ప్రవాస భారతీయుల జీవన చిత్రం - ఒక కవితగా

Posted by తెలుగు'వాడి'ని on Monday, February 25, 2008

కారణలు ఏమైనా ఆప్యాయతలూ, ప్రేమలూ, అభిమానాన్నీ పంచిన పెద్దలు మరియు అందరినీ, కన్నవారినీ(కొన్నిసార్లు కట్టుకున్నవారినీ), కలిసి పెరిగిన అన్నాతమ్ముళ్లు-అక్కాచెల్లెళ్లు, ప్రాణం కన్నా ఎక్కువగా అనిపించిన స్నేహితులు మరియు బంధుహితసన్నిహితులు, పుట్టిపెరిగిన చదువుకున్న ప్రాంతాలనూ వదిలి ప్రవాసానికి విచ్చేసిన భారతీయుల జీవన చిత్రం, ఆలోచనానుభవ విధానమిదేనేమో.

గమనిక : ఇందులోని ఒక్క అక్షరం ముక్క కూడా నాది కాదు. ఇప్పుడే ఒక మిత్రుడు పంపించిన ఈమెయిల్ లో ఉన్నది.

దీనిని చదివిన తరువాత, సరళమైన పదాలతో, సులభంగా అర్ధమయ్యే భావంతో, అన్ని కోణాలనూ తాకిన, కనులకు కట్టినట్టు చెప్పగలిగిన ఈ కవిత నాకు బాగా నచ్చటంతో మీతో పంచుకోవాలని అనిపించిన ప్రయత్నమిది.

ఇది ఎన్నినాళ్ల క్రితం, ఎవరు, ఏ ఆలోచనానుభవాలతో వ్రాశారో నాకు తెలియదు కానీ ఇందులోని భావంతో సరిపోలగ భావాలు, అనుభవాలు, ఆలోచనలు ఉన్నవాళ్లు కొద్దిమంది అయినా ఉండి ఉంటే ఇది వ్రాసిన వారి జీవితం ధన్యం ... వెలువడిన ఈ కవితకు అమరత్వం.........అందుకు ముందుగా ఆ అజ్ఞాత కవి హృదయానికి ఇదే నా అభినందనలమాల.



నాకు నచ్చిన ఇంకొక విషయం ఏమిటి అంటే ఆ ఈమెయిల్ లో .. NRI కి ఇచ్చిన నిర్వచనం

N R I ::::: Non Returning Indian.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


5 వ్యాఖ్యలు:

రాధిక on Feb 26, 2008, 8:55:00 AM   said...

థాంక్స్ అండి పంచుకున్నందుకు.చాలా రోజుల క్రితం[ బ్లాగులు అలవాటవ్వని కాలం లో అన్న మాట]ఫారంస్ లో తిరుగుతూవుంటే కనిపించింది ఈ కవిత.కళ్ళు తడిచి పోయాయి మొదటిసారి చదివినప్పుదు.ఇప్పుడు కూడా అదే పరిస్థితి.


Unknown on Feb 26, 2008, 9:46:00 AM   said...

Very great Kavitha, chaalaa chaalaa baagundhi.....prathi padhamlonu yentho nijam vundhi.....okka maatalo cheppali antey AKSHARA SATHYAM antaaru choodandi, daanikhi PARIPOORNATHA vachhindhi eee kavithatho ani cheppochhu kachhitham gaa.....

Very good one andi...thanks.


వింజమూరి విజయకుమార్ on Feb 27, 2008, 1:55:00 AM   said...

నిజంగా కవితలోని సబ్జెక్టు ఆర్థ్రమైనది. ఇది పల్లెటూర్లనుండి హైదరాబాదు, ఢిల్లీ లాంటి మహానగరాలకు చేరి తిరిగి తనవారితో కలవలేని అభాగ్యజీవులందరికీ వర్తిస్తుంది. ముందు మీ పేరు చెప్పండి తెలుగువాడిని గారూ. మిమ్మల్నిలా పిలవడానికి బ్లాగర్లు ఎంత యిబ్బందికి గురౌతున్నారో మీరు అర్థం చేసుకోగలరు.


Anonymous on Feb 27, 2008, 7:38:00 AM   said...

నేను కూడా మొదటి సారి ఐదేళ్లక్రితం చదివాను. అప్పుడు ఇప్పుడు కూడా కవిత లొ నచ్చనిది చివరి రెండు పంక్తులే. మిగాతా కవితంతా చాల గొప్పగా ఉంటుంది. కవి ( కవయిత్రి?) అన్యాయంగా రూపాయిని తిట్టి, "ఎస్కేపిష్ట"య్యారనిపిస్తుంది, చివరి ముగింపు చదివితే.
(డబ్బు?) కోరి దూరతీరాలువెళ్లి, రూపాయిని అంటం ఎందుకు.
-ఊకదంపుడు


తెలుగు'వాడి'ని on Feb 27, 2008, 4:05:00 PM   said...

@ రాధిక గారు, రాము గారు, విజయకుమార్ గారు, ఊకదంపుడు గారు : కవిత నచ్చినందులకు మరియు మీ అభిప్రాయాలను పంచుకున్నందులకు పేరు తెలియని ఆ అజ్ఞాత రచయిత(త్రి) తరపున హృదయపూర్వక ధన్యవాదములు.

@ రాధిక గారు, ఊకదంపుడు గారు : నేను మాత్రం ఈ కవిత చూడటం ఇదే ప్రధమం.

@ విజయకుమార్ గారు : మరి కొన్ని రోజులలో తెలియజేస్తాను. అప్పటివరకు మీరు పెద్ద మనసుతో, సహృదయంతో అర్ధం చేసుకుంటారనే ఆశిస్తూ.

@ ఊకదంపుడు గారు :మీరన్నట్లు ఆ 'రూపాయి' ప్రస్తావనతో పలాయనవాదపు ధోరణి అనిపించినా మరియు వాస్తవమే అనిపించినా ... ఆ వాక్యం లేక పోయినా కవిత బాగానే ఉండేదేమో ... కాకపోతే తన ఉద్దేశ్యం ప్రకారం డబ్బులు కోసమే ఇక్కడకు వచ్చాము అని చెప్పే ప్రయత్నంలో ప్రాస(ఒంటరితనం : అవిటితనం) కోసం పోయి ఉండవచ్చు :-)


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting