తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 1

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, January 2, 2008

ఈ మధ్య చర్చావేదిక అనే బ్లాగ్ లో మన తెలుగు బ్లాగులకు మరియు టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా (బ్లాగుల బాగోగులు, ఔనేమో?కాదంటారా?, చర్చావేదిక కు స్వాగతం) అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరగడం చూసాను/చదివాను. అక్కడ నేను నా వ్యాఖ్య వ్రాయడం కన్నా నా ఆలోచనలన్నిటినీ క్రోడీకరించి/ప్రోదిచేసుకొని, మధించి, విశ్లేషించి విపులంగా ఒక కొత్త పొస్ట్ వ్రాస్తేనే మంచిది అని నాకు అనిపించిన ఆలోచనలకు అక్షర రూపమే ఈ క్రింద నేను వ్యక్తపరచినవి. కానీ ఆలోచించటం మొదలు పెట్టి వాటిని కాగితం మీదకు ఎక్కించే క్రమంలో చెప్పవలసింది/చెప్పగలిగింది చాలా ఉన్నట్టు అనిపించినందువలన దీనిని రెండు/మూడు భాగాలుగా విడగొట్టి ప్రచురించవలసి వస్తుంది. కనుక అందులోని మొదటి భాగమిది...అలాగే మిగిలిన భాగాలను సాధ్యమైన్నంత తొందరలోనే అంటే వెనువెంటనే ప్రచురించుటకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను

ముందుగా అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను ప్రసాదించాలనీ మరియు మీ ఆశలు, ఆశయాలు, ఊహలు, లక్ష్యాలు, కోరికలను సాధించే స్థైర్యాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని, అవకాశాలను కల్పించేలా ఆ దైవం మీకు శుభాశీస్సులను అందించాలని కోరుకుంటున్నాను.

కూడలి లో మార్పులు:


ఈ తెలుగు బ్లాగ్ప్రపంచంలో నేను మూడు నెలల పసివాడిని కనుక కూడలి గురించి నేను ఈ కింద చెప్పిన మార్పులు/చేర్పులు ఒక వేళ ఇంతకు ముందే ఉండి వాటిని మార్చగా ఏర్పడినది ఈ కొత్త కూడలి అయితే ముందుగా క్షంతవ్యుడను (మరలా వెనుకకు వెళ్లేలా ఇవి ఉన్నందుకు) తదుపరి అగమ్యగోచరమే (ఇక చేయుటకు ఏమున్నదబ్బా అని)

Home/Main Page :

మనకు (ముఖ్యంగా నాకు) వచ్చే హిట్లలో ఎక్కువగా కూడలి నుంచే అందులోనూ ముఖ్యంగా Home/Main Page లో నుంచే వస్తున్నాయి. అలాగే కూడలిలో ఉన్న వేరే Pages అంటే బ్లాగ్స్ మరియు రాజకీయాలు లో నుంచి వచ్చే హిట్లు చాలా తక్కువగా ఉంటున్నాయి అలాగే వ్యాఖ్యల Page నుంచి కొంచెం ఫర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి అలాగే మిగతా సైట్స్ లేక మార్గాల నుంచి కొన్ని అలాగే direct వచ్చేవి మరి కొన్ని కనుక ..........

నా అభిప్రాయం ప్రకారం మనకు హిట్స్ రావటానికి కూడలి ఎంత బాగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే అలాగే మన టపాలు ఇంకా ఎక్కువ మందికి చేరకపోవటానికి కారణం మన టపాల జీవిత కాలం కూడలి మొదటి Page లో అతి తక్కువగా ఉండటమే అందుకే మనం కూడలి Home/Main page పూర్తిగా మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.

నాకు ఈ అభిప్రాయం కలగటానికి ప్రధానమైన కారణం :


నేను December నెల మొదటిలో రెండు టపాలను(అరుదైన పి.వి నరశింహారావు గారి చిత్రములు మరియు కార్టూన్స్ మరియు గత కొద్దికాలంలో నే చూసిన అధ్బుతమైన, సృజనాత్మకమైన వ్యాపార ప్రకటనలు) 'Miscellaneous' అనే Label పేరుతో ప్రచురించాను(ఆ సమయంలో దానికి సరి అయిన తెలుగు పదం తట్టలేదు). కానీ నా బ్లాగ్ లో ప్రేరణ అనే విభాగంలో నేను ఈ తెలుగులో బ్లాగాలనే కోరికకు ప్రధాన కారణం సాధ్యమైనంత ఆంగ్ల పదాల వాడుక తగ్గించాలని .. కానీ అది చేయలేక పోయినందుకు అప్పటినుండి నన్ను నేనే తిట్టుకుంటూ ఉన్నంతలో ఒక రోజు చచ్చేంత కోపం వచ్చి కనీసం ఏదో ఒక తెలుగు పదం పెడదామని 'అవీ-ఇవీ' అనే Label గా మార్చాను కానీ ఈ మార్పుకే అది కూడలిలో మరలా వచ్చేసింది. ఈ రెండు టపాలు 20 రోజుల పాతవి అయినా కూడా వాటికి మరలా ఒక 25 హిట్స్ మరియు రెండు వ్యాఖ్యలు కూడా వచ్చాయి ..... అంటే కూడలి మొదటి Page లో మన టపా తెలుగు బ్లాగ్ప్రపంచలోని చదువరులు/పాఠకులు అందరికీ చేరటానికి కావలసినంత జీవితకాలం ఉండటంలేదు అని అర్ధం అవుతుంది నా వరకు.

నేను అలోచించిన మార్పులు/చేర్పులు :

1. విడివిడిగా టపాలను చూపడం కన్నా బ్లాగ్ ని బట్టి టపాలను సమూహం(Group) గా చేసినట్లైతే మొదటి Page లో ఇంకా ఎక్కువగా టపాలను చూపించటానికి, మరియు ముందువి/పాతవి అయిన టపాలు తొందరగా కనుమరుగు కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇలా చేయకపోవటం వలన ఏమౌతుందో అనే దానికి ఒక మంచి ఉదాహరణకు ఈ కింద ఉన్న image ని చూడండి. (ఒక రకంగా ఇది తేనెగూడు లో ఇప్పటికే ఉన్నది).

2. ఒక 30 టపాలను మాత్రమే చూపించే బదులు ఆ సంఖ్యను ఇంకా బాగా పెంచవలసిన (అంటే ఒక 100 వరకు) అవసరం ఉంది అనిపిస్తుంది .... కావాలంటే Vertical Scrollbar ఉపయోగించి అయినా సరే.

3. అలాగే పైన చెప్పినట్టు ఒక 30 టపాలకే పరిమితవకుండా గత వారం రోజులవి అయిన చూపించేటట్టుగా ఉండాలి .. ఒక ఏడు Boxes లాగా లేదూ స్థలాభావం అనుకుంటే తేది ని ఒక Drop-Down లో చూపించి తేదీని బట్టి కింద టపాలు చూపించవచ్చు.

4. గత మూడు నెలలలో కనీసం ఒక 10 టపాలన్నా (ఏదో consistent గా టపాలు రాస్తున్నారు అనే criteria కోసం అంతే) రాసిన వాటిలో నుంచి random గా ఒక 12 బ్లాగ్స్ ని select చేసి వారంలో ఒక మూడు రోజులు నాలుగు బ్లాగుల చొప్పున ... పైన మరియు కింద 3 బ్లాగులు రెండు వరుసలలో చూపించాలి.

5. ఇంతకు ముందే చెప్పినట్టు మనకు కూడలి వ్యాఖ్యల page నుండి కూడా మనకు చాలానే హిట్స్ వస్తున్నాయి కాబట్టి దానిని కూడా మార్చవలసిన అవసరం ఉంది. ఒక టపాకు సంబంధించి వచ్చిన వ్యాఖ్యలను విడివిడిగా చూపించే బదులు వాటిని ఒక సమూహంగా చేసి, దానిలో తాజాగా వచ్చిన ఒకటో రెండో వ్యాఖ్యలను చూపి మిగతా వాటిని expand/collapse format లోకి మార్చవచ్చు.

RSS Feed :

నేను మన OreMuna బ్లాగ్ లో చూసిన కూడలి RSS Feed (http://www.koodali.org/rss20.xml) (అందులో నుంచి నాకు కొన్ని హిట్స్ కూడా వచ్చాయి) లో కూడలి మొదటి page లో కనిపించే టపాలన్నీ కనిపిస్తాయి. కనుక మొదటిగా మన మందరిమీ మన బ్లాగుల్లో ఒక కొత్త Page Element జత చేసి ఈ కూడలి RSS Feed ని చూపించాలి. మరీ ముఖ్యంగా మరి కొన్ని కొత్త RSS Feeds తేది, దిన, గత కొన్ని రోజులవి మరియు విభాగానికి సంబంధించి తయారు చేసుకొని మన బ్లాగుల్లో చూపిస్తే బాగుంటుంది.

అలాగే తేనేగూడులో కుడి వైపున చూపించే 'ఈ వారము మరియు గత కొద్ది నెలలలో ఎక్కువగా చూసిన పుటలు' వీటికి విడివిడిగ కానీ లేక అన్నిటికీ కలిపి ఒక RSS Feed ఉంటే మన బ్లాగుల్లో వీటిని చూపించడం చాలా సులభమవుతుంది.News Letters :

మనకు ఉన్న అన్ని తెలుగు బ్లాగ్ aggregator's సైట్స్ (కూడలి , జల్లెడ , తేనెగూడు మరియు తెలుగుబ్లాగర్స్ మొదలగునవి) వెనువెంటనే దిన/వార/మాస వార్తాఉత్తరాలకు అవకాశం కల్పించవలసిన అవసరం ఉంది. మనం E-Mail అడిగేటప్పుడు వారికి ఏ విభాగానికి(సినిమా, రాజకీయాలు, హాస్యం, సాహిత్యం మొదలగునవి) సంబందించి ఉత్సుకత ఉందో తెలుసుకొని అలాగే వారికి దిన, వార, మాస గా ఎలా కావాలి అంటే అలా పంపించే ఏర్పాటు చేయాలి. అలాగే ఈ వార్తాఉత్తరాలలో అన్ని టపాలు ఇవ్వాలా వద్దా అని మనం చర్చించుకోవటం మంచిది.(నా వోటు మాత్రం అన్నీ ఇవ్వకుండా ఒక 40 లేక 50 ఇచ్చి మిగిలిన వాటి కోసం 'మిగతా వాటి కొరకు' అనే ఒక లంకె ఇచ్చి అది క్లిక్ చేయగానే ఆ aggregator సైట్ లో ఆ విభాగానికి సంబంధించిన page కి redirect చేస్తే మంచిది.)

Contribution or Money Generation :

నేను పైన చెప్పిన సూచనలు/సలహాలు/మార్పులు/చేర్పులకు సంబంధించి మన బ్లాగులోకంలోని మిత్రులందరి మేధోమధనం జరిగిన తరువాత ఒకవేళ మనకు ఆచరణయోగ్యమైన/అనుసరణీయమైన/చేయదగ్గ ఒక లిస్ట్ తయారు అయ్యి, దానికి ప్రస్తుతం కూడలిని నిర్వహించే వీవెన్ గారి సమయము, శక్తి సామర్ధ్యాలకు తోడు ఇంకా ఎక్కువ resources కావలసి వస్తే (ఖచ్చితంగా కావలసి వస్తాయని నా ఉద్దేశ్యము) అందుకు మనమంతా contribute చేయవలసి వస్తే (చేస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం) నన్ను మొదటిగా లెక్క పెట్టుకోవటానికి మీకు ఎలాంటి సందేహాలు వద్దు అని చెప్పగలను.

ఒకవేళ ఈ contribution/donation అనే సలహా మీకు నచ్చక పోతే మనమందరం కలసి కట్టుగా చేయగలిగినది మరి ఒకటి ఉన్నది. మనమందరం సంప్రదింపుల కొరకు ఎవరినో ఒకరిని (ఉదాహరణకు వీవెన్ గారు) పెట్టుకొని వివిధ తెలుగు Web Sites లో (TeluguOne.com, AndhraVilas.com, IdleBrain.com, Eenadu.com, Andhrajyothy.com, Vaarttha.com మొదలగునవి) ప్రకటనలను(RealEstate, S/W Training, Movies etc) ఇచ్చే వారితో మాట్లాడి అవే ప్రకటనలను ఒకే సారి మనం మన తెలుగు బ్లాగ్స్ అన్నింటినీ (కుడి ఎడంగా ఒక 200-350 బ్లాగ్స్ దాకా ఉండొచ్చు regular update చేసేవి మరియు statistics చూపించేవి) ఒక సమూహంగా represent చేసి చూపించగలందులకు పైన sites కి ఇచ్చినంత ఇవ్వకపోయినా దానిలో ఎంతో కొంత ఇచ్చినా మనకు సరిపోయినంత రావచ్చు అని నా అభిప్రాయం. ఖచ్చితంగా పైన పేర్కున్న సైట్స్ తో మన తెలుగు బ్లాగ్స్ ని compare చేసుకోలేము గానీ ఒక సమూహంగ మనం ఎంతో కొంత గట్టి బలమైన శక్తిగానే అనిపిస్తాము అని నా అభిప్రాయము ... అదీ కాక మనం ఒకే సారి రెండు, మూడు వందల బ్లాగుల్లో ఏకకాలం చూపిస్తున్నాము కనుక అది కూడా ఒక advantage అయ్యే అవకాశాలే ఎక్కువ మరియు సమూహమైనప్పుడు 250 బ్లాగ్స్, average monthly హిట్స్ 1000 = 250, 000 హిట్స్ a month ఇలా చూసుకుంటే చాలా పెద్ద సంఖ్యగా అనిపించటం లేదా! అలాగే ప్రకటనలు చూపిస్తున్నాము కదా అని మన బ్లాగుల్లో కుప్పలు తెప్పలుగా చూపించకుండా ఒక 5 నుండి 10 ప్రకటనలకు పరిమితం(top 2, sides 3+3, bottom 2 and if it's Ok we can show 2+2 above and below each post) మరియు మన ప్రకటనల సమయాన్ని కూడా కొన్ని నెలలకు అంటే మనం అనుకున్నంత డబ్బులు రాగానే అపేయవచ్చు. ఇది అందరికీ అమోదయోగ్యమయితే మనం ఉత్సాహం ఉన్న బ్లాగ్గర్స్ పేర్లు తీసుకోవటం మొదలు పెట్టవచ్చు.

నా ఈ పై ఆలోచనకు ఇంకొక ప్రధమ కారణం ఏమిటి అంటే, ముందు ముందు మన ఈ తెలుగు బ్లాగ్స్ కి అంతో ఇంతో ఆదాయాన్ని ఇవ్వగలిగిన వాటిగా మార్చాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కూడలి లాగే మనకు ఒక 'Advertisement Platform' అవసరం అవుతుంది ... దాని కోసం మనం మీ బ్లాగ్, వెబ్ పుటల నుండి ఆదాయం గడించండి లేక Chitika eMiniMalls లేక ఇంకొక దాని మీద ఆధారపడే బదులు ఈ చిన్ని ప్రయత్నమే మనకు గొప్ప మార్గదర్శకం అవుతుంది లేక అవ్వచ్చు అని నా ఊహ.

Eenadu Internet Ad-Tariff :TeluguOne Ad-Tariff :Vaarttha Internet Ad-Tariff :...................................................

ఇంకా నేను cover చేయాలి అనుకుంటున్న విషయాలు ... ఈ క్రింద వాటి అన్నింటికీ Data అంతా సిధ్ధంగానే ఉన్నది ... మిగిలిపోయిందల్లా తెలుగులోకి మార్చడమే

  • Expandable Posts
  • Popularity Meter
  • Blogs/posts liked/visited List
  • Summary of Post
  • Single Theme
  • Feedburning
  • Publicize
  • Rating
  • Comments
  • Complete Profile
వీలైతే మిగిలిన వాటిని ఇంక ఒకే టపాలో పూర్తి చేయటానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను కానీ చెప్పవలసింది ఇంకా చాలా ఉన్నది (ఇందులోవి మీ అందరికీ చాలా వరకు తెలిసినవే అయినా అన్నీ ఒక చోట ఉండేలా చేద్దామనే నా ఈ ప్రయత్నం)...

ఈ టపాకు ఉన్న Title ను బట్టి మరియు పైన చెప్పిన దానిని బట్టి, దీనికి రెండో భాగం ఉంటుందని తెలుసు కాబట్టి ఆ రెండో భాగాన్ని మీరు ఇక్కడ చదవవచ్చు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::విషయ సూచికలు :


8 వ్యాఖ్యలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on Jan 2, 2008, 1:14:00 AM   said...

అద్భుతం మీ విశ్లేషణ చాలా బాగుంది.ఆచరణలో ఏమేరకు సఫలమవుతుందో పెద్దలు,నిపుణులు చెప్పాలి.వీవెన్ మీదే ఎక్కువ భారం వేసే బదులు టెకి నిపుణులు కొందరు పాలుపంచుకోవచ్చు.మీరు ఏదో క్లుప్తంగా ముగించొద్దు.వివరంగా రాయండి


netizen on Jan 2, 2008, 4:33:00 AM   said...

సాధ్యాసాధ్యలు ఆలోచించాలి! రేపు ఆదివారం దీన్ని గురించి చర్చించవచ్చేమో చూడండి!


తెలుగు'వాడి'ని on Jan 5, 2008, 5:59:00 PM   said...

ముందుగా రాజేంద్ర, netizen గార్లకు హృదయపూర్వక ధన్యవాదములు ...

కనీసం మీరిద్దరైనా ... ఒకరు అధ్బుత విశ్లేషణ అని, ఆచరణలో సఫలమవుతుందా అని చర్చించాలనీ, మరొకరు సాధ్యాసాధ్యాలు ఆలోచించాలనీ .. చెప్పి(తెలియజేసి)నందులకు నిజంగా అభినందనీయులు.

చూడబోతే, మార్పులు-చేర్పులతో కూడిన నా ఆలోచనల టపాకు, మీ ఇద్దరి వ్యాఖ్యలకు ... స్పందన శూన్యం కనుక ఇంతటితో దీనిని (కనీసం ప్రస్తుతానికి) వదిలివేస్తున్నాను...కాకపోతే ముందు ముందు అయినా ఇంతకు మించి ముందుకు పోతుందనే ఆశ అయితే నాకు లేదు .....


రవి వైజాసత్య on Jan 5, 2008, 10:01:00 PM   said...

చాలా బాగా ఉంది .. నాకు నచ్చింది :: నలుగురికీ చెప్పదగిన బ్లాగు/టపా(6 to 9 out of 10)
కాస్తాగండి మహాప్రభో..dont jump to quick conclusions తిరిగివచ్చి సవివరంగా రాస్తా


Anonymous on Jan 5, 2008, 10:56:00 PM   said...

క్లుప్తంగా రాయవద్దనే, నేను ఆగా. కానీ అదెప్పటికీ జరగదేమో అని రాసేస్తున్నా.

కూడలికి మెరుగులద్దడంలో మరింత మంది పాల్గొనడానికి నేను ఫ్లాట్‌ఫారం సిద్ధం చేయాలి.

మీరు చెప్పిన కొన్ని మార్పులు చెయ్యడానికి కూడలి యొక్క ప్రస్తుత నిర్మాణాకృతి సరిపోదు. దాన్ని పూర్తిగా కొత్తగా నిర్మించాలి. వీచారకరంగా, ఇది చాలా సమయం తీసుకుంటుంది. వివరమైన ప్రణాళికని త్వరలో ప్రకటిస్తా.


Anonymous on Jan 5, 2008, 11:29:00 PM   said...

క్లుప్తంగా రాయవద్దనే ఆగా. కానీ వివరంగా రాయడం కుదిరేలాలేదు.

కూడలికి మార్పులు:
కూడలి ప్రస్తుత నిర్మాణాకృతిలో కొత్త విశేషాంశాలు జోడించడం కుదరదు లేదా చాలా కష్టం. దాన్ని పూర్తిగా మార్చే ఉద్దేశం ఉంది. మరింత మంది కూడలి నిర్మాణంలో పాల్గొనేలా చేయడానికి ముందుగా ఓ ఫ్లాట్‌ఫాం సిద్ధం చేయాలి. ఇదంతా చాలా పెద్ద తతంగం, చాలా సమయం పడుతుంది.

ఇతర సూచనలు:
మీరు చెప్పిన ఇతర సూచనలు కూడా అందరూ పాఠిస్తే మంచిది.

ఈ రోజు సమావేశంలో దీన్ని ప్రస్తావిస్తా.


తెలుగు'వాడి'ని on Jan 6, 2008, 3:37:00 PM   said...

రవి గారు, వీవెన్ గారు : ముందుగా ధన్యవాదములు.

రవి గారు : సరే ఆగిపోయామండి మీరు ఆగమని చెప్పినందుకు :-) మరియు మీరు తిరిగి వచ్చి సవివరంగా వ్రాస్తారని చెప్పిన మాట మీద గౌరవం(నమ్మకం)తో ... ఎదురు చూస్తున్నామని మాత్రం మరచిపోకండి !

వీవెన్ గారు : ఈ టపాలో చెప్పినట్టు నేను ఈ తెలుగు బ్లాగ్ప్రపంచంలో మూడు నెలల పసివాడిని కనుక ఈ కూడలి ప్రస్థానం గురించి, నిర్మాణ/నిర్వహణ ల గురించి తెలిసింది చాలా తక్కువనే చెప్పాలి.

కొత్త పాళీ గారి వ్యాఖ్య కు నా స్పందన లో కొంత ఇక్కడ ఇస్తున్నాను...
"మన బ్లాగులకు మరో వంద రెట్లు పాఠకులను పెంచుకునే క్రమంలో కూడలిని కూడా తీసుకువెళ్లాలి....ఈ క్రమంలో మాత్రం వీవెన్ గారి పై అతి తక్కువ భారం పడేలా చూడాలి మరియు లేఖిని స్వాంతనతో, కూడలి నీడన ఎదుగుచున్న ఇప్పుడే మొలిచిన మొక్కలలాంటి మన బ్లాగులు వటవృక్షాలై తీయని ఫలాలను అందించే సమయాన తొలి ఫలం కూడలి/లేఖిని కి అందేలా మనం చేసే ప్రయత్నాలుండాలి."

Please come up with a solid and long-term plan and see how we all can give you a best hand(money, time, resources, discussions, technical help etc) to take it to the new heights and should be good enough to accommodate future requirements and/or easily portable to new infrastructure.

Good luck and all the best.


శరత్ on Jul 28, 2008, 2:38:00 AM   said...

మీరు చెప్పిన వాటితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting