TV TRP Ratings గురించి కొంత సమాచారం
బుల్లితెర అనే కొత్త బ్లాగులో ఒకానొక టపా వెర్రితలలు వేస్తున్న నేషనల్ మీడియా కు వ్యాఖ్య రాసే సందర్భంలో చేయిజారి TRP Ratings అని ఒక పదం ఉపయోగించా .. అంతే అబ్రకదబ్ర గారు వాటిని ఎలా ఇస్తారు అని ప్రశ్నించగా నేను మొదలు పెట్టిన వివరణ ఇంతింతై వటుడింతై అన్న చందంగా చాలా పెద్ద వివరణై కూర్చుంది .. సరే ఆ వివరణ అంతా ఇలా ఒక కొత్త టపాగా రాయటం ద్వారా, బుల్లితెర అనబడే ఈ కొత్త టపాను నలుగురికీ పరిచయం చేసినట్టుగానూ మరియు ఆ సమాచారం అంతా ఇలా బ్లాగస్థం చేసినట్టుగానూ ఉంటుంది అనే ఆలోచనకు అక్షరరూపమే ఈ ప్రయత్నం.
అనటానికి వీటిని TRP (Telivision/Target Rating Point) లేక GRP(Gross Rating Point) అని అంటారు గానీ ... మీకు దీని గురించి ఖచ్చితమైన వివరాలు కావాలంటే Nielsen Ratings అని వెదకండి/చదవండి.
మీకు ఓపిక/ఆసక్తి అంటే ఇదిగోండి లంకె : Nielsen Ratings
ఓపిక/ఆసక్తి లేకపోతే క్లుప్తంగా చెప్పాలి అంటే ...
:::
Nielsen Television Ratings are gathered by one of two ways; by extensive use of surveys, where viewers of various demographics are asked to keep a written record (called a diary) of the television programming they watch throughout the day and evening, or by the use of Set Meters, which are small devices connected to every television in selected homes. These devices gather the viewing habits of the home and transmit the information nightly to Nielsen through a "Home Unit" connected to a phone line. Set Meter information allows market researchers to study television viewing habits on a minute to minute basis, seeing the exact moment viewers change channels or turn off their TV. In addition to this technology, the implementation of individual viewer reporting devices (called people meters) allow the company to separate household viewing information into various demographic groups.
:::::
ఇండియాలో కూడా ఈ మీటర్ పెట్టెల వ్యవహారమేనండీ ... కాకపోతే ఇది కొన్ని రాష్ట్రాలకే, అందులోనూ కొన్ని నగరాలకే పరిమితం ... ఇది కూడా చాలా తక్కువ శాతం .. ఇక పల్లెల గురించి మీకు తెలిసిందే కదా ...
నా దగ్గర ఉన్న ఒక పాత లంకెలో TRIPPING OVER THE TRP TRAP చాలా వరకు సమాచారం ఉంది ... ఇంత కన్నా కొత్త లంకెలు ఏమీ లేవండీ .. సారీ...
(ఇలా అతి తక్కువ శాతంతో లెక్కకట్టిన రేటింగ్స్ తో ఇండియా మొత్తానికి ఈ వ్యూయర్ షిప్ ఎలా ఆపాదిస్తారు అని ప్రస్తుతం స్టార్, సోనీ, జీ ల మధ్య ఒక ప్రత్యక్షయుధ్ధమే జరుగుతోంది .. ఈ రేటింగ్స్ మీదే వ్యాపారప్రకటనల విలువ ఆదారపడి ఉంటుంది అని మీకు తెలుసు కదా .. స్టార్ వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అని ... సోనీ, జీ ఈ రేటింగ్స్ ని బాయ్ కాట్ చేయాలి అని నిర్ణయించుకున్నాయి కొంతకాలం క్రితం .. ఇప్పటి పరిస్ఠితి ఏమిటో తెలియదు)
ఈ రేటింగ్స్ డాటా అంత కలిపి ఒక అయిదు/ఆరు వేల కుటుంబాల (ఈ మధ్య కాలంలో ఈ సంఖ్య కొద్దిగా పెరిగి ఉండవచ్చు .. కొత్త నగరాలు/పట్టణాలు జత చేసి ఉంటారు కాబట్టి) నుంచే అంటే దీనికి ఉన్న విలువ ఏపాటిదో ఉహించుకోవచ్చు. అందుకే మన డిడి వాళ్లు ఒక ప్రత్యేకమైన రేటింగ్స్ DART (Doordarshan Audience Ratings) ను ఫాలో అవుతారు. ఇది కూడా సర్వేల మీద ఆధారపడేదే కానీ కాకపోతే ఎక్కువ మంది ద్వారా వివరాలు(సర్వే/డైరీ ఇచ్చిన తరువాత వారానికి వచ్చి వీటిని collect చేస్తారు) సేకరిస్తారు.
ఇండియాలో ఇది చేసే సంస్థ ... INTAM (Indian Television Audience Measurement)
ఇకపోతే కేబుల్ ఆపరేటర్లకి ఏమన్నా పద్ధతులుంటాయా - ఏ ఇంట్లోవాళ్లు ఏ ఛానల్ చూస్తున్నారో కనుక్కోటానికి? అనే ప్రశ్నకు సమాధానం ... ప్రస్తుతానికి ఇండియాలో ఏమీ లేవు (పల్లెటూళ్లే కాదు నగరాలలో/పట్టణాలలో కూడా లేవనుకోండి) ...
ఇండియాలో ప్రస్తుతం ఒక కొత్త రకమైన మెజర్ మెంట్ వచ్చింది ... అదే మొబైల్ ద్వారా వివరాలు సేకరించటం .. పూర్తి వివరాలు ఇక్కడ : Yesterday who watched what
ఇకపోతే ఇప్పుడిప్పుడే ఇక్కడ అమెరికా లాంటి దేశాలలో కేబుల్, ఫైబర్ ఆప్టిక్, బ్రాడ్ కాస్ట్ మరియు సాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాలకు సంబంధించి పేటెంట్ పెండింగ్ టెక్నాలజీ ఒకటి ఇప్పుడే మార్కెట్ లోకి వస్తూ ఉంది .. మీకు మరిన్ని వివరాలు కావాలంటే ... Digital Audience Measurement and Tracking అనే సైట్ లోకి వెళ్లండి.
ఈ సెట్-టాప్ పెట్టెలలోనే ఇదంతా ఉంచటానికి చాలా విరివిగా ప్రయత్నాలు జరిగాయి/జరుగుతున్నాయి కాకపోతే ఇదే సమయంలో ఇండియా/చైనా అనూహ్యంగా పుంజుకోవటం, కుడి ఎడంగా ఇదే సమయంలో అమెరికా/యూరప్ లాంటి దేశాలలో ఈ డిజిటల్ వ్యూయర్-షిప్ పెరగటం, ఒకే కేబుల్ ద్వారానే ఇంటర్నెట్/టివి కార్యక్రమాలు రావటం, ముఖ్యంగా ఈ రేటింగ్స్ యొక్క పరిధి, సాధికారత మొదలగు వాటిపై అనేకానేక సందేహాలు తలెత్తటంతో ఈ రంగంలో కొంత diversified R&D జరగటానికి అవకాశం ఏర్పడింది. అలాగే ప్రస్తుతం నిపుణులు ఊహించిన విధంగా ఇండియాలో IPTV సేవలు వాప్తిలోకి వస్తే మరికొంత విస్కృతమైన రేటింగ్స్ డాటా లభించే అవకాశం ఉంటుంది.
మరికొన్ని వివరాలకు : Measuring the TRPs
ఇంతే సంగతులు .. చిత్తగించవలెను ... :-)
కొంచెం ఎక్కువ అయ్యిందంటారా విషయ వివరణ !?...
ఎందుకు అడిగామురా బాబు అని అబ్రకదబ్ర గారు అనుకుంటున్నారేమో మరి పాపం ! :-(
1 వ్యాఖ్యలు:
- Anil Dasari on Jul 10, 2008, 9:25:00 AM said...
-
"ఎందుకు అడిగామురా బాబు"
నేనలా అనుకోవటం లేదు :-) చాలా మంచి సమాచారం ఇచ్చారు. ఓపికగా రాసినందుకు ధన్యవాదాలు. ఇండియాలో రేటింగ్స్ పద్ధతిపై నాకు చాలా అనుమానాలున్నాయి - అవి అంత నమ్మదగ్గవి కాదేమోనని. మీ వివరణ దాన్ని రుజువు చేసింది.