Best Employers in Asia 2007 (India, S'Pore, Korea, Japan, China, Hing Kong)
మన బ్లాగుల్లో చాలా మంది ముఖ్యంగా ఇండియా, సింగపూర్ లలో పనిచేస్తున్న వాళ్లు, అలాగే ఉద్యోగ నిమిత్తం వివిధ దేశాలలో పనిచేసి(స్తు)న వాళ్లు ఉన్నారు కనుక వారు పనిచే(సి)స్తున్న కంపెనీ ఈ లిస్ట్ లో ఉంటే ఎంతో కొంత ఆనంద పడటమో లేక వీళ్ల బొంద సర్వేలు వీళ్లు .. ఇందులో ఇసుమంత కూడా నిజం లేదని అనుకునేవాళ్లు ... ఎవరికోసమైనా నాకు తెలిసిన వివరాలు ఇక్కడ మీకు అందిద్దామనే చిన్న ప్రయత్నమే ఈ టపా ..
Asia
India
Singapore
Korea
Japan
China
Hong Kong
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
ఓ బుడ్డోడి 'విశ్వదాభిరామ' మిమిక్రీ కార్యక్రమం - చించేశాడంటే నమ్మండి
'విశ్వదాభిరామ' మిమిక్రీ కార్యక్రమం - మురళి
లేక
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
Save the Planet -- and Save the Company a Lot of Power and Paper
ఈ గ్లోబల్ వార్మింగ్ ఏమో గానీ, కొత్తపాళీ గారి దెబ్బకి/రిక్వెస్ట్ కి ఈ అంశం మీద ఏదో ఒక టపా: గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన రాసి ఆ బత్తీబంద్ లో పడేసి ఒక పని అయ్యిందిలే అనుకున్నా కూడా, అప్పటికే బాగా వార్మప్ అయిన బుర్ర ఇంకా దాని చుట్టూనే తిరుగుతూ ఉండటంతో వీటికి సంబంధించిన మరికొన్ని విషయాలను ఇక్కడ పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ...
గ్రీన్ ఎనర్జీ అనీ, గ్లోబల్ వార్మింగ్ అనీ, పేపర్ లెస్ ఆఫీస్ అనీ ఇంకా ఏవో రకరకాలుగా అందరం ఆలోచిస్తున్న ఈ దశలో ... వీటికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగితే ముందుగా మనకు తోచేవి : ప్రతి రోజూ అఫీస్ నుంచి వెళ్లేటప్పుడు అన్నీ ఆఫ్ చేయాలి, విద్యుత్ వాడకం తగ్గించాలి, సాధ్యమైనంతవరకు ప్రింటింగ్ తగ్గించాలి, విద్యుత్ వృధా కాకుండా చూడాలి మొదలగునవి.
కానీ ఇవన్నీ చెప్పటానికీ, చదవటానికీ బాగానే ఉంటాయి కానీ ఇవన్నీ ప్రతిరోజూ క్రమం తప్పక చేయవలసి రావటంలోనే ఉంది తంటా అంతా అని మనకందరికీ తెలిసిన విషయమే ..
వెళ్లండ్రా బాబు రోజూ ఇవన్నీ చెయ్యాలి అంటే మనవల్ల కాదు అనిపించి అసలు ఇలాంటి వాటికి ఏమన్నా products ఉన్నాయా అని వెదుకుదాము అనుకుంటే, వెదకబోయిన తీగ కాలికి తగిలింది నేను క్రమం తప్పక చదివే
Inc.com అనే వెబ్ సైట్ లో.
ఇలాంటి కొన్నింటికి ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చిన కొన్ని వస్తువుల వివరాలు ............. [ నాకు నచ్చినవి ప్రత్యేకమైన రంగులో ]
Stylish eco-lighting :: An LED desk lamp
Green computing ::: An energy-efficient notebook computer
Enforcing conservation ::: Software that automatically powers down all company PCs
Saving paper ::: Software that eliminates unnecessary pages before printing
Plugging power leaks ::: Strip prevents your computer peripherals from siphoning power when you aren't using them
Keeping tabs on power use ::: A gauge that measures energy consumption of appliances -- from microwave ovens to monitors
వీటి గురించి పూర్తి వివరాలు :
Inc.com లో ప్రచురించబడిన ఈ ఆర్టికల్ Save the Planet -- and Save the Company a Lot of Power and Paper లో చదవండి.
ఇలాంటి products అన్నీ ఇప్పుడిప్పుడే మార్కెట్ లోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా ముందు ముందు మరిన్ని ఫీచర్స్ తో తప్పకుండా వస్తాయి ... లేదా ఇప్పటికే కొన్ని వచ్చి ఉండవచ్చు ... మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే అందరికీ తెలియజేయండి.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
Conservation of Energy గురించి TCS వారి Annual Report లో ఏముందో చూడండి
కబుర్లూ .. కాకరకాయలూ ... అనే బ్లాగ్ లో ప్రచురించిన టపా TCS Annual Report 2007-08 లో లేవనెత్తిన సందేహానికి సమాధానం తెలుసుకుందామనే నా ప్రయత్నంలో నేను చదివిన TCS Directors Report రిపోర్ట్ లో Conservation of Energy గురించి TCS వారు ప్రకటించిన వివరాలు చదివాక ఇంత గొప్ప(?) కంపెనీ చూపిస్తున్న శ్రధ్ధ గురించి మీరు కూడా తెలుసుకుంటే బాగుంటుందేమో అనే ఉద్దేశ్యమే నా ఈ టపా ..
ఇది ఒక్కటి చేయనంత మాత్రాన అది గొప్ప కంపెనీ కాకుండా పోతుందా అంటే ... అలాగని కాదు ... మన వంతు బాధ్యతగా ఇది చేస్తున్నాము అని తెలిస్తే నా వరకు నాకు ఒక భారతీయునిగా (ఒక ప్రముఖ కంపెనీ/సంస్థ/people చేస్తుంటే) నిజంగా గర్వంగా, ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇంత పెద్ద కంపెనీస్ చేస్తే వాటి impact/results కూడా అదే స్థాయిలో ఉంటాయి అలాగే అవి దూరదృష్టితో కూడినవై ఉంటాయి మరియు సామాన్య జనాలలో కూడా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
CONSERVATION OF ENERGY
The operations of the Company involve low energy consumption.
Adequate measures have, however, been taken to conserve energy.
అంతే .. అంతకు మించి ఇంక ఏమీ లేదు ... అలాగని వీళ్లు అసలు ఏమీ చెయ్యటం లేదేమో అని అనుకుందాము అంటే అది నమ్మశక్యంగా అనిపించటం లేదు ... ఖచ్చితంగా ఏవో కొన్ని అన్నా చేస్తూ ఉంటారు కదా .. కనీసం వాటి గురించి వివరాలన్నా ఇచ్చి ఉండవలసింది ... మిగతా టాపిక్స్ అన్నిటి గురించీ పేరాలు, పేరాలు ఉన్నాయి ... ఎడిషనల్ బుక్లెట్స్ జతచేసి మరీ వివరించారు ...
ఇంకా కొంచెం శ్రధ్ధ పెట్టి కనీసం ఒకటో రెండో వివరాలు ఇస్తే ఎంత బాగుండేది ...
IBM's(documented baseline energy conservation and CO2 emissions reduction since 1990) report :
రెండే రెండు విషయాలలో మాత్రమే ...
2005 కన్నా 2006 లో ప్రగతి కనిపించింది (Highlighted with Blue border)
...
మిగిలిన అన్ని విషయాలలో 2005 లోనే బాగుంది (Highlighted with Red border)
or
Did I read the data wrong?
ఇక అసలు విషయానికి వస్తే ..
ఇప్పుడు నా కన్ను దీనిమీద ఎందుకు పడింది అంటారా ... ఈ మధ్య అంతా గ్లోబల్ వార్మింగ్ గురించే కదా .. అది ఒక ప్రధాన కారణం అయితే ... రెండవది మరియు అతి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ...
మొన్నీ మధ్య IBM వారి సైట్ లో నేను ఒక ఆర్టికల్ : A day in a low carbon life ... What might it be like to lead a business in 2012? చదివినప్పుడు ముందు కొంత ఆశ్చర్యపడ్డా ... వీళ్లు కొంచెం 'అతి/ఎక్కువగా' చెపుతున్నారేమో/ఆలోచిస్తున్నారేమో అని .. కానీ ఇంత పెద్ద కంపెనీ కదా, అంత ఆషామాషీగా ఎందుకు చెపుతారు ఇలా .. మన బుర్రకి అర్ధమయ్యే/ఊహించే స్థాయికన్నా కొంచెం ఎక్కువ చెపుతున్నారులే అని సరిపెట్టుకున్నా .. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ... ఆ రోజు ఎంతో దూరంలో లేదు అని ..
కొంచెం ఓపిక చేసుకుని చదవండి ... Very good article.
Few lines from the above mentioned article/PDF :
“I knew carbon management was going to be a big issue, but I never dreamed that it would be so central to our reporting and performance,” he read.
.................................
“News just in…we can confirm that the SEC will be investigating claims that a Fortune 500 company falsified carbon submissions in their latest company report. More now from our reporter in Montana…”
నిజంగా ఈ TCS వాళ్లు ఏమి చేస్తున్నారో తెలుసుకుందాము అనే ఉత్సాహంతో అడుగుతున్నా .... మన ఈ బ్లాగ్ప్రపంచంలో లో ఎవరికన్నా తెలిస్తే వివరాలు తెలుపగలరు ...
FYI : ఒకవేళ మీరు వ్యాఖ్య రాస్తే మీరు TCS లో పనిచేస్తున్నారేమో అని పొరపాటు పడే ప్రమాదం ఉంది అనుకున్నా లేక మీ పేరు తెలపటం ఇష్టం లేకున్నా .. నా బ్లాగ్ లో మీరు anonymous గా వ్యాఖ్యలు రాసే సదుపాయం ఉంది
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
గ్లోబల్ వార్మింగ్ : బత్తీబంద్ -> నా ఆలోచనలు
ఏదో కొత్తపాళీ గారి పుణ్యమా అని నేను కూడా కొద్దిగా (ఆలో)చించి నాకు తోచిన నాలుగు ముక్కలు వారికి పంపించగా, అది బత్తీబంద్ లో ప్రచురించబడింది గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన గా ....
దీనిపై మీ అభిప్రాయాలను, అలాగే వీలైతే మీవైన ఆలోచనలు కూడా అక్కడ పంచుకోండి.
మరచిపోకండి ... Count down to lights out
JUNE 15 *** 7.30 - 8.30 PM