Conservation of Energy గురించి TCS వారి Annual Report లో ఏముందో చూడండి

Posted by తెలుగు'వాడి'ని on Thursday, June 12, 2008

కబుర్లూ .. కాకరకాయలూ ... అనే బ్లాగ్ లో ప్రచురించిన టపా TCS Annual Report 2007-08 లో లేవనెత్తిన సందేహానికి సమాధానం తెలుసుకుందామనే నా ప్రయత్నంలో నేను చదివిన TCS Directors Report రిపోర్ట్ లో Conservation of Energy గురించి TCS వారు ప్రకటించిన వివరాలు చదివాక ఇంత గొప్ప(?) కంపెనీ చూపిస్తున్న శ్రధ్ధ గురించి మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో అనే ఉద్దేశ్యమే నా ఈ టపా ..

ఇది ఒక్కటి చేయనంత మాత్రాన అది గొప్ప కంపెనీ కాకుండా పోతుందా అంటే ... అలాగని కాదు ... మన వంతు బాధ్యతగా ఇది చేస్తున్నాము అని తెలిస్తే నా వరకు నాకు ఒక భారతీయునిగా (ఒక ప్రముఖ కంపెనీ/సంస్థ/people చేస్తుంటే) నిజంగా గర్వంగా, ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీస్ చేస్తే వాటి impact/results కూడా అదే స్థాయిలో ఉంటాయి అలాగే అవి దూరదృష్టితో కూడినవై ఉంటాయి మరియు సామాన్య జనాలలో కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

CONSERVATION OF ENERGY

The operations of the Company involve low energy consumption.
Adequate measures have, however, been taken to conserve energy.

అంతే .. అంతకు మించి ఇంక ఏమీ లేదు ... అలాగని వీళ్లు అసలు ఏమీ చెయ్యటం లేదేమో అని అనుకుందాము అంటే అది నమ్మశక్యంగా అనిపించటం లేదు ... ఖచ్చితంగా ఏవో కొన్ని అన్నా చేస్తూ ఉంటారు కదా .. కనీసం వాటి గురించి వివరాలన్నా ఇచ్చి ఉండవలసింది ... మిగతా టాపిక్స్ అన్నిటి గురించీ పేరాలు, పేరాలు ఉన్నాయి ... ఎడిషనల్ బుక్లెట్స్ జతచేసి మరీ వివరించారు ...

ఇంకా కొంచెం శ్రధ్ధ పెట్టి కనీసం ఒకటో రెండో వివరాలు ఇస్తే ఎంత బాగుండేది ...

IBM's(documented baseline energy conservation and CO2 emissions reduction since 1990) report :

ఆశ్చర్యంగా ......

రెండే రెండు విషయాలలో మాత్రమే ...

2005 కన్నా 2006 లో ప్రగతి కనిపించింది (Highlighted with Blue border)

...

మిగిలిన అన్ని విషయాలలో 2005 లోనే బాగుంది (Highlighted with Red border)

or

Did I read the data wrong?

ఇక అసలు విషయానికి వస్తే ..

ఇప్పుడు నా కన్ను దీనిమీద ఎందుకు పడింది అంటారా ... ఈ మధ్య అంతా గ్లోబల్ వార్మింగ్ గురించే కదా .. అది ఒక ప్రధాన కారణం అయితే ... రెండవది మరియు అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ...

మొన్నీ మధ్య IBM వారి సైట్ లో నేను ఒక ఆర్టికల్ : A day in a low carbon life ... What might it be like to lead a business in 2012? చదివినప్పుడు ముందు కొంత ఆశ్చర్యపడ్డా ... వీళ్లు కొంచెం 'అతి/ఎక్కువగా' చెపుతున్నారేమో/ఆలోచిస్తున్నారేమో అని .. కానీ ఇంత పెద్ద కంపెనీ కదా, అంత ఆషామాషీగా ఎందుకు చెపుతారు ఇలా .. మన బుర్రకి అర్ధమయ్యే/ఊహించే స్థాయికన్నా కొంచెం ఎక్కువ చెపుతున్నారులే అని సరిపెట్టుకున్నా .. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ... ఆ రోజు ఎంతో దూరంలో లేదు అని ..

కొంచెం ఓపిక చేసుకుని చదవండి ... Very good article.

Few lines from the above mentioned article/PDF :

I knew carbon management was going to be a big issue, but I never dreamed that it would be so central to our reporting and performance,
he read.

.................................

News just in…we can confirm that the SEC will be investigating claims that a Fortune 500 company falsified carbon submissions in their latest company report. More now from our reporter in Montana…


నిజంగా ఈ TCS వాళ్లు ఏమి చేస్తున్నారో తెలుసుకుందాము అనే ఉత్సాహంతో అడుగుతున్నా .... మన ఈ బ్లాగ్ప్రపంచంలో లో ఎవరికన్నా తెలిస్తే వివరాలు తెలుపగలరు ...

FYI : ఒకవేళ మీరు వ్యాఖ్య రాస్తే మీరు TCS లో పనిచేస్తున్నారేమో అని పొరపాటు పడే ప్రమాదం ఉంది అనుకున్నా లేక మీ పేరు తెలపటం ఇష్టం లేకున్నా .. నా బ్లాగ్ లో మీరు anonymous గా వ్యాఖ్యలు రాసే సదుపాయం ఉంది

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


0 వ్యాఖ్యలు:

Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting