్యాఖ్యకు ... ఎంత చక్కగా, క్లుప్తంగా చెప్పారండి ... చిరంజీవి మంచి నటుడే కానీ ఖచ్చితంగా మహా నటుడు కాదనీ .. అలాగే మంచి మనిషి అంతే గానీ ఖచ్చితంగా మహా మనీషి కాదు అని ... నావి కుడా నూటికి నూరు శాతం ఇవే అభిప్రాయాలు...

చిరంజీవి గారు ప్రస్తుతం చూస్తున్నది/ఆలోచిస్తున్నది .. తన కామన్ సెన్స్ గురించి కాదండి ... కామన్ మాన్ సెన్స్/సెస్ గురించి ... ఇక రాజకీయనాయకుడి లక్షణాలు పుణికిపుచ్చుకుంటున్నాడా? అనే దానిలో సందేహం ఎందుకండి..త్వరలోనే ఇదే విషయమై ఒకటో, రెండో టపాలు ప్రచురిద్దాము అనే ఆలోచనలో ఉన్నాను ... చూద్దాం..ఆచరణలోకి ఎంతవరకు తీసుకురాగలనో !!!


Usha on Jan 15, 2008, 7:42:00 AM   said...

నమస్తే తెలుగు"వాడి" ని గారు
నిజంగా మీ చిరు ప్రయత్నం కేవ్వు కేక
ఎవరికి తెలీని సంగతి కాపోతే అభిమానుల అంద దండా తో కప్పిపుచ్చుకుంటూ నేట్టుకోస్తున్నవేగా
నిజం అండి ఎంతటి "మహా మనీషో" సుధాకర్ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలండి సుధాకర్ మీరు
నిజం ఎప్పుడు నివురులో దాగిపోతుంది కదా అలాగే ఇదీ అంటే ఏమంటారు ?
తేన్క్యు
ఉష


తెలుగు'వాడి'ని on Jan 17, 2008, 4:09:00 PM   said...

ధన్యవాదములు ఉష గారు మీ వ్యాఖ్యకు మరియు ఈ టపా 'కెవ్వు కేక' అని చెప్పినందుకు :-) మీరన్నట్లు ఈ చిరంజీవి మొ: వారంతా అభిమానుల అండదండలతోనే నెట్టుకొస్తున్నారు...నివురుగప్పిన కొన్నింటిని అప్పుడప్పుడు ఇలా బయటకు లాగుదామనే ప్రయత్నం అంతే


Anonymous on Nov 13, 2009, 12:45:00 AM   said...

andare ke namaskarum chiranjivi manche manese asalu kane kadu endukante tana abemanulo ento mande vikalangulu vunna vare gurunche eme patechukodu.special eye and blood hospitals nu conduct chestuna chiranjivi tana abemanula nunde raktum pilche vate ne baga dabbu vunna vala ke retu matladukune ammukuntunadu.tana abemanulo okare kina blood kane eyes kane donate chesenattu tana jeveta charetralo ne vunadu ado pike cheputade tappa.oka chiranjivi abimane ke kuda aa blooad and eyes use avatledu.ede matrum real fact


Anonymous on Sep 27, 2010, 6:05:00 AM   said...

evarevaro evo cheppesaru chiru gurinchi.. white paper lo nalla macha matrame kanapadtunda meeku?

ee legend ante evaru emi anna silent ga navvakunda koorchovalaa?

indaka evaro annaru. rajaykeeyallo counters vestunte chiru emi matladaledu rajakiya lakshanalu puniki puchukunnada ani?

matladina tappe? matladakapoyina tappa? navvina tappena?

industry charitra teesukunte chiru chiru manishi kaadu. ayana 7 years lo manchi cenimalu cheyakapovachu kaani . chiru chiru chiruga modalu pettina a time nunchi choosukondi evaru enni mile stones daatakuntoo vellaro ani.
inka rajanikanth to comparison ledu. Bala chandar lanti goppa directorsee chiru ni rajanikanth ,chiru ,kamal ani oke kovalo petti andulo kooda chiru oka vyvidhyamyna natudu ani annaru.

maohan babu chiru internal ga em vunna eroju vallu bagane vunnaru . vaalu anta bagane vuntaru.
ikkad meeru anta enudku danikosam blog okarini takkuva chesi matladtunnaro naku ardam kavadam ledu.

Mana Telugu industry ane okka mata iteh gurtupettukondi chaalu.

Tappuga emyana ani vunte Sorry Guyzzzzzzz...

Bye
Baalu


baalu on Sep 27, 2010, 6:05:00 AM   said...

evarevaro evo cheppesaru chiru gurinchi.. white paper lo nalla macha matrame kanapadtunda meeku?

ee legend ante evaru emi anna silent ga navvakunda koorchovalaa?

indaka evaro annaru. rajaykeeyallo counters vestunte chiru emi matladaledu rajakiya lakshanalu puniki puchukunnada ani?

matladina tappe? matladakapoyina tappa? navvina tappena?

industry charitra teesukunte chiru chiru manishi kaadu. ayana 7 years lo manchi cenimalu cheyakapovachu kaani . chiru chiru chiruga modalu pettina a time nunchi choosukondi evaru enni mile stones daatakuntoo vellaro ani.
inka rajanikanth to comparison ledu. Bala chandar lanti goppa directorsee chiru ni rajanikanth ,chiru ,kamal ani oke kovalo petti andulo kooda chiru oka vyvidhyamyna natudu ani annaru.

maohan babu chiru internal ga em vunna eroju vallu bagane vunnaru . vaalu anta bagane vuntaru.
ikkad meeru anta enudku danikosam blog okarini takkuva chesi matladtunnaro naku ardam kavadam ledu.

Mana Telugu industry ane okka mata iteh gurtupettukondi chaalu.

Tappuga emyana ani vunte Sorry Guyzzzzzzz...

Bye
Baalu


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting