కంటి చూపుకే చస్తారు : బాలయ్య !?

Posted by తెలుగు'వాడి'ని on Sunday, February 1, 2009

ఈ రోజు అన్ని మాధ్యమాలలో వచ్చిన వార్త ఇది ..

....................తాను మీసం మెలేసి, కన్నెర్ర చేస్తే ఆ కంటి చూపుకే రాష్ట్ర ద్రోహులంతా చస్తారని ఆయన తొడకొట్టి హెచ్చరించారు.

::::::::::::

మీసాలు, కళ్లు, తొడలు అయిపోతే ... ఆలస్యం చేయకుండా నా గన్ బయటకు తీస్తా ... 

                  [ కాకర్ల సుబ్బారావు గారికి ఫోన్ చేయటం మరచిపోనులేవయ్యా ... 

                                  అట్లాగే 
                    ఆల్రెడీ వసుంధరకి సాక్ష్యాలు మాయచేయటం గురించి కూడా గుర్తుచేసేశా.  ]


ఎగస్పార్టీ లో వాళ్లు అన్న ముక్క ఈయన చెప్పటం మర్చిపోయాడో లేక ఈ మాధ్యమాల వాళ్లు రాయలేదో గానీ ...  

           [ పనిలో పని బాబు వగైరాలు  కూడా ఒకదారి అయిపోతే ఇక ఆ కుర్చీ మనదే అనుకుంటున్నాడో ఏమో  ]

ఏది ఏమైనా రాజకీయంలో ఉన్న వాళ్లు బాలయ్య బాబుకు .. కనుచూపు మేరలో సంగతి దేముడెరుగు గాని, ఖచ్చితంగా గన్ రేంజ్ లో మాత్రం ఉండకూడని రోజులు వచ్చాయి ..

 ***************                  తస్మాత్ జాగ్రత్త           ******************విషయ సూచికలు :


6 వ్యాఖ్యలు:

Anonymous on Feb 1, 2009, 8:55:00 PM   said...

మా బాగా చెప్పారు.
కాకర్ల సుబ్బారావు.......???


జ్యోతి on Feb 1, 2009, 10:23:00 PM   said...

నిన్న రాత్రి అన్నం తింటూ ఈ వార్త టీవిలో విని నాకైతే పొలమారింది. మావారికి చెప్పా.. ఇదేం చూపు.. ఛానెల్ మార్చండి అని.ప్రజలను అంత వెదవలనుకుంటున్నారా అర్ధం కాదు.. ufffffffffff...


Bhaskar on Feb 3, 2009, 5:20:00 AM   said...

బాలయ్యకున్న రాజకీయ అనుభవం చాలా ఎక్కువ. రామారావు గారితో రాజకీయ వేదికల పై ప్రసంగించిన అనుభవం ఉంది.


అబ్రకదబ్ర on Feb 3, 2009, 10:01:00 AM   said...

దేశద్రోహుల గురించి వినున్నాం. రాష్ట్రద్రోహులెవరు కొత్తగా?


Anonymous on Mar 17, 2009, 11:49:00 AM   said...

rastra drohulu telidaaa ........ roju e madya TV lo gola pedthunnaru na bus na bus ani .....


Anonymous on Mar 18, 2009, 10:29:00 AM   said...

balakrishna eyes donate chesadu antaa..... ika andaru upiri pilchukovachu. Inko gud news gun lo bullets levanta.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting