Free and Premium Templates for your Blogger/Wordpress Blogs

Posted by తెలుగు'వాడి'ని on Thursday, July 3, 2008

సి.బి.రావు గారు రాసిన టపా బ్లాగరు మిత్రులకు: మీతో నేను - 1 లో బ్లాగ్ టెంప్లేట్స్ మార్చటం గురించి చదివిన తరువాత ఇప్పటికే నా దగ్గర అందుకు సంబంధించిన వివరాలు ఉండటంతో అవి మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ...

మీరు మీ టెంప్లేట్ మార్చాలి అనుకుంటే ..... ముందుగా ...

1. మీకు ఆ టెంప్లేట్స్ లో ఎన్ని కాలమ్స్ (రెండా, మూడా లేక నాలుగా) కావాలో నిర్ణయించుకోండి. [ నావరకైతే Four Columns Templates అంత బాగా నచ్చలేదు ... సూటిగా చెప్పాలి అంటే వికారంగా ఉన్నట్టనిపిస్తుంది. నేను ఎక్కువగా ఇష్టపడేది Three Columns Templates ]

2. మీ బ్లాగ్ లో మీరు ఏ విషయంపై ఎక్కువగా రాస్తున్నారో/రాయాలనుకుంటున్నారో ఆలోచించి దానికి అనుగుణంగా మీ టెంప్లేట్ యొక్క (హ)రంగులు ఉండేలా చూసుకోండి. (ఇలానే ఉండాలి అన్న నియమం ఏమీలేదనుకోండి ... ఉంటే ఆహ్లాదంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది .. అలాగే ఈ రంగులు మీ టపాలలోని భావాన్ని పాఠకుడికి అదే అనుభూతి కలిగించటంలో/చేరవేయటంలో ఎంతో కొంత దోహదపడతాయి).

3. మీ బ్లాగ్ ఎటువంటి టపాలు కలిగి ఉంది/ఉండబోతుంది అంటే మీ బ్లాగ్ ఏ విభాగం కిందకు వస్తుంది అన్నది నిర్ణయించుకోండి ... ఎందుకంటే ఏ విభాగానికి సంబంధించి ఆ విభాగానికి ప్రత్యేకమైన, రెడీమేడ్ టెంప్లేట్స్ మీరు చాలా సులభంగా సంపాదించవచ్చు.

4. మీ బ్లాగ్ లో మీరు పొందుపరచాలి అనుకుంటున్నారా అనేది కూడా ఒక ముఖ్యమైన విషయమే .... అవును అనేది మీ సమాధానం అయితే మీరు వాడబోయే టెంప్లేట్ వాటిని సపోర్ట్ చేస్తుమ్దో లేదో చూసుకోండి ముందుగానే (కాకపోతె ఈ మధ్య కాలంలో వచ్చిన/వస్తున్న టెంప్లేట్స్ అన్నీ వీటిని సపోర్ట్ చేస్తున్నాయి).

5. మీరు వ్యాపార ప్రకటనలు చూపించాలి అనుకుంటున్నారా? అవును అనుకుంటే, వివిధ రకాలుగా వీటిని చూపించగలిగిన ప్రత్యేకమైన టెంప్లేట్స్ ఉన్నాయి. వాటినే ఎంచుకోండి. (ఇంకా మన తెలుగు బ్లాగులు ఈ వ్యాపార స్థాయికి రాలేదు అనుకోండి .. కాకపోతే కొన్ని సాంకేతిక బ్లాగుల్లో ఇవి ఉంటే బాగానే ఉంటుంది)

6. మీ బ్లాగ్ మీద మీకు మమకారం ఎక్కువ అయిపోయి ఇంకా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలనుకోవటమో లేక ఒక ప్రొఫెషనల్ లుక్ ఉంటే బాగుంటుందేమో అనిపించటమో లేక ఇంకా చాలా ఎక్కువ కష్టమైజేషన్ options ఉంటే బాగుంటుంది అనిపించటమో జరిగితే మీరు ప్రీమియం టెంప్లేట్స్ వాడుకోవచ్చు. ఇవి సాధారణంగా $45 నుంచి $99 లోపల లభ్యమవుతాయి (ఇండియాలో ఇలా అమ్మే సైట్స్ ఏవీ నాకు తెలియవు కనుక వాటి ధరల విషయం నాకు తెలియవు). దురదృష్టవశాత్తు ఈ ప్రీమియం టెంప్లేట్స్ వ్యవహారంలో Wordpress వారికి లభ్యమైనన్ని Blogger వారికి లేవు. అలాగే Professional/Commerical Sites అన్నీ చాలా వరకు Wordpress వాడటానికి ఇష్టపడతాయి.

7. చిన్నచిన్నవి అనిపించే Menu Options, Paypal Donate Me Button, SEO (Search Engine Optimization) మరియు Flickr Photos మొదలగునవి ఉంటే బాగుంటుందేమో ఆలోచించుకోండి. ఎందుకంటే ఇవి అన్నీ రెడీమేడ్ గా పొందుపరచబడిన టెంప్లేట్స్ దొరుకుతాయి కనుక వాడకం సులభం అవుతుంది.

Blogspot.com వారికి :

Three Columns :

FreeTemplates
WebTalks
BlogCrowds

Two columns :

FreeTemplates
BlogCrowds

For more .... collection on beautiful 2/3 column blogger Templates :

Wordpress.com వారికి :

Free Templates :

Gridblog -


See a Demo of this Template
Download this Template

FireBug -

See a Demo of this Template
Download this Template

Blog Oh Blog -

See a Demo of this Template
Download this Template

Premium Wordpress Templates :

Design Adaptations.com/

Take a look at the CornerStone 2.0 template which was used in ' Navatarangam ' .

Revolution Theme .. నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇది ఒకటి

Peter And Rejensen
The Blog Entrepreneur.com
Men With Pens
Gadget Crunch .. నాకు బాగా నచ్చిన వాటిల్లో ఇది ఒకటి
Mimbo Pro ... Expensive but unbelievably fantastic theme. I like this a lot.
Artecg ... Modified version of the above. Amazing Template .. I like this very much.
Themesdemo - WpThemesPlugin
Premium News Theme
WP Magazine
Dubtastic
Rock In Themes

For the price list and also the Top/Best Wordpress Premium Themes :



ఒకవేళ మీకు కొంచెం ఓర్పు మరికొంచెం కళాపోషణ ఉంటే మీకు నచ్చిన రంగులు, ఎన్ని కాలమ్స్ ఉండాలి, మెనూ/కేటగిరీ ఎక్కడ/ఎటువైపు ఉండాలి మొదలగునవి అన్నీ డైనామిక్ గా మార్చుకొని మీకు నచ్చిన తరువాత కోడ్ జెనరేట్ చేసుకుని మీ బ్లాగ్ లోకి కాపీ/పేస్ట్ చేసుకోవచ్చు. అలా చేయాలి లేక చేయగలము అనుకుంటే ఈ కింద ఉన్న లంకెను నొక్కండి.

Web-based Wordpress Theme Editor


ముఖ్య గమనిక : మీరు ఈ ఉచిత టెంప్లేట్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ బ్లాగ్స్ లో install చేసుకుంటే దయచేసి ఆ టెంప్లేట్ లో ఉన్న లంకెలు (టెంప్లేట్ తయారు చేసిన వారి లేక సైట్ యొక్క లంకెలు) తొలగించకండి.

ఇవికాక మీకు తెలిసినవి/నచ్చినవి ఇంకా ఎమైనా ఉంటే నలుగురితో పంచుకోండి. నాకు వీలైనప్పుడు మరికొన్నిటితో ఇంకోసారి కలుద్దాం. అంతవరకూ మీరు టెంప్లేట్ మార్చే పనిలో ఎంజాయ్ చేయండి. సెలవా మరి.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::

మీరు ఈ టపా చివరి వరకు చదివినట్లైతే మరొక్క నిముషం సమయం తీసుకొని దయచేసి మీ రేటింగ్-ను, క్రింద ఉన్న Widget ద్వారా తెలియజేయగలరు...అందులకు మీకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


16 వ్యాఖ్యలు:

oremuna on Jul 3, 2008, 8:57:00 PM   said...

మీ ఓటింగ్ విడ్జెట్ మాయం అయినట్టున్నది?

టెంప్లేట్లు (రూపురేకలు?) గురించిన మీ వ్యాసం బాగుంది.

మరో చిన్న విషయం : కొన్ని రూపురేకలు ఆంగ్ల బ్లాగులకే బాగుంటాయి, తెలుగులోకొచ్చేసరికి అవి అంత అందంగా ఉండవు. ఇటువంటివాటిలో సాధారణంగా సమస్య line-height తో ఉంటుంది, అది పెంచి చూడండి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే తెలుగు వాటికి నాలుగు వరుసల రూపురేకలు అంతా బాగోవు, కానీ కవితా బ్లాగులకయితే ఇవి బాగుంటాయి! రెండు మూడు వరసలతో మనం వ్రాసె వ్యాస పరంపరా బ్లాగులకు బాగుంటాయి.

ఇంతవరకూ తెలుసు సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే రూపురేకలు రాలేదు, ఎవరైనా వాటిని తయారు చేస్తే బాగుంటుంది.


జ్యోతి on Jul 4, 2008, 1:51:00 AM   said...

ఇంతకు ముందు ఎంచక్కా పెళ్ళికి తయారైన జయలలితలా భారీగా, బరువుగా ఉండే మీ బ్లాగు ఇప్పుడు మరీ చిక్కి ఇలియానాల అయ్యిందండి. ఇంకా ప్రయోగాలు చేయండి.

టెంప్లేట్ మార్చేటప్పుడు , పాట టెంప్లేట్ సేవ్ చేసిపెట్టుకోవాలి. అలాగే కొత్త టెంప్లేట్ మార్చినప్పుడు అంతకు ముందు ఉన్న page elements అన్నీ పోతాయి, ప్రొఫైల్ తప్ప. సో అవన్నీ విడిగా సేవ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా టెంప్లేట్ ప్రివ్యూ చూసుకుని సేవ్ చేయాలి. ఈ గొడవలేమి వద్దు, అనవసరంగా రిస్క్ ఎందుకు అనుకుంటే ఒక డమ్మీ బ్లాగు తెరిచి, అన్ని టెంప్లేట్లు మార్చుకుంటూ ప్రయత్నించండి. తొందరపడి మీ బ్లాగుతో ప్రయోగాలు చేయకండి. ఉన్నది పోయింది ,ఉంచుకున్నది పోయింది అన్నట్టు అవుతుంది. నేను గమనించింది ఏమంటే custom templates లో హెడర్ పిక్చర్ మార్చలేము.. బ్లాగర్ వాడు ఇచ్చిందే నోరు మూసుకుని, కళ్ళు తెరుచుకుని చూసుకోవాలి. యామ్ ఐ రైట్.


Unknown on Jul 4, 2008, 10:41:00 AM   said...

మీ ప్రస్తుత టెంప్లేటు అంత బాలేదు. మీ బ్లాగుకి సరిగా సూటవలేదనిపిస్తుంది.

"తెలుగువాడిని" బానరు కూడా ఏదో అతికించినట్టుగా ఉంది. ఇంకా మార్పులో ఉందా ?


తెలుగు'వాడి'ని on Jul 7, 2008, 7:43:00 PM   said...

oremuna గారు : పాత విడ్జెట్స్ అన్నీ తీసివేశానండి.

మీరన్నట్టు ఈ కాలమ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించాలి. ఉన్నాయి కదా అని తీసుకుంటే అన్ని బ్లాగులకు అంతగా నప్పవు. నాకు కూడా Three columns Templates బాగా నచ్చాయి.

తెలుసు సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే రూపురేకలు గురించి, ఆవస్యకత అయితే ఉంది కాకపోతే తయారు చేయటానికి ముందు మనం ఎలా ఉండాలి అన్నదానిపై కొంత చర్చజరిగితే బాగుంటుందేమో కదా...


తెలుగు'వాడి'ని on Jul 7, 2008, 7:55:00 PM   said...

జ్యోతి గారు : భలే పోల్చారే :-) ఇవన్నీ ఎప్పటికప్పుడు త్వరితగతిన మారిపోయే విషయాలండీ అందుకే ఇతరులు ఉపయోగించుకోవటం లేదనిపిస్తే ఇలాంటి సాంకేతిక విషయాలకు సంబంధించిన టపాలు రాయటం కష్టంగా అనిపిస్తుంది.

టెంప్లేట్ మార్చటం గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు.

Custom Templates header pictures మార్చవచ్చండి. కాకపోతే కొంచెం CSS/HTML తెలిసి ఉండాలి. మీకు ఏ టెంప్లేట్ కి మార్చాలి అనుకుంటున్నారో చెపితే నేను మీకు ఏ లైన్స్ మారిస్తే సరిపోతుందో చెప్పగలను. ఇది నేనే కాదండి ఎవరైనా Techies చెప్పగలరు (వీవెన్, ప్రవీణ్, ప్రదీప్, కిరణ్)


తెలుగు'వాడి'ని on Jul 7, 2008, 8:02:00 PM   said...

ప్రవీణ్ గారు : కుండబద్దలు కొట్టారుగా :-( ఈ టెంప్లేట్ నా బ్లాగ్ description చూపించటంలేదు అందుకని max number of widgets - more than one చేసి Image - page element add చేశానన్నమాట :-)

ఈ బ్లాగ్ కి పంగనామాలు పెట్టి హాయిగా ఒక Technical Blog లోకి దూకుదామనే ఆలోచన ఉంది అందుకే చివరిగా తెలుగు బ్లాగులకు నా వంతు contribution గా కొన్ని విషయాలు చెపుదామని ఇలా మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నా..


ప్రతాప్ on Jul 7, 2008, 10:01:00 PM   said...

మొన్న ఆదివారం నుంచి మీకు కృతజ్ఞతలు తెలుపాలి అనుకొంటూనే వున్నా. ఇదిగో ఇప్పటికి కుదిరింది. మీరు అందించిన templates తో నా బ్లాగు రూపురేఖల్ని మొత్తం మార్చేసాను. అది చూసిన ప్రతి ఒక్కరు చాలా బావుంది అని అంటున్నారు. ఈ క్రెడిట్ మొత్తం మీకే దక్కాలి. మళ్లీ ప్రత్యేక కృతజ్ఞతలు.

జ్యోతి గారు,
మనం కావాలంటే custom templates లో blogheader picture మార్చుకోవచ్చు. అందుకు నా బ్లాగ్ మంచి ఉదాహరణ. కావాలంటే ఒకసారి సందర్శించి చూడండి. కాకపోతే template కి మార్పులు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి.


Anonymous on Jul 7, 2008, 10:58:00 PM   said...

ప్రవీణ్ అన్నట్టుగా ఈ మూస మీ బ్లాగుకు అంతగా అతికినట్టు లేదుగానీ, పాతదాని కంటే నాకిదే నచ్చింది. పాతది కాస్త బండగా ఉన్నట్టుండేది. పైగా అటేపూ ఇటేపూ బోల్డంత సరుకుతో నిండిపోయి ఉండేది.

ఐనా అసలు బాగున్నా బాగోకపోయినా ప్రయోగాలు చేస్తూనే పోవాలండీ - కొత్త రూపూ, కొత్త రంగూ, కొత్త విడ్జెట్లూ,.. అలా మారుస్తూంటేనే బావుంటుంది. ఏప్పుడూ ఒకే రూపాన్ని ఏం చూస్తాం?:)

పోతే, మీరిచ్చిన లింకులు నాబోంట్లకు బాగా పనికొస్తాయి. నెనరులు


Unknown on Jul 7, 2008, 11:45:00 PM   said...

ఆసం...
జాగు చెయ్యక వెంటనే టెకీ బ్లాగు మొదలెట్టండి.


తెలుగు'వాడి'ని on Jul 8, 2008, 12:12:00 PM   said...

ప్రతాప్ గారు : మీ బ్లాగ్ నిజంగా చాలా చూడ ముచ్చటగా ఉంది. ఇలాంటి టపాలు ఉపయోగపడ్డాయి అని చెప్పటానికి ఆలస్యమైనా ఫర్వాలేదు గానీ, అసలంటూ చెపితే ఇలాంటివి మరి కొన్ని టపాలు రాయటానికి ఉత్సాహంగా ఉంటుంది. చెప్పినందుకు ధన్యవాదములు.


తెలుగు'వాడి'ని on Jul 8, 2008, 12:21:00 PM   said...

చదువరి గారు: ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇటు రాక ... ఉపయోగపడింది అని చెప్పినందుకు సంతోషం మరియు ధన్యవాదములు. ఇంతకు ముందు నేను మన తెలుగు బ్లాగులకు సంబంధించి కొన్ని సాంకేతిక విషయాలపై టపాలు రాసిన సమయంలో చేసిన ప్రయోగాలతో మీరన్నట్టు రెండు వైపులా చాలా ఎక్కువ సరంజామాతో బండగా ఉండేది. ఎప్పుడూ ఆ పాత చింతకాయ పచ్చడే అయితే ఎలా, కొత్తదనం ఉండాలి అప్పుడప్పుడూ...


Kottapali on Jul 8, 2008, 1:58:00 PM   said...

చాలా మంచి సమాచారం ఒక్క చోట అందించడం.
టెంప్లేటు మార్చడమంటే ఇల్లు మారడమంత కష్టం అనిపిస్తుంది నాకు (సహజమైన బద్ధకం దానికి తోడు అనుకోండి). కానీ ఔత్సాహికులకి ఇది ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.


తెలుగు'వాడి'ని on Jul 12, 2008, 4:22:00 PM   said...

కొత్తపాళీ గారు : టెంప్లేట్ మార్చడమంటే ఇల్లు మారడమంత అనే పోలిక బాగుంది. చాలా చక్కగా చెప్పారు. కానీ ఇలాంటి టపాలు లేదా ఈ టెంప్లేట్స్ గురించి బాగా చర్చ జరిగుతున్నప్పుడన్నా లేదా ఎక్కువ మంది (జ్యోతి/ప్రతాప్/పూర్ణిమ గార్లు) మార్చినప్పుడన్నా మీరు మీ బ్లాగ్ టెంప్లేట్ మార్చడటానికి సీరియస్ గా ప్రయత్నించాలి సార్ ... ఇక అప్పుడుకూడా లేక ఇలాంటి సమయంలో కూడా చేయలేదంటే మన స్టోరేజ్ రూములు సర్దిన చందమే అయిపోతుంది ఇక్కడ :-)


నిషిగంధ on Jul 12, 2008, 7:46:00 PM   said...

తెలుగు 'వాడి 'ని గారూ, ఇంత మంచి సమాచారాన్ని ఇంత విపులంగా అందించినందుకు ధన్యవాదాలు.. ఇక టెంప్లేట్ మార్చడానికి సీరియస్ గా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది..

స్టోరేజ్ రూం సర్దడం - చాలా కరెక్ట్ గా చెప్పారు :-)


నిషిగంధ on Jul 16, 2008, 12:10:00 PM   said...

తెలుగు 'వాడి ' ని గారూ వీలున్నప్పుడు ఒకసారి నా బ్లాగ్ మీద ఓ లుక్కేయండి.. మిరిచ్చిన టెంప్లేట్ కి మార్చి చూశాను కానీ కొంచెం డార్క్ అనిపించి వేరేవాటి వైపు దృష్టి మళ్ళించాను..

Thanks you so much for the inspiration..


amma odi on Dec 14, 2008, 11:11:00 PM   said...

తెలుగు 'వాడి ' ని గారూ,
సార్! మీరు చెప్పినట్లు లంకెలు వేయడం చేశాను. ఒక టపాలోని ఒక పదం లేదా వాక్యం నుండి వేరే టపాకి లంకె వేయడం వచ్చింది. కాని ఒక టపా నుండి వేరే టపాలోని ఒక వాక్యంకు టపా వేయడం రావడం లేదు. అది ఎలా వేయాలో చెప్పగలరు. మీరు చెప్పిన పద్దతి మాత్రం లంకె వేయడం పరిఙ్ఞానం లేని వాళ్ళు కూడా లంకె వేయడం సులువుగా వచ్చేటట్లు చెప్పారు. కృతఙ్ఞతలు.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting