తెలుగు బ్లాగులు :: వాటి కాప్షన్

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, January 8, 2008

నేను ఇంతకు ముందు ప్రచురించిన టపా గత కొద్దికాలంలో నే చూసిన అధ్బుతమైన, సృజనాత్మకమైన వ్యాపార ప్రకటనలు లో చెప్పినట్టుగా నాకు ఈ ప్రకటనల మీద మాత్రమే గాక, తమ ప్రకటనల(ప్రచారం)లో భాగంగా రూపొందించే ఈ ఏకవాక్య Captions లేక Tag Line అంటే కూడా నాకు చాలా ఇష్టం ఎందుకంటే తమ కంపెనీ, వస్తువు సినిమా, వెబ్ సైట్ ... అసలు దేని గురించి అయినా సాధ్యమైనంత తక్కువ పదాలతో జనాలకు చేరేలా వారిని ఆకర్షితులయ్యేలా చేసే ప్రయత్నం ఒక సాహసమైతే దానిని తమ సృజనాత్మకతతో, తెలివితేటలతో కొత్త పుంతలు తొక్కించిన వారెందరో...అలాగే నేను ఈ తెలుగు బ్లాగ్ప్రపంచంలోకి నాలుగు నెలల క్రితం అడుగిడినపుడు నేను చదివిన చాలా బ్లాగుల్లో కూడా వీటిని చూసిన తరువాత, ఈ captions మీద నాకున్న అభిరుచితో ఒక్క సారి మన తెలుగు బ్లాగులన్నింటినీ తిరగవేసిన మీదట captions ఉన్న బ్లాగులన్నింటినీ ఇక్కడ ఇస్తున్నాను.

రానారె గారి బ్లాగు caption లో ఉన్నట్టు మడిసన్నాక కూసింత కళాపోసన ఉండాలి కానీ మన తెలుగు బ్లాగ్లోకంలో అది చాలా ఎక్కువగా ఉందండోయ్...నిజంగా ఆశ్చర్యపోవటం నా వంతైంది ఎందుకంటే బ్లాగు గురించి description ఇవ్వవలసి ఉంటే మనవాళ్లు చాలా క్లుప్తంగా ఒక caption ఇచ్చేశారు చాలా మంది....వంశీ/త్రివిక్రం ల One Line Satires, సిరివెన్నెల గారి సాహితీ ఘుమఘుమలు, జంధ్యాల గారి కామెడీ మరియు పరుచూరి వారి ఆవేశపూరిత డైలాగులు మొదలగు మార్కు పదాల పొందిక వారిని సైతం నివ్వెరపరచేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో ... చెప్పే కన్నా ఈ క్రింద ఉన్నవి చూస్తే మీకే బాగా అర్ధమవుతుంది ....

మనవి : నేను కుడి-ఎడంగా జల్లెడలో కనిపించిన అన్ని బ్లాగులకు వెళ్లి వీటిని సేకరించాను కానీ complete English Caption ఉంటే మాత్రం వాటిని తీసుకోలేదు. ఒకవేళ మీ బ్లాగులు ఏవైనా ఇక్కడ కనపడలేదు అంటే అవి జల్లెడలో లేకపోవటమో లేక miss అవటమో జరిగి ఉంటుంది అలాగే ఇవి సేకరించినది ఒక 45-60 రోజుల క్రితం .. ఈ లోపు ఏవన్నా కొత్త బ్లాగులు వచ్చి ఉంటే వాటిని తీసుకోలేదు అంతే గానీ నాకు నచ్చకపోవటంవలన ఇక్కడ ఇవ్వలేదు అని భావించవద్డు.

ఇలాగైనా మీకు తెలియని/చూడని/చదవని కొన్ని బ్లాగులను పరిచయం చేద్దామని నా ఈ చిన్ని ప్రయత్నం.
...............................

అభినయని: నా మానసపుత్రిక..

About Telugu Media : నిజాలు తెలుసుకోండి..

నిశ్శబ్ద మాలిక Living My Life As I Like : Spreading light with ideas.

మాష్టారు : నా అంచనాలు

AKAMKSHA : అందరూ భావుండాలనేదే నా ” ఆ కాం క్ష”

అక్షరవనం :: ..విహరించండి ..తీరికవేళల్లో...


Royal Youth Association (Bank of Blood Donors)
: మా ఆశయం .. చిన్నగా బ్రతికినా చాలా గొప్పగా బ్రతకాలి

ఋ ౠ ఌ ౡ : అందం. భాషందం. భువనందం. బ్రతుకందం.

Aravind Ajad's Random Thoughts : అరవింద్ ఆజాద్, నా పనికి మాలిన ఆలోచనలు

!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!! : యాంత్రిక జీవితపు ఎడారిలో... అందమైన ఆలోచనలన్నీ అడుగంటిపోతున్న భావ రహిత వాతావరణంలో... ఆశయాలను అందుకునే ప్రయత్నంలో... చిన్న చిన్న ఆనందాలను కోల్పోకూడదనే ఆరాటంతో... నిరంతరం ప్రయాణం చేస్తూ... అలసిపోయిన తరుణాన... నాకు తెలిసింది... నా మనసే ఈ ఎడారిలో నన్ను సేద తీర్చే ఒయాసిస్సు... అప్పుడే నా మదిలో మొదలైంది ఈ చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు!!!

కంప్యూటర్ మాయాజాలం!!.... : అంతలా అశ్చర్యపోకండి!!!

అంతరంగాలు… :: అనంత మానస చదరంగాలు

హరివిల్లు ... ఎన్ని వేల వర్ణాలో

బ్లాగాగ్ని : కూడలి, తెవికీ, పొద్దు కనిపించే మూడు సింహాలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ బ్లాగాగ్ని

బొమ్మలాట : సినిమాలు, సంగీతం, సాహిత్యం...ఇంకా నా హాబీస్ గురించి ఇక్కడ రాస్తాన

పక్కింటి అబ్బాయి : కోరికల గుర్రాలపైన...మధుర స్వప్న మేఘాలలో...

చైతన్యం : నా ఆలోచనల మాలిక

చందమామ : అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉన్న ఒక వ్యక్తి చేసే చిన్న ప్రయత్నం

చందురుడి చందనాలు... : సరదాగా సాగిపోయే తెలుగుదనపు మాధుర్యాల సంచికల సమూహం...

శ్రీనివాస్ చింతకింది : నా ఆలోచనలు, అభిప్రాయాలు, స్పందనలు, అనుభూతులు ఇలా ఎన్నో, ఎన్నెన్నో...

దిన్నిపాటి : మరో తెలుగోడి బ్లాగు

ఫన్ కౌంటర్ : చచ్చేట్టు నవ్వుకోవడానికి telugu satire for telugu people about films politics sports ఏదైనా సరే....ఇరగబడి నవ్వుకోండి

గడ్డి పూలు : ఒక తెలుగు బ్లాగు

ఊహా ప్రపంచం : ఆలోచనలు, ఊహలు కలగలిపిన హరినాథ్ ఊహా ప్రపంచం,కొన్ని వాస్తవాలు కూడా. ఇప్పుడు నా సొంత వెబ్ సైటు లో. ప్రశంసలు, విమర్శలు రాయడం మర్చిపోకండ

తొందర్లోనే నేను.. : అమ్మ ఒళ్ళో ఉంటాను, అమ్మ చేతి వంట తింటాను..

భాగ్యనగరం : ఉపాధి వేటలో ఒక చల్లని మజిల

ఇవీ నా మదిలోని ఆలోచనలు.. : మనసులోని వాటికి అక్షర రూపం ఈ అలోచనలు.

ఇది కథ కాదు... : సొంత జీవితపు పువ్వులు - ముళ్ళు....

జాబిల్లి : నా మదిలొ మెదిలే భావాలు……

జగన్నాటకం : ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

అంతర్వాహిని : మనోఫలకంపై ఒదిగిన అక్షర బిందువులు కాలపు అలజడికి, కలల ఒరిపిడికి గురై.. అప్పుడప్పుడూ చెప్పే భావాలకు అక్షరరూపం..

జానుతెనుగు సొగసులు : తెలుగును మరవకండి, తెలుగును ప్రేమించండి, తెలుగువారిగా జీవించండి

నైమిశారణ్యం : సంస్కృతి - సంప్రదాయం

జ్యోతి : సరదా సమాలోచనల పందిరి

కాలాస్త్రి : ఇక్కడ నాకు నచ్చిన వాటి గురించి రాసేస్తూ ఉంటాను. మీకు నచ్చితే అదే నాకు 43 వేలు!

నా తీపి కలలు : పంచుకుంటారా…..

కార్యంపూడి : ఎందరో మహానుభావులు....అందరికీ వందనములు.....

శ్రీ కృష్ణదేవరాయలు : ఓ తెలుగోడి బ్లాగు... తెలుగు మాట్లాడుదాం... తెలుగు వ్రాద్దాం,వ్రాయిద్దాం... తెలుగు బ్లాగులు ప్రచురిద్దాం!

పదహారణాలా తెలుగబ్బాయి : నా మదిలోని భావాలు తేటతెలుగులో

సినీవాలి : గొడవ... గొడవ... గొడవ... మనసులోపలా బయటా... అంతా గొడవే... ఆ గొడవేమిటో తెలిస్తే... ఇంకెందుకు గొడవ...

మానస వీణ : నా మది లోని రాగాలు …

మహా కవి శ్రీ శ్రీ : 'మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం' అని ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీ శ్రీ

నా రచనలు : ఇది నా రచనల సంపుటి. వివిధ సందర్భములలో నాలో మెదిలిన భావావేశమునకు, నేనెరిగిన వాజ్ఞ్మయలేశము లోని రంగులద్ది మలచిన పద్యములు, కవితలు, పాటలు ఇచట పొందు పరచితిని. ఎన్నదగిన సాహిత్య ప్రతిభ ఏమీ ఇందు లేదు గాని, వచనము కన్నా కొంత ఇంపుగా, వినసొంపుగా పదములను అల్లుటయే నేను చేసిన ప్రక్రియ!

దిదిద్ధిమినకపోతరాజు : దిదిద్ధిమినకపోతరాజు. ద్ధిమినకపోతరాజు. మనకపోతరాజు. నక్కపోతరాజు. కపోతరాజు. పోతరాజు. తరాజు. రాజు. జు.

మన తెలుగు కబుర్లు : మన తెలుగు వారు లోకమంతా విస్తరించారు, ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నట్లు మన తెలుగు వారు మన సంస్క్రుతిని కాపాడుతున్నారు విదేశియులను కూడా మన సంస్క్రుతి పై ఆసక్తి కలిగించి వారిని మనలో కలుపుకుంటున్నారు. ఇది చాలు మన తెలుగు వెలుగులు నలు చరగులా విస్తరించడానికి.మన తెలుగవారికి నా మన:పూర్వక అభినందనలు

“తెర”చాటు చందమామ : ఉత్తమ సినీ సాహిత్యం

మాణిక్య వీణ : శ్రీ విద్వాన్ విశ్వం గారు ఆంధ్రప్రభ వారపత్రిక లో రచించిన వ్యాస పరంపర....

మరమరాలు : "ఎందరో మహానుభావులు అందరికీ నా మరమరాలు (పేదవాడి ప్రసాదం)" ... ప్రపంచములో ఎందరో శాస్త్రవేత్తల పరిశోధనలు, మహానుభావుల మాటలు, త్యాగధనుల సమీష్టి కృషి ఫలితం ఈనాడు మనకు కనపడే ఈ అబివృద్ది. నేను సేకరించిన కొంత మంది మహానుభావుల అడుగుజాడలను మీకు తెలియజేయ ప్రయత్నమే ఈ "మర్మ-మరాలు".

మీ స్ఫూర్తి : మనలో మనకోసం meespoorti@gmail.com

తెలుగు సినీ సాహిత్యపు మెరుపులు : తెలుగు సినీ సాహిత్యపు మెరుపులు

మూడు బీర్ల తర్వాత : తలకాయకీ గుండెకాయకీ సమన్వయం కుదిర్చే వృథా ప్రయాస...

మనిషి : ఉద్ధరేత్ ఆత్మనాత్మానమ్: దైవం ఉన్నా లేకపోయినా మనిషికి ఒరిగేదేంలేదు పోయేదీలేదు

naakavitvam/నా కవిత్వం : కవిత నిలిచే మనసంటే వెన్నెల తెలిసిన రాత్రన్న మాట!

నాలుగు పదాల ఆట :ఇచ్చిన నాలుగు పదాలను వాడి కాస్త హాస్యంగా ఒక కవిత / తవిక రాయటమే ఈ ఆట

నా మనసు : మధురమైన మనోభావాల సమాహారం

నా ఊహల సమాహారం : ఇది నా ఆలోచనల మణిహారం

మీ కోసం... : నా ప్రపంచంలోకి మీకిదే స్వాగతం.. సుస్వాగతం...

నీతి కథలు : మన భారతీయ సంస్కృతికి సవినయ నివాళి

నా స్వగతం : నే స్మరిస్తె పద్యం, అరిస్తె వాద్యం, అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం

' వాసు ' లోకానికి స్వాగతం : నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో..... ....అప్పుడే నువ్వు వేరొకరిని ప్రేమించ గలవు.

నా ప్రపంచం : నరిశెట్టి ఇన్నయ్య గారి వివిధ పత్రికలు,పాత్రికేయులతో అనుభవాలు.

చెప్పాలని ఉంది.. : తెలుగు అంటే చాలా ఇష్టం....కొత్త విషయములన్నా చాలా ఇష్టం

మానసవీణ : మనసు పలికే మధుర రాగం...

నిస్పృహ : నా ఆలొచనలు...నేను చదివిన వాటి గురించి...ముఖ్యంగా తెలుగు లో రాయటానికి..

తెలుగు కబుర్లు : ఇందులొ తెలుగు వారి అభిరుచుల మేరకు అన్ని అందుబాటులొ వుంటాయి

పడమటి గోదావరి రాగం : గొదారి గలగలతో పైరగాలి రెపరెపలతో మది పాడే మౌనరాగం

ఓనమాలు : మంచి అన్నది పెంచుమన్న - Let us promote goodness

నా అలోచనలు చదవండి : ఈ పక్కన చూపించె బొమ్మకి ఈ బ్లాగు పేరుకీ అసలు లోపలి విషయానికి సంబంధం ఏమిటి... సరేగాని నా అలోచనలు ఎందుకు తెలుసుకోవాలి అనే మీ ప్రశ్న కి జవాబు కోసం నా బ్లాగులోకి తొంగి చూడండి.... మీకే అర్దం అవుతుంది.

నా మదిలో .. : నా మదిలో రేగే ఎన్నో ఆలోచనలను మీతో పంచుకోవడానికి ఇలా...

పూలవాన : కురిసే వేళ…

ప్రియతమా : ప్రేమ ఎంత మధురం

నేను ఏమనుకుంటున్నానంటే.. : మీకు నచ్చినా, నచ్చకపోయినా..........

రాజకీయం : రా - రాజ్యాంగబద్దంగా జ - జనానికి కీ - కీడుచేసే యం - యంత్రాంగం

Wandering thoughts : ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా...

నా రాతలు : నా సంతోషాలు, స్నేహితులు, మనుష్యులు, ప్రేమలు,ఇష్టాలు,చేతలు.... నా కధలు, వ్యధలు, బాధలు... నా కష్టాలు... నా అనుభవాలు, అవమానాలు...నా ఆలోచనలు..నాకు తెలిసిన నా ప్రపంచం...

రామ-చిలక-పలుకులు :నేను నచ్చిన, మెచ్చిన విశెషాల కలగూరగంప

'సత్య'శోధన : సత్వసాధనకు, సత్యశోధనకు సంగీతమే ప్రాణము - వేటూరి, శంకరాభరణం

సంభవామి యుగే యుగే : నా ఆలోచనలకు వర్చువల్ రూపం

గతంలో : నా రాతలు...

శేఖరీయం : "మనిషి తట్టుకోలేని భావావేశమే కవిత్వం,రచనలు". ........

స్మృతులు : ఈ బ్లాగోతం గురించి

శోధన : మదిలో రగిలే ఆలోచనల ప్రతి పదం ఇక్కడ కదనపు కదం కదం

వికటకవి : ఆ తెనాలి రాముడే స్పూర్తిగా…

THE INSIDER : నువ్వొక విషతుల్యమైన అమృతభాండానివి!

తెలుగు జోక్స్ (Jokes in Telugu)
: నవ్వడం ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం ఒక రోగం.

తెలుగు నేస్తమా... : తెలుగు నేస్తమా..తెలుగోడి గుండె చప్పుడు తెలుసుకో సుమా..

తెలుగు లో మీ ముందుకు...
: డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా తెలుగు వెర్షన్ TV యాడ్ కాదు, ..నా బ్లాగ్!!!

తెలుగు తీపి : తెలుగు జాతి మనది - నిండుగ వెలుగు జాతి మనది - అనన్య సామాన్యమైన భావ సంపద మనది - రండి - ఆస్వాదించండి..........

తెలుగు 'వాడి'ని : 'వేడి'ని ... 'నాడి'ని .. ఒక అక్షర వజ్రాయుధంగా, వజ్రాక్షరాయుధంగా

తెలుగు నేల : మానవజాతి మూడు వర్గాలుగా విభజింపబడి ఉంది: కదలలేని వారుగా, కదలగలిగే వారుగా మరియు కదిలేవారుగా - బెంజమిన్ ఫ్రాంక్లిన

telugu writings Somethings In TelugU... : తెలుగులో ఏవో...కవితల్లాంటి మాటలు...

రచ్చబండ : మా పల్లెలో మఱ్ఱిచెట్టు నీడలో మనసు విప్పి చెప్పుకున్న కబుర్లు

రేగొడియాలు : తీయ తీయగా.. కారం కారంగా..

త్రినేత్రం : మూడో కన్నుకు కనపడిన కలలు, కథలు

సిరివెన్నెల : … సీతారామశాస్త్రిని కాదు.

మయూఖ : ఒక అఙ్ఞానపు రేఖ

VIBRANT HCU ... వైబ్రెంట్ హెచ్.సి.యు
: జీవన గమనంలో మరువలేని జ్ఞాపకాల మజిలీ....అంతులేని సంతోషాల పందిరి.....HCU..................

వసుంధర : ఎన్నెన్నో భావాలు… కొన్ని తొలకరి జల్లులైతే మరికొన్ని భీకర తుఫానులు..

విన్నవీ కన్నవీ : తెలుగు బ్లాగులో వ్యూలు రివ్యూలు ప్రీవ్యూలు A Telugu Blog on Movies, Music and Books

విశాఖ సాంస్కృతిక కళా వైభవం : విశాఖ సంస్కృతి ని విఖ్యాతం చేయుటకు మేము చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమును అందరూ ఆదరిస్తారని ఆశిస్తు....ఈ విశాఖ సాంస్కృతిక కళా వైభవం అను ఈ సాంస్కృతిక పత్రిక ను విశాఖ కళా కారులకు అంకితమిస్తున్నాము.

విశాఖతీరాన : కాసేపు సరదాగా,కాసేపు తీవ్రంగా,అన్ని విషయాలు అనగా సినిమాలు, రాజకీయాలు, సాహిత్యం, వ్యవస్థ, ఇలా అన్ని విషయాల గురించి మాట్ల్లడుకుంటూ ముందుకు పోదాం.

జీవితంలో కొత్త కోణం : మంచిపనికైనా, లక్ష్య సాధనకైనా పట్టుదలతో కృషి చేస్తే చాలు. పేద,గొప్ప,వయసు తేడాల్లేకుండా విజయాలు వరిస్తాయి. ఇవి చదివి స్ఫూర్తి పొందండి. జీవితంలో కొత్త కోణాలను ఆస్వాదించండి.

మన తెలుగు వెలుగు : వేమన పద్యాలు, బాల గేయాలు, ఘంటసాల పాటలు

యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి : మడిసన్నాక కూసింత కలా పోసన వుండాలన్నారు బాపు-రమణ !!

నిజం : అయినా నిష్ఠూరం కానిది

వేమన : భోగియై, విరాగియై, యోగియై, చివరకు జీవ సమాధి పోందిన వేమన తన పద్యముల ద్వారా తెలుగువారికేకాక, యావత్తు ప్రపంచానికే ఎనలేని మేలు చేశారు, మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ-జీవాత్మ-పరమాత్మ సంబంధములతో సహ లోకరీతులన్నింటినీ తన పద్యములతో వేమన చాటి చెప్పినారు. ఆ పద్యముల సమూహారమే ఈ బ్లాగు.

అంతరంగం : నా ఆలోచనా తరంగాలు

:::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


22 వ్యాఖ్యలు:

Naveen Garla on Jan 9, 2008, 1:40:00 AM   said...

పూతరేక్స్ - కావాలా ఐతే తీస్కోండి మరి

http://gsnaveen.wordpress.com


తెలుగు'వాడి'ని on Jan 9, 2008, 7:21:00 PM   said...

నవీన్ గారు : మీ బ్లాగు - caption గురించి చెప్పినందుకు ధన్యవాదములు....మీ పూతరేక్స్ ఎక్కడో జారిపోయాయండి .. క్షమించండి ... కానీ మేము ఎప్పుడూ మీ బ్లాగు కొచ్చి తీసుకుంటూన ఉన్నామండి :-) ...


జ్యోతి on Jan 9, 2008, 8:04:00 PM   said...

గీతలహరి

పదములు తానే పెదవులు కాగా.. గుండియలే అందియలై మ్రోగ


Unknown on Jan 9, 2008, 9:21:00 PM   said...

కశ్యప్ గారి బ్లాగు టైటిల్ వెనుక ఒక చమత్కారముందండీ: ఆ బ్లాగు URL లోని kaburlu తో టైటిల్ ని కలిపి చదివితే "కబుర్లు...చెప్పాలని ఉంది" అవుతుంది. :-)


వింజమూరి విజయకుమార్ on Jan 9, 2008, 10:07:00 PM   said...

చాలా శ్రమ కోర్చి సేకరించారు. అభినందనలు యింకా కృతజ్ఞతలు. మీరు చెప్పేవరకూ ఈ 'కాప్షన్' ల గురించి నేనంతగా పట్టించుకోలేదు. కొన్ని బ్లాగుల కాప్షన్ లు చాలా సరదాగా ఉన్నాయి. ఉదాహరణకి 'మూడు బీర్ల తర్వాత', 'బ్లాగాగ్ని' వంటి బ్లాగుల కాప్షన్ లు. నా 'అభినయని' బ్లాగులో కాప్షన్ 'నా మానస పుత్రిక' నేను పెట్టింది కాదు. జ్యోతి గారు నన్ను కాదని బలవంతంగా మా పాప 'అభినయని' పేరుతో బ్లాగును, 'నా మానస పుత్రిక' కాప్షన్ ను ఆమె స్వంతం గానూ ఊహించి పెట్టారు. కనుక దీనికి సంబంధించిన క్రెడిట్ ఆమెకే దక్కుతుంది. మరోసారి కృతజ్ఞతలతో. . .


ramya on Jan 10, 2008, 5:35:00 AM   said...

కొత్తబంగారులోకం
Waiting for you


రాధిక on Jan 10, 2008, 9:20:00 AM   said...

ఇంత సమాచారంతో టపాలు రాయడానికి మీకు ఎంత సమయం పడుతుందండి?మీరు నిజం గా చాలా గ్రేట్.

నాపాత కేప్షన్ తీసేయమని కొందరు మిత్రులు సలహా ఇచ్చారు.అందుకే "నా నేస్తాలకి అంకితం " తీసేసాను.కొత్త కేప్షన్ కోసం చూస్తున్నాను.


తెలుగు'వాడి'ని on Jan 10, 2008, 10:56:00 AM   said...

జ్యోతి గారు, సుగాత్రి గారు, విజయకుమార్ గారు, రమ్య గారు, రాధిక గారు : ముందుగా ధన్యవాదములు అన్డ్ మరియు కృతజ్ఞతలు మీ వ్యాఖ్యలకు మరియు బ్లాగ్-కాప్షన్ తెలియజేసినందులకు..

విజయకుమార్ గారు : మొదటలో నేను ఏదో ఒకటో రెండో బ్లాగులే కదా అనుకున్నాను ... కొంచెం తీరిక చేసుకుని చూస్తే మీరన్నట్లు కొన్ని సరదాగా (ఉదాహరణకి 'మూడు బీర్ల తర్వాత', 'బ్లాగాగ్ని' 'సిరివెన్నెల' వంటి బ్లాగుల కాప్షన్ లు), కొన్ని వారి బ్లాగు టైటిల్ కు అచ్చుగుద్దినట్టుగా భావం వచ్చేలా ఉన్న కాప్షన్స్ (అక్షరవనం,అంతర్వాహిని,మానస వీణ), అలాగే మరికొన్ని చాలా భావుకతతో ఉన్నవి(అభినయని, గీతలహరి,!!! నా చిన్ని చిన్ని ఊహల చిరుజల్లు !!!)..It's always fantastic to see/read people and their nice gesture, giving credit where the credit is due.

మొత్తానికి మీ పుణ్యమా అని నా టపాకు ఒక దానికి 10/10 వచ్చింది :-) ప్రత్యేక ధన్యవాదములు.

రాధిక గారు : ఈ టపాకు సమయం వెచ్చించటానికి కారణం నేను ఈ టపాలో చెప్పినట్టుగా నాకు వీటిపై బాగా interest ఉండటం ఒక ప్రధాన కారణం ... ఇకపోతే ఇందులో విషయం అంతా ఆయా బ్లాగుల్లో నుంచి Copy/Paste అండి :-) కాకపోతే కష్టమల్లా జల్లెడలోకి వెళ్లి ప్రతి సైట్ తెరవటమే.

ఇప్పుడు ఇన్ని బ్లాగుల కాప్షన్స్ చూశారుగా...ఆలోచించండి...సరదాగానా, భావుకత్వంగానా, కవితాత్మకంగానా అన్నది .. మీ బ్లాగు కాప్షన్ కు..


వింజమూరి విజయకుమార్ on Jan 10, 2008, 10:11:00 PM   said...

రాధిక గారూ. 'నేస్తమా' బ్లాగుకి కాప్షన్ 'మనసుతోనే సుమా' అనో 'మానసంతోనే సుమా', 'సాహితీ సుమ హస్తమా' అనో అంటే బావుంటుందేమో చూడండి. ఏదో స్పాంటేనియస్ గా యిప్పటికిప్పుడు స్పురించినవి చెప్పాను. నచ్చకుంటే వదిలేయండి.


వింజమూరి విజయకుమార్ on Jan 10, 2008, 10:12:00 PM   said...

@రాధిక గారూ.

'నేస్తమా' బ్లాగుకి కాప్షన్ 'మనసుతోనే సుమా' అనో 'మానసంతోనే సుమా', 'సాహితీ సుమ హస్తమా' అనో అంటే బావుంటుందేమో చూడండి. ఏదో స్పాంటేనియస్ గా యిప్పటికిప్పుడు స్పురించినవి చెప్పాను. నచ్చకుంటే వదిలేయండి.


oremuna on Jan 11, 2008, 7:25:00 AM   said...

బాగా కష్టపడ్డారండీ

ఎంత కళాపోషన వెలకి తీసినారు!

యూ డిసర్వ్ ఏ క్రెడిట్

ఇలా అన్ని బ్లాగులనుండి ఏరి కూర్చడం ఎంత శ్రమంటే! నేను మొదలుపెట్టిన నెల నెల ఆణిముత్యాలు ఓపిక/టైం లేక మానేశాను :)


oremuna on Jan 11, 2008, 7:33:00 AM   said...

ఒరెమూనా
ఒరెమూనా ఒకటి రెండు మూడు నాలుగు

ఒరెమూనా
ఒరెమూనా ఒకటి రెండు మూడు నాలుగు


తెలుగు'వాడి'ని on Jan 11, 2008, 8:21:00 PM   said...

oremuna గారు....మీ వ్యాఖ్యకు ధన్యవాదములు మరియు మీరిచ్చిన క్రెడిట్ కు ప్రత్యేక ధన్యవాదములు ... నెల నెలా అంటే కష్టమే లేండి అందుకే దీనిని One Time Deal గా అనుకునే రాశాను ఈ టపా :-)

ఇన్ని రోజులకి ఒరెమూనా(కటి రెండు ,మూడు నాలుగు) అంటే ఏమిటో తెలిసింది మీ రెండో వ్యాఖ్య వలన ... మొదట కొన్ని రోజులు బుర్ర బద్దలు కొట్టుకున్నా ఏమిటి అని :-(


Unknown on Jan 11, 2008, 11:22:00 PM   said...

వావ్...
మీ ఓపికకు జోహార్లండీ బాబు.

చాలా మటుకు గమనించినా మళ్ళీ చదవడానికి సరదాగా ఉన్నాయి కాప్షన్లు.


తెలుగు'వాడి'ని on Jan 12, 2008, 9:38:00 AM   said...

ప్రవీణ్ గారు : ధన్యవాదములు....మీరన్నట్లు చాలా కాప్షన్ లు సరదాగా ఉన్నాయి...అలాగే మన తెలుగు వారిలో కాస్తంత కాదు కాదు చాలా ఎక్కువే ఉంది కళాపోషణ అ(క/వి)నిపిస్తుంది వీటన్నింటినీ చూస్తుంటే !!!


రానారె on Mar 3, 2008, 11:35:00 AM   said...

ఎంత ఓపిక!! కొన్ని బ్లాగులకు రంగులు వేరుగా వున్నాయి, దాని మతలబేమి తెలుగువాడా!? :)


తెలుగు'వాడి'ని on Mar 3, 2008, 3:47:00 PM   said...

రానారె గారు : ఓపిక ను నా అభిరుచి dominate చేయటంతో ఈ టపాను పూర్తి చేయగలిగాను.. మొత్తానికి ఇన్ని రోజులకు ఆ రంగుల గురించి ఒకరైనా ప్రశ్నించారు :-)...ఇక మీరడిగిన ప్రశ్నకు సమాధానం : అవి మొదటి సారిగా నేను ఆయా బ్లాగుల captions ను చదవగానే నాకు బాగా నచ్చినవి (red color)మరియు నాకు అత్యంత బాగా నచ్చినది ఆ blue color లో ఉన్న 'మూడు బీర్ల తర్వాత'...

అలాగే ఈ రంగుల గురించి నా టపాలో ప్రస్తావించటం మరియు 'అభినయని' బ్లాగుకి రంగు వెయ్యటం మర్చిపోయాను...మరలా మార్చుదాము అంటే వెంటనే కూడలిలో వస్తుందని ఆ పని చెయ్యలేదు.


Anonymous on Jan 13, 2009, 5:13:00 PM   said...

హాస్యం.. లాస్యం..STOP.SMILE.PROCEED


oremuna on Jan 29, 2009, 8:43:00 PM   said...

నెనింకా ఆ రంగులు ఉట్టినే వేశారు అనుకున్నాను.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting