తెలుగు (మిగతా భారతీయ) సినిమాల నిర్మాణం, విడుదల మరియు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటే బాగుంటుంది !?

Posted by తెలుగు'వాడి'ని on Sunday, April 6, 2008

మన భారతీయ సినిమాలలో(ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ మొదలగు) ఉండే వైవిధ్యమైన అంశాల(పాటలు, ఫైట్లు, హాస్యం, పాటలలో వస్త్రధారణ మొ:) వలన ప్రస్తుతం ఉన్న సినిమాల తయారీ/నిర్మాణాన్ని ఎలా మారిస్తే బాగుంటుందో అని ఆలోచించగా నాకు తట్టిన కొన్నిటిని ఇక్కడ మీముందుకు ...

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఆరాధించబడుచున్న/చెలామణి అవుతున్న ఒక్కరికీ (ఏవో కొన్ని సన్నివేశాలలో లేదా ఒకటో రెండో సినిమాలలో తప్ప ... అది కూడా నటన అనబడేదానికి standards చాలా తక్కువ ఎత్తులో ఊహించుకొని ఆలోచిస్తే తప్ప) అసలు వారు camera ముందు చేసేదేమిటో (తద్వారా తెరపై కనిపించేది, మనం చూసేదేమిటో), దానికి ఒక అర్ధం పర్ధం ఉందా, దానికి నటన అనే పదం వాడొచ్చా అంటే మనకన్నా ముందు వారే తెల్లమొఖాలు పెట్టేస్తారు అంటే అతిశయోక్తి కాదేమో... ఇక అలాంటిది అసలు వాచకం, ఆంగికం, ఆహార్యం, అభినయం అనే పదాలు ఉన్నాయనీ, ఒకటో రెండో పదాలు ఉన్నాయని తెలిసిన(విన్న)వారికి కూడా పదాల అర్ధం ఖచ్చితంగా తెలిసి ఉండదు అనటం నూటుకి నూరుశాతం సబబుగానే/నిజమే కదా అనిపించటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదేమో .. మరి అలాంటప్పుడు మనం నటీనటుల నటన(?) గురించీ, వారిని పెట్టి సినిమాలు తీస్తున్న వారినీ, సినిమాల గురించి ఆలోచింటం, విశ్లేషించటం, బాధపడటం, పతనమై పోతున్న అంశాల గురించి ఆవేదన చెందటంలో అర్ధంలేదేమో .. కాకపోతే మానవ మాత్రులం కనుక ఎక్కడో చురుక్కుమనటం తదనుగుణంగా ప్రతిస్పందించటం పడుతున్న బాధను వ్యక్తపరచటం సహజాతిసహజం.

నాకు అర్ధం కాని ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నటీనటులు ఆయా సినిమాలలో వివిధ సన్నివేశాలలో ప్రదర్శించే నటనకు(?) ఒకటి కన్నా ఎక్కువ టేకులు తీసుకోవటం .. అదేమంటే perfection కోసం, సీను బాగా పండటం (పండించటం కోసం) అని చెప్పటం చూస్తుంటే (వింటుంటే, చదువుతుంటే) నాకు అసలు నవ్వు ఆగదు సుమండీ ... వీళ్ల బొంద మండ ... వీళ్ల నటనకి మరలా extra takes ఒకటి ... ప్రేక్షకులు ఏదో వీళ్ల దగ్గర నుంచి అధ్భుతాలు ఆశిస్తున్నట్టు వెధవ బిల్డప్ ఒకటి....

పైన చెప్పినట్టుగా అసలు కాలం నటీనటుల నుంచి నటనను గానీ, సన్నివేశాలలో/పాటలలో వారి ముఖకవళికల గురించి గానీ, దర్శకత్వ ప్రతిభను గానీ ఆశించి మనం సినిమాకు వెళ్లటం లేదు కనుక, సినిమాల నిర్మాణాలకు సంబంధించిన వారు ముఖ్యంగా నిర్మాత కొంచెం సృజనాత్మకంగా ఆలోచించి, ఏదో తొక్కలో perfection (ఒకటో రెండో ముఖ్యమైన సన్నివేశాలను తప్పించి) అనే పేరు మీద ఉన్న కాల్షీట్స్ అన్నీ వృధా చేసుకునే కన్నా వాటిని ఇంకొక విధంగా సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరూ చూసి ఆనందించగల సినిమాలు ఎలా తీయవచ్చో చూద్దామా.....నా ఉద్దేశ్యం ప్రకారం క్రింది విధంగా చేయవచ్చు అని ...

ముఖ్యంగా మన తెలుగు (మిగిలినవి కూడా అంటే ముఖ్యంగా హిందీ, తమిళం, కన్నడ మొదలగు) సినిమాను కుటుంబసమేతం, యువత, మాస్ (నా దృష్టిలో క్లాస్ అనే దానిని ముందు ఉన్న మూడిటితో కలిపి క్రింద చెప్పబడిన వాటికి అన్వయించటం వలన పెద్ద ఉపయోగం ఉండదు లేక అలా చేయాలనుకోవటం ఒక వృధా ప్రయత్నం) అనే వర్గాలవారిని దృష్టిలో ఉంచుకొని తీసినట్టుగా మరియు వర్గాల వారి ఆదరాభిమానాలను చూరగొనాలంటే ఎలా తీయవచ్చో అనే పంధాలో అందరూ వెళుతున్నారు గనుక ...

స్థూలంగా ఇప్పటి సినిమా (కొంచెం కుడిఎడంగా) ... ఒక కాబరే డాన్స్ పాట, ఒకటో రెండో పరమ బూతు/శృంగార సన్నివేశాలు, రెండుమూడు బూతు హాస్య సన్నివేశాలు, మూడునాలుగు వెకిలి/చెత్త/రోత సన్నివేశాలు, నాలుగయిదు ఫైటులు, అయిదారు పాటలు, ఆరేడు కారెక్టర్ నటీనటుల డైలాగులు/సన్నివేశాలు, ఏడెనిమిది విదేశీ/స్వదేశీ లోకేషన్స్, హీరోహీరోయిన్లకు ఒక పదిపదిహేను దుస్తులు, క్లైమాక్స్...

పైన చెప్పిన వాటన్నింటికీ సినిమా చూసే వర్గాలలో ఏది ఎవరికి ఎంత డోస్ లో ఉండాలో కాగితం మీద చక్కగా రాసుకొని (అన్ని వర్గాలకు కామన్ గా ఉండే సన్నివేశాలను, డైలాగులను తప్పించి)... మనం నటీనటుల నటన గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకోకుండా అంటే ఎక్కువ perfection కోసం తపించకుండా ....[టేకుల మీద టేకులు తీసుకుని ఏడిస్తేనే వీళ్ల నటన ఇలా అఘోరించింది ఇక ఒకే టేకులో ఓకే చేస్తే మనకు థియేటర్లలోనే వాంతి వస్తుందేమో అంటారా .. అదీ నిజమే సుమండీ ... ఇప్పుడు లోపల్లోపల తిప్పుతూ ఉంది అప్పుడు పూర్తిగా బయటకు వస్తుంది .. అంతే .. ఇలా అయితే కాస్త ఉపశమనంగా అన్నా ఉంటుంది] ఆయా సన్నివేశాలన్నింటినీ ఉన్న కాల్షీట్స్ లోనే(కావాలంటే కొంచెం ఎక్కువ ... డబ్బులు ఎక్కువ కాకుండా) పైన చెప్పిన మూడు/నాలుగు వర్గాలకు అనుగుణంగా చిత్రీకరించాలి... ఇప్పుడు వీటిని ఏమి చేయాలో చూద్దామా మరి...

1. విడి విడిగా సినిమాలు

అలా ఒకే సన్నివేశాన్ని మూడు-నాలుగు రకాలుగ తీసిన తరువాత వాటిని ఆయా వర్గాల వారిగా ఒక సినిమాగా జత చేసి అంటే మూడు-నాలుగు సినిమా ప్రింట్స్ లాగా మార్చి అన్నింటినీ ఒకేసారి విడుదల చేయాలి....ఇక్కడ చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఆయా వర్గాల వారి సినిమాను విడుదల చేసిన theaters వివరాలు చక్కగా వివరించాలి.

2. On Demand / Set Top Box / DTH / IPTV Services

సినిమాలన్నింటినీ పైన చెప్పిన services అన్నింటి ద్వారా అందుబాటులోకి తేవాలి. అప్పుడు ఎవరికి కావలసిన సినిమాను వారు చూసుకునే అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు, ఇంటిల్లిపాదీ ఒకేసారి సినిమా చూడాలి అనుకుంటే, పైన చెప్పిన/లభ్యమవుతున్న వర్గాలలో నుంచి 'కుటుంబ సమేతంగా' అన్న సినిమాను, ఒకవేళ ఇంటిలో టీన్స్ ఉండి ఉంటే వారు 'youth' వర్గానికి సంబంధించిన సినిమాను చూడవచ్చు.

3. Dynamic Assembly (Make your own movie)

ఇంకా కొంచెం విప్లవాత్మకమైన అవకాశం కల్పించాలి అనుకుంటే ... అన్ని వర్గాలకు సంబంధించిన clips అన్నింటినీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచాలి. అప్పుడు ప్రేక్షకుడు ఏయే సన్నివేశాలు తనకు వర్గం వాటికి దగ్గరగా చూడాలి అనుకుంటాడో వాటినే select చేసుకొని అప్పటికప్పుడు సినిమాను assemble చేసుకొని చూసుకునే అవకాశం కలుగుతుంది. Web site లో విధంగా తయారు చేసుకునే అవకాశం కల్పించటం చాలా తేలిక కనుక internet అందుబాటులో ఉన్నవారు అందరూ దీని నుంచి లాభం పొందవచ్చు. ఇక ఎలాగూ రానున్న యుగమంతా పైన చెప్పిన రెండవ point లో ఉన్న సేవలే ... ముఖ్యంగా IPTV కాబట్టి, ఇలా తయారు చేసుకున్న సినిమాను మనం direct గా మన account లోకి upload చేసుకుని ఇంటినుంచే చూసుకోవచ్చు.

4. Digital Movie and advertisements (both location based)

అతి త్వరలో మన కళ్ల ముందు సాక్షాత్కరించబోయేది ... డిజిటల్ విప్లవం ... ఇందులో రీలు డబ్బాలు/పెట్టెలతో పని లేదు ... కొద్దో గొప్పో అర్ధం అయ్యేలా ఉన్న క్రింద ఉన్న చిత్రాన్ని చూడండి.


ఒక వేళ మీకు ఈ డిజిటల్ సినిమా గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే .. Digital Cinema : Wikipedia Link

ఇందులో థియేటర్ ఉన్న ప్రదేశం/ప్రాంతాన్ని బట్టి dynamic గా ఏ copy ని (పైన చెప్పినట్టుగా ఒక సినిమాకు సంబంధించి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే) కావాలంటే దానినే ప్రదర్శించేలా చేయవచ్చు. అలాగే ప్రకటనలు కూడా dynamic గా ఎంపిక చేసుకోని చూపవచ్చు.

5. Mobile and Web based content (from extras)

ఉన్న కాల్షీట్స్ లో నుంచి అనుకున్న వాటి కన్నా ఎక్కువ సన్నివేశాలు(ముఖ్యంగా పాటలు, హాస్య సన్నివేశాలు, నాయికానాయకుల స్టిల్స్) చిత్రీకరించటం వలన వాటిని ring tones, wall papers మొదలగు వాటిగా మరియు పాటల వీడియోలు వాటిని Mobile మరియు Web లో ప్రదర్శించి అంతో ఇంతో డబ్బులు సంపాదించుకోవచ్చు.

ప్రేక్షకుల స్పందన ఎలా ఉండాలి :

మార్పు అనేది రావాలి లేక వచ్చేలా మనం చెయ్యాలి అనుకుంటే అది ఇక్కడ నుంచే(USA, UK, Australia, Dubai మొదలగు దేశాల నుంచి) మొదలవ్వాలి.....ఇప్పటికే మనకి BATA, ATA, తీట, తొక్క, తోలు, రక్కటం, అరవటం (ఈ మధ్య ఇవి చాలవన్నట్టు pro/anti తెలంగాణా, చిరంజీవి రాజకీయాల్లోకి రావాలి అనేవి కూడా మొదలు పెట్టారు...) అనే చాలా సంఘాలు ఉన్నాయి కదా ... వీటికి ఇంకొకటి చేరితే వచ్చే పెద్ద నష్టమేమీ లేదు కనుక ప్రస్తుత తెలుగు సినిమా తీరు తెన్నులపై మధనపడేవారు, మంచి(నిర్వచించటం కష్టం) సినిమాలు రావాలి అని కోరుకునే వారు, తెలుగు సినీ అభిమానులు, ముఖ్యంగా సినిమా కొరకు మనం ఖర్చు పెట్టిన డబ్బు మరీ దారుణంగా వృధా అవలేదు అనిపించే సినిమాలు రావాలని కోరుకునే వారు ... ఒక సంఘంగా ఏర్పడి .. ఒక web site ఏర్పాటు చేసుకొని సభ్యులుగా చేరండి .... రాబోయే కొత్త సినిమాలు ఏవి వస్తున్నాయో వాటిలో ఎవరెవరు ఏ సినిమాలు చూడాలి అనే ఉత్సుకతతో ఉన్నారో తెలియ చెప్పాలి / select చేసుకోవాలి ... అలా ఉన్న వారిలోనుంచి different demographics Youth/bachelors (MS చేస్తూనో, లేక కొత్తగా ఉద్యోగంలో చేరిన వారో), ఇప్పుడే India నుంచి వచ్చిన వారు, just married, married but yet to have kids, 6-8+ years kids ఉన్న వారు, పిల్లలు settle అయిన వారు, retirement/దగ్గరైన వారు ఇలా వైవిధ్యమైన విభాగాలలో నుంచి ఒక 15-50 మంది సభ్యులను/కుటుంబాలను (అన్ని దేశాలలో కలిపి ఇండియా కాకుండా, వీలైతే ఇండియాను చేర్చే దాని గురించి తరువాత ఆలోచించుకోవచ్చు) ని ఎన్నుకొని వాళ్లను మాత్రమే సినిమాకు పంపించాలి ... సినిమా అయిపోయిన వెంటనే వాళ్లు అందరూ తమ రివ్యూలు వీలయినంత వెంటనే తెలపాలి .. వ్రాయటం కష్టం అనుకుంటే మీ అభిప్రాయాలు record చేసి(మీ cell phone/PDA ల లో ఉన్న voice recorder ద్వారా లేదా చాలా web sites లో ఈ సౌకర్యం ఉంది) upload చేయవచ్చు ... ముఖ్యంగా ఈ రివ్యూలలో కనపడవలసినవి ఏమిటి అంటే ... టికెట్ కి అంత డబ్బులు/శ్రమ పెట్టి వెళ్లవలసిన అవసరం ఉంది అనిపించే దమ్మున్న సినిమానా అని ... ఒక్కొకసారి మన కళ్ల/మనసుతో చూస్తే ఈ 15-50 మంది వ్యక్త పరచిన అభిప్రాయాలు కొద్దిగా అటూ ఇటూ ఉండవచ్చు .. నా ఉద్డేశ్యం ప్రకారం ఒకటో రెండో ఇలా మనం సినిమా థియేటర్లలో చూడకపోతే వచ్చే నష్టం ఏమీలేదనే అనుకుంటున్నా ... ఇంకొక విషయం ఏమిటి అంటే నిజంగా సినిమా లో అంత దమ్మే ఉంటే ఆయా థియేటర్లలోకి ఇంకొక సారి ఎలాగూ వస్తుంది ...కావాలంటే అప్పుడే చూడొచ్చు..

ఇలా మనం నాలుగు అయిదు సార్లు వరుసగా ఒక ఝలక్/షాక్ ఇస్తే ముందు ఇక్కడ మన సినిమాల distributors కి దిమ్మతిరిగిపోతుంది .... ఆ దెబ్బ అక్కడ పడుతుంది (పృష్ట తాడన్ దంత భంగః టైపు లొ) ...ఇప్పటికే వీళ్లకి బాగానే వత్తి ఆరిపోయింది 2007 లో ... కావాలంటే ఈ రిపొర్ట్ Abroad Box-office in 2007 చూడండి.

అలాగే ఆంధ్రప్రదేశ్(ఇండియాలో ... హిందీలో కొంచెం బాగానే ఉధ్ధరిస్తున్నట్లే ఉంది ఈ మధ్య) లో సినీ ప్రేక్షకుడిని వినియోగదారునిగా పరిగణించేలా చట్టం రావాలి ... సాధారణ వినియోగదారునిలా తను డబ్బులు పెట్టి కొన్న వస్తువు సరిగా (పని చేయటం) లేదనో, తను ఆశించిన స్థాయిలో లేదనో అనుకుంటే తను కొన్న వస్తువుని వెనుకకు ఇచ్చే వీలు లేదూ అంటే మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పరమ దరిద్రంగా అనిపించినప్పుడో లేదా కళ్లు తిరిగిపోయే ప్రచారార్భాటంతోనో, హోరెత్తిపోయిన వ్యాపార ప్రకటనల వలన కొనుక్కొన్న వస్తువు వారు చూపించిన/వినిపించిన దానికి దరిదాపుల్లో లేకపోతే మనం (ముఖ్యంగా ఆడవారు) అ వస్తువు ఎంత దరిద్రంగా ఉందో అనీ, ఎవరూ కొనద్దు అనీ వాయుమనోవేగాలను మించిపోయే రీతిలో ఎలా ప్రచారం కల్పిస్తారో ... ఈ సినిమాలకు కూడా దానిని అన్వయించి ఈ హీరో దర్శక నిర్మాతల తుప్పు సమూలంగా వదిలించాలి.... మనం కొనే సినిమా టికెట్ ధర (ఉదాహరణకి రూ: 50 అనుకుంటే) లో నిర్మాత, పంపిణీదారులకు లాభం ఒక పదో పదిహేనో రూపాయలను పక్కన పెడితే కనీసం ఆ మిగిలిన 35-40 లకు అయినా సరైన న్యాయం చేయలేదు అనిపిస్తే మూకుమ్మడిగా అందరూ సినిమా చూడటం మానివెయ్యాలీ .. (సామూహక సమ్మె లాగా)

ఈ సరికొత్త విప్లవం మనలో తొందరగా రాకపోతే కనుచూపు మేరలో ఒక ఉపద్రవం ముంచుకోస్తుంది ... అదీ డిజిటల్ రూపంలో సినిమాలు ప్రదర్శించటం మరియు అతి ముఖ్యమైనది ఏమిటి అంటే సంవత్సర సభ్యత్వంతో (రు: 100), ఎవరి దగ్గర అయితే మనం సభ్యత్వం తీసుకున్నామో వారిచే ప్రదర్శితమైన సినిమాలు మనం ఎన్ని అయినా చూడొచ్చు .... కానీ ఇందులో మనకు కొంత లాభం ఉన్నట్టు అనిపించినా (ఒక సంవత్సరంలో ఎన్నైనా చూడొచ్చు...అలాగే నెలకు ఒకటి వేసుకున్నా ఒక 10-15 సినిమాలు అంటే ఒక 300-500 దాకా పెట్టాలి కానీ ఇలాగయితే ఒక 100 తోనే అయిపోతుంది) అసలు జరగబోయే నష్టమేమిటంటే వారికి ముందుగానే డబ్బులు చేతిలో పడ్డాయి కాబట్టి సినిమా గురించి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు కనుక ఇక రాబోయే సినిమాల గతి ఏ విధంగా ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం కాదనుకుంటా (నేను చదివిన వార్త ప్రకారం ఇప్పటికే ఈ విధానం తమిళనాడులో మొదలయ్యింది మరియు ఒక కోటి సభ్యత్వ కార్డ్స్ ఇప్పటికే అమ్మటం జరిగింది .. ఆంధ్రప్రదేశ్ లొ కూడా వీరి టార్గెట్ కోటి మందిని చేర్చుకోవటం) ..

నేను పైన చెప్పినవన్నీ ఆచరణ సాధ్యం కావు అని, కొన్ని హాస్యాస్పదంగా ఉన్నాయనీ కొంత(లేదా చాలా/అందరూ) మంది భావించవచ్చు .. ప్రస్తుతానికి నేను నాకు వచ్చిన ideas అన్నీ ఇక్కడ పొందుపరచటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ... మరలా సమయం దొరికినప్పుడు వీటిని refine చేయటానికి ప్రయత్నిస్తాను ..

అంత వరకు ఇంతే సంగతులు చిత్తగించవలెను !

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::విషయ సూచికలు :


5 వ్యాఖ్యలు:

కొత్త పాళీ on Apr 7, 2008, 7:31:00 PM   said...

నేనీమధ్యనే నాలుగు కొత్త తెలుగు సినిమాలు చూశా .. అంచేత ఇంకో ఆర్నెల్ల దాకా నిరాఘాటంగా తెలుగు సినిమా ఉపవాసం చెయ్యగల్ను!
ఈ టపా మాత్రం బహు వాడిగా వేడిగా రాశారు బాసూ!


రాజేంద్ర కుమార్ దేవరపల్లి on Apr 7, 2008, 9:37:00 PM   said...

అమ్మయ్య గురువు గారు మరో ఆరునెలలు నిరాఘాటంగా తెలుగు సినిమా ఉపన్యాసం చేస్తారు గదా అనుకుని ఉహూ మహూ అనుకుంటూ మరొక సారి చదివా,ఉపవాసమన్నారు.

తెలుగువాడిని గారు మీ బ్లాగు చాలా నిదానంగా దిగుతుంది,నాకే ఈ సమస్యా ఇంకెవరికన్నా ఉందా?

ఈ టపా కొత్తపాళీ గారు చెపినట్లు ఘాటుగా ఉంది,విషయతీవ్రత తో పాటు భారీ వాక్యాలు,పెద్ద పెద్ద పదాలు అధ్యయనాన్ని కాస్త జటిలం చేస్తున్నాయి.గమనించగలరు.


తెలుగు'వాడి'ని on Apr 7, 2008, 11:32:00 PM   said...

కొత్తపాళీ గారు : మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. మీరు ఒకేసారి నాలుగు తెలుగు సినిమాలపై చేసిన దాడి, వాటి ప్రభావం మీ పై, గురించి మీ టపాలో చూశానండి. ఆరునెలల ఉపవాసం అనేది సరి అయిన మందు అలాంటి వాటికి. :-) మీరు దీనికే వాడి, వేడి అంటున్నారు .. ఇంకా కొద్దిగా సమయం తీసుకొని refine చేసి మిగిలిన data అంతా ఇక్కడ ఇచ్చి ఉంటే ఇంక ఎలా ఉండేదో :-(


తెలుగు'వాడి'ని on Apr 8, 2008, 12:20:00 AM   said...

రాజేంద్ర గారు, మీ వ్యాఖ్యకు కూడా ధన్యవాదములు. ఈ టపా కొంచెం పెద్దది కావటం మరియు ఒక image ఉండటం వలన Blog load అవటం కొంచెం slow అయిపోయింది. ఇది నేను కూడా గమనించాను.

Actual గా ఇది ఇంకా చాలా పెద్ద టపా అండి మరియు దీనిని రెండు, మూడు భాగాలుగా ప్రచురిద్దామనీ .. అది కూడా కాకుండా దీనిని నవతరంగం కు పంపిద్దామనే ఉద్దేశ్యంతో చాలా వివరంగా చెప్పటానికి ప్రయత్నించాను మొదలు పెట్టినపుడు ... కాకపోతే refine చేయటానికి సమయం లేకపోవటం మరియు ఈ టపా చాలాకాలంగా draft గా ఉండిపోవటంతో ఉన్నదున్నట్లుగానే ప్రచురించటం జరిగింది అందుకే మీరు చెప్పినట్లు భారీ వాక్యాలు, పెద్ద పెద్ద పదాలు అలాగే ఉండిపోయాయి.

ఏదైనా విషయం గురించి కొంచెం తీవ్రంగా ఆలోచించి వ్రాయవలసివస్తే నాకు ఇలా భారీ వాక్యాలు, పెద్ద పెద్ద పదాలు అలా దొర్లిపోవటం నాకు మొదటి నుంచి ఉన్న మా చెడ్డ అలవాటు ... తెలుగు మాత్రమే వ్రాయగలిగిన రోజుల్లో వీటిని కుదించి, మార్చి వ్రాయటం చాలా సులభంగా అనిపించేది ... ఇప్పుడు కొంచెం ఎక్కువ సమయం కావలసి రావటంతో కొంచెం కష్టంగా అనిపించటమో లేక ఆంగ్ల పదాలు ఎక్కువ రావటమో జరిగిపోతుంది .. ప్రస్తుతం నా మొదటి ప్రాధాన్యత, సాధ్యమైనంత వరకు అతి తక్కువ అంగ్ల పదాలు వాడటం అవటం వలన వీటి గురించి ఆలోచిస్తున్నా కూడా ఆచరణలో పెట్టటానికి వెనకడుగు వెయ్యవలసి వస్తుంది.

ఇక చివరిగా, నాకు మొదటి నుంచి గ్రాంధిక, పౌరాణిక, జానపద పదాలు, గద్య/పద్య నాటకాలు (ముఖ్యంగా డి.వి.సుబ్బారావు గారి సత్యహరిశ్చంద్ర కాటిసీను, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారు మాయల ఫకీరుగా చేసిన బాలనాగమ్మ మరియు షణ్ముఖి ఆంజనేయ రాజు గారి శ్రీకృష్ణ రాయబారం, శ్రీరామాంజనేయ యుధ్ధం మొదలగు)అంటే ఉన్న ఇష్టంతో కొద్దోగొప్పో ఇలా అలవాటు అయిపోయింది.

తరువాతి టపాలకు తప్పకుండా చిన్న వాక్యాలతో, పదాలతో వ్రాయటానికి ప్రయత్నం చేస్తాను.

మీ సూచనలకు అభినందనలు మరియు మరొక్కసారి ధన్యవాదములు.


రమణి on Apr 8, 2008, 2:47:00 AM   said...

తెలుగు 'వాడి ' ని గారు: బాగుంది మీ సినిమా ప్రహసనం. ఇదివరకు అంటే పాత సినిమాల రోజుల్లో, అయితే సినిమా థియేటర్లో చూస్తేనే అందం అనుకొనేవాళ్ళము కాని, ఇప్పుడొచ్చే సినిమాలు ధియేటర్కి వెళ్ళి మాత్రం చూడకూడదు అనిపించేలా వున్నాయి. ఎందుకంటే అక్కడ నలుగుర్లో నారాయణ, గుంపులో గోవిందా అనే పరిస్థితి వస్తుంది. బాగుందా లేదా అనే చర్చకన్నా, భరించడం అనే భాదకి లోనవుతాము.

ఇక మీరందరు అసలు వులకడం, పలకడం లేదు కొత్తపాళీగారు విషయంలో. కొత్తపాళీగారు ఏకబిగిన 4 సినిమాలు చూసేసారు, ఓ పెద్ద సన్మానం చేయాలని ఏమన్నా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే, ఒక సినిమానే చూడలేక బయటికి వస్తున్న ఈ రోజుల్లో నాలుగు సినిమాలంటే మాటలా?? మరి బ్లాగర్లందరూ కలిసి ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుంది, మీరెదన్నా చెపితే నేను నా వంతు కృషి చేస్తాను.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting