మీ బ్లాగ్ లోని అన్ని టపాలను ఒకే చోట చూపటం ఎలా ?

Posted by తెలుగు'వాడి'ని on Thursday, March 27, 2008

వ్యాపార స్వభావం లేక ధనార్జన అన్నది ఇంకా మన తెలుగు బ్లాగర్లకు లేకపోవటం లేక మన తెలుగు బ్లాగులు ఇంకా ఆ స్థాయికి చేరుకోకపోవటం వలన గానీ ...లేదా వారు ఆశించిన స్థాయిలో తమ బ్లాగులకు వీక్షకులను/అభిప్రాయాలను కూడలి , జల్లెడ , తేనెగూడు , తెలుగుబ్లాగర్స్ అనబడే Sites నుండి రావటమో లేక చివరిగా మా బ్లాగులు మా కోసం వ్రాసుకుంటున్నవి గానీ ఎవరో వచ్చి చదవాలనీ/అభిప్రాయాలు చెప్పాలని ఆశించటం లేదు అనీ ... కారణాలు ఏవైనా మనలో చాలా మంది (కుడిఎడంగా అందరూ) మనం బ్లాగులు వ్రాసే మాధ్యమాలలో (Blogger/WordPress మొదలగు) లభ్యమవుతున్న Options తోనే తమ Blogging ను కొనసాగించటం వలన (కొంత మందికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవటం గానీ లేక అంత సమయం లేకపోవటం వలన గానీ లేక సమయాభావం వలన గానీ లేక ఉన్నవి చాల్లే అని గానీ) మీరు ఎంతో కష్టపడి(!?) వ్రాస్తున్న టపాలకు ఆదరణ లే(రా)కపోవటానికి నాకు అనిపించిన ఒక ప్రధానకారణానికి (మీ బ్లాగులను/టపాలను) ఓ పసిపిల్లలా లాలించి, పాలించి, పెంచి పోషించి .. అనునిత్యం(సరే..సరే ఎప్పుడు కొత్త టపాలు వ్రాస్తే అప్పుడు మాత్రమే) కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా ... వాటిని Blog Archive అనే గోడల మధ్య బంధించటం) నాకు తెలిసిన చాలా సులువైన ఒక విధానాన్ని సూచించటమే ఈ టపాయొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఇక్కడ వివరించినది ఇంతకు ముందు వ్రాసిన టపా 'తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 2' లో 'Feedburning' అనే section లో ఉన్నది కాని ఇక్కడ వీలైనంత విపులంగా ప్రతి ఒక్కరూ అతి సులభంగా తమ బ్లాగులలో చేయగలిగేలా చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాను .. చూద్దాం ఎంతవరకు నేను సఫలం అవుతానో మరియు ఎంత మంది ఇది ఉపయోగంగానే ఉంది అనుకొని తమ బ్లాగులలో చేస్తారో ..

Feed2JS :

1. మొదటిగా మీరు తెలుసుకోవలసింది మీ బ్లాగు యొక్క RSS/Atom Feed Address ....

ఒకవేళ మీ బ్లాగు 'Blogger/BlogSpot' అయితే ఆ బ్లాగుయొక్క RSS/Atom Feed Address ఎప్పుడూ /feeds/posts/default అవుతుంది.

ఉదా : మీరు రాధిక గారి 'స్నేహమా' బ్లాగు తీసుకుంటే ఆ బ్లాగు అడ్రస్ http://snehama.blogspot.com కనుక ఆ బ్లాగుయొక్క RSS/Atom Feed Address http://snehama.blogspot.com/feeds/posts/default అవుతుంది.

ఒకవేళ మీ బ్లాగు 'Wordpress' అయితే ఆ బ్లాగుయొక్క RSS/Atom Feed Address ఎప్పుడూ /feed అవుతుంది.

ఉదా : మీరు వికటకవి గారి బ్లాగు 'వికటకవి' తీసుకుంటే ఆ బ్లాగు అడ్రస్ http://sreenyvas.wordpress.com కనుక ఆ బ్లాగుయొక్క RSS/Atom Feed Address http://sreenyvas.wordpress.com/feed అవుతుంది.

2. తరువాత మీరు మీ బ్లాగు యొక్క Feed ను JavaScript ద్వారా మీ బ్లాగులోని టపాలన్నింటినీ ఒక వరుస క్రమంలో చూపించటానికి ఈ దిగువన ఉన్న లంకె ను నొక్కండి.

అన్ని టపాలను చూపండి Feed2JS ద్వారా

మీరు ఆ పైన ఉన్న లంకెను నొక్కినచో మీకు అందులో ఉన్న Options అన్నీ ఈ దిగువన ఉన్న Image లో లా ఉంటాయి.

ఇందులో మీరు చేయవలసినది అంతా URL అని ఉన్న చోట మనం పైన కనిపెట్టిన మీ బ్లాగు యొక్క RSS/Atom Feed Address (ఉదా: స్నేహమా లేక వికటకవి) ఇవ్వటమే.

తరువాత ఆ Options క్రింద కనిపిస్తున్న 'Preview' అనే నొక్కండి.

ఇప్పుడు మీకు మీ బ్లాగులో ఉన్న టపాలు (అన్నీ కాదులేండి) కనిపిస్తాయి (అర్ధం పర్ధం లేని అక్షరాలలాగా ఉన్నా కూడా ఏమీ కంగారు పడకండి ... అసలు టపాలు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యం మనకు ప్రస్తుతానికి) .. ఉదా : ఈ క్రింద ఉన్న 'వికటకవి' గారి మరియు 'హృదయ బృందావని' గారి బ్లాగులలోని టపాలను చూడండి.


పైన కనిపిస్తున్న ఇమేజ్ లో వికటకవి గారి బ్లాగు టపాలలో మొదటి దానిలో మీకు రోమన్ సంఖ్య I (ఒకటి) కనిపిస్తుంది కదా :-) ... [ అది వారు లేటెస్ట్ గా వ్రాసిన టపా షరతుల పెళ్ళికొడుకులు - I ].... అంటే ఇప్పటిదాకా మనం చేసింది అంతా బాగానే పనిచేసింది అన్నమాట ...

అలాగే ఇంకొక Verification ఏమిటి అంటే 'ఒక హృదయం' లో ఉన్న టపాల సంఖ్య ఇక్కడ ఇమేజ్ లో చూపించిన టపాల సంఖ్యతో సరిగ్గా సరిపోయింది :-)

మనము సరిగ్గానే చేశాము మరియు Feed2JS మార్పు కూడా బాగానే పని చేస్తుంది అని నిర్ధారించుకున్నాము కనుక తరువాత చేయవలసిన వాటి గురించి తెలుసుకుందాము.

3. ఇప్పుడు పైన ఉన్న Options Page లో ఉన్న 'Generate JavaScript' అనే బటన్ ను నొక్కండి. అప్పుడు అదే పేజ్ లో పైన కనిపించే కోడ్ అంతా Copy చేసుకోండి.

4. తరువాత పేజ్ పైన కుడి వైపున కనిపించే 'Customization' అనే లంకె ద్వారా 'Template' -> 'Page Elements' దగ్గరకు వెళ్లండి.

5. HTML/JavaScript అనబడే కొత్త Page Element ను జతచేయండి .. ఇందులో ఇంతకు ముందు మీరు copy చేసుకున్న code ను ఇక్కడ paste చేయండి కానీ ఈ code ను HTML లో Pre అనే Taga మధ్యలో ఉంచటం మరచిపోవద్దు....ఎలా ఉంచాలో తెలియకపోతే దిగువన ఉన్న Images ను చూడండి.... వెంటనే save చేయండి.

మీరు copy చేసుకున్న code :



మీరు paste చేయవలసిన code :




ఒక వేళ మీరు జత చేసిన Page Element యొక్క Column Width తక్కువగా ఉండటం వలన మీ టపాల Titles పూర్తిగా కనిపించక పోతే ఇలా చేయండి....

  • ముందుగా మీరు ఎప్పుడూ చేసే విధంగా ఒక కొత్త టపా వ్రాయండి ...
  • Title మీ అన్ని టపాలను చూడాలి అంటే ఇక్కడ నొక్కండి అని అర్ధం వచ్చే లాగా పెట్టండి .. లేదా మీకు ఎలా ఇష్టమయితే అలా....
  • ఇప్పుడు ఈ టపాలో మీరు ఏమీ వ్రాయకుండా ఇంతకు ముందు మీరు copy చేసి పెట్టుకున్న code ను ఇక్కడ paste చేయండి... ఎలా చేయాలో ఇంతకు ముందే చూసారు కదా .. వివరాలకు కొంచెం పైన చూడండి.
  • మీరు టపా వ్రాసే window లో కొంచెం క్రింద, Publish Post కు పైన ఉన్న Post Options అనే దాని మీద నొక్కండి అప్పుడు మీకు ఈ క్రింద image లో ఉన్న విధంగా options కనిపిస్తాయి. అందులోఉన్న తేదీ ను మీరు చాలా పాత తేదీ కు మార్చండి.
  • ఇక చివరిగా ఎప్పటిలాగానే మీ టపాను publish చేయండి.
  • ఇప్పుడు మీ బ్లాగులోనికి వెళ్లి ఇప్పుడు ప్రచురించబడిన టపా యొక్క URL ను copy చేసుకోండి.
  • చిట్ట చివరిగా ఇంతకు ముందు చెప్పినట్టుగా Link List అనబడే ఒక కొత్త Page Element ను జతచేయండి.
  • అందులో క్రింద చూపిన image లో చూపించిన విధంగా ఇంతకు ముందు మీరు చేసుకున్న టపా యొక్క URL ను ఇక్కడ paste చేయండి...


ఇక ఇప్పుడు ఎవరైనా మీ బ్లాగు కు వచ్చి కొత్తగా create చేసిన లంకె ను నొక్కితే మీ బ్లాగ్ లోని అన్ని టపాలు ఒకే చోట కనిపిస్తాయి.

గమనిక :

బ్లాగర్ లోని default settings/restrictions వలన మీ బ్లాగ్ లో ఉన్న recent ఇరవై టపాలు మాత్రమే కనిపిస్తాయి. ఒకవేళ మీకు నిజంగా అన్ని టపాలు కావాలి అంటే మీరు ఉపయోగించవలసిన URL ను http://snehama.blogspot.com/feeds/posts/default?max-results=999 గా మార్చి మరియు Feed2JS Options లో 'Number of items to display' దగ్గర 999 ఇవ్వండి సరిపోతుంది.

ఇకపోతే Wordpress ను వారి బ్లాగింగ్ Platform గా వాడే వారు ఇలాంటి instructions కావాలి అంటే మరి కొన్ని రోజులు వేచి ఉండవలసిందే ఎందుకంటే ఈ instructions Blogger లో పని చేసినంత consistent గా Wordpress లో పనిచేయటం లేదు......నేను వేరే విధమైన instructions కోసం ప్రస్తుతం చూస్తున్నాను ... అవి పూర్తి చేసిన తరువాత వాటిని ఇక్కడ ప్రచురిస్తాను.....

:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


16 వ్యాఖ్యలు:

Anonymous on Mar 27, 2008, 1:55:00 PM   said...

బ్లాగ్ స్పాట్ లో మొత్తం టపాలు రావడం లేదు. నేను వాడిన code ఈ క్రింద image లో చూడవచ్చు

Feed2JS Code for my Deepthidhara Blog

పరిష్కారం వుందా?

Default code లో 20 టపాలు వస్తున్నాయి.


తెలుగు'వాడి'ని on Mar 27, 2008, 2:18:00 PM   said...

@cbrao గారు : ముందుగా మీ వ్యాఖ్యలోని code ను image గా మార్చడమైనది...గమనించగలరు...నేను మీ Feed URL తో ఇప్పుడే try చేశానండి.....నాకు మీ బ్లాగులోని అన్ని టపాలు కనిపిస్తున్నాయి....

All Posts from for Deepthidhara Blog using Feed2JS

Feed2JS Options and Code

ఇంకొక సారి ప్రయత్నించండి...రాకపోతే అప్పుడు నేను debug చేయటానికి try చేస్తాను.


రాధిక on Mar 28, 2008, 10:02:00 AM   said...

సగం వరకు చేయగలిగానండి.థాంక్స్.కానీ అన్ని టపాలు కనపడేలా చెయ్యడానికి చెప్పినది మాత్రం పని చెయ్యట్లేదు.


తెలుగు'వాడి'ని on Mar 28, 2008, 9:42:00 PM   said...

రాధిక గారు : నాకు మీ టపాలన్నీ బాగానే కనిపిస్తున్నాయండీ...రావు గారు కూడా మీలాగే (మొదటి ఇరవై టపాలే వస్తున్నాయి) అన్నారు కానీ నేను ప్రయత్నిస్తే వారి బ్లాగులో నుంచి కూడా అన్ని టపాలు కనిపిస్తున్నాయి మరి. మీ బ్లాగులో ఎలా కావాలో చెప్పండి నేనే అలా చేసి చూపిస్తాను మీకు.


సుజాత వేల్పూరి on Mar 28, 2008, 11:24:00 PM   said...

This is very useful. No doubt. But I have a very primary doubt.
I've joined in telugubloggers group in google groups. I've started a blog very recently. Even I have joined in telugubloggers group, my blog address is not shown and posting too! what else I should do to see my blog in telugubloggers.com? pl let me know


తెలుగు'వాడి'ని on Mar 28, 2008, 11:44:00 PM   said...

@Sujatha Garu : First, congrats and good luck for starting a new blog.

Here is the link that will help you:

How to add your blog to telugubloggers.com

And I think it might take 2 or 3 days after you sent/submitted them the instructions to add your blog, to show it on their site with your posts.

Did you already added your blog to ..

koodali

thenegoodu

jalleda (as this site is down as I was typing, this is not a direct link so please take a look at the site you will find the link to add your blog)

If not, please do so.


సుజాత వేల్పూరి on Mar 29, 2008, 3:53:00 AM   said...

ఈ బ్లాగ్ వ్యవహారం చూడ్డానికి, వేరే వాళ్ల బ్లాగులు చదవడానికి ఈజీగానే ఉంది గానీండి, నా బ్లాగ్ విషయానికొచ్చేసరికి చెడ్డ కష్టంగా ఉందండీ బబూ! నా బ్లాగ్ ని కూడలికి కలపమని వీవెన్ గారికి ఈ మెయిల్ చేసాను. రిప్లై లేదు. తెలుగు బ్లాగర్స్ కి మొన్ననే వినతి పంపాను.ఊహూ! లాభం లేదు. మా ఆయన్ని హెల్ప్ అడుగుదామని చూస్తే, తనేమో చాలా బిజీగా ఉన్నాడు.(నిజంగానే) 'వీకెండ్ చూస్తాన్లే ఉండమ్మా' అని వీకెండ్లు కూడా ఆఫీస్ కి వెళ్ళిపోతున్నాడు. నా టపాలు అందరూ చూసేలోగా నేను టపాకట్టేస్తానో ఏమిటో.
http://manishi-manasulomaata.blogspot.com/

idee naa blaag.


రాధిక on Mar 29, 2008, 8:45:00 AM   said...

సైడు బారులో 20 టపాలు మాత్రమె కనిపిస్తున్నాయి కదా.అక్కడ అన్నీ కనపడేలా చెయ్యాలండి.అందుకు ప్రయత్నించి విఫలం అయ్యాను.మీకు కుదిరితే చేసిపెట్టండి.ముందుగా నెనర్లు.


తెలుగు'వాడి'ని on Mar 29, 2008, 9:38:00 AM   said...

సుజాత గారు : మీరు టపా కట్టేసేటంత మాటలు, నిరాశ ఎందుకండీ ... ఒక్క రెండు, మూడు రోజులు ఓపిక పట్టండి ... వీవెన్ గారు, తెలుగుబ్లాగర్స్.కాం వారు మీ బ్లాగ్ ను వారి site కు జతచేస్తారు .. ఇక అంతే మీ బ్లాగుకు కుప్పలుతెప్పలుగా hits. ఈ లోపు మీకు వీలు చూసుకొని జల్లెడ మరియు తేనెగూడు కి కూడా మీ బ్లాగును జతచేయటానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పటి వరకు మీరు చూసి/చదివి ఉండకపోతే, సౌమ్య గారి బ్లాగ్ Sowmya Writes చూడండి/చదవండి. తనకు కూడా మీ లాగే పుస్తక పఠనంపై మంచి ఆసక్తి చదివిన పుస్తకాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచే అభిరుచి, తను చదివిన పుస్తకాలను తన బ్లాగ్ కు వచ్చే పాఠకులకు/వీక్షకులకు పరిచయం చేయాలనే ఉత్సాహం ఉన్నాయి.


తెలుగు'వాడి'ని on Mar 29, 2008, 9:38:00 AM   said...

రాధిక గారు : మీరు నేను చెప్పిన మొదటి steps అన్నీ correct గానే చేశారండి. కాకపోతే అన్ని టపాలు కావాలంటే అనే section లో చెప్పిన వాటిలో ఉన్న రెండు instructions(?max-results=999 జతచేయడం మీ Feed URL కు) మరియు (Feed2JS options లో number of items to display=999) అనేవి చేయలేదు. ఇప్పుడు చూడండి మీ బ్లాగ్ లో కుడి వైపున అన్ని టపాలు కనిపిస్తున్నాయి ..... ఆనందమానందమాయే :-)


రాధిక on Mar 29, 2008, 8:57:00 PM   said...

ఆనందమానందమాయే
ఆనందమానందమాయే :-)
thank you very much sir


సుజాత వేల్పూరి on Mar 30, 2008, 10:31:00 PM   said...

తెలుగు 'వాడి 'ని గారు

నాకు సహనం తక్కువనే విషయం ఇంకోసారి రుజువు చేసుకున్నాను. మిమ్మల్ని హెల్ప్ అడిగిన మర్నాటినుంచే నా టపాలు కూడలి లో రావడం మొదలైంది. ధన్యవాదాలు.


సిరిసిరిమువ్వ on Mar 31, 2008, 12:35:00 AM   said...

ధన్యవాదాలు. మీరు చెప్పినట్లే చేసాను, అన్ని టపాలు కనపడేడట్లు. అన్నట్లు అన్ని టపాలు కనపడాలంటే మీరిచ్చిన feed URL లింకులో max-results వరకే వస్తుంది, మిగతాది cut అయిపోతుంది, అందువలన మొదట రాలేదు, తరువాత 999 add చేస్తే బాగానే వస్తుంది.


తెలుగు'వాడి'ని on Mar 31, 2008, 9:28:00 AM   said...

రాధిక గారు : You are always welcome!

సుజాత గారు : ఇష్టంతో చదివిన పుస్తకాలను ఉత్సాహంతో అభిప్రాయాలను వ్రాసి సంతోషంగా నలుగురితో వాటిని పంచుకోవాలనే ఆలోచనలలో అది చాలా సహజమైన విషయమేలేండి :-) ఇకపోతే ఇప్పటికే మీ టపాలకు వ్యాఖ్యలు రావటం వాటికి మీరు ఓపికగా స్పందించటం బాగుంది.

సిరిసిరిమువ్వ గారు : చేయటమే కాకుండా మరలా ఓపికగా వచ్చి వ్యాఖ్య వ్రాసినందులకు మీకు కూడా ధన్యవాదములు.

హమ్మయ్య! మొత్తానికి సాధించారు.

నేనేమైనా తప్పు వ్రాశానేమో అని తల బద్డలు కొట్టుకున్నా .. మరలా మరలా చదివా నేను వ్రాసిన instructions అన్నీ ఎక్కడా ఏమీ కనపడలేదు :-( మీరు చెప్పిన ఆ వాక్యం మీరు copy చేస్తే మొత్తం వస్తుంది మీకు Browser లో కనపడకపోయినా .. కాకపోతే నేను ఆ వాక్యానికి Font Size - smallest చేశాను ... అయినా కనపడటం లేదు అన్న మాట ... అందుకే ఇప్పుడు ఆ వాక్యానికి Font type మార్చేశాను ... ఇప్పుడు ఆ వాక్యం చక్కగా కనిపిస్తుంది. చెప్పినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదములు

మీ బ్లాగులో చూశాను అన్ని టపాలు ఒకే చోట చాలా చూడముచ్చటగా ఉన్నాయి (అలాగే రాధిక గారి బ్లాగులో కూడా), మీ ఇద్దరి టపా టైటిల్స్ చిన్నవిగా, క్లుప్తంగా ఉండటం వలన :-)


కొత్త పాళీ on Mar 31, 2008, 7:25:00 PM   said...

ఇది మంచి పనిముట్టు. అభినందనలు.


AumPrakash on Mar 23, 2009, 5:42:00 AM   said...

namaskaaram mee peru kosam chusaanu kanapadaledu. nenu kothaga blog start chesaanu www.aumprakash-arya.blogspot.com naaku chaala thelusukovalani vundi meeru paina cheppina vidhanga try chesanu list vachindi.Thanks , naaku mee blog lo right lo "lables" tag vundi adi enti naa blog lo yela create cheyaalo dayachesi mail cheyandi mee mail kosam waiting.......


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting