Save the Planet -- and Save the Company a Lot of Power and Paper

Posted by తెలుగు'వాడి'ని on Thursday, June 12, 2008

ఈ గ్లోబల్ వార్మింగ్ ఏమో గానీ, కొత్తపాళీ గారి దెబ్బకి/రిక్వెస్ట్ కి ఈ అంశం మీద ఏదో ఒక టపా: గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన రాసి ఆ బత్తీబంద్ లో పడేసి ఒక పని అయ్యిందిలే అనుకున్నా కూడా, అప్పటికే బాగా వార్మప్ అయిన బుర్ర ఇంకా దాని చుట్టూనే తిరుగుతూ ఉండటంతో వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలను ఇక్కడ పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ...

గ్రీన్ ఎనర్జీ అనీ, గ్లోబల్ వార్మింగ్ అనీ, పేపర్ లెస్ ఆఫీస్ అనీ ఇంకా ఏవో రకరకాలుగా అందరం ఆలోచిస్తున్న ఈ దశలో ... వీటికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే ముందుగా మనకు తోచేవి : ప్రతి రోజూ అఫీస్ నుంచి వెళ్లేటప్పుడు అన్నీ ఆఫ్ చేయాలి, విద్యుత్ వాడకం తగ్గించాలి, సాధ్యమైనంతవరకు ప్రింటింగ్ తగ్గించాలి, విద్యుత్ వృధా కాకుండా చూడాలి మొదలగునవి.

కానీ ఇవన్నీ చెప్పటానికీ, చదవటానికీ బాగానే ఉంటాయి కానీ ఇవన్నీ ప్రతిరోజూ క్రమం తప్పక చేయవలసి రావటంలోనే ఉంది తంటా అంతా అని మనకందరికీ తెలిసిన విషయమే ..

వెళ్లండ్రా బాబు రోజూ ఇవన్నీ చెయ్యాలి అంటే మనవల్ల కాదు అనిపించి అసలు ఇలాంటి వాటికి ఏమన్నా products ఉన్నాయా అని వెదుకుదాము అనుకుంటే, వెదకబోయిన తీగ కాలికి తగిలింది నేను క్రమం తప్పక చదివే
Inc.com అనే వెబ్ సైట్ లో.

ఇలాంటి కొన్నింటికి ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన కొన్ని వస్తువుల వివరాలు ............. [ నాకు నచ్చినవి ప్రత్యేకమైన రంగులో ]

Stylish eco-lighting :: An LED desk lamp

Green computing ::: An energy-efficient notebook computer

Enforcing conservation ::: Software that automatically powers down all company PCs

Saving paper ::: Software that eliminates unnecessary pages before printing

Plugging power leaks ::: Strip prevents your computer peripherals from siphoning power when you aren't using them

Keeping tabs on power use ::: A gauge that measures energy consumption of appliances -- from microwave ovens to monitors

వీటి గురించి పూర్తి వివరాలు :

Inc.com లో ప్రచురించబడిన ఈ ఆర్టికల్ Save the Planet -- and Save the Company a Lot of Power and Paper లో చదవండి.

ఇలాంటి products అన్నీ ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా ముందు ముందు మరిన్ని ఫీచర్స్ తో తప్పకుండా వస్తాయి ... లేదా ఇప్పటికే కొన్ని వచ్చి ఉండవచ్చు ... మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే అందరికీ తెలియజేయండి.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::విషయ సూచికలు :


0 వ్యాఖ్యలు:

Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting