Laptop లను శుభ్రం చేయటం ఎలా ?

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, July 9, 2008

******************************************

నల్లమోతు శ్రీధర్ గారి సాంకేతిక బ్లాగ్ లో
లాప్‌టాప్‌ల విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి. అనే టపాకు పూర్ణిమ గారు లాప్-టాప్ లను ఎలా శుభ్రం చేయాలి అని అడిగిన ప్రశ్నకు శ్రీధర్ గారి సమాధానంతో పాటు నేను ఇచ్చిన సమాధానాన్ని మరలా ఇక్కడ ... పూర్ణిమ గారితో పాటు మనలో ఇంకా మరికొంత మందికి అయినా ఉపయోగపడుతుందేమో అనే ఆలోచనే ఈ టపా ..

Laptop లను శుభ్రం చేయటానికి ఈ కింద లంకెలలో ఉన్న సమాచారం చూడండి.

How to Clean A Laptop Computer
How to Clean a Laptop Screen With Household Products

వివిధ రకాలైన సైట్స్ లో వివరించిన చిట్కాలు/సూచనలు/సలహాలు ఆచరించబోయే ముందు ఒకవేళ మీకు వీడియోలో చూస్తే ఇంకా బాగా ఉంటుంది అనిపిస్తే ఈ కింద ఉన్న వీడియో లంకెను నొక్కండి లేదా అంతకు దిగువన ఉన్న వీడియోను ఇక్కడే చూడండి.

How To Clean A Laptop - Video

లేదా




ఆడుతూ పాడుతూ శుభ్రం చేయండి ... అలుపూ సొలుపూ లేక చక్కగా బ్లాగండి.

మరలా ఇలాంటి మరికొన్ని చిట్కాలతో లేదా మరింత సమాచారంతో కలుద్దాం ... అంతవరకూ శెలవా మరి !!!!!



విషయ సూచికలు :


13 వ్యాఖ్యలు:

ప్రతాప్ on Jul 10, 2008, 2:07:00 AM   said...

బావుంది. చాలా ఉపయోగ పడేలా ఉంది. నా laptop ఎలా శుభ్రపరుచుకోవాలో తెలియక చచ్చిపోతున్నాను.
నాకు కొన్ని సందేహాలున్నాయి. మీకు కాని తెలిస్తే వివరించగలరు.
compressed air అంటే ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది?
cleaning solution అంటే మనం కళ్ళజోడు శుభ్ర పరుచుకోవడానికి ఉపయోగించేది, ఉపయోగించవచ్చా? లేక వేరేది ఏమన్నా ప్రత్యేకంగా దొరుకుతుందా?


Sujata M on Jul 10, 2008, 3:12:00 AM   said...

Hey.. videojug is my fav. site. I didnt know how to post a videojug video into blogger. I would love to post some videos in my blog. Can you please help ?


తెలుగు'వాడి'ని on Jul 10, 2008, 9:18:00 AM   said...

@సుజాత గారు: Click on the 'Share' image/button which you can see below any video on the Videojug site. Then you can see Link/Embed fields with some text next to them.

**** If you want to show/embed the video the way it was shown in this post and/or just show a hyperlink which takes the user to the videojug site once it's clicked ........

....... simply copy the code next to 'Embed' and simply paste in to your Blog Post Editor.

That's it. You are done.

Please drop me a line here if you got in to any issues.


Anil Dasari on Jul 10, 2008, 9:48:00 AM   said...

ప్రతాప్,

మీరు బహుశా canned air గురించి మాట్లాడుతున్నారు. ఇది వేరు, compressed air వేరు. Canned air అనబడేది అధిక వత్తిడివద్ద కంప్రెస్ చేయబడ్డ ద్రవరూప హైడ్రోకార్బన్లు. ఇవి spray cans లో దొరుకుతాయి (పెప్సీ టిన్ సైజులో కానీ, కొంచెం పెద్దగా కానీ ఉంటాయి). కంప్యూటర్ల మదర్ బోర్డులు, ఇతరత్రా ఎలక్ట్రానిక్ సామాగ్రి లోపలి భాగాల దుమ్ము దులపడానికి దీన్ని వాడతారు. వీటినే air dusters అని కూడా అంటారు. మీరు అమెరికాలో ఉన్నట్లయితే ఇవి Frys Electronics, Best Buy లాంటి ఎలక్ట్రానిక్ షాపుల్లో లభిస్తాయి. Wal Mart లోకూడా ప్రయత్నించొచ్చు. డబ్బా సైజునిబట్టి ఖరీదు ఐదు నుండి పదిహేను డాలర్ల దాకా ఉండొచ్చు. ఆన్‌లైన్ లో కూడా దొరుకుతాయి.

Canned air లభించకపోతే చెవులు క్లీన్ చేసే cotton swabs తో కూడా చాలా వరకూ లాప్‌టాప్ దుమ్మును వదిలించవచ్చు. కొద్దిగా శ్రమతో కూడిన పని, ఎక్కువ సమయం పడుతుంది. నావరకూ నేను సైజ్ 8 లేదా సైజ్ 10 ఫ్లాట్ పెయింటింగ్ బ్రష్ ఉపయోగించి ల్యాప్‌టాప్ లోపల దుమ్ము దులిపేస్తాను.


తెలుగు'వాడి'ని on Jul 10, 2008, 9:55:00 AM   said...

@ప్రతాప్ గారు : ఉపయోగపడితే అదే పదివేలు. ఆచరణలో పెడితే అదే కోటానుకోట్లు :-)

Compressed air అనేది ప్రోడక్ట్ పరంగా వచ్చేటప్పటికి చాలా వరకు canned air అని అంటారు. కళ్ళజోడు శుభ్ర పరుచుకోవడానికి ఉపయోగించే cleaning solution వాడొచ్చు. ఫర్వాలేదు. ప్రత్యేకంగా కూడా చాలా ఉన్నాయిలేండి.

దురదృష్టవశాత్తూ ఇలాంటి సమాచారానికి సంబంధించి మన నాలెడ్జ్ అంతా 'అమెరికా' వెబ్ సైట్స్ కే పరిమితం :-( మీరు Laptop Cleaning Kits or Notebook Cleaning Kits అని వెతికితే చాలా ప్రోడక్ట్స్ కనిపిస్తాయి.

ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలంటే సందేహించకుండా అడగండి.


తెలుగు'వాడి'ని on Jul 10, 2008, 10:07:00 AM   said...

అబ్రకదబ్ర గారు : ముందుగా ధన్యవాదాలండీ మి సమాచారానికి. చూడబోతే ఇద్దరం ఒకేసారి మొదలు పెట్టాం లాగా ఉంది వ్యాఖ్య రాయటం. ప్రతాప్ గారి లొకేషన్ తెలియదు కదా ఈ అమెరికా సమాచారం ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ చివరకు వద్దులే .. ఒకవేళ అడిగితే అప్పుడు ఇవ్వచ్చులే అని క్లుప్తంగా ముగించా..కానీ మనిద్దరి వ్యాఖ్యలు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉండటం బాగుంది.


Purnima on Jul 11, 2008, 9:07:00 AM   said...

అడిగిందే తడువుగా నా కోరికను మన్నించి ఈ విషయమై టపా రాసినందుకు చాలా చాలా ధన్యవాదాలు!! నాకు చాలా ఉపయోగకరంగా ఉంది.


Anonymous on Jul 11, 2008, 12:26:00 PM   said...

లాప్ టప్ స్క్రీన్/lcd స్క్రీన్ లు శుబ్రం చేయడానికి మెత్తటి క్లాత్ తో ’VODKA' తో శుబ్రం చేయవచ్చు.


తెలుగు'వాడి'ని on Jul 11, 2008, 1:48:00 PM   said...

@సుజాత గారు: I saw you posted a YouTube video clip in your 'Gaddipulu' blog. It's the same as for VideoJug also. Let's do this : Create a new post and then simply copy and paste the embed code from videojug's video in to this new post and publish it. If it's not showing up then I will take a look at the 'page soource' of your blog and see if there is some thing wrong. If not then we can think about an alternative way of troubleshooting.


Sankar on Jul 13, 2008, 7:35:00 AM   said...

thanks a lot ... seems very useful... let me try and post my experience


ప్రతాప్ on Jul 15, 2008, 2:20:00 AM   said...

అబ్రకదబ్ర గారు, తెలుగువాడిని గారు,
మీ information కు ధన్యవాదాలు.
కానీ నేను ప్రస్తుతం ఉండేది హైదరాబాదులో. ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయో లేదో కాస్త ఎంక్వయిరీ చెయ్యాలి. దొరక్కపోతే మీ సలహాని, శివ గారి సలహాని follow అయిపోతాను.


Sujata M on Apr 18, 2009, 9:54:00 AM   said...

Im sorry. I lost touch. Thank you very much. I actually used videojug videos in my blog last year. I forgot to thank you. Thanks a lot sir.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting