వరికి మధ్ధతు ధర - రాజశేఖరుని పనితనం మరియు వాచాలత్వం

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, November 6, 2007

ఎవడికి వాడు వరికి వెయ్యి ఇవ్వాలి అనే వాడే కానీ ఒక్కడు కూడా మా బాధ పట్టించుకోడే ... ఇది మీరందరూ అనుకుంటున్నంత చిన్న విషయం కాదయ్యా ..... మేము ఏమన్నా వెర్రి పప్పలలాగా హైదరాబాదులొ ఇప్పటి దాకా ఊరికే కూర్చున్నామా ... మేము చేసే ప్రయత్నాలన్నీ ప్రతి ఒక్కరికీ వివరించుకోవలసిన ఖర్మ పట్టింది ఏం చేస్తాం .. తప్పదు కదా పాలకపక్షంలో ఉన్నప్పుడు ... సరే తెలుసుకోని అఘోరించండి...

వివిధ పత్రికల సంపాదకీయాలు :

ఈనాడు ....ఇదేం మద్దతు
ఆంధ్రజ్యోతి .... విశాలం కావలసిన వరి ఆందోళన
ప్రజాశక్తి .... మధ్ధతు ధర - చిత్తశుధ్ధి

మొట్టమొదటి సారి రైతులు ఈ రేటు గురించి అలోచిస్తున్నారు అని మేము తెలుసుకున్నప్పుడు, తరువాత అన్ని ప్రతిపక్షాలు, నాయకులు దీని గురించి ధర్నాలు, వింత ప్రదర్శనలు మొదలు పెట్టినప్పుడు, వారి చిల్లర వ్యాఖ్యానాలు మేము పేపర్లలో చదివినప్పుడు, టి.వి లలో చూసి/విన్నప్పుడు, మేము మీకు ఎవ్వరికీ తెలియకుండా మా వార్తాహరులు/వేగుల ద్వారా మొత్తం సమాచారం సేకరించాము.

కానీ దాంట్లో మాకు పనికి వచ్చే విషయాలు ఏమీ కనపడలేదు అంటే ...

*** మేము మొన్నే కదా ఆదర్శరైతులుగా మొత్తాన్ని మా కాంగ్రెస్ వాళ్లనే ఎన్నుకున్నది, అందువలన వాళ్లకి ఎవరికీ ఇంకా వరి ఉన్న దాఖలాలు కనపడలేదు ... మరి ఇంకా ఎందుకయ్యా రేటు పెంచడం...

ఆ మిగతా వాళ్లు మాకు వోటు వేస్తారో ఛస్తారొ తెలియదు ... కొంచెం అటూ ఇటూ ఎవరన్నా ఉంటే రేపు ఎన్నికలప్పుడు మేము దీనికి వడ్డీ, అసలు, కొసరు కలిపి అప్పుడే ఇస్తాము కనుక ఇప్పుడు దీని గురించి మేము చించుకోని ఏమన్నా చేసినా ఎన్నికలనాటికి ఇది మర్చి పోయి ఇంకొకటి పట్టుకుంటారు ... అప్పుడే అంత వెధవలం అయిపోయాము అనుకుంటున్నారా...ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఉంది.

*** మా పార్టీ కార్యకర్తలు, మంత్రులు, MLA - MP లు, అనుచరులు, బంధుమిత్రహితసన్నిహితులు, అసలు మా అనుకున్న ఎవరికి గానీ ఏ ఒక్కరికి అయినా ఈ రేటు పెంచటం వలన పైస కూడా వచ్చేటట్టేమీ కనపడలేదు...అంటే అసలు రాదు అని కాదు ఒక వేళ వచ్చినా కూడా అది మాకు చిల్ల పెంకులతోనో, విదిల్చిన ఎంగిలి మెతుకులతోనో సమానం....మాకు డబ్బు సంపాదనే ధ్యేయం అనుకుంటే మా పొన్నాలకి ఒక్క సైగ చేస్తే చాలు ఏదో ఒక కొత్త ప్రాజెక్టు సృష్టించకపోడు.....మరి ఇన్ని తెలుసుకోని రేటు పెంచి ఏం చేస్తాం.....ఏదో మీ పిచ్చి ఆలోచనలు కాకపోతే...

సరే ఇంతటితో సరిపెడదామా అంటే ... ఈ బాబు ఒకడు ... తుయ్యిమని ఢిల్లీ వెళ్లి అక్కడ అపాయింట్ మెంట్ దగ్గర నుంచి చివరికి ప్రధానమంత్రితో తిట్టించుకొన్నది కలుపుకోని అన్నింటినీ కలిపి ఒక పెద్ద లొల్లి మొదలెట్టాడు....సరే మనమేమన్నా తక్కువ తిన్నామా ... అదే టైంలో మా MLA - MP లు, ఇంకా ఢిల్లీ చూసొద్దాం , పేపర్లలో ఫొటో చూసుకుందాం అనుకున్న వాళ్లని మొత్తాన్ని చుట్టచుట్టి ఏదో వినతిపత్రం ఇప్పించాం .. గుడ్డిలో మెల్లగా రేటు పెంచితే మన గొప్పతనం...లేదంటే ఆ! బాబేనా ఢిల్లీ వెళ్లి అడిగేది మేము కూడా వత్తిడి తెస్తున్నాము అని చెప్పుకోవచ్చు కదా....ఇంత చేసినా మీకు సంతృప్తి లేక పోయే ఎట్లా ఛస్తామయ్యా మీతో...

ఇక ఇట్లా కాదులే అని చిట్ట చివరిగా నేనే పంచె సవరదీసుకుంటూ ఢిల్లీ వెళ్లానా లేదా మీ కోసం ... అహ అసలు వెళ్లానా లేదా మీ కోసం ... అర్ధం చేసుకోరు ఏందయ్యా మీరు అసలు...

మీకేం నాయనా ఇక్కడ ఢిల్లీలో నా బాధలు ఎవడికి చెప్పుకోవాలి .... ప్రధానమంత్రి గారికి పేరులో మాత్రమే మన (మన+మోహన్ సింగ్) ఉంది ... ఈయనకి మన తన ఎవడైనా ఒకటే ... ఈయన ఇచ్చేదేమో కొన్ని నిముషాల సమయం .. ఆ కాస్తలోపే నా పాలన గురించి, 'మన' అనుకుంటే ఎట్లా దోచి పెట్టచ్చో, నియమనిబంధనలతో పని లేకుండా ఎదైనా ఎలా చేయవచ్చో, ఏ విధంగా సంతకం పెట్టవచ్చో వివరించటం కుదిరి చావదాయే...ఎలా చావాలి ఈయనతో ..

కాదూ కూడదూ ఈయనను మన బ్రహ్మాస్త్రంతో .. అదేనండీ డబ్బు సూట్ కేసులతో కొడదామా అంటే ఈయనేమన్నా మా సోనమ్మా లేక దిగ్విజయన్నా లేక మొయిలీ మామా....అదీ గాక ఈ పెద్ద మనిషికి ఈ సూట్ కేస్ ల లెక్కలు అర్ధం అయి చావవు .... అసలు మన అర్ధశాస్త్రం ఈయన అర్ధశాస్త్రం పూర్తిగా వేరాయె....

ఏదో చెపుతాడు : భారం అంటాడు ... బడ్జెట్ అంటాడు ... మనకి అర్ధం అయ్యే భాషలో ఒక్కటీ చెప్పడు

... ఇయన్నీ ఎవడికి కావాలండి ఏదో ఒకటి చేసి మరలా ఎన్నిక అయితే ఆ తరువాత వీటన్నిటినీ వెంటనే ఉపసంహరించుకోవచ్చు కదా ... మమ్మల్ని చూసికూడా నేర్చుకోడు మేము నాలుగేళ్లనాడు ఎన్ని చెప్పలేదు, ఏమన్నా చేసామా పెట్టామా, ఏం పీకుతున్నారు జనాలు... మనదేమో ఎన్నికలశాస్త్రం ఈయనదేమో నిజమైన అర్ధశాస్త్రం ... రెండికీ లంకె కుదరదు అని ఈయనకి అర్ధం కాదు పెట్టదు ..

సరే ఈ చావు కబురు మరల హైదరాబాదు దాక మోసుకెళ్లటం ఎందుకు అని ఇక్కడే పత్రికల/టివి వాళ్లకి చెప్పేసా .. హమ్మయ్య ఒక పని అయిపోయింది....అసలు మనం ఇక్కడికి వచ్చింది వేరే పని మీద కదా .. అదేనండి అమ్మకి ఈ నెల సూట్ కేస్ లు ఇచ్చే పనిమీద .. ఇక మనం ఆ పని కానించేస్తే ఇక్కడ చెయ్యటానికి ఏమీ లేదు.....అప్పుడు మన పాదయాత్ర-తలకి కండువా, ఇప్పుడు మన విమానయాత్ర-పంచెకట్టు చూసి నిజంగా ఏదో చేసేస్తామని నమ్మిన వాళ్లకి మనం ఇక్కడికి వచ్చి ఫుల్ గా బాగానే యాక్ట్ చేసాం కదా ఇక చాలు ఇక్కడ..........

కాకపోతే మనం తొందరగా హైదరాబాద్ బయలు దేరి వెళ్లాలి ... అసెంబ్లీ మొదలు కాబోతుంది కదా .. నాకు, మా మంత్రులకు "తిట్ల పురాణం - తెలుగులో" క్లాస్ కి అటెండ్ అయి కొత్తవి నేర్చుకోవాలి....లేక పోతే మన పని గోవిందా ఆ ప్రతిపక్షాల, వాళ్ల నాయకుడు అడిగే ప్రశ్నలకు, లేక బయట పెట్టమనే నిజాలకు.....

హమ్మయ్య! మొత్తానికి చివరకు విమానంలోకి వచ్చి పడ్డాం.....ఇంకెంత సేపులే ఈ మాగజైన్ తిరగేసేలోపు మా రాజ్యం/పాలనలోకి వచ్చి పడతాం....

ముగింపు : విమానం దిగిన తరువాత విలేకరుల సమావేశంలో వరికి మధ్ధతు ధరపై అడిగిన ప్రశ్నకు

ఎవడ్రా వాడు వరికి రేటు పెంచమనేది ... ఏందిరా పెంచేది తొక్కా.....నా సంగతి తెలియదు మీకు ... తోలు తీస్తా ఏమనుకున్నారో....బొక్క ఏమన్నా కాదు పెంచేది....గట్టిగా అడిగితే బొంగు పగులుద్ది.....ఇంక మూసుకోని దొబ్బెయ్యండి...ఇక ఈ విషయం ఇంతటితో వదిలెయ్యకపోతే డొక్క చించి డోలు కడతా .... అని వివరిస్తున్నంతలో ...

ఇది అసెంబ్లీ కాదు, ఎదురుగా చంద్రబాబు లేడు, ఆ పైన అడిగింది ఈనాడు/ఆంధ్రజ్యోతి విలేకరి కాదు అయినా ఏమిటబ్బా (కొంపదీసి హైదరాబాద్ గాలి/నీళ్లు కాదుకదా అనుకునేంతలో) అని అందరూ, వారితో పాటు తను కూడా ఆశ్చర్యపడుతున్నంతలో,

ఒక్క సారి చేతుల వైపు చూసుకుంటే ...

ఇందాక మనం చెప్పుకున్న తను, తన మంత్రి వర్గం అటెండ్ కాబోయే "తిట్ల పురాణం - తెలుగులో" క్లాస్ కు సంబంధించిన మొదటి పాఠం ....

అది చూడటంతోనే అందరికీ అర్ధం అయిపోయింది అసలు విషయమేమిటో ....

కొసమెరుపు : ఎవడురా రేపు చదవవలసిన పాఠం ఇప్పుడే తెచ్చి నాముందు పెట్టింది ... ఉన్న తలనెప్పులకు తోడు ఇవి కూడానా అని బాధపడుతున్నట్టు నటిస్తూ, మెల్లగా ఆ కాపీని మరికొన్ని కాపీలు తీయించి, కన్నా కు, ధర్మాన కు మొదలగు వారికి పంచవలసిందిగా రోశయ్యగారికి సైగచేసి చెప్పటం అందరి కంటా పడింది.



విషయ సూచికలు :


5 వ్యాఖ్యలు:

Anonymous on Nov 10, 2007, 11:45:00 AM   said...

కొంచెం తీవ్రస్థాయిలో ఉన్నా కూడా చాలా బాగా రాశారు YSR మాటల దురద గురించి మరియు వారు చేయగలిగిన రైతుల సేవ గురించి... కానీ ఏమీ ఉపయోగం ... వాళ్లు మాత్రం మారరు ... 2009 లో మనమే వాళ్లను అధఃపాతాళానికి తొక్కెయ్యాలి...అంతవరకూ మనం చెవులు మూసుకొని కూర్చోవడమే..


Anonymous on Nov 12, 2007, 5:46:00 AM   said...

భయ్యా... ఖతర్నాక్ రాసినవ్.. నీకు నువ్వే సాటి..గంత బాగనె వుంది గనీ.. మధ్యలో గా పంకిరాని చెత్త పత్రికల ప్రస్తావన ఎందుకన్న? (ఒక్క ప్రజాశక్తి మినహా), అయినా నువ్వు నాణేనికి ఒక పక్కనే డిస్కస్ చేసినవ్ అనిపిచ్చింది. వరి ధర 1000 చెసినాంక, రెప్పొద్దున బియ్యం ధర ఆకాశన్నట్టుతుంటె, దానికి సమాధానం ఈనాడు పేపరొడు గానీ, జ్యొతి పేపరోడుగానీ లేక బాబు గారు గాని ఇవ్వరు.. గవర్నమెంటు ఆన్సర్ చేయాలి. ఏమంటవ్..? గోధుమల వుత్పత్తి తక్కువుండి, దానిని ప్రొత్సహించనీకి దాని ధర పెంచిన్రన్న సంగతి చదువుకున్న వారందరికి/కామన్సెన్సున్నవారందరికి తెల్సు.[of course, there is a strong north political lobby to increase the cost, గీ విషయంల నువ్వు విమర్శ చెసుంటె బాగుండెడిది. ఏమంటవ్?]
ఇంక నువ్వు గిట్లనె బాబు గారి కుల రాజకీయల గురించీ, సో కాల్డ్ రైతు అవతారం గురించి కూడా వ్యంగ వ్యాఖ్యానాలు రాయలని ఆశిస్తున్న ...
last but not least...
ఇంకొటేందంటె, నువ్వు/మీరు/తమరు తెలుగు వారె కాదు తెలుగు దెశం వారని కూడ అర్థమవుతుంది [by criticising Manmohan]


తెలుగు'వాడి'ని on Nov 12, 2007, 8:11:00 AM   said...

@ అనామ(మి)క గారు :

కృతజ్ఞతాభినందనలు మీ వ్యాఖ్య/వ్యాఖ్యానాలకు. ఇలా చర్చించుకునే విధంగా వచ్చే వ్యాఖ్యల ద్వారానే మనమందరం సమకాలీన విషయాలపై అవగాహన / దృక్పధం సరైన మార్గంలో వెళ్లేలా చేస్తాయని నా ఉద్దేశ్యం. అందుకు మీకు మరొక్కసారి నా కృతజ్ఞతలు.

ఇక అసలు విషయానికి వస్తే :

ఈనాడు/ఆంధ్రజ్యోతి పత్రికల ప్రస్తావన ... ఈ పత్రికలలోని ఎడిటోరియల్స్ లో రాసే ఆర్టికల్స్ లో ఇంకా కొద్దో గొప్పో చిత్తశుధ్ధి మిగిలి ఉంటుంది అని నమ్మేవాళ్లు ఎవరన్నా ఉంటే (పూర్తిగా కాకపోయినా ఇప్పటికీ వీళ్లల్లో నేనూ ఒకడిని .. నేను ఈ రెండు పత్రికలు చదవటం / చదివినా నమ్మటం మానేసి, చాలా రోజులు అయ్యింది) వాళ్లకు ఉపయోగపడుతుంది అని ఇచ్చాను అంతే ...

మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ అక్షర సత్యాలు. కానీ మీరు అన్నట్టే "గవర్నమెంటు ఆన్సర్ చేయాలి " ...ఆ! ఇదే నా బాధల్లా ... ఈ పాలక/రాజశేఖరుని ప్రభుత్వం మీరు అన్న పాయింట్స్ తో జనాలను ఈ సమస్య (కుడి ఎడంగా ఇదే సమయంలో KG Rs.2 బియ్యం ప్రకటించింది వీరే అని, సాధ్యాసాధ్యాలతో పనిలేకుండా అని గుర్తుకు తెచ్చుకోండి) మొదలవుతుంది అని తెలిసినప్పటి నుంచి లేక మొదలైనప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయటానికి (మిగిలిన ప్రయత్నాలతో పాటుగా) చాలా గట్టిగా ప్రయత్నించి ఉంటే (ఉండాలి అన్నది నా ప్రగాఢ అభిప్రాయం .. ఇది పాలక పక్ష భాధ్యత కూడా) రైతాంగంలో కానీ, మిగిలిన జనాలలో గానీ మీరు అన్నట్టు చదువుకున్న/కామన్ సెన్స్ ఉన్న వారు అయినా కనీసం అర్ధం చేసుకుని (కొద్ది మంది అయినా) ఉండేవారు. అలా చేయకపోగా ప్రతి అడ్డమైన మీటింగుల్లో ... నేను పోరాటం చేస్తా, నేను సాధిస్తా ఢిల్లీ వెళ్లి అయినా(నిజానిజాలు పక్కన పెట్టండి ... please take a look at this article వైయస్ కు ఇది 'భలే ఛాన్సులే'), అనే కారుకూతలన్నీ జనాలకి చెప్పి, ఢిల్లీ నుంచి ఊపుకుంటూ వచ్చి, అప్పుడైనా జనాలకి/రైతులకి సవివరంగా చెప్పటానికి ప్రయత్నించి ఉంటే కొద్దో గొప్పో YSR పై గౌరవం పెరిగి ఉండేది (రాజకీయంగా ఇది సరి అయినది కాదు అని చాలా మంది భావించవచ్చు గాక) ... అలా చేయకుండా
YSR గారి ప్రకటన చూడండి : "గోధుమకు, వరికి మధ్య మధ్ధతు ధరల్లో తేడా 1996 నుంచీ కొనసాగుతుందనీ, దీనికి నేడు ఎవరైనా ఏం చేస్తారు"

ఇదిగో .. ఇక్కడే...ఈ సమాధానం దగ్గరే నాకు కాలింది ....

అన్నింటికీ ఒకటే సమాధానం : "మీ తొమ్మిదేళ్లలో ఏం చేశారు..ఇంతకు ముందు అంతే....ఎప్పటి నుంచో ఉంది ... టెర్రరిస్ట్ అటాక్స్ మామూలే, అమెరికాలో కూడా కూలిపోతున్నాయి బ్రిడ్జిలు (ఇది దిగ్వి గారు)".......ముందు వాళ్లు వెధవలు,
దరిద్రం చేస్తున్నారు అనే కదా మీకు అప్పచెప్పింది అధికారం
.

Criticizing Manmohan point : నేను రాసిన రెండు, మూడు పాయింట్స్ లో తన గురించి మంచిగానే రాశానే ... డబ్బులు తీసుకునే టైపు కాదు .. మన/తన ఎవడైనా సమాధానం ఒకటే ... బడ్జెట్/భారం అని నిజాలే చెప్తారు అని .. Please shred some light on where did I criticized as I'm really not sure about it. (ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలచుకున్నానండి .. సమకాలీన రాజకీయ నాయకులలో నేను విమర్శించటానికి ఒక్క నిముషం సమయం అయినా తీసుకొనేది ఇద్దరే (on top of my head): ఒకరు, జయ ప్రకాష్ నారాయణ్, రెండు : మన్మోహన్ సింగ్ ... please take a look at my earlier post : గల్ఫ్ బాధితులకు మన రాజకీయ పార్టీల, నాయకుల, సగటు పౌరుని విషయ వివరణ లేఖ)

ఈ ఒక్క మన్మోహన్ గారి పాయింట్ తో నన్ను తెలుగుదేశం పార్టీ వారి కింద జమకట్టేశారే .. అలా మీకు అర్ధమవుతుంది అని చక్కగా చెప్పినాక ఇక మేము చెప్పటానికి ఏముంది :-( ... కాకపోతే కుడి వైపున ఉన్న 'మన మాట' మరియు ఇంతకు ముందు రాసిన నా పాత జాబులు చదివి మరలా మీ అభిప్రాయం చెప్పండి వీలైతే ... అప్పటికి కూడా మీకు అలానే అర్ధమవుతుంటే, సరే అలాగే కానివ్వండి .. ఏం చేస్తాం....

చివరిగా మనకు ఎవడు(రు) అయినా ఒకటే ... ఉతికి ఆరెయ్యటమే ...


సూర్యుడు on Nov 12, 2007, 11:17:00 AM   said...

We should remember one thing. All these parties are playing their games, just like any corporate play against their competitors. Just look at some of the incidents like:

1. CPI(M) doesn't support SEZs anywhere outside WB or may be KL, Congeress doesn't support SEZs only in WB, KL or any states that were not ruled by it. Try to understand why?

2. Babu, who has opposed free power to farmers in the earlier election time frame, is now willing to provide free power, if he comes to power next time. Why (how?)

3. Congress which opposed kg Rs. 2 rice during 83s is willing to provide now, why?

See, they will come up with different formulas to implement it. For example, if they say, we will provide kg Rs. 2 rice, they may give it to only a selected income group which may be small in number, unless they (people) manipulate it by bribing the officials.

And a whole lot of other things, as usual, due to shortage of time ... ;)

One funny thing is, we, who generally considered (self declared, just like self styled commanders in militants :-)) to be intellectuals can be very easily manipulated by the so called uneducated or whatever politicians time and again, don't you think so?

With regards,
Suryudu


తెలుగు'వాడి'ని on Nov 12, 2007, 2:08:00 PM   said...

@Suryudu:

Very well said. Oh Yeah! I couldn't agree more and it's like we were/are trapped in side that vicious circle and manipulated/ing by those politicians. I think it's very high time for all of us to come up with promoting people from our respective regions / constituencies to see/make/rule or at least contribute to a better administration via politics.

(I am almost ready to publish a new post on the same topic with in the next few days...when that happened, please take up some of your time and let's brainstrom for the betterment of ideas)


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting