స్టెఫీ గ్రాఫ్ - నా అభిమాన టెన్నిస్ తార

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, February 18, 2009

నాకు మొదటి నుంచీ ఏడుపు గొట్టు సీరియల్స్, కుటుంబ (అను)బంధాలు, వైషమ్యాలు, వాళ్ల బొంద వాళ్ల బోలె, అందులోనూ వీళ్లు జత చేసే హై/మెలో డ్రామా అవీ చూడటమంటే మా చెడ్డ చిరాకు ..

మరి టివి అంటూ ఉంటే మరి ఏదో ఒకటి చూడాలి కదా .. అలా అలా ఆ రోజుల్లో చిత్రలహరి, అప్పుడప్పుడూ వచ్చే ఆదివారం తెలుగు సినిమా లాంటి కార్యక్రమాలు చూసే రోజుల్లో నాకు మెల్లమెల్లగా ఈ ఆటల మీదకు బాగా మనసుపోయింది .. అందుకు ప్రధమ కారణం మనం చూసేటప్పుడు ఊహించటానికి అతి తక్కువ అవకాశాలు ఉండటమే అంటే ముందు ఏమి జరుగుతుందో/జరగబోతుందో తెలియదు కాబట్టి చివరి వరకు ఉత్కంఠగా ఉంటుంది .. వచ్చిన ఏ సినిమాను వదిలి పెట్టకుండా చూస్తూ ఉంటే .. అందులోనూ మన తెలుగు సినిమా కధాక్రమం, ముగింపు అన్నీ ఎలా ఉంటాయో తెలిసిందే కదా ... అన్నీ అలా కళ్లకి కట్టినట్టుగా కనపడుతుంటే అంటే తరువాతి దృశ్యం ఏమిటో అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా ...

క్రికెట్ చూడకపోతే (కొద్దిగా, ఆడకపోతే కూడా) అదో పెద్ద నేరం అన్నట్టు ఉండేది కాబట్టి క్రమం తప్పకుండా అంటే ఏ  match వదిలి పెట్టకుండా చూస్తూ ఉండటం అలవాటు అయిపోయింది .. మరి మ్యాచెస్ లేనప్పుడు ఏమి చెయ్యాలి అని గోళ్లు గిల్లుకుంటున్నాప్పుడు హఠాత్తుగా ఈ టెన్నిస్ మన కంట్లో పడింది ... పడటం కూడా అలాంటి ఇలాంటి ప్లేయర్ కాదు .. స్టెఫీ గ్రాఫ్ .. ఇక అంతే ... తన మ్యాచ్ అంటే మనం టివి సెట్స్ కి పూర్తిగా అతుక్కుపోవటమే ... అందమొక్కటే కారణమా అంటే ఖచ్చితంగా కాదు .. కాకపోతే మొదటి కారణం మాత్రమే సందేహమే లేదు. ఆ రోజుల్లో చాలా మందికి సబాటిని నచ్చేది మరి ... కానీ నాకెందుకో అంతగా ఎక్కలా .. స్టెఫీ అందం ముందు దిగదుడుపులాగా అనిపించటమేమో ...

అసలు ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు రావటానికి కారణం ఏవో పాత వీడియోలు చూస్తుంటే స్టెఫీ గ్రాఫ్ కు సంబంధించిన ఈ వీడియో కనపడింది.

Will you marry me?

or



Spontaneous గా తను స్పందించిన తీరు చూస్తే అబ్బురమనిపించక మానదు.

తన అసాధారణం, అధ్భుతమైన ప్రతిభతో అప్రతిహతంగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న రోజులు .. ఆ ప్రతిభ కు తోడైన అందం నన్ను నిజంగా కట్టిపడేశాయి.

తను ఒక్క పాయింట్ పోగొట్టుకున్నా ఎంత బాధ వేసేదో .. అలాంటిది అప్పుడే కొత్తగా వచ్చిన మోనికా సెలెస్ చేతిలో తరచుగా ఓడిపోతుంటే తట్టుకోవటం తనకు ఎలా ఉండేదో మాకైతే నిజంగా నరకప్రాయమే ..

స్టెఫీ గ్రాఫ్ గురించి పూర్తి వివరాలకు లో ఉన్న ఈ వికీపెడియా ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ నేను చూసిన/చదివిన వాటిల్లో సాధ్యమైనంత సవివరంగా ఉన్నది అంటే అతిశయోక్తి కాదేమో ..
 ..........................................................



విషయ సూచికలు :


6 వ్యాఖ్యలు:

Rajendra Devarapalli on Feb 18, 2009, 10:07:00 PM   said...

మీ మొదటి పేరాగ్రాఫు నాకు బాగా వర్తిస్తుంది,కానీ నాకు సబాటిని అంటే(ఇప్పటికీ) పిచ్చ :)
ఏది ఏమైనా వివరాలు/లింకులు/లంకెలు ఇవ్వటం లో మీకు మీరేసాటి.అవును ఈమధ్య బొత్తిగా నల్లపూసయ్యారేమండి??


Anil Dasari on Feb 19, 2009, 11:14:00 AM   said...

నాకు టెన్నిస్ తారలంటే పిచ్చేమీ లేదు కానీ అప్పట్లో మీరన్నట్లు సబటినీకే పంకాలు ఎక్కువుండేవి. స్టెఫీ నిస్సందేహంగా మంచి ఆటగత్తే, కానీ అందగత్తె అంటే .. hmm. కొంత మగరాయుడి లక్షణాలుండవూ? ఎంతైనా జర్మన్ కదా.

ఈ మధ్య క్రీడల మీద పడ్డారేమిటో? అందునా ప్రత్యేకించి టెన్నిస్ పైన. అందులోనూ టెన్నిస్ భామల పైన. ఏంటి కత?


సిరిసిరిమువ్వ on Feb 19, 2009, 11:19:00 PM   said...

నాకూ సబటిని అంటే వీరాభిమానం. అప్పట్లో టెన్నిస్ చాలా ఆసక్తిగా చూసేదాన్ని. సబటిని, స్టెఫిల తరం అయిపోయాక అంతగా చూడటం లేదు. అవునూ ఏంటి కత?

మీ సుదీర్ఘ వాక్యాలు చదవక చాలా రోజులయిందండి:)


Unknown on Feb 20, 2009, 10:36:00 PM   said...

మీ సంగతేమో కానీ నేనయితే టెన్నిస్ తారల అందానికే దాసోహం.

నా వాల్‌పేపర్లు ఎప్పుడూ వారివే. (కాలేజీలో ఉన్నప్పుడు anna kaournikiva, ఇప్పుడు maria sharapova, ana ivanovic వగైరా..) :-)


admin on Sep 9, 2009, 5:17:00 AM   said...

saradaagaa Google-Telugu lo Steffi Graf ani type chesaanu.

naaku nijangaa chaala happy gaa anipinchindi.

Online lo Telugu-Steffi abhimaanulu vunnaduku.

naa varakaithe kevalam tennis matrame istam,adi kooda steffi tennis ante pratyekam.

naa varaku naaku she's best of all players.

also see mys site, http://stefaniemariagraf.blogspot.com

and http://rkm-writes.blogspot.com


Anonymous on May 23, 2013, 1:27:00 AM   said...

తరచూ ఎక్కడ ఓడిపోయిందండీ? అవును సబాటిని, స్టెఫీ ల కున్న అభిమానుల సంఖ్య ముందు ఇప్పటి షరపోవా, కౌర్నికోవా కూడా తక్కువేనేమో!


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting