2007 లో తెలుగు సినిమా - ఒక విశ్లేషణ
TeluguCinema.com మరియు AndhraCafe.com అనే Web Sites లో 2007 లో విడుదలైన తెలుగు సినిమాలు, మన హీరోలు/వారి సినిమాలు హిట్టా-ఫట్టా, దేశ-విదేశాలలో Box-Office Report మరియు Remake ల పరిస్థితి మొదలగు వాటి గురించి విశ్లేషణాత్మకమైన వ్యాస పరంపర ...
నాకు ఏదైనా విషయానికి సంబంధించి మనం చెప్పాలి అనుకుంటే ఏదో నాలుగు ముక్కలు కాకుండా సాధ్యమైనంత వరకు దానికి సంబంధించి అన్ని రకాలైన విషయాలను సంపూర్తిగా చెప్పటానికి ప్రయత్నిస్తేనే ఆ చదివిన వాటిని నేను ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడతాను. (మన బ్లాగ్లోకంలో నేను చదివిన కొద్ది బ్లాగుల్లో, అందులో నాకు ఆసక్తి ఉన్న కొన్ని విషయాలకు (సినిమా, రైతులు/వ్యవసాయం మొదలుగునవి) సంబంధించి తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి వ్యాస పరంపర కూడా నాకు బాగా నచ్చుతుంది.)
TeluguCinema.com :
- List of Films released in 2007
- Box - Office Report 2007
- Abroad Box-office in 2007
- Heroes in 2007: An analysis
- 2007: The Death of Remakes!
కొసమెరుపు : ఏ కారణం చేతనో ఇంకా వీరు మన హీరోయిన్ ల జయాపజయాల గురించి ఏమీ ప్రచురించలేదు. ప్రస్తుతం వారు అదే పనిమీద ఉన్నారో లేక ఇది పెద్ద వ్రాయదగ్గ విషయం కాదనుకున్నారో వారికే తెలియాలి.
AndhraCafe.com :
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
అరుదైన పి.వి నరశింహారావు గారి చిత్రములు మరియు కార్టూన్స్
ఒక అసాధారణ మేధావిగా, రాజకీయ దురంధరునిగా, అభినవ కౌటిల్యునిగా/చాణిక్యునిగా, సాహితీ ప్రియునిగా మరెన్నో విశేష విభవాదిత్యాలతో ఎందరో, ఎందరెందరో దేశ విదేశాలలో ప్రశంసలు, విమర్శలను అందుకున్న/ఎదుర్కొన్న ఒక మహా మనీషి కీ:శే పి.వి నరషింహారావ్ గారు. వీటన్నిటికన్నా, ప్రప్రధమగా ఓ తెలుగువాడు దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించాడనీ ఆ తెలుగు జాతి నాది అనీ చెప్పుకోవటంలో ఒక విధమైన గర్వం తొణికసలాడుతూ ఉంటుంది. అలాగే సంచలనాల నెలవైన నిర్ణయాలతో (ఆర్ధిక విధానాలు, మన్మోహన్ సింగ్ నియామకం మొ:నవి) దేనికీ వెరువక తను అనుకున్న దానితో దేశానికి నవ్యపధ నిర్దేశనం చేసిన దార్శనికుడు. అందుకే ఆయన చిరస్మరణీయుడు. అందులో ఉడతా భక్తిగా నేను ఎప్పుడో సేకరించిన వాటిని మీ ముందుకు తీసుకు వచ్చే నా ఈ చిన్ని ప్రయత్నమిది.






















పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
గత కొద్దికాలంలో నే చూసిన అధ్బుతమైన, సృజనాత్మకమైన వ్యాపార ప్రకటనలు
ఒక పుష్కర కాలం క్రితం నేను సూర్యదేవర రామ్మోహన్ రావ్ గారి 'లక్ష్యం' చదివిన దగ్గర నుంచి, అందులో వ్యాపార ప్రకటనకు ఉన్న ప్రాముఖ్యతను, ఆ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అధ్బుతమైన తెలివితేటతలతో, సృజనాత్మకతో తయారుచేయబడిన ప్రకటనలతో అవి సృష్టించిన సంచలనాలను తెలియజెప్పుతూ రాసిన కొన్ని విషయాలను చదివిన తదుపరి, అదే సమయంలో Mudra Krishna Murthy Garu చాలా simple గా అనిపించే 'Only Vimal' and 'I Love Rasna' భారతీయ వ్యాపార ప్రకటన ప్రపంచంలో సృష్టించిన సంచలనాన్ని చూసిన తరువాత నాకు వీటిపై కలిగిన ఉత్సుకత దిన దిన ప్రవర్ధమానమయ్యిందే కాని ఇంతవరకు తగ్గలేదు. (పైన చెప్పిన వాటి గొప్పతనం నాకు బాగా అర్ధం కావటానికి కారణం కొన్ని సంవత్సరాల పాటు మనం టి.వి, పత్రికలలో చూసిన ప్రకటనలు కూడ .. ఉదా: ఫినాయిల్ బాటిల్ కొంటే రేనాల్డ్స్ పెన్ ఉచితం (స్వాతి లో వచ్చేది ఇది మూడో పేజ్ లో) మరియు ఆంధ్రా షుగర్స్ వారి వంట నూనె కొంటే దువ్వెన, సబ్బు పెట్టుకునే డబ్బా ఉచితం (స్వాతి లో వచ్చేది ఇది కవర్ వెనుక భాగంలో)....
::::::::::::::::::::::::::::::::::::;
::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::::::
::::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
నచ్చిన బ్లాగులు మరియు టపాలు (బ్లాగ్స్ అండ్ పోస్ట్స్)
తెలుగు బ్లాగుల రాశి గతకొద్ది కాలంగా బాగా పెరగటం వలన ఎన్నో, ఎన్నెన్నో మంచి టపాలు (Blog Posts) మనలో చాలా మంది కంట పడకుండానే మరుగున పడిపోతున్నాయి. కాకపోతే మనకందరికీ బాగా తెలిసినట్టుగా కూడలి, తేనెగూడు, జల్లెడ, తెలుగుబ్లాగర్స్ మొదలగు వెబ్ సైట్స్ ఉండడం వలన చాలావరకు మనం ఈ బ్లాగ్స్/పోస్ట్స్ గురించి తెలుసుకోవటానికి చక్కటి అవకాశం కలుగుతున్నది.
కానీ నాకెందుకో ఒక బ్లాగ్ పేరు/అడ్రస్ కన్నా ఆ బ్లాగ్ లో నాకు నచ్చిన పోస్ట్ ని (అంటే ఇది ఒక్కటే నచ్చినదని మిగతావి నచ్చలేదని పెడర్ధాలు తీయకండి సుమా) ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడతాను. అందుకు కారణం ఆ బ్లాగ్ లోకి వెళ్లి అందులో ఉన్న పదుల, వందుల టపాలను చదివే తీరిక ఉండకపోవచ్చు లేక ఆ కొద్ది సమయంలో ఆణిముత్యం లాంటి టపాలు కనపడకపోవచ్చు కనుక మన బ్లాగ్ లోకి కొత్తగా వచ్చే ఆ పదిమందికి ఇలాగైనా కొన్ని టపాలు డైరెక్ట్ గా పరిచయం చెయ్యటం మంచిదేమో అనే ఉద్దేశ్యమే నా ఈ చిన్ని ప్రయత్నం.
ఇలా కాకుండా మనకు అందుబాటులో ఉన్న చాలా బుక్-మార్కింగ్ సైట్స్ లో ఏదో ఒకటి ఎంచుకొని మనకు నచ్చిన అన్ని టపాలు (బ్లాగ్ పోస్ట్ ఆర్ సైట్ అడ్రస్) వాటిలో సేవ్ చేసుకున్న తరువాత ఒక అర్.యస్.యస్ ఫీడ్ తో మన బ్లాగ్ లో వాటిని చూపించవచ్చు. (ఇది నిజంగా చాలా మంచి పధ్ధతి కాకపోతే మనం ప్రత్యేకంగా ఆ సైట్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మరియు ప్రతిసారి లాగిన్ అవ్వాలి కొత్త పోస్ట్/సైట్ బుక్-మార్క్ చేసేటప్పుడు).
ఇక్కడ నేను ముఖ్యంగా Two Blogs గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి.
రాధిక గారి 'స్నేహమా' మరియు చేతన గారి 'నా కెమేరా'. మొదటి దానిలో ఆణిముత్యాల వంటి కవితలు, రెండవ దానిలో అధ్బుతమైన చిత్రాలు (photos). ఎన్ని సార్లు చూసినా/చదివినా మరలా మరలా చూడాలి/చదవాలి అనిపించడం వీటి ప్రత్యేకత, అందుకే వీటి గురించి ప్రస్తావించటానికి ముఖ్యకారణం.
సూచన :
రాధిక గారు : మీరు ఈ మధ్య చాలా విరామం తీసుకున్నారు కాకపోతే ఈ రోజే ఒక కొత్త కవిత చూశాను మీ బ్లాగ్ లో ... దీనితో మీ విరామానికి సెలవు చెప్పినట్లైతే అదే మాకు ఆనందం.
చేతన గారు : మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి చాలా కాలం అయ్యింది కానీ ఇంకా మార్చలేదు. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా చెప్పండి.
కరుణశ్రీ గారి పుష్పవిలాపాన్ని వినిపించిన 'వికటకవి' గారికి, ఉషశ్రీ గారి మహాభారత, రామాయణాలను వినిపించిన 'ఆసా'(ఆస్ట్రేలియా నుంచి సాయి) గారికి ప్రత్యేక ధన్యవాదములు మరియు హృదయపూర్వక అభినందనవందనములు.
మనవి : ఈ క్రింద ఇచ్చిన లిస్ట్ నేను గత కొద్ది రోజులలో చదివిన వాటిలో నాకు బాగా నచ్చిన టపాలు.
మన దేశంలో ఎంతో విలువైన కళాసంపదలని కేజీల లెక్కలో అమ్మెస్తుంటాం – అదే విదేశాలలో అయితే, వాళ్ళ కళా సంపదని అపురూపంగా కాపాడుకొంటారు. మనం - తాతల కాలం నుంచి ఇంట్లో ఉన్న పుస్తకాలని సరిగా పరిరక్షించుకోం సరికదా, వాటి విలువ గుర్తించకుండా, పాత సామానులవాడికో, న్యూస్ పేపర్లు కొనేవాడికో, కిరాణా కొట్టువాడికో – పావలాకో, అర్ధకో అమ్మెయ్యటం సర్వ సాధారణం మన దేశంలో......
ఈ రాజకీయ ఘోష నుంచి కాస్త హాయిగా తెలుగు సాహిత్యం వైపు పయనిద్దాము. అమృతగుళికల్లాంటి కరుణశ్రీ గారి కలం నుంచి జాలువారిన పుష్పవిలాపం మరియు పుష్పాంజలి విందాం. తెలుగు నేలలో అంతో ఇంతో సాహిత్యంతో పరిచయమున్నవాళ్ళందరికీ ఇది చిరపరిచితమే. ఆశ్చర్యమేమంటే, పద్యాల్లో భావం పుష్పాల యొక్క విలాపమే అయినా, ఆ బాధతో పాటు పద్యాల్లోని తీయనైన సాహితీసంపదను కూడా ఆస్వాదించవచ్చు. ఇందులో సాహిత్యం, గానం మరియు సంగీతం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లు అనిపిస్తుంది. వినండి.
ఒకవేళ ఇలాంటివే మరికొన్ని బ్లాగులు/టపాలు తెలుసుకోవాలి/చదవాలి అనుకుంటే రెండవ , మూడవ , నాలుగవ భాగాలుగా నేను ప్రచురించిన టపాలలో చదవవచ్చు/చూడవచ్చు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..