ఇరాక్ యుధ్ధం వలన బాగా లాభపడిన కంపెనీలు
ఇరాక్ పైకి అమెరికా యుధ్ధానికి వెళ్లటం అనేది న్యాయమా, అన్యాయమా అనేది పక్కన పెడితే అసలు దీని వలన కొన్ని కంపెనీలు ఏ స్థాయిలో లాభపడ్డాయో/లాభపడుతున్నాయో తెలుసుకుంటే ఒకింత ఆశ్చర్యం మరికొంత గగుర్పాటు కలుగుతుంది.
ఈ కంపెనీలలో మొదటిగా చెప్పుకోవలసిన Halliburton 2003-2006 మధ్యకాలంలో సంపాదించింది $17.2 Billion మాత్రమే .. ఈ కంపెనీ వెనుక ఎవరు ఉన్నదీ మీకు Google లో వెదికితే కనుక్కోవటం అంత కష్టం ఏమీ కాదు :-)
పూర్తి వివరాలకు : The 25 Most Vicious Iraq War Profiteers
4
వ్యాఖ్యలు:
- Rajendra Devarapalli on Jul 23, 2008, 3:02:00 AM said...
-
మతి చెదిరింది మీరిచ్చిన వివరాలు చదూతుంటే.
ఆ మధ్య ఎక్కడో బౌద్ధసాహిత్యంలో చదివా,గతంలో,దేశీయంగా యుద్ధాలు జరుతున్నప్పుడు,బౌద్ధసన్యాసులు,శ్రమణకులు యుద్ధాలు వద్దు అని వారించటం,కానీ వాటివల్ల లబ్దిపొందే వణిక్ప్రముఖులకు వీరి వాదనలవల్ల,యుద్ధాలాగిపోతే ఎలా అన్న భయం పట్టుకోవటం,(లాభాలు తగ్గుతాయి కదా,పోతే పోతాయి కొన్ని ప్రాణాలు) దానితో,అటు రాజులనూ,ఇటు వణిజులనూ అశ్రయించుకుని బ్రతికే అర్చక,పురోహితవర్గాల ద్వారా అసలు బౌద్ధాన్నే నిర్మూలించాలని పధకరచన చేసారని.
- తెలుగు'వాడి'ని on Jul 23, 2008, 12:11:00 PM said...
-
రాజేంద్ర గారు : మారింది కాలం, మనుషులు అంతే ... తరాలు మారినా, రాజ్యాలు పోయినా, ప్రజాస్వామ్యం వచ్చినా, ... పోయే ప్రాణాలతో పనిలేదు, యుధ్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు, క్షతగాత్రుల లెక్కల అవసరం, తదుపరి వారి జీవితాల గురించి ఆలోచనల అవసరం లేదు ... ధనదాహం మాత్రం అదే ... కీర్తి కాంక్ష, గెలిచామని(?) [ మనిషిగా చనిపోయినా కూడా ] అహం సంతృప్తిపరచుకోవటం అన్నీ పాతవే ...
- Anonymous on Jul 23, 2008, 12:56:00 PM said...
-
అమ్మో కళ్ళు చెదురుతున్నాయి ఆ అ0కెలు చూస్తు0టే
- Ramani Rao on Jul 25, 2008, 12:45:00 AM said...
-
అమ్మో! వివరాలు, ఆ అంకెలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడ్చింది.
అడిగానని అనుకోకండి, చెప్పకుండ దాటేయకండి, మీరు చర్చ/రచ్చ ల గురించి పోస్ట్ రాస్తున్నా అన్నారు. నిజంగానే చిరంజీవి పార్టీ లా చేస్తున్నారు. మేమేమో ఇక్కడ కళ్ళు వాచేలా ఎదురుచూడడం ఏమి బాగోలేదు.. ఎంత చిరంజీవి అభిమానులైతే మటుకు, బ్లాగు పోస్ట్ కి రాజకీయానికి లంకె పెడితే ఎలా తెలుగు 'వాడి ' ని గారు?