ఆధునిక అక్షరమాలలో ఎన్ని తెలుసు మీకు - Web Savvy తల్లిదండ్రులారా !?
ఇప్పటికే అ-అమ్మ, ఆ-ఆవు, ఇ-ఇల్లు అనే వాటికి బదులు A-Apple, B-Ball, C-Cat అని మనం చక్కగా పిల్లలకు నేర్పుతుంటే ... దీనికే/ఇలాంటి వాటికే తెలుగు భాష మూలన పడిపోతుంది ... వాడకం తగ్గిపోతుంది ... తల్లిదండ్రులే పిల్లల కన్నా ఎక్కువగా వారిపై ఈ ఆంగ్లభాషను రుద్దుతున్నారు అని మనం బాధపడిపోతుంటే ... Web Savvy తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కొత్తగా ఒక అక్షరమాల Internet లో సంచారం చేస్తుంది ... ప్రస్తుతానికి సరదాగానే అయ్యుండొచ్చు గానీ ఇలాంటి వాటికి మనం ఎంతో దూరంలో లేమేమో అనిపిస్తుంది అప్పుడప్పుడూ ... దానిని ఇక్కడ మీకు అందించాలనే ప్రయత్నమే ఈ టపా ..
మరి ఇక ఆలస్యం చేయక ఈ అక్షరమాల పని పట్టండి .. చూద్దాం ఇప్పటికప్పుడు ఎన్ని కనిపెట్టగలమో ...
ఈ ఆధునిక సాంకేతిక/వెబ్ ప్రపంచంలో ఖచ్చితంగా మన పిల్లలు ఇలాంటి వాటిల్లో మన కన్నా ముందు ఉండే అవకాశం ఉంది కాబట్టి ... కొద్దో గొప్పో ప్రయత్నించండి ... ఎలాగూ చాలా వరకు తెలిసినవే ఉన్నాయి కదా ..
వాళ్లు అడిగినప్పుడు అన్నిటికీ తెల్ల మొహం వేసే బదులు కనీసం కొన్నింటికైనా సమాధానం తెలిసి ఉంటే మంచిదేమో కదా ..
అయినా ఇప్పుడు మనకి ఈ అక్షరాభ్యాసం అవసరమా అంటే అది కాలమే నిర్ణయిస్తుంది .. తెలుసుకుంటే తప్పేమీ లేదు ... ఏదో కొంత విజ్ఞానాభివృధ్ధి అయినా అవుతుంది కదా ... దూకండి మరి రంగంలోకి .... లేదా సరదాగా చూసి వదిలెయ్యండి ...
7
వ్యాఖ్యలు:
- Rajendra Devarapalli on Jul 11, 2008, 12:49:00 AM said...
-
అయ్యా ఇందులో నాకు ఒకట్రెండు కన్నా తెలియవు కనుక వాటి వివరాలు ఇవ్వప్రార్ధన
- Kathi Mahesh Kumar on Jul 11, 2008, 12:58:00 AM said...
-
బాగుంది.
- Bolloju Baba on Jul 11, 2008, 4:15:00 AM said...
-
తమాషాగా ఉందే!
బొల్లోజు బాబా
- Bolloju Baba on Jul 11, 2008, 5:14:00 AM said...
-
చిత్రంగా ఉందే చిత్రం
బొల్లోజు బాబా
- Anil Dasari on Jul 11, 2008, 7:47:00 AM said...
-
ఐదారు తప్ప మిగతావన్నీ అర్ధమయ్యాయి. ఆ ఐదారిట్లో ఒకటి Y. Y for Y! (Yahoo!) అనుంటే మరింత బాగుండేదేమో.
- Unknown on Jul 11, 2008, 12:27:00 PM said...
-
ఓ ఇది ఈజీ :P
@అబ్రకదబ్ర: అయ్యో... YouTube!
- తెలుగు'వాడి'ని on Jul 18, 2008, 8:01:00 PM said...
-
రాజేంద్ర గారు : ఇవిగోండి ఆ అక్షరమాలలోని వాటికి వివరాలు ... ఇప్పటివరకు తెలియకపోవటం కన్నా ఇప్పుడు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండటమే ఎంతో ముఖ్యం.
Apple
Bluetooth
Core
Del.icio.us
Emule
Facebook
Google
H.I.T (Holon Institute of Technology, top engineering colleges in Israel)
Iphone
Java
Kazaa
Linux
Messenger (MSN)
Napster
Office
Play station
Quicktime
RSS
SecondLife
Tag cloud
USB
Vista
Wikipedia
XP
Youtube
Zuma
తప్పులుంటే ఎవరైనా సరిజేయ ప్రార్ధన.
స్పందించిన అందరికీ దన్యవాదములు.