రైతుల ఆత్మహత్యలపై నా అంతఃసంఘర్షణ, తదుపరి కార్యాచరణ ప్రణాళిక - ఓ రైతుబిడ్డగా
ఇప్పటి వరకు పాలకుల, ప్రభుత్వాల, అధికారుల నిర్లక్ష్య, నిర్లజ్జ రైతు వ్యతిరేక విధానాల ఫలితం ... నిండునూరేళ్ల జీవితం వారి చేతుల్లో పెట్టిన రైతన్నల లలాటలిఖితం ... కనుచూపు మేరనైనా కనిపించని సహాయ ప్రయత్నాలు
అందువలన
గతించిన వారెందరో.....గతిలేక దినసరి కూలీలుగా మారినదెందరో....పస్తులున్నదెందరో ... పుస్తెలమ్మిన దెందరో... ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భూములను అమ్ముకున్నదెందరో .. ప్రాణమున్న జీవఛ్ఛవాలుగా బ్రతుకు బండినీడుస్తున్నదెందరో ... మమ్ములను మా తండ్రుల ప్రాణమే ఈ భూమనీ ... ఈ వ్యవసాయమే మాకు వారసత్వమనీ గర్వంగా చెప్పలేని, చెప్పుకోలేని (ఇక్కడ కారణలు అప్రస్తుతం మరియు అందరూ ఇలాకాక పోయుండచ్చు) స్థాయికి దిగజార్చారు, అదే వ్యవసాయాన్ని అపహాస్యం చేశారు.
ఇందుకు దారితీసిన పరిస్థితులు, నాయకులు, విధానాలు మొదలగువారి(టి) గురించి మనకందరికీ సంపూర్తి అవగాహన ఉంది....కాకపోతే అవే విషయాలను మరొక మారు పునఃశ్చరణ చేసుకోవాలి అనుకుంటే వీటిని మీరు నేను ప్రచురించిన నా మరొక బ్లాగ్ పోస్ట్: బాబు, రాజు మరియు మనలో ... పదేళ్లలో ఎంత మార్పు !? లో చూడొచ్చు.
అవకాశాలు వెదుక్కుంటూనో, అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనో, చితికిపో(వుచున్న)యిన మా కుటుంబాలను కాపాడుకోవటానికో, వ్యవసాయం వంటబట్టకనో(వంటబట్టించుకోవటం ఇష్టంలేకనో) .... పుట్టిపెరిగిన ప్రాంతాన్ని వదిలివచ్చి అంతో ఇంతో సంపాదించుకున్నందుకు, మా రైతులను, రైతుకుటుంబాలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగానే తెలుసు.
ఈ సమస్యకు పరిష్కారపు దిశగా, ఓ రైతుబిడ్డగా నా అంతఃసంఘర్షణకు ప్రతిరూపంగా తదుపరి కార్యాచరణగా ప్రోదిచేసుకున్న నా ఆలోచనలు ఇక్కడ :
ఈ చిన్ని ప్రయత్నానికి మరికొన్ని చేతులు కలిసి, ఆలోచనలు జోడించి, చేతలలోకి మార్చుకునే సమయం వచ్చి అందుకు మనం అవకాశం కలిగించుకోగలిగితే అదే పదివేలు.
స్పందించటానికి రైతు కుటుంబ నేపధ్యం నుంచే రానక్కరలేదు .... చదివిన, తెలుసుకున్న, విన్న, చూసిన వాటినుంచైనా స్పందించగలిగిన మనస్సుంటే చాలు.
సహాయం అనేది ప్రతి సారీ, అందరూ డబ్బుల రూపంలో చూడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కొకసారి వెలకట్టలేని అలోచనలు, ఆచరణలో పాలుపంచుకోవటం కూడా సహాయపు జాబితాలోకే వస్తాయి కనుక.
ఒక్కొకరు ఒకేసారి వెయ్యో, రెండు వేలో డాలర్స్ ఇవ్వటానికో లేక మధ్య మధ్యలో తోచినప్పుడు ఒక అయిదారువందల డాలర్స్ ఇస్తూ ఉండటమో చేయటానికి ఇష్టపడతారు .... కనుక అందరూ అలాగే ఉండవలసిన అవసరం లేదు కనుక నా అభిప్రాయం ప్రకారం ఏదైనా చిన్నదిగా, తక్కువ మొత్తంగా మొదలెడితే అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటే మంచిదని ... అంటే ప్రతి నెలా ఒక పదో, ఇరవయ్యో డాలర్స్ ఇవ్వగలిగితే అది ఒక అధ్బుతమైన ప్రారంభం అనిపిస్తుంది.
మనం ఆ పది, ఇరవై డాలర్స్ ను విడివిడిగా చూస్తే శిఖర సమానమైన సమస్యకు ఇది పరిష్కారమా అనిపించవచ్చు ....కానీ ఒక వంద, రెండువందల మందిమి ఒకే సారి కలిస్తే .. అవే వెయ్యో, రెండు వేలో డాలర్స్ అవుతాయి ...
వీటితో కనీసం ఒకటో, రెండో కుటుంబాల సమస్యను సంపూర్తిగా పరిష్కారించలేక పోవచ్చు .. అలాగే వాళ్ల అప్పులు తీర్చడంతోనే సమస్య పరిష్కారం అయిపోయినట్టు కూడా కాదు .. కాకపోతే బ్రతికించటం కన్నా, మరొక జీవనోపాధి చూపించటం కన్నా ముందు ఒక బ్రతుకు కడతేరకుండా చేయ గలిగితే తదుపరి అలోచించవచ్చు.
వందల మిలియన్ డాలర్స్ తో తీసే ఇంగ్లీష్ సినిమాను తొమ్మిది డాలర్స్ లోపే చూడొచ్చు కాకపోతే మూడు నుంచి అయిదో, ఆరో మిలియన్ డాలర్స్ తో తీసే తెలుగు సినిమా మాత్రం పది నుంచి పదమూడు నుంచి పదిహేను నుంచి పదహారు దాకా పెంచినా కూడా చూస్తూనే ఉన్నాము ... కొంతమంది ఈ తెలుగు సినిమాలు చూడటానికి 40-60 మైళ్లు కూడా డ్రైవ్ చేసుకొని వెళ్లి చూస్తున్నారు ...దీనికి రావటనికి పోవటానికి ఒక $6-7 .... మనలో చాలా మంది సినిమాకు ముందో తరువాతో ఖచ్చితంగా లంచ్ కో, డిన్నర్ కో వెళ్లటం అక్కడ ఒక $10-20 ...
అలాగే మొదటలో ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో టిప్స్ ఇవ్వటం అనేది ఒక విధంగా కంపల్సరీ అని మొదలెట్టి ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు పడి నెలకు ఒక $10-20 దాకా ఇస్తూనే ఉన్నాము
నా ఉద్దేశ్యం మనం ఇవన్నీ మానుకోవాలని చెప్పటం కాదు సుమా ... మన దైనందిన జీవితాలలో ఒక భాగమై కూర్చున్న ఇలాంటి ఖర్చులన్నింటికీ మనం ఎంత ఖర్చు పెడుతున్నామో ... వాటితో పాటుగా మరో $10-20 ఇంకొక ఖర్చుగా అనుకోగలిగితే మీరు చేసే ఈ సహాయం మరికొంత మందితో కలిసి నెలకు ఒకటో రెండో కుటుంబాలనైనా ఆత్మహత్యల బారి నుంచి కాపాడవచ్చు.
ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అండి : ఇండియాలో జీతాలు, వాళ్ల ఖర్చుల గురించి(I.T కి సంబందించినంతవరకు అయితే ఓకే) నాకు అంత బాగా అవగాహన లేదు మరియు అరకొర సమాచారంతో మాట్లాడేకన్నా మాట్లాడకపోవటమే మంచిది అనే ఉద్దేశ్యంతో ... కనుక ఇక్కడ నేను అంత వివరంగా ఆయా ఖర్చుల జోలికి వెళ్లలేదు(కనుక దయచేసి అన్యధా భావించవద్దు..అలాగే మిగతా దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా).
ఇంతమంది బ్లాగ్మితృలలో, పెద్దవాళ్లలో ఎవరైనా ముందుకు వచ్చి దీనిని ఒక ఫౌండేషన్ గా రూపుదిద్దుటకు కృషి చేయగలగటానికి తప్పక ముందుకు వస్తారని ఆశ, ఆకాంక్ష........లేదంటే ఇప్పటికే ఉన్న ఏదో ఒక ఫౌండేషన్ తో మనం ఒక టై-అప్ పెట్టుకోని మనం ఇచ్చే ఈ డబ్బుని రైతు కుటుంబాల జీవన స్థితిగతులను మార్చుటకు ఉపయోగించవలసిందిగా కోరవచ్చు. మీకు ఇలాంటి ఫౌండేషన్స్ గురించి తెలిసి ఉంటే దయచేసి కొంత సమయం చూసుకొని పూర్తి వివరాలను ఇక్కడ తెలియజేయండి ... కనీసం ఒక్కొకరిగానైనా మనం మన వంతు సహాయం అందిద్దాం.
మన రక్త సంబంధీకులు, బంధు మిత్ర హిత సన్నిహితుల నుంచి లేదా మనకు బాగా తెలిసిన వాళ్ల నుంచి ఏయే కుటుంబాల వారు ఆత్మహత్యా రేఖకు దగ్గరలో ఉన్నారో, పూర్తిగా అప్పులలో మునిగి ఉన్నారో లేక తమ కొడుకు-కూతుళ్ల చదువుకు, కుటుంబంలో ఆరొగ్యానికి డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నారో మొదలగు కారణాలున్న వారి వివరాలు సేకరించి వారందరికీ సాధ్యమైనంతవరకు సహాయం చేయటానికి ప్రయత్నించవచ్చు. మనకు వచ్చే వందలాది/వేలాది అప్లికేషన్స్ లో నుంచి మనం ముందు ఎవరికి సహాయం చేయాలి అన్న దానికి మనం కొంత క్రైటీరియా ఏర్పరచవచ్చు (దీనికి ఇంకా కొంత అలోచనామధనం జరుగవలసిన అవసరం ఉంది ... నిదానంగా అలోచిద్దాం మరి)
మన అభిప్రాయాలను పంచుకొందాం ... మార్పులు చేర్పులు చేసుకుందాం ... మొదలెడదాం మరొక మహాప్రస్థానం ...
ఆరేడు సంవత్సరాల క్రితం మొదలైన ఈ ఆత్మహత్యల పర్వం ఇప్పటికి కూడా ఆగలేదు .. మనకందరికీ తెలుసు ఇకముందు కూడా ఉంటాయని ... అందుకే చేయి-చేయి కలుపుదాం..రూపాయికి రూపాయ్(డాలర్ కి డాలర్) జతచేద్దాం ... నెలకొక ఆత్మహత్యనైనా ఆపుదాం....
8
వ్యాఖ్యలు:
- rākeśvara on Nov 30, 2007, 8:05:00 AM said...
-
మీ అమాయకత్వం చూస్తే నాకు కొద్దిగా బాధగానే వుంది.
బిందెనుండి నీరు కారిపోతుంటే, దానికి పరిష్కారం బిందెలో ఇంకొన్ని నీళ్లు పొయ్యడం కాదు! ఆ బిందెకున్న చిల్లు పూడ్చడం పరిష్కారం!
మీకు అంతగా చేయాలనుంటే, మా మిత్రుడొకడు rural financing లేదా micro economics లో పని చేశేవాడు, అలా చేయవచ్చు. మీరు కూడా మీ అమెరికా ఉద్యోగం మానేసి, Institute of Rural Management Anand (www.irma.ac.in) లో చదువుకొని, రైతుల కోసం సహకార సంఘాలూ, వివిధ risk hedging సదుపాయాలూ వగైరా కల్పించవచ్చు. మీకు ఎంత తెలివితేటలు, చొఱవా, లౌక్యం ఉంటే అన్ని మహోత్తర ఉపాయాలు ఇంకా వస్తాయి.
అది చాలా కష్టమని పిస్తే, ఆంధ్రంలో ఒక భారీ పరిశ్రమ (అందునా యంత్రాలు తక్కువ వాడి, పర్యావరణానికి కూడా హాని కలిగించనిది) స్థాపించి, జీవనాధారం కోల్పోయిన రైతులకూ, పదోతరగతి చదువుకున్న వారి పిల్లలకూ, కూలీలకు ఉపాధి కల్పించండి.
అదీ కష్టమయితే, మీరు హైదరబాదులో పనిచేస్తూ, కూలీ దొరక్క అనంతపురం జిల్లా నుండి వలస వచ్చినావిడను పనావడిగా పెట్టుకోండి.
డాలరుకు నలభై రూపాయలైనా... అప్పుడప్పుడూ అవి సరిపోవని గ్రహించగలరు. చేపలు పట్టి ఇవ్వడం కంటే, చేపలు పట్టడం నేర్పడం సరుచితం.
- తెలుగు'వాడి'ని on Nov 30, 2007, 11:32:00 AM said...
-
@ రాకేశ్వరరావు గారు : మీ అభిప్రాయం తెలియజేసినందులకు కృతజ్ఞతాభినందనలు. మీ మొదటి ఉపమానం "బిందె, నీళ్లు, ఇంకొన్ని నీళ్లు, చిల్లు' మీరు ఈ రైతు ఆత్మహత్యలకు ఎలా అన్వయించారో చెపితే సంతోషిస్తాం. ఇకపోతే మీరు చెప్పిన ఆ పెద్ద పెద్ద పేర్ల స్థాయిలో కాకపోయినా, నేను ఇప్పటికే(కీ) కొన్ని కుటుంబాలకు వారికాళ్ల మీద వారు నిలబడే జీవనోపాధికి, కొంతమంది సాటి రైతులకు ఎరువులు,పురుగుమందులు మొదలగువాటికి (వడ్డీల గొడవలు లేకుండా ... ఎప్పుడో ఒకప్పుడు తీర్చాలండోయ్ :-) ... అలాగే ఊరికే ఇచ్చినట్టుగా ఉండకుండా మా వద్ద కష్టపడి పనిచేసే వారందరికీ, వారి పిల్లల చదువులకు నాకున్నంతలో సహాయం చేస్తున్నాను...అలాగే జీవనోపాధికోసం వలస వచ్చిన వారు నాలుగు కుటుంబాల దాకా (అనంతపురం నుంచి కాదులేండి కాకపోతే కర్నూలు నుంచి) మా వద్ద పనికల్పించాము. అలాగని నేనేమీ కోటీశ్వరుడిని కాదు లేక నాకేమీ వందలాది ఎకరాల పొలాలేమీ లేవు (ఈ రెండిటికీ సంబంధించి కనీసం దరిదాపుల్లో కూడా లేను). ఆ కష్టాలు అనుభవించినవాడిగా ఏదో కొంత సాయం చేద్దామనే ఉద్దేశ్యం అంతే.
అమెరికా ఉద్యోగం మానేసి, IRMA లో చదువుకుని అనే దానిలే నాకు వ్యంగ్యమే (ఇంత అవసరమా) ఎక్కువగా క(వి)నిపించింది....అయినా ఎవరి స్పందన వారిది ...ఎవరు ఎలా చెప్పినా నేనేమీ తల బద్దలుకొట్టుకోనే రకం కాదు..కనుక నాకేమి సమస్య లేదు ఇలా చెప్పినందువలన..
... ఇక మీ చేపల సామెతకు వస్తే ఎవరి అభిప్రాయం వారిది. నా అభిప్రాయం అయితే, ఆకలితో ఉన్నవాడికి విత్తు నాటి, మొక్కను పెంచి, చెట్టు అయినాక ఎక్కి కాయలు కోసుకుతినడం నేర్పిపించడంకన్నా ముందు ఒక కాయను చేతిలో పెట్టడం మంచిది ... అలాగే చెరువులో మునిగిపోతున్నవాడికి ఈత నేర్పడానికి ప్రయత్నించడంకన్నా ముందు మునిగిపోకుండా కాపాడడం ముఖ్యం ... తరువాత ఆ ఇద్దరినీ 'కాయలు పండించడం' మరియు 'ఈత నేర్వడం' అనే వాటి వైపుగా కర్తవ్యోన్ముఖులను చెయ్యాలి అలా చెయ్యకపోతే లేక వారు కాకపోతే పైన చేసిన సహాయం.
అందుకే నేను అప్పులు తీర్చడంతోనే సమస్య పరిష్కారం కాదనీ కాకపోతే ముందు ఒక బతుకు కడతేరకుండా చూస్తే మంచిదేమో అని చెప్పాను.
- Unknown on Nov 30, 2007, 12:06:00 PM said...
-
మీ మొదటి టపా చదివి ఆపండీ ఎడుపులు అని ఘాట్టిగా అరుద్దామన్నంత కోపమొచ్చింది. ఏడుపులు, పెడబొబ్బలు, సానుభూతులు కాదు కావాల్సింది. ఒక చెర్నాకోల్తో రైతులోకాన్ని కొట్టి లేపాలి.
ఏదో ఒక ప్రణాళికతో ముందుకు వచ్చిన మీ నిజాయితీని మెచ్చుకోవాలి.
రైతులు చాలామటుకు స్వతహాగా అత్మాభిమానం మెండుగా ఉన్నవాళ్ళు..అందుకే ఆత్మహత్యలు..అప్పనంగా సహాయం చేస్తే తీసుకుంటారంటారా? ఎవరు ఆత్మహత్య చేసుకునేంత కష్టాల్లో ఉన్నారో చెప్పలేం. అలా చెప్పగలిగితే పరిస్థితి ఇంతదాకా రాదు.
సన్నకారు వ్యవసాయం లాభసాటి కాదు. ఈ సంవత్సరం మనం సాయం చేసినా పై ఏడాది గట్టెక్కుతారని నమ్మకం లేదు. రాకేశుడన్నట్టు వ్యవసాయేతర ఉపాధి పథకాలపై దృష్టి పెట్టాలి. నిజంగానే వ్యవసాయం కొనసాగించాలంటే కొన్ని ప్రత్యమ్నాయాలు లేకపోలేదు. ఒక వంద, రెండు వందల రైతులు కలిసి సహాకార సంఘంగా యేర్పడి వ్యవసాయం చేయటం. దీనికి రైతుల్లో నాయకత్వం, చిత్తశుద్ధి ఉండాలి. (అదే విషయం ఆ ఆత్మహత్య చేసుకుంటున్న రైతులతో అని చూడండి..) అది అయ్యేపనిగాదులేదులే అబ్బయ్య అని ఠకీమని అంటారు. ఇలాంటి వ్యవస్థలకు ఉదాహారణలు సోవియట్ కాలపు వ్యవసాయ సముదాయాలు, ఇజ్రాయెలీ కిబ్బుట్జులు. మనదేశంలో ఫేమస్ ఉదాహరణ: అముల్ .(it is sad that too many people are giving up..rather than changing with the times)
- తెలుగు'వాడి'ని on Nov 30, 2007, 4:10:00 PM said...
-
తెలుగువీర గారు : మీ అభిప్రాయాలు తెలియజేసినందులకు కృతజ్ఞతాభినందనలు.
నా మొదటి టపాలలాంటివి చదివినప్పుడు మీలాగే నాకూ అనిపిస్తుంది కాకపోతే ఆ భావవ్యక్తీకరణ అంతటితో ఆగిపోవటానికి (ఆపెయ్యటానికి) ఎవరికారణాలు వారికి (సమయం దొరకక/చాలక పోవటమో లేక బి.పి లు తగ్గించుకోవటమో (ఇదికూడా ఒకందుకు మంచిదే కదండీ) ఉంటాయిలే అని సరిపెట్టుకుంటాను అంతే...
నేను ఈ దిగువన ప్రస్తావించబోయే విషయాలన్నీ నా టపాలో చెప్పి నేను చేస్తున్న సముద్రంలో నీటిబొట్టంత సహాయాన్ని నా టపా ఒక డప్పులాగా అయిపోకూడదనీ వీటి జోలికి వెళ్లలేదు.
మీరు 'రైతుల ఆత్మాభిమానం' అనే ఒక చక్కని నిజాన్ని/విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ ఆచరణలో చేసిన/చేయగలిగిన ఒక వాస్తవాన్ని చెప్పదలచాను .. ఒకప్పుడు పది - పదిహేను ఎకరాల పొలం ఉండి, ఎంత కష్టపడినా కూడా, ఏ దురలవాట్లు లేకపోయినా , ఎలాంటి విలాసాలకు డబ్బులు ఖర్చు చేయకపోయినా, సరిగా పండక, పండినా సరైన ధరలేక, కుటుంబసభ్యులలో ఎవరో ఒకరికి ఆరోగ్యసమస్యలు రావటంతో, పిల్లల చదువులకోసమో పొలాలు అన్నీ అమ్ముకోని చివరకు మిగిలిన ఒకటో రెండో ఎకరాలలో వ్యవసాయం చేయటానికి డబ్బులు లేక కౌలుకి ఇచ్చి,కుటుంబాన్ని పోషించటానికి మగవారు రోజువారీ అరక దున్నటానికి, ఆడవారు కూలికి వెళ్లటానికి సిధ్ధమైన వారి గురించి నేను ప్రత్యక్షంగా చూశాను. అందుకే వారి ఆత్మాభిమానం
జోలికి వెళ్లకుండా ఉండేలా మరియు ఈ రోజు, రేపు రెండు పూటలా అన్నంతో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి కదా అని నచ్చ(తెలియ)జెప్పి ... వారిలో 'మన' (మరొకరున్నారు) అన్న భావం కలిగించి ... ఇరవై ఎకరాలకి పెట్టుబడి ఉన్నవాడికి వారి మరో రెండు, మూడు ఎకరాలకి పెద్ద కష్టం కాదు కదా అని చెప్పి, పదిమందికి వెళ్లి రోజు వారీ అరక దున్నటం, కూలీకి వెళ్లటం కన్నా ... వారి పొలంలో వారే వ్యవసాయం చేసుకునేలా మిగిలిన సమయం మన పొలాలలో పనిచేస్తున్నందుకు వారికి సంవత్సరం మొత్తానికి వచ్చే పదిహేనో, ఇరవై వేలో ముందుగానే ఇచ్చి, వారి పిల్లలకు డి.టి.పి, సాప్ట్(హార్డ్)వేర్ డిప్లొమాస్ చేయించిన ప్రయత్నం ఇప్పుడు వారి ఇళ్లల్లో కొత్త కాంతులు చూస్తున్నా, వారు మన, మన కుటుంబ సభ్యుల మీద చూపించే అభిమానానికి నిజంగా కళ్లు చెమరుస్తాయి.
అలాగే మీరన్నట్టు అన్నిసార్లు(చోట్ల) ఈ ప్రయోగం విజయవంతమవ్వాలని లేదు అలాగని మొదలు పెట్టకుండా ఉండటం కూడా తప్పేనేమో కదా....వ్యవసాయం అనే పుండుకి ఏ మందు వేస్తే ఖచ్చితంగా నయమవుతుందో కనుచూపు మేరలో కనిపించనపుడు లేక ఆ మందుతో తగ్గుతుందన్న నమ్మకంలేనప్పుడు లేదా ఇప్పటికిపుడు నమ్మకం కలిగించలేనపుడు , అసలు మందు వేయకుండా ఉండే దాని కన్నా, వికటించని మందు(లు) వేస్తూ తాత్కాలిక ఉపశమనం కలిగించటంలో తప్పులేదేమో లేక అదే మంచిదేమో అనిపిస్తుంది నాకు.
- Unknown on Dec 1, 2007, 9:12:00 AM said...
-
శెభాషులు, వంద నినాదాలు, ఏడుపులు, పెడబొబ్బలకంటే ఒక చిన్నసహాయం ఎంతో మేలు. చేస్తున్న పనులు చెప్పుకోవటానికి మొహమాటపడతాము కానీ మనం చెప్పకపోతే పదిమందికీ అది స్పూర్తినెలా ఇస్తుంది అని నాకు మీరు వ్రాసిన విషయం చదివిన తర్వాత తెలిసింది. మీకు ఇలా సహాయము అవసరమైన వాళ్ళు తారసపడితే నాకూ తెలియజేయండి. దయచేసి మీరు దీని గురించి ప్రత్యేక టపా రాయాలని మనవి. డబ్బా అని ఎవరైనా అనుకుంటే..నవ్వి ఊరుకోండి.
పిల్లలకు డి.టి.పి నేర్పించటం చాలా మంచి ఆలోచన
- Anonymous on Dec 14, 2007, 2:37:00 AM said...
-
Eme anukokandi.
Raitulani bichagallu chesaru.
Raitulaku kavalsinde, mee daanamo inkedo kaadu saraina margam.
2002 pesticides vaadakm 1900 tonns paiga vundi okka rabiloone, ade 2006 400 ki vachinde. sarigga vaadethey 250 tonnes kanna ekkuva pattav, so, mari okko acre ki atelast 2-3k ekkuva pettubadi pedutunnaru.
Taruvata, mana ICRISAT nidrapotunnadi, Baabu chesina panlu valla international seeds companies daarunam ga doopide chestunnai, america lo BT 400rs aite ade ikkada manaki 1600 ki ammeru, reddy baabu eme control chesaru?
vaade 12 crores ki ICRISAT ki ammutanu anadu, kaani baabu nidrapovatam valla vaadu ekamga 1600 crores america ki pattukelladu.
aa 1600 kotlu okka vittanala meedane, ave ganaku migilethy mari manam iche 10$ kanna entha ekkuva? taruvaata avi valla dabbule.
Manam eme cheyakkaral doopideni arikattali.
Doopide ante raitulani doopide cheyatam kaadu, anni vidaluga, raitulu vallane valle dopide chesukuntunnaru.
1.Sahakaara runalu eme ayyayi?
2. Raitula ni mosam chese vallu dharjaga enduku terugutunnaru?
3. MRP ki amme dharaki ento teeda enduku vuntunnadi? Seeds and pesticides
4. Raitu kuulelu 5hrs lo chesi panini enduku 2 days inka ekkuva ga podigestunnaru?
5. Agri research eme ayyinde?
6. Poote padi, raitulu dabbu dubara enduku chestunnaru? ante pakknodu 2 bottels kodethe nenu 3 bottles kottutunnanu.
ala anne chinna chinna problems, kaani pattinchukokapovatam valana ave gudi bandalu ayyayi.
4.
- తెలుగు'వాడి'ని on Dec 28, 2007, 5:01:00 PM said...
-
@ramu గారు : ఇందులో అనుకోవటానికి ఏమీ లేదండి ... ఎవరి అభిప్రాయాలు వారివి మరియు ఎవరి ఆచరణ/పరిష్కార మార్గాలు వారివి. మీరు చెప్పిన వన్నీ చాలా valid points అండి అందులో సందేహమే లేదు కానీ వాటి వల్ల ఇప్పటికిప్పుడు వెంటనే ఏమి ఒరుగుతుందో మీరే ఆలోచించి చెప్పండి...పోబోతున్న ప్రాణం ఆపకుండా కాపాడుతుందా...లేనప్పుడు మరి ఎందుకండి ఈ విశ్లేషణలు :-(
పోతే తిరిగిరానిది ప్రాణం అండి అందుకే దానిని నిలబెట్టటానికి మీరన్నట్టు నేను రైతులను భిక్షగాళ్లను చేశాను అనుకున్నా లేక అంతకన్నా దిగర్చుతానేమో అనుకున్నా ...నా వోటు దానికే...ముందు ప్రాణాన్ని నిలబెట్టాలి ఆ తరువాతే ఏదైనా అంటే వారిని ఏ మార్గంలోకి మార్చాలి...long term / alternative plan ఏమిటి ..
రోడ్ మీద accident అయ్యి మనుషులు ప్రాణాపాయస్థితిలో ఉంటే, వాళ్ల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నం చేసే బదులు ... అసలు ఈ accident ఎందుకు అయ్యింది ... వేగంగా నడపటం ఏమిటి .. చూసుకోనక్కరలేదా ... ప్రభుత్వం ఏమి చేస్తుంది ... divider ఉందా .. ఉంటే correct గా ఉందా .. లేకుంటే ఎందుకు లేదు ... రోడ్ మీద గీసిన గీతలు, రోడ్ పక్కన ఉన్న ప్రమాద హెచ్చరికలు మీరు పాటించరా...అసలు ఈ రోడ్ వేసిన contractor ఎవరు ... ఇలాంటి ప్రశ్నలు వేసినట్టుగా ఉంది మీరు చెప్పింది.
ముందు వారి ప్రాణాలని కాపాడండి....తరువాత ఇవన్నీ చెప్పి వారిని మరింత జాగరూకులను చెయ్యండి వింటారు లేక పోతే ఏమి జరుగుతుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కరలేదు అనుకుంటా ..
వీలుంటే నేను తెలుగువీర గారికి చెప్పిన comments మరొక్కసారి చదవండి ... నేనేమీ రైతులకి బిక్షం వెయ్యటంలేదు అండి లేక వారి ఆత్మగౌరవం / ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టటం లేదు అండి ... ముందు వారిని ఆత్మహత్యల మీద నుంచి మరల్చండి .. తరువాత వారికి కొన్ని ప్రత్యామ్నాయాలని చూపించండి ...ఖచ్చితంగా ఆచరించి తీరుతారు
- Anonymous on Jan 29, 2008, 7:43:00 AM said...
-
tv5,tv9 luu
news channelsaa???
leka
newsense channels?????
tv lu chudalantene chiraku...
veelu eppudu marutaru...
pokiri cinema lo anta manchiga comment chesina vallu artham chesukoa..tv9 vodu bayatiki vachhi tv5 ani jaanalani chavakodutunnadu...
evarina dare chesi chepudamante bayam..media to pettukovlante...