TeluguLo.com లో ఏమిటో ఈ పద ప్రయోగాలు ... ఏం చెయ్యాలి వీళ్లను
ఇప్పుడే TelugulO. com లో ఈనాడు-సాక్షి గురించి ఉన్న ఒక పోల్ (Poll) లో వాడిన ఒక పదం చూసిన/చదివిన తరువాత వీళ్లకు వేరే పదం దొరకలేదో లేక తెలియదో లేక ఈనాడు అంటే అసహ్యమో ... ఎందుకు వాడారో మనలో కొంతమందికి అయినా తెలుస్తుందనో, తెలుసుకుంటారనో ... మరీ ముఖ్యంగా ఏదో మామూలు తెలుగు web site కదా అని మీ పిల్లలు చూస్తే ఇలాంటి పదాలకు కొత్త నిర్వచనాలు ముందుగానే వెదుక్కుంటారని ఒక చిన్న ఆలోచనే ఈ టపా ....
నేను ప్రస్తావించిన ఆ పోల్ కు సంబంధించిన వివరాలకు దిగువన ఉన్న ను చూడండి.
ఈ పద ప్రయోగం కొన్ని ప్రాంతాలలో లేక మాండలికాలలొ సరైనది అయ్యుండవచ్చు లేక సర్వసాధారణంగా వాడుకలో ఉండి ఉండవచ్చు ... నాకు అంతగా తెలియదు ... అలాగే నేను ఈ పదమేదో పెద్ద బూతు పదమనీ, అసలు వాడకూడదనీ చెప్పటం కూడా నా ఉద్దేశ్యం కాదు సుమా....ఎందుకంటే ఇదే పదానికి చాలా అర్ధాలు ఉండవచ్చు మరియు వాడే సందర్భాన్ని బట్టి మారవచ్చు ...
కాకపోతే నాకు తెలిసినంతలో ఈ పదం వాడే చాలా సందర్భాలు మాత్రం మంచి అర్ధాలు వచ్చేవి కాదు....(ముఖ్యంగా నలుగురు కుర్రాళ్లు/మగవాళ్లు అలాగే కొంచెం మోటు సరసంగా మాట్లాడే గ్రామీణ ప్రాంతంలోని ఆడ(మగ)వాళ్లు కూడా)...
అక్కడ TelugulO.com వారు వాడిన దానికన్నా ఇక్కడ నేను చెప్పటమే అసలు ఈ పదానికి ఎక్కువ ప్రాచుర్యం మరియు లేనిపోని అర్దం ఆపాదించబడింది అంటే నేనేమీ చెయ్యలేను ఎందుకంటే ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తట్టలేదు కనుక :-)
చూద్దాం ఇంక ముందు ముందు ఎలాంటి పదాలతో ఈ Internet ప్రపంచంలోని తెలుగు పత్రికా రంగం ముందుకు సాగుతుందో..
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
12
వ్యాఖ్యలు:
- కొత్త పాళీ on Mar 27, 2008, 4:57:00 PM said...
-
చాన్నాళ్ళకి దర్శన మిచ్చారు .. సంతోషం.
మాండలికాల ప్రసక్తి కరక్టే .. ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణా కర్నూలు భాషల్లో దొబ్బటం అంటే పడదొయ్యటం లేదా కొట్టి నేల కూల్చడం అనే అర్ధం వాడుక ఉంది. కృష్ణాజిల్లాలో పరువైన కుటుంబంలో ఈ మాట అంటే ముక్కున వేలేసుకుంటారు, అదే పైన చెప్పిన ప్రాంతాల్లో ఎవరూ రెప్ప కూడ కదల్చరు.
అలాగని ఒక వార్తా పత్రిక, అందులోనూ జాల పత్రిక ఇటువంటి భాష ఉపయోగించిందీ అంటే .. ఆ మాత్రం భాషా భేదాలు తెలియని వాళ్ళు ఆ పత్రికని నిర్వహిస్తున్నారూ అంటే .. అనుమానించాల్సిన విషయమే.
అన్నట్టు మీరు గమనించారో లేదో, ఈ మధ్య ఒక వీరుడు తెలుగు అచ్చు పత్రికల్లోని అచ్చు తప్పుల్ని రోజుకోటీ చొప్పున ఏకుతున్నాడు.
- తెలుగు'వాడి'ని on Mar 28, 2008, 9:47:00 PM said...
-
కొత్తపాళీ గారు : ముందుగా మీ సవివరమైన వ్యాఖ్యకు ధన్యవాదములు....అవునండీ నా బ్లాగులో వ్రాయలేదు గానీ క్రమం తప్పక బ్లాగులన్నీ చదువుతూనే ఉన్నానండి. మీరు చెప్పిన బ్లాగు కూడా చూస్తూనే ఉన్నాను.
- Anonymous on Mar 28, 2008, 11:13:00 PM said...
-
ఇది అత్యుత్సాహం తో రాసిన వార్త. సాక్షి జర్నలిస్ట్లులతో పత్రిక ప్రారంభానికి ముందు వారి శిక్షణా కార్యక్రమంలో జగన్ కలిసినప్పుడు, 'మనం రాగానే ఈనాడు దొబ్బెయ్యాలి ' అని అన్నాడని ఈ తెలుగులో.కాం వాళ్ళే వార్త రాశారు. ఆర్కైవులలో ఆ వార్త దొరుకుతుంది. బహుశా అందుకే, అల రాశాడనుకుంటా! అయినా ఆ మాటను వాడిన ఆయనకు దాని అర్థం తెలుసో ,తెలియదో మనకు తెలియదు. పత్రికల వాళ్ళకు, జర్నలిస్టులకు 'అర్థం తెలీక రాశానూ అనే ఎక్స్ క్యూజ్ లు ఉండవు. ఆ మాట యధాతధంగా వాడటం క్షంతవ్యం కాదు.
- తెలుగు'వాడి'ని on Mar 29, 2008, 12:04:00 AM said...
-
సుజాత గారు : ముందుగా మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
మీరు ప్రస్తావించిన జగన్ గారి వ్యాఖ్యను అదే telugulo.com వారు పోల్ రిపోర్ట్ : సాక్షి మీద పెద్ద నమ్మకం లేదు ను ప్రచురించిన సందర్భంలో, జగన్ గారు ఏ సందర్భంలో ఎలా వాడారో చెప్పారు ..
మీ అభిప్రాయం చాలా నిక్కచ్చిగా, సూటిగా వ్యక్తపరచినందులకు అభినందనలు.
- Ramani Rao on Mar 29, 2008, 12:11:00 AM said...
-
ఈ భాష, ఈ పదం పత్రికలకే పరిమితం కాలేదు తెలుగూవాడి ' ని గారు. మా పిల్లల ట్యుషన్ కి కూడా పాకిందనిపిస్తుంది ఇప్పుడు మీ టపా చదువుతుంటే. ఈ మధ్యే ఒక నెల క్రితమనుకొంట, మా పాప అడిగింది ఈ పదం అర్ధం ఏమిటమ్మా? అని, వాళ్ళ టీచర్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఈ పద ప్రయోగం చేసిందని. "తెలియకపోతే అడగమంటావుగా" అంటూ మా పాప అనేసరికి నాకు నోట మాట రాలేదు. పాఠాలు చెప్పాల్సిన గురువులే ఇలా వుంటే ఇక మనమేమి చెయ్యగలము. ఇదంతా తెగులు పట్టిన తెలుగండీ.
- oremuna on Mar 29, 2008, 10:10:00 AM said...
-
నా వరకూ అయితే ఇది వాడదగిన పదమే! నా బ్లాగులో కూడా కొన్ని సార్లు వాడి ఉంటిని.
:)
- తెలుగు'వాడి'ని on Mar 29, 2008, 11:10:00 AM said...
-
రమణి గారు : మీకు కలిగిన అనుభవాన్ని ఇక్కడ మీరు పంచుకోవటంతో ఈ టపాకు అందులో నే ప్రస్తావించిన అంశానికి కొంత ప్రాధాన్యత, బలం చేకూరినట్టనిపించింది. ఈ పద ప్రయోగ ప్రస్థానపు తొలి అడుగు మన భావిభారత పౌరుల తొలి పునాదుల్లో కూడా అని మీరు చెపుతుంటే మన తెగులు/తెలుగు పరిణామక్రమ ప్రాభవం గురించి అగమ్యగోచర మనఃస్థితి :-(
- తెలుగు'వాడి'ని on Mar 29, 2008, 11:19:00 AM said...
-
ఒరెమూనా గారు : మంచిది :-)
అంటే మీ ఉద్దేశ్యంలో ఈ పదం .. సందర్భం, ప్రదేశం/ప్రాంతం, చుట్టు పక్కల ఉన్న జనాలతో పరిగణలోకి తీసుకోకుండా వాడదగినదనా !?
మీ అభిప్రాయం తెలిపిన తరువాత నేను దీని గురించి ఇంకా వివరంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను
- సుజాత వేల్పూరి on Mar 30, 2008, 12:21:00 AM said...
-
ఈ మాటకి వివిధ ప్రాంతాల్లో వివిధ అర్థాలున్నమాట నిజమే అయినా, పాజిటివె,లేదా మంచి అర్థం అయితే లేదండీ! 'పోవడం', 'దొంగతనం చేయడం' 'ఫ్రీ గా కొట్టేయడం' లేదా 'నొక్కెయ్యడం 'తిట్టడం' నాకు తెలిసి ఇలాంటి అర్థాలే ఉన్నాయి.అదీ కాక, మనం మాట్లాడే భాష కంటే, పత్రికలు(అవి వెబ్ సైట్లు అయినా సరే)వేరే భాషను, అంటే, మెరుగైన భాషను (అన్ని ప్రాంతాల వారికీ అర్థమయ్యేవిధంగా) వాడాల్సి ఉంటుంది. కన్ ఫ్యూజన్ కి తావిచ్చేవిధంగా ఉండకూడదు.ఉదాహరణకి అనంతపురం జిల్లాలో చీపురు ని పొరక అంటారు. అందరికీ తెలిసిన మాట చీపురే కాబట్టి పత్రికలు ఆ మాటనే వాడాలి. (అనంతపురం జిల్లా ఎడిషన్లో పొరక అని రాస్తే ఓకే ) వివిధ ప్రాంతాల్లో వేరే వేరే అర్థాలున్నా, మొత్తం మీద నెగటివ్ అర్థం ఇచ్చే మాటలని, వినడానికి ఇబ్బందిగా ఉండే పదాలను వాడకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం.
- తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం on Mar 30, 2008, 5:28:00 AM said...
-
పచ్చి వ్యావహారికాలు పచ్చిబూతుల్లాంటివేనన్న సత్యాన్ని గ్రహించి వాటికి సాహితీకారులు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి పదాలకు ఏ మాండలికంలోను మాన్యత లేదు-అవి ఎంత విఱివిగా వాడబడుతున్నప్పటికీ! ఒకరిని అధిక్షేపించడం కోసమైనా సరే, వాటికి లిఖిత/ముద్రితరూపాన్నివ్వడం క్షంతవ్యం కాదు.
- తెలుగు'వాడి'ని on Mar 31, 2008, 12:04:00 PM said...
-
సుజాత గారు : మరొక్క సారి సాధ్యమైనంత వివరంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయటానికి మీ విలువైన సమయాన్ని వెచ్చించినందులకు వేనవేల అభినందనలు మరియు ధన్యవాదములు.
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు : ఎప్పటి మీ వ్యాఖ్యలలాగానే సరళంగా, సూటిగా చెప్పదలచుకున్న భావాన్ని క్లుప్తంగా ముచ్చటగా మూడు ముక్కలలో చక్కగా చెప్పారు. అభినందనలు మరియు ధన్యవాదములు.
- Anonymous on Jul 26, 2008, 5:33:00 AM said...
-
ayya yeppudu kooda telugu bhashanu kincha parachavaddani telugulo.com vaariki na vinnapam
by
bellary