బ్లాగర్ నుండి ఉచితంగా మీకు ఫోన్ చేయటం మరియు వాయిస్ మెయిల్ వదిలిపెట్టటం ఎలా

Posted by తెలుగు'వాడి'ని on Friday, February 22, 2008

మీ బ్లాగుకు వచ్చిన పాఠకులు అందులోని టపాలను చదివేటప్పుడు ఒకవేళ వారు మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే లేదా మిమ్ములను వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే ... ఇప్పుడు గూగుల్ వారు తమ బ్లాగర్ లో(ఇది ఒక్క బ్లాగర్ లోనే కాదండీ ... ఎవరైనా, ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు) ఆ సదుపాయాన్ని కలుగజేశారు.

ఇందుకు సంబంధించి మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటే తెలుసుకోవచ్చు ఇక్కడ లేదా ఒకవేళ డైరెక్ట్ గా మీరు signup చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్లవచ్చు.

ఇది ఇప్పటికిప్పుడు మన తెలుగు బ్లాగర్లకు పెద్దగా ఉపయోగం అనిపించకపోవచ్చు ... కానీ దీనిని నేను ఇక్కడ పరిచయం చేయటానికి మూడు ముఖ్య కారణాలు ఏమిటి అంటే ..

1. ఈ టెక్నాలజీ ఇప్పటికే పాశ్చాత్య దేశాలలో చాలా విరివిగా వాడబడుతున్నది (ముఖ్యంగా ఒకటి, రెండు కన్నా ఎక్కువ ఉంటే .. One Number for All) కనుక మనం దీని గురించి కొద్దో గొప్పో తెలుసుకుంటే ఉపయోగం ఉంటుందేమో అనే ఉద్దేశ్యం.

2. ఒక్కొకసారి మంచి టపాలు చదివినప్పుడు వ్యాఖ్యగా ఏమి వ్రాయాలో తటాలున తట్టకపోవచ్చు లేదా మనం చెప్పాలి అనుకున్నది ఇంతకు ముందే ఎవరో చెప్పేసి ఉండవచ్చు ..లేదా తెలుగులో వ్రాయటానికి బద్దకం (ప్రస్తుతం ఉన్న విధానాల వలన .. బ్లాగర్ లో కొత్త పోస్ట్ వ్రాసేటప్పుడు ఉన్నట్లుగా, కామెంట్ బాక్స్ లో కూడా డైరెక్ట్ గా తెలుగులో వ్రాసే అవకాశం వస్తే ఇది చాలా వరకు తగ్గవచ్చు)..... వ్యక్తిగతంగా ఏదైనా సహాయం/వివరాలు కావలసి వస్తే ... లేదా ఫోన్ లో అయితే నాలుగు ముక్కలు సులభంగా చెప్పగలమేమో అనుకుంటే ... ఇలాంటి సందర్భాలలో దీనిని ఉపయోగించుకోవచ్చు.

3. ఇది మిమ్ములని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ఇక్కడి నుంచి వచ్చే కాల్స్ అన్నీ ఆటోమాటిక్ గా వాయిస్ మెయిల్ కు మళ్లించుకునే సెట్టింగ్ ఉండటం

కాకపోతే దీని మన అనామిక/అనామకులు misuse చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ... సందేహమే లేకపోవచ్చు... నేను కొంచెం ధైర్యం గానే ఇప్పటికే ఇది నా బ్లాగ్ లో పెట్టాను (కాకపోతే వీటి గురించి ఇదివరకే తెలియటం/ఉపయోగించటం వలన ఇది మీకు చూపిద్దామని ఉంచాను .. కనుక ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.....ఆలకించిన ఆశాభంగం.....త్వరగా ఉపయోగించుకోండి) ......... చెడు ఫలితాలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేస్తాను :-)

ఉండి ఉంటే :

ఈ వాయిస్ మెయిల్ లో పాఠకులు వుంచిన మెసేజెస్ లో నుంచి ఆయా టపాలకు సంబంధించి అభిప్రాయాలు ఉంటే అందులోనుంచి అ బ్లాగ్ సొంతదారు కనుక ఆ మెసేజ్ ను ఆడియో వ్యాఖ్యగా చూపించదలచుకుంటే ఆ మెసేజ్ ను ఆ టపాకు పోస్ట్ చేసుకునే సౌలభ్యం ఉండి ఉంటే మనకు ఇంకా బాగుండేదేమో ...

ఇప్పుడే అందిన/చదివిన/చూసిన వార్త ... మనందరికీ ఎంతో శ్రవణానందకరమైన వార్త ... పాఠకులు ఉంచిన వాయిస్ మెయిల్ ను కావాలి అనుకుంటే మనం మన బ్లాగు పోస్ట్ కు జతచేయవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


3 వ్యాఖ్యలు:

Unknown on Feb 22, 2008, 11:01:00 PM   said...

బాగుంది. మంచి సమాచారం. నేనెప్పుడూ ఇలాంటివి వాడలా.

మీకు బాగా పని చేస్తే (ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ) ఏ విధంగా ఉపయోగపడిందో చెప్పగలరు.


aravind on Feb 22, 2008, 11:21:00 PM   said...

నేను ప్రయత్నించాను...కానీ country India అని ఇవ్వగానే when ever we expand to your country we will notify you...

సొ అది India లొ పని చేయదన్నమాట...
ముందే చెప్పంచుకదండీ..


తెలుగు'వాడి'ని on Feb 27, 2008, 4:34:00 PM   said...

@అరవింద్ గారు : ఈ టపా వ్రాసేటప్పుడు country విషయం అసలు నా మొదడులోకి దూరలేదండి. సహజంగా నేను నా టపాలన్నీ చాలా వరకు విపులంగా వ్రాయటానికే ప్రయత్నం చేస్తాను...అలాగే ఇలాంటి విషయాలలో ఇంకా జాగ్రత్తగా ఉంటా కాకపోతే ఈ టపా విషయంలో కొంత excitement కి గురి అవ్వటం(వివరణ దిగువన) వలన ఆ country point miss అయ్యాను.

@ప్రవీణ్ గారు : వివరణ ఆంగ్లంలో ఉన్నందుకు ఏమీ అనుకోకండి. తెలుగులో వ్రాద్దామని ఇంకా ఆలశ్యం చేసి మీకు ఈ విషయంపై ఉన్న ఆసక్తిని చంపెయ్యటం ఇష్టం లేక ఇలా...

I worked as an Enterprise Architect for a startup (for a friend but later he dropped the idea as no funding from VCs and Angel Investors) which actually the same exact concept. That time I did a lot of R&D on this very same idea. That's why I got excited when I read the concept now part of Blogger from Google.

List of very exciting features :

This link summarizes MOST of the features I like about this service ::::

One number for all your phones, for life

Know who is calling and screen unknown callers

Hear why someone is calling before taking the call

Personalize your voicemail greetings by caller or group


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting