మీకు ప్రత్యేకమైన తేదీన(ఉదా:పుట్టిన/వివాహం) లేదా సంవత్సరంలో, ప్రపంచ సినీపరిశ్రమలో ఎవరు పుట్టారు, వివాహం చేసుకున్నారు లేదా చనిపోయారో తెలుసుకోవాలని ఉంటే!

Posted by తెలుగు'వాడి'ని on Monday, February 4, 2008

మనలో చాలా మంది .. తల్లిదండ్రులలో, స్నేహితులలో, ఉబుసుపోక కబుర్లలో ... లేదా ఏదో ఒక సందర్భంలో....మన పుట్టిన తేదీని బట్టి మీరు అంతటి గొప్పవారు అవుతారు(అవవచ్చు) అనీ, వివాహ తేదీ అయితే చాలా మంచి రోజు అనీ, ఫలాన వారు అదే తేదీలో(కల్యాణ మండపంలో) చేసుకుని మంచిగా ఉన్నారనీ... అదనీ, ఇదనీ వినే/వింటూనే ఉంటాము.

ఉదాహరణకు మీరు పుట్టిన తేది మే 28 అయితే అన్నగారు అంత, మే 31 అయితే సూపర్ స్టార్ కృష్ణ అంత లేదా మే 27 అయితే రవిశాస్త్రి అంత గొప్పవారు అవుతారు అని వింటూనే ఉంటాము.

నేను IMDb Web Site లో వేరే సమాచారం చదువుతూ ఉంటే, యాధృచ్చికంగా నాకు కనిపించిన ఈ లంకె కొంచెం interesting గా అనిపించి మీతో పంచుకుందామనే ప్రయత్నమిది ...

ఈ దిగువన ఉన్న లంకె మీద నొక్కండి ....

మీకు ప్రత్యేకమైన (ఉదా: పుట్టిన/వివాహం) తేదీన , ... ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలో ఎవరెవరు పుట్టారు, వివాహం చేసుకున్నారు లేదా చనిపోయారో తెలుసుకోవాలని ఉంటే ...

మీకు ప్రత్యేకమైన సంవత్సరంలో పుట్టిన లేదా వివాహం చేసుకున్న లేదా చనిపోయిన వారి పేర్లు తెలుసుకోవాలి అనుకుంటే ...

ఇకపోతే మీరు చేయవలసిందల్లా ... ఆ పైన ఉన్న లంకెలలో మీకు సంబంధించిన సంవత్సరం లేదా తేది మరియు నెల మార్చుకోవటమే .....

అది ఎలాగో తెలియకపోయినా లేదా తప్పులు చేస్తున్నా లేదా బాగా గందరగోళంగా అనిపించినా ... సులభమైన మార్గం ఏమిటి అంటే ... మొదటిగా ఆ పైన ఉన్న లంకెను నొక్కండి...ఇప్పుడు మీరు ఆ site లో కి వెళ్లిన తరువాత, ఎడమ వైపున Search Boxes లో లేక Drop-Downs లో మీకు కావలసిన వివరాలు ఇవ్వటమే ...

చూసుకోండి మరి ... మీకు తెలిసిన, నచ్చిన నటీనటులు, దర్శకులు మొదలగు వారితో మీకు ప్రత్యేకమైన తేది, సంవత్సరం జత కలిశాయేమో ... మీరు నిజంగా అంతవారు అయ్యారా, అందులో కొంతైనా అయ్యారా లేక అయ్యే మార్గంలో ఉన్నారా ... వీలయితే పంచుకోండి ఆయా వివరాలు ఇక్కడ ... సరదాగానే సుమా

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::విషయ సూచికలు :


0 వ్యాఖ్యలు:

Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting