జగన్ సాక్షి : రేటు పెంచటం ఎందుకు? ఏం జరుగుతోంది?
ఈ రోజు మొదటి పేజ్ లో 'ఏదో ఏదేదో చాలా' చెప్పేసి ఒక్క అర్ధరూపాయి మాత్రమే పెంచుతున్నాము అని చావు కబురు చల్లగా చెప్పారు జగన్ గారు ....
ఈ సాక్షి పత్రికలో గత కొద్ది రోజులుగా వచ్చిన మార్పుల గురించి ఇంకొక టపాలో చర్చిద్దాం ..
ప్రస్తుతానికి పెంచిన ధర గురించి మాట్లాడదాం.
"ఈనాడు" circulation కుడి ఎడంగా ఒక 12 లక్షలు ఉంటుంది అధికారిక లెక్కల ప్రకారం .. సరే ఈ సాక్షి దానిని అధిగమించినా/మించకపోయినా కనీసం ఆ సంఖ్యను చేరుకుంది అనుకున్నా కూడా .....
ఇప్పుడు పెంచింది 50 పైసలు ...
పెంచకపోతే రోజు వారీ భరించవలసిన నష్టం : 12 లక్షలు * 0.50 = 6 లక్షలు
నెలకి : 30 * 6 లక్షలు = ఒక కోటి 80 లక్షలు.
ఒక నాలుగు అయిదు నెలలలో ఎన్నికలు అయిపోవటం .. కొత్త ప్రభుత్వం/ముఖ్యమంతి ఎవరో తెలిసిపోతుంది ..
ఎవరొచ్చినా ... ఈ లోపు అంటే ఒక అయిదు నెలలలో రమారమి ... 5 * ఒక కోటి 80 లక్షలు = 10 కోట్లు
ఇప్పటి వరకు వచ్చిన పుంఖానుపుంఖలంగా ప్రచురించిన అవినీతి వార్తలను బట్టి చూసినా లేక జగన్ కున్న కొద్దో గొప్పో ఆస్తులను బట్టి చూసుకున్నా .. 10 కోట్లు భరించలేడా ? అంటే నష్టాలు చూపిస్తే నిజంగా కొంపలు మునిగిపోతాయా?
ఏం జరుగుతోంది?
10
వ్యాఖ్యలు:
- Anonymous on Jan 8, 2009, 10:10:00 AM said...
-
చివరికి పుచ్చొంకాయల ధర కూడా పెంచేస్తున్నారన్నమాట!
- చదువరి on Jan 8, 2009, 10:12:00 AM said...
- This comment has been removed by the author.
- Anil Dasari on Jan 8, 2009, 10:40:00 AM said...
-
ఏం జరుగుతుందో మనకెందుగ్గానీ ..
ఎన్నాళ్లకెన్నాళ్లకి పునర్దర్శనం!?! ఏం జరిగింది?
- Anonymous on Jan 8, 2009, 4:43:00 PM said...
-
ఎలా ఉన్నారు?
భావున్నారా?
ఆమధ్య జ్యోతక్క కనపడటంలేదని ప్రకటన ఇద్దామని అనుకున్నారు.
:)
- Ramani Rao on Jan 10, 2009, 2:39:00 AM said...
-
ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్ళకు..... స్వాగతం తెలుగూ 'వాడి'ని గారు!! :-)
- Anonymous on Jan 10, 2009, 3:01:00 AM said...
-
Satyam effect
- Telugu Movies UPdats on Jan 10, 2009, 6:24:00 PM said...
-
సాక్షి కి సోమ్ములు ఇచ్చే SATYAM ని తిరగతిప్పి MYTAS చెస్తె రెండు బోర్ల పడ్డయి మరి
- Ramani Rao on Jan 11, 2009, 5:55:00 AM said...
-
ఇంతకు ముందు నేను కామెంట్ రాసినట్లు గుర్తు.??? రాలేదా? పబ్లిష్ చేయలేదా? మర్చిపోయారా తెలుగు 'వాడి 'ని గారు?
- Anonymous on Jan 19, 2009, 8:59:00 PM said...
-
స్వాగతం సారూ
- Anonymous on Jan 21, 2009, 6:19:00 AM said...
-
నా డి.టి.పి. సెంటర్ యాడ్ కూడా సాక్షిలో ఇస్తుంటాను. గతంలో నాలుగు లైన్ల యాడ్ కి నాకు 60 రూ. ఖర్చయ్యేది, ఇప్పుడు 70 రూ. ఖర్చవుతోంది. ఒక లైన్ అదనంగా వేస్తే 15 రూ. అదనంగా ఖర్చవుతుంది. ఈనాడులో ఇప్పుడు కూడా యాడ్ కి 100 రూ. (5 లైన్లకి) ఖర్చవుతుంది. వ్యాపారులు ఎక్కువగా సాక్షిలోనే యాడ్స్ వేస్తున్నారు. కేవలం సాక్షి పేపర్ వల్ల కాదు, మార్గదర్శి కుంభకోణం వల్ల కూడా ఈనాడు సర్క్యులేషన్ పడిపోయింది. ఒకప్పుడు మా ఊర్లో ఈనాడు, వార్త పేపర్లు ఎక్కువగా అమ్ముడుపోయేవి. సాక్షి వచ్చిన తరువాత ఈనాడు రెండో స్థానానికి దిగిపోయింది. మార్గదర్శి కుంభకోణం, సాక్షి ఈ రెండూ ఈనాడు పై ప్రభావం చూపించాయి.