ప్రముఖ దినపత్రికలలోని కార్టూన్ ల మరియు ప్రజాభిప్రాయసేకరణల పరంపర - మొదటిది ( వై.యస్.ఆర్ :: ప్రభుత్వ పాలన)

Posted by తెలుగు'వాడి'ని on Friday, January 18, 2008

మనం ప్రతి రోజూ చదివే తెలుగు దినపత్రికలలో (ఈనాడు , ఆంధ్రజ్యోతి మొదలుగునవి) .. అలాగే Internet లో ఉన్న తెలుగు Web Sites (AndhraCafe , TeluguLo , ThatsTelugu etc) లో ప్రచురించబడే కార్టూన్స్ మరియు ప్రజాభిప్రాయసేకరణలు అన్నింటినీ ఒక సమూహంగా చేసి, వాటిలోనుంచి కొన్ని విభాగాలుగా .. వై.యస్.ఆర్ మరియు ప్రభుత్వ పాలన, తెలుగుదేశం మరియు చంద్ర బాబు, సోనియామన్మోహనీయం మరియు కేంద్ర ప్రభుత్వ పాలన మొదలగునవి...తయారు చేసి మీకందించాలనే ఓ చిన్న ప్రయత్నమిది.

అసలు దినపత్రికలు చదవటం మొదలుపెట్టింది ఈనాడుతో అయితే అందులో శ్రీధర్ కార్టూన్, ఇదీ సంగతి చదవటం, హెడ్డింగ్స్ పైపైన చూడటం వెంటనే వెనుక పేజ్ లో ఉన్న క్రికెట్ వార్తలు చదవటం ...వెనువెంటనే..కొంపలు మునిగి పోయే వేగంతో(ఏ హీరో/సినిమా/రికార్డ్స్ కు సంబంధించి ఎంత పేజ్ వేశారు అనే ఆతృతతో) అలాగే ఆ రోజులలో సినిమా బొమ్మలు ఎక్కువగా వేసే ఆంధ్రజ్యోతిని చూడటం కూడా దైనందిన చర్యలో అతి ముఖ్యమైన ఘట్టమంటే అతిశయోక్తి కాదేమో ... [ కారణాలు ఏవైనా గానీ అలాంటి పత్రికలను ఇప్పుడు చదవటం తగ్గించటం ... ఒకవేళ చదివినా ఆ వార్తలపై నమ్మకం ఉండకపోవటం ... నిజంగా మన పత్రికారంగానికి పట్టిన దౌర్భాగ్యమేనేమో ]

ఇంతకు ముందు టపాలలో చెప్పినట్టు, నాకున్న కొన్ని అభిరుచులలోవ్యాపారప్రకటనలకు సంబంధించి ....గత కొద్దికాలంలో నే చూసిన అధ్బుతమైన, సృజనాత్మకమైన వ్యాపార ప్రకటనలు.. బొమ్మలు/కార్టూన్స్ Save చేయటం గురించి ... అరుదైన పి.వి నరశింహారావు గారి చిత్రములు మరియు కార్టూన్స్ ... మరియు Captions గురించి తెలుగు బ్లాగులు :: వాటి కాప్షన్ .... ఆ రోజులలో అయితే ఈనాడులోని శ్రీధర్ కార్టూన్, ఇదీ సంగతి, క్రికెట్ అయితే కపిల్ దేవ్ వార్తలు మరియు ఆంధ్రజ్యోతి/జ్యోతిచిత్ర/సితార లలో అయితే సినిమాలకు సంబంధించిన అన్ని బొమ్మలూ కత్తిరించి దాచుకోవటం ఒకటి ... ఇప్పుడేమో Internet లో మొదటలో అయితే Right Click నొక్కి Save చేయటం ... కొత్తగా చేరిన అనుభవం/(అతి)తెలివితేటలతో మనకు Internet లో లభ్యమవుతున్న Crawlers, BOTs and Download Mgrsతో దరిదాపుగా మన తెలుగు సైటులన్నింటినుంచీ మూకుమ్మడిగా Download చేయగలగటం తో కుప్పలుతెప్పలుగా నా HardDisk లో పేరుకుపోయిన వీటికి మోక్షం ప్రసాదిద్దామని చేస్తున్న ప్రయత్నానికి ప్రతిరూపమే ఈ టపా ....

ముందుగా మొదలు పెడుతున్నది .... ఈనాడు కార్టూన్స్ తో ... వై.యస్.ఆర్ మరియు అతని ప్రభుత్వ పాలనపై ... రాబోయే టపాలలో మిగతా పత్రికలు, వ్యక్తులు, పార్టీల గురించి చూద్దాం.

సూచన / మనవి / హెచ్చరిక : కార్టూన్స్ మొత్తం 30 ఉన్నాయి .... స్పీడ్ కొంచెం స్లో గా పెట్టాను ... మొత్తం సమయం ఒక నాలుగు/అయిదు నిముషాలు తీసుకోవచ్చు ... అన్ని కార్టూన్స్ అయిపోయినాక మీకు Play బటన్ కనపడుతుంది....

ఒకవేళ మీకు ఈ Slides ఈ బ్లాగుకు బయట అంటే Slide.com సైట్ కు వెళ్లి చూడాలి అనుకుంటే నొక్కండి ఇక్కడ :

వై.యస్.ఆర్ ప్రభుత్వ పాలనపై ఈనాడు కార్టూన్స్ : చూపించండి

లేదా

మీరు ఇదే Slide Show ను Flickr స్టైల్ లో అంటే క్రింద అన్ని Pics చూపిస్తూ ఒక Powerpoint Presentation లాగా లేదా మీరు ఏ కార్టూన్ నొక్కితే అదే Play అయ్యేలా కావాలి అంటే కింద నడుస్తున్న Slide Show లో ఏ కార్టూన్ మీద అయినా నొక్కండి.


సూచన / మనవి / హెచ్చరిక : కార్టూన్స్ మొత్తం 30 ఉన్నాయి .... స్పీడ్ కొంచెం స్లో గా పెట్టాను ... మొత్తం సమయం ఒక నాలుగు/అయిదు నిముషాలు తీసుకోవచ్చు ... అన్ని కార్టూన్స్ అయిపోయినాక మీకు Play బటన్ కనపడుతుంది....
:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::విషయ సూచికలు :


5 వ్యాఖ్యలు:

oremuna on Jan 19, 2008, 7:12:00 AM   said...

ఆర్యా!

మాక్కూడా ఇలా ఈనాడు కార్టూన్లు అన్ని ఓ చోట చూసుకోవాలని చాలా ఘాఠ్ఠీ కోరిక, కాకపోతే కాపీరైట్ ఉల్లంఘన అని బయం. :)


Ram on Jan 19, 2008, 7:18:00 AM   said...

thx ande, meeru gurthunchukoni naa blog ni chusaru, naku viluvaina comments icharu, samayabhavam valla naa blog ni pattinchukovatam ledu,

meeru ichina link chusanu, ade Mac lo, Win lo telugu kanapadutundi kani sariga vundadu FF vadethey. Bahusa next version tho ee problem ni solve chestaremo mozilla vallu.

thanks


తెలుగు'వాడి'ని on Jan 19, 2008, 11:05:00 PM   said...

oremuna గారు : ప్రతి కార్టూన్ ని నొక్క కుండా అన్నీ ఇలా slides లో పెట్టి కుర్చీలో వెనక్కి వాలి హాయిగా enjoy చేద్దామనుకున్నాను గానీ .... మీరు ప్రస్తావించిన Copy Rights విషయం ఒక్కసారి కూడా నా బుర్రలోకి రాలేదండి అసలు :-( నన్ను భలే సందిగ్ధావస్థలో పెట్టారుగా ... కానీ ఖచ్చితంగా ఇది ఉల్లంఘన కిందకే వస్తుంది .... కనుక ఈ టపాలకు కొంత విరామం ఇచ్చి చూస్తే మంచిదేమో అనిపిస్తుంది .. !??!


రాజేంద్ర కుమార్ దేవరపల్లి on Jan 20, 2008, 12:27:00 AM   said...

అయ్యా,ఏపత్రికలో ప్రచురితమైన విషయం ఐనా చివరకు సంపాదకునికి లేఖలు తో సహా వారికే సర్వంసహా కాపీరైటు హక్కులు దాఖలు పడి ఉంటాయి.సదరు వారి అనుమతి లేకుండా ప్రచురించటం చట్టఉల్లంఘన కిందకు వస్తుంది.ఇదేమాట ఆర్మూరు న్యూసు పేరుతో వస్తున్న బ్లాగరకు కూడా చెప్పాలి.


తెలుగు'వాడి'ని on Jan 20, 2008, 9:25:00 PM   said...

రాజేంద్ర గారు : The Copy Rights issue just slipped my mind with the excitement of, can upload tens of images at a time and can prepare this presentation with in few minutes with all the effects. కానీ ఖచ్చితంగా ఇది ఉల్లంఘన కిందకే వస్తుంది...అందుకే వీటిని ఇంతటితో ఆపివేసి, ఈ టపాను కూడా తీసివేస్తాను.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting