మౌనంగానే ఎదగమనీ - నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ సినిమాలోని పాట

Posted by తెలుగు'వాడి'ని on Thursday, November 22, 2007

నాకు బాగా నచ్చిన సినిమాలు, పాటల గురించి నా ఆలోచనలను, అభిప్రాయాలను నాకు తోచిన రీతిలో, సాధ్యమైనంత విశ్లేషణాత్మకంగా వ్యక్తపరచుటకు, నాలో పెల్లుబికిన నూతనోత్సాహపు ప్రత్యూషపవనం నా మబ్బుల మదిని తాకిన ఈ క్షణాన విరచించబడిన నా ఈ మొదటి ప్రయత్నం తేలిపోయే పిల్లమబ్బులా ఈ ఒక్క దానితోనే మిగిల్చిపోతుందో లేక చిరుజల్లులు కురియించు చందంగా మరికొన్ని రాయుటకు ఉత్తేజాన్నిస్తుందో లేక ప్రళయకాల ఝుంఝూనిలమారుతమై ఒక సునామీ కెరటమై నేను చెప్పదలచుకున్నవన్నీ నా ఆలోచనాభిప్రాయాల సంద్రంలో నుంచి తీరమనే బ్లాగ్-పోస్ట్స్ లోకి విసిరి కొట్టే వరకు నన్ను వెన్నంటి ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.

ఇక మనం పైన పేర్కొన్న పాటకు సంబంధంచిన విషయంలోకి వెళితే.....

హీరోగారి రెండో ప్రేమకధ కేరళకు మారినప్పటి నుంచి ఇదేదో మళయాళం సినిమా చూస్తున్నామన్న భావన అనే కష్టాల కడలిని ఈదితే, ఈ మౌనంగానే ఎదగమనీ అనే ఆణిముత్యం లాంటి పాట దొరకటం నిజంగా ఒక అందమైన అనుభూతి. ఈ తెలుగు సినిమాలో మళయాళం గోల గురించి, ఇంకా పర భాష-రాష్ట్ర, పద,వాక్య, సన్నివేశ, ప్రదేశాల కూర్పుతో మన తెలుగు సినిమా గురించి, తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడో లేక పైన ఉన్న ఆ లంకెనైనా క్లిక్కండి....

ఒకవేళ మీకు ఈ పాట చూడాలి అని ఉంటే ఈ దిగువన ఉన్న లింకుని నొక్కండి...లేదా మీకు YouTube లో(చాలా మంచి కామెంట్స్ రాశారు) చూడాలి అంటే ఈ లింకుని నొక్కండి లేదా క్రింద ఉన్న వీడియోపై డబుల్ క్లిక్ చెయ్యండి....

మౌనంగానే ఎదగమనీ(భూమిక), ఒవ్వొరు పోక్కళమే(స్నేహ) మౌనంగానే ఎదగమనీ(భూమిక), ఒవ్వొరు పోక్కళమే(స్నేహ)

YouTube లంకె(తెలుగు):వీడియో - మౌనంగానే ఎదగమనీ(భూమిక)
YouTube లంకె(తమిళం):వీడియో - ఒవ్వొరు పోక్కళమే(స్నేహ)

ఈ పాటగురించి చెప్పాలి అంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, మొదలు పెట్టిన తరువాత ఎక్కడ ఆపాలో తెలియనట్టుగా .... ఒక దానికొకటి మమేకమై మనలోని పంచేద్రియాలు ఏకకాలంలో ...ఈ పాటలో చంద్రబోస్ సాహితీ పటిమను, కీరవాణి సుమధుర సంగీతాన్ని, భూమిక ప్రశాంత స్థిరచిత్త హావభావ ముగ్ధ మనోహర సౌందర్యాన్ని, కోయిల కలకూజిత చిత్ర గాత్ర మాధుర్యాన్ని చవి చూస్తూ ఒక అయిదు నిముషాలు కాలమే స్తంభించిందా అనిపించేలా, మనసుకు హత్తుకుపొతూ, ఒక రకమైన ఉత్తేజాన్ని, సూర్తినీ రగిలిస్తుంది.

ఈ పాటలో నాకు బాగా నచ్చిన ఆణిముత్యాల వంటి (మచ్చుకి) కొన్ని చరణాలు : [పూర్తి లిరిక్స్ ఈ పోస్ట్ చివరలో ఇమేజెస్ రూపంలో ఉన్నాయి...కావాలంటే సేవ్ చేసుకోండి.]

ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుందీ....
......
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చిందీ....
విసుగే చెందక కృషి చేస్తేనే అమృత మిచ్చిందీ...
.....
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ ...
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ...

(పైన చెప్పినవన్నీ తమిళంలో పాటకు కుడా చక్కగా వర్తిస్తాయి కాకపొతే మనకు ఆ పాట అర్ధం తెలియ(లే)దు, మరియు భూమిక బదులు స్నేహ ఉంది....మిగతా వివరాలు మనకు తెలియవు ....)

[తెలుగు, తమిళ భాషల్లో ఈ పాటకు ప్రాణం పోయుటలో అణువంత ప్రమేయం ఉన్నా కూడా ఆ అందరికీ పేరుపేరునా ఇవే నా హృదయపూర్వక నమఃసుమాంజలి .... మీ కృషి, కష్టం అజరామరం .... దాని ఫలితం అనవరతం ఆనంద, స్ఫూర్తిదాయకం.]

ఈ పాటలొ భూమికకు చీర కడితే పాటకు-భూమికకు-పాట నేపధ్యానికి-ఆ స్టేజీ వాతావరణానికి ఇంకా బాగా నిండుదనం వచ్చేదేమో అనిపించింది ఈ పాట చూస్తున్నంత సేపూ .... ఏమోలే మన తొక్కలో అలోచనలు అంటే డ్రస్ వేస్తే చీరైతే, చీర కడితే డ్రస్ అయితే అనుకునే టిపికల్ అని నన్ను నేనే కొంచెం సేపు తిట్టుకోని ఇక ముయ్యమని సర్ది చెపుతున్నంతలో...ఈ పాటల రచయిత, సంగీత దర్శకుడు, పాడిన వారి గురించి తెలుసుకుందామని గూగ్లిస్తే, తమిళంలొ స్నేహ పాడిన పాట తగిలింది YouTube లో .... అందులో కూడా మన స్నేహ పంజాబీ డ్రస్ లొ నే ఉంది....అప్పుడు అర్ధం అయ్యింది అసలు విషయం :) మన తెలుగు సినిమా వాళ్ల గురించి తెలిసి కూడా తొందరపడి ఇందాక నన్ను తిట్టుకున్నాను అని గుర్తుకు వచ్చి అందుకు మరలా ఇంకొక సారి తిట్టుకోని (ఆ! మనకేమన్నా సిగ్గా పాడా మరలా మామూలే)...ఆ బాధ అంతా స్నేహను చూస్తూ(పంచేద్రియాలలో శ్రవణం (మనకు ఆ తమిళం అర్ధం అయ్యి చావదు కదా) వాటా, నయనానికి బదిలే చేస్తే ఆ ఆనందం చెప్పేది ఏముంది...ఎందుకంటే స్నేహ ముగ్ధమనోహరంగా, మనసుకు ఇంపుగా, కనులకు పండుగగా ఉంది) మర్చిపోయాము.......

ఒక వేళ మీరు ఈ పాట లిరిక్స్ ని డౌన్-లోడ్ చేసుకొవాలి అంటే కింద ఉన్న JPEG ఇమేజెస్ ను సేవ్ చేసుకోండి.


<-1:2->


ఒక చిన్న (సరే సరే పెద్దదేలే) విన్నపం : మన బ్లాగ్మితృలలో ఎవరైనా ఈ పాట తమిళ్ వెర్షన్ కు .. ఏ చరణానికి ఆ చరణం తెలుగు లో కి అనువదించి కొంచెం (ఓకే ఓకే చాలా) పుణ్యం కట్టుకోగలరా...వారికి ముందుగానే వేనవేల కృతజ్ఞతాభినందనవందనములు)




3 వ్యాఖ్యలు:

Murthii on Nov 28, 2007, 3:13:00 AM   said...

Ovvoru pookalume solgiradeee...vaalvendraal poraadum porkalame...
ovvoru vidiyalume solgiradeee....iravaanal pagalondru vandidumeee...

Every flower is saying "life is a battle to fight"...
Every sunrise is saying "there will be a light after every dark(night)"...

vaalkai kavidai vaasippom vaanam alavu yosippom
muyarchi endra ondrai mattum moochi pola swasippom...

Let’s sing life’s poetry....lets think sky high...
Let’s inhale like air words "keep trying..."

latcham kanavu kannodu...latchiyangal nenjodu...
unnai vella yaarum illai urudiyodu poraadu...

Lakhs of dreams in our eyes...lakhs of ambitions in our heart...
There is no one to succeed you...keep working with confidence...


uli taangum karkal daane man meedu silaiyagum
vali taangum ullam daane nilaiyana sugam kaanum...
yaarukillai poraattam kannil enna neerottam
oru kanavirundal adai dinamuyandraal nam

A stone which gets hit by becomes beautiful statue
Heart which gets hit by pain\sorrow finally gets happiness...
Who in this world doesn’t have pains....why tears in eyes....
If u have dream and if u keep trying def one day it will become true...

Hi TeluguVaadini ,
I have translated the Tamil Song with on of colleague, I think she tried her level best to convey the meaning in English, so can you kindly translate the same into Telugu so that it can reach more number of bloggers


తెలుగు'వాడి'ని on Nov 29, 2007, 1:03:00 PM   said...

msn murthy గారు, మీకు మరియు మీ కోలీగ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభినందన నమఃసుమాంజలి.

Tried to translate the best I could with in this short time (spending some more time I think this will get better but I just want to let the message to go out first)

వికసించే ప్రతి కుసుమం చెపుతుందీ ... జీవితమంటే యుధ్ధమనీ
ఉదయించే ప్రతి కిరణం తెలుపుతుందీ .. చీకటి వెంటే వెలుగొస్తుందనీ

జీవితమెప్పుడు ఒక పాటగ పాడుకో .... ఆలోచనలెప్పుడు ఆకాశమంత ఎత్తులో ఉంచుకో
మరియొక సారి ఉన్నదని నిత్యం మననం చేసుకో...

మన కన్నుల్లో కలలెన్నో ... మన గుండెల్లో లక్ష్యాలెన్నో
వేరొకరెవరూ నిన్ను గెలిపించగ లేరనీ తెలుసుకో... నీ పై నమ్మకమే నిన్ను గెలిపిస్తుందని గుర్తుంచుకో ...

ఉలి దెబ్బలు పడితేనే ఏ రాయైనా అందమైన శిల్పంగా మారేది
కష్టాల బాధ తెలిసుంటేనే ఏ హృదయానికైనా ఆనందంలోని తీపి తెలిసేది.

లోకంలో బాధలన్నవి లేని దెవరికనీ .... మరి కన్నులలో ఆ కన్నీరెందుకు
కలలన్నవి ఉంటే..మరియొక సారని ప్రయత్నిస్తూ ఉంటే .. అవే నిజమౌతాయి.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting