రోజుకి ఎన్ని టపాలు, టపా ఎలా/ఎంత ఉండాలో కూడా మీరే చెప్పేస్తారా అండీ - ?!

Posted by తెలుగు'వాడి'ని on Sunday, July 27, 2008

ఈ మధ్య ఒకరో, ఇద్దరో ఒకే రోజు ఒకటి కన్నా ఎక్కువ టపాలు ప్రచురించటం చూసి మనలో కొంతమంది పనిగట్టుకొని ప్రత్యేకంగా ఆయా బ్లాగులోకి వెళ్లి బొట్టు పెట్టి మరీ వ్యాఖ్యలు వ్రాయటం చూసి/చదివి దాని కంటే ప్రయోజనకరమైన పనిపైకి అంటే అసలు ఈ ప్రధానమైన సమస్యను ఎలా పరిష్కరించవచ్చో అనే దిశగా మన ఆలోచనలను, దృష్టిని మరల్చగలిగితే మంచిది అనే ఉద్దేశ్యంతో ఈ టపా వ్రాయటమైనది.


ఈ రోజు కార్టూన్స్ కాబట్టి ఒక్కోదానికి ఒక్కో టపా ఎందుకు ... ఒక 5/6 లేక అన్నీ కలిపి ఒక దాంట్లోనే వేయచ్చు  కదా అన్నారు ... బాగుంది ... రేపు ఇంకొకరు ఒకే రోజులో 6/7 విషయాలపై స్పందించి ఒకే రోజు ఎక్కువ టపాలు ప్రచురిస్తే ఏమి చేస్తారు ... చాలా సింపుల్ .... బాసూ ! ఒకే రోజు అన్ని విషయాలపై స్పందించకయ్యా ... రోజుకొక దానిపై స్పందించు చాలు అనో .. లేక మీరు కొంచెం ఎక్కువగా స్పందిస్తున్నారండీ ఇలా అయితే మీ బ్లాగును కూడలిలో బ్లాక్ చేయిస్తాము ... జాగ్రత్త అనో .. అంటారు అంతే కదా... చాలా బాగుంది ఇలాంటి దిశానిర్ధేశనాలుంటే మన తెలుగు బ్లాగులు, తెలుగు భాష చాలా బాగా అభివృధ్ధి చెందుతాయి ... ఇక్కడ వీళ్ల వివరణ/వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఎవరూ మరీ అంత దారుణంగా ఏమీ చెప్పరు లేండి .. నీదంతా అతి ... అసలు మీ పేరు తెలుగు 'వాడి'ని అనే బదులు .. తెలుగు 'అతి'ని లేదా తెలుగు 'అతివాడి'ని అని ఉండవలసింది అని సెటైర్లు వేస్తారు ... మీరు ఎన్ని సెటైర్లు వేసినా ఎన్ని వివరణలు ఇచ్చినా అసలు సమస్యను పక్కన పెట్టినట్టే  అని గమనిస్తే కొంతైనా మంచి జరిగే అవకాశం ఉంది.

ఏదైనా ఒక సైట్ (కూడలి/జల్లెడ) లో ఇలాంటి లూప్ హోల్స్ ఉంటే మాత్రం దానిని ఇలా వాడుకోవటం తప్పు కాదా అంటే తెలిసి వాడుకోవటం తప్పే కావచ్చు ... కానీ ఆ 'తెలిసే' అనే దానిని మీరు ఎలా నిర్ణయిస్తారు ... అలాగే 'నూతన భావాలు' అని నిజాయితీగా ఒప్పుకుంటే మరలా దానిమీద సెటైర్స్, కానీ టపాలో బొమ్మ బాగాలేదు అని నాలుగు అయిదు సార్లు మారిస్తే అది perfection కోసం అని .. భలే బాగుంది కదా ఈ బ్లాగునీతి .. 

  • నిజంగా వాళ్లు perfection కోసం నిరంతరం తపించే వాళ్లో లేక తమ టపాలలో తప్పులుంటే తట్టుకోలేని వాళ్లో  లేక రేపు తమ పిల్లలకి ఇలా తప్పులున్న బ్లాగులు చూపించటం ఇష్టం లేని వాళ్లో అయిఉంటే అప్పుడు కూడా వాళ్లను చేతులు ముడుసుకుని కూర్చోమని చెప్పటమో లేక అసలు కూడలిలోనే మీ బ్లాగ్ చేర్చుకోవద్దు అని చెపుదామంటారా? 
  • ఇలా ప్రచురించబడిన టపాకు తరచుగా మార్పులు చేర్పులు చేసే వారికి మనందరం చెప్పే feed disable చెయ్యటం అనేది ఒక్కో సారి మర్చిపోతే అలాంటప్పుడు ప్రతి సారీ ప్రతి ఒక్కరి వ్యాఖ్యలకీ సమాధానం(సారీలు) చెప్పుకుంటూ పోవటమే మార్గమా?
  • ఈలోపు ఆ బ్లాగ్ కూడలి నుంచి కొద్దికాలాం పాటు తప్పిస్తే మరలా ఎప్పుడు activate అవుతుందా అని ఎదురు చూడటం తప్ప గత్యంతరం లేదుగా? అప్పుడు కూడా అన్ని టపాలు ఒకేసారి ప్రచురించలేము కనుక రోజుకి ఒకటి/రెండు ప్రచురించుకుంటూ వెళుతుంటే   అవన్నీ సమకాలీన రాజకీయాలకు సంబంధించినవి అయితే ఊకదంపుడు గారు అన్నట్టు పాతచింతకాయ పచ్చడి అయిపోయే ప్రమాదం లేదా? ఈ దిశగానేనా మనం మన బ్లాగులని తీసుకువెళ్లాలి అనుకుంటున్నది. 
  • Word verification తీసెయ్యరా అని మనం చాలా సులభంగా ఒక చిన్న వ్యాఖ్య వ్రాసి వచ్చేస్తూ ఉంటే అది ఏమిటో అని తలబద్దలు కొట్టుకునేవాళ్లు .. మరియు సాంకేతికంగా అంత బాగా తెలియని వాళ్లు. ఒకే టపాలో ఎక్కువ images పెడితే align చేయటం తెలియని వాళ్ల పరిస్థితి ఏమిటి?
  • శతకోటి టపాలలో ఇదో కొత్త బోడి టపాలే అని తన బ్లాగుకు రావటం లేదని భావించి ఒకేసారి ఒక 10-15 టపాలు ప్రచురిస్తే అన్నా ఆయా బ్లాగర్ల attention/interest కొంచెం ఇటువైపు వస్తుందని అనుకోవటంలో కూడా తప్పు ఉందంటారా? కొత్తవారికి ఆ మాత్రం అవకాశం ఇవ్వటం లేదా వారు అలాంటి అవకాశం తీసుకోవటం భావ్యం కాదా?
ప్రపంచమంతా Micro Blogging అనీ Live Blogging అనీ వైవిధ్యభరితంగా మునుముందుకు దూసుకుపోతుంటే చెయ్యగలిగీ  ఆచరణసాధ్యమైన మార్గాలు కళ్ల ముందు కనపడుతున్నా మొదటి అడుగు వేసి ఇంతో అంతో  చేసిన వీవెన్ గారికి ఒక బలమైన/దీర్ఘకాలిక తోడ్పాటునందించి మన తెలుగు బ్లాగ్ప్రపంచాన్ని సైతం సరికొత్త పుంతలు తొక్కించటానికి ఇదే సరి అయిన తరుణమని మనలో కొంతమంది అయినా గుర్తించి మరో అడుగు ముందుకు వేసి చేయి చేయి కలిపి కర్తవ్యోన్ముఖులుగా మారగలిగితే అదే పదివేలు.

ఎనిమిది నెలల క్రితం కూడలిలో మార్పులు చేర్పుల ఆవస్యకత గురించి నేను ఒకసారి బాగా చించి ఇంకా బాగా నొక్కి వక్కాణించి  ఒక టపా వ్రాస్తే వచ్చిన స్పందనలు బహుస్వల్పం ... అందులోనించి ఏవైనా కొన్ని (అవి చెత్తగానో లేక ఆచరణయోగ్యంగా లేకపోతే అందరం కలిసి కొత్తవి ఆలోచిద్దాం) తీసుకుని వాటిపై దృష్టి పెట్టేలా ఒక్కరైనా ముందుకు వచ్చారా అంటే అది శూన్యం ..  స్పందించకపోవటంలో తప్పులేదు ఎందుకంటే ఎవరికి ఉండే కారణాలు వారికి ఉండే ఉంటాయి ... కానీ అసలు సమస్యను పక్కన పెట్టి అంటే పరిష్కరించకుండా ఇలా బ్లాగుల్లో తర్జనిగా బెదిరింపు వ్యాఖ్యలు వ్రాయటం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. నియంతృత్వంగా, దౌర్జన్యంగా, అదరేసి బెదరేసినట్టుగా కాకుండా ... ప్రస్తుతం కూడలిని మార్చ వలసిన సమయం ఆసన్నమయ్యింది .. ఒక నాలుగు అయిదు నెలల్లో ఏదో ఒకటి చేసి దీనికి పరిష్కారం కనుక్కునే పనిలో ఉన్నామనో, ఉందామనో చెప్పవలసింది పోయి ... మరీ ఈ విధంగానా చెప్పటం .. అలాగే అంతవరకు అంటే ఈ కొద్దికాలంలో అందరూ సంయమనంతో ఉండి అంటే ఒకేసారి ఒకేరోజు దయచేసి అన్ని టపాలనూ ప్రచురించవద్దు అని చెప్పటం సమంజసంగా ఉంటుంది కదా ..

ఈ యవ్వారం చూడబోతుంటే సదా సిధ్ధంగా ఉండే సైనికుల్లాగా ప్రతి బ్లాగ్ మీద ఒక కన్నేసి ఉంచి, ఎన్ని బ్లాగుల్లోకి వెళ్లి అయినా వెళ్లి ఇలాంటి copy/paste (చాలా సులభం కదా) వ్యాఖ్యలు చేయటానికి మారటానికి ప్రయత్నించే బదులు ఆ సమయాన్ని ఫలవంతంగా వాడుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి.

ఈ బ్లాగుల్లోకి వెళ్లి వ్యాఖ్యలు వ్రాసే సమయంతోనో లేక అదే ఓపికతోనో కూడలిలో పైన ఉన్న వేరువేరు విభాగాల (సినిమాసాహిత్యంహాస్యంసాంకేతికం • రాజకీయాలు • ఫొటోలు ♦ కూడలి 100) లంకెలను నొక్కో లేక అన్నింటికన్నా కింద ఉన్న మరిన్ని అనే లంకెను నొక్కో చదువుకోవచ్చుగా ... ఇలా చేయటం వలన మొదటి పేజ్ లో ఉన్న బ్లాగులతో పాటుగా గత కొద్ది రోజులుగా ప్రచురించబడిన వాటిని చదువుకోవచ్చు అన్నీ నలుగురినీ educate చేయవచ్చుగా..


కొత్త బ్లాగులు, కొత్త ఈమెయిల్ క్రియేట్ చేయటం అన్న ప్రక్రియలు ఉచితమే కాబట్టి ... ఎన్నైనా చేయచ్చు .. ఇలా ఒక ఒక 100 బ్లాగులు, వంద ఈమెయిల్స్ సృష్టించి రోజుకు ఒక 10-20 టపాలు (టైటిల్, ఒక రెండు వాక్యాలు అంతే) ప్రచురించుకుంటూ వెళుతుంటే ... వెనువెంటనే ఈ బ్లాగు పెద్దలు అందరూ ఆ బ్లాగులను block list చేసుకుంటూ వెళ్లినా .. జరగవలసిన damage 100 రోజులకు జరిగిపోయింది.... ఇక్కడ మనవాళ్ల అతి మరియు దౌర్భాగ్యపు తెలివితేటలు/వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అంటే ... ఎవరు చేస్తారండి అలా, నువ్వేదో ఎక్కువ ఊహించి వ్రాయటమే గానీ అనో లేక అక్కడదాకా వచ్చినప్పుడు ఆలోచిద్దామనో అని వ్రాసేంత ...

నాకు తెలిసినంతలో ఏదైనా బ్లాగ్ కూడలికి కలపాలి అంటే వీవెన్ గారికి డైరెక్ట్ గా మెయిల్ పంపటమో (మనలో ఎవరిని అన్నా ఎలా జత చేయాలి అని అడిగితే మనం సహజంగా వీవెన్ గారి ఈమెయిల్ ఇస్తూ ఉంటాము కాబట్టి) లేక వారే కూడలి కి వచ్చి కొత్త బ్లాగు చేర్చండి అనే లంకె చూసి అక్కడ ఉన్న వివరాలను follow అవ్వటమో చేస్తూ ఉంటాము ..  ఈ పెద్దలు అందరు విడివిడిగా ఇలా ప్రతి బ్లాగులోకి వెళ్లి బెదిరింపుల వ్యాఖ్యలో లేక అభ్యర్ధనలగా ఉండే సెటైర్స్ వేసే బదులు ఈ లంకెలోనే ఆయా నియమావళిని పొందుపరచటం చెయ్యవచ్చు కదా ... లేదా కూడలి మొదటి పేజీలోనే ఇలాంటివి పొందుపర్చవచ్చు కదా ... ఆహా అలాంటివి కుదరవు ఎందుకంటే .... ఏదో ఉచితంగా ఈ మాత్రం అన్నా చేసి మనకు ఇస్తుంటే వీవెన్ గారి పై ఇంతకన్నా భారం మోపటం మంచిది కాదు అన్న సానుభూతి వాక్యాలకైతే ఏమీ కొదవ లేదు గాని .. ఇప్పటి వరకు మోస్తున్న లేక/మరియు ఇంకా వెయ్యాలి/వెయ్యవలసిన భారాన్ని ఎలా తగ్గించాలి అనే దాని గురించి ఒక్కరు కూడా ఆలోచించరు .. అంటే అసలు ఆలోచించరు అని కాదు .. ఉచిత సలహాల దాకా చాలా బాగా ఊదరగొట్టేస్తారు ... ఆచరణ దగ్గరకొచ్చేటప్పటికి ఒక్కరూ కనపడరు ...

ఏం .. ఇన్ని వందల మంది బ్లాగర్లు ఉన్నారు దేశదేశాలలో ... తలా ఒక $10-20 వేసుకుందాము ..కూడలిని ఆధునీకరించుకుందాము అని మాత్రం ఆలోచన రాదు .. డబ్బుల మాట రాగానే మాత్రం తట్టా బుట్టా సర్దుకోవటానికి అయినా సిధ్ధం ... పౌరుషం పొడుచుకు వస్తుంటే ఈ టపా కింద వ్యాఖ్యలలోనో లేక మీ బ్లాగుల్లో ఇంకో టపా/కవిత లాగానో సెటైర్ వేసి కాదు ప్రదర్శించవలసింది ... మీవంతుగా మీరు ఎలా మీ సహాయాన్ని అందించాలి అనుకుంటున్నారో దాని మీద చూపండి.

Active గా వ్రాసే బ్లాగర్లు మరియు ఈ బ్లాగుల అభివృధ్ధిని(ఎవరికి ఉండే కారణాలు వారికి ఉండొచ్చుకాక) కోరుకునే వాళ్లు కనీసం ఒక 200 మంది ఉంటారు అనుకున్నా ... ఒక్కొక్కరు ఒక $20 (ఒక్కసారిగా కాకపోయినా రెండు మూడు సార్లుగా అయినా ఓకే) వేసుకుంటే .. 200*20=$4000 ...  లేదూ వంద మంది .. $10 అనుకునా ... $1000 ... అంటే అటూఇటుగా Rs. 50,000 నుండి 1,50,000 దాకా వచ్చే అవకాశం ఉంది... హైదరాబాద్ లో Rs. 15000 పెడితే LAMP (Linux Apache MySql PHP) with Flash who has good experience in Web20/Social Networking with Digg like recommendation engine వున్న వాళ్లు దొరుకుతారు ... లేదూ మనకు కావలసిన features అన్నీ మరియు architecture ఎలా ఉండాలో చెపితే ఏదొ ఒక టీమ్ కి ఒక project లాగా ఇచ్చి వేస్తే వాళ్లే చేస్తారు ... అతి తక్కువ సహాయంతో, కొంత మంది ఆలోచనల మధనంతో ఇంతటి అధ్భుతమైన platform(s) ను create చేయగలిగిన వీవెన్ గారి సారధ్యంలో తనతో పని చేయటానికి 1-3 developers ఒక 3-6 నెలల పాటు సమకూర్చగలిగితే, ఇప్పుడు ఇంత మందితో (too many cooks అనేది లేకుండా జాగ్రత్త పడాలి/పడతాం లేండి) కూడిన చర్చల ద్వారా తయారు కాబడే కూడలి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి .. అప్పుడైనా మీలో కొంత inspiration కలుగుతుందేమో చూడండి...

అప్పనంగా అన్నీ చేసి వడ్డించిన విస్తరిలా పెడితే మాత్రం మొదటి బంతిలో ముందు వరుసలో కూర్చుని త్రేనుపుకుంటూ వెళ్లటానికి మాత్రం సదా సిధ్ధం.... కొత్తగా వచ్చిన బ్లాగర్లు అంటే కూడలి నిర్మాణం/ప్రస్థానం గురించి, వీవెన్ గారి యొక్క అవిరళ కృషి, నిరంతర శ్రమ గురించి తెలియని వాళ్లు లేదా అతితక్కువగా తెలిసిన వాళ్లు దయచేసి నొచ్చుకోకండి నా పై వ్యాఖ్యానాన్ని చూసి ... అది బ్లాగు పెద్దలనీ, సీనియర్ బ్లాగర్లనీ జబ్బలు చరచుకునే, ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు తమ సుద్దులతో రడీ అయిపోయే వాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లని ఉద్దేశించి ... ఈ విభాగంలో ఎవరూ లేకపోతే మంచిది ... అప్పుడు ఎవరినీ ఉద్దేశించి అన్నట్లు కాదన్నమాట .. కొంచెం కష్టంగా/నిష్టూరంగా అనిపించినా వాస్తవం అలాగే ఉంటుంది.

ఇకపోతే కొత్తగా వచ్చే/వస్తున్న బ్లాగర్లందరికీ అసలు కూడలి నిర్మాణం ఎలా జరిగిందీ, ఇప్పటి వరకు అంతా వీవెన్ ఎలా దీనిని అభివృధ్ధి పరచిందీ ... ఇంకా ఇలాంటి చాలా విషయాలను పరిచయం చేయవలసిన అవసరం ఉంది ... నిజంగా చెప్పాలి అంటే నాకు కూడా దీని గురించి పూర్తి వివరాలు తెలియవు ..  నాకు తెలిసి దీనికి రెండు మంచి మార్గాలు ఏమిటి అంటే పైన చెప్పిన 'కొత్త బ్లాగు చేర్చండి' పేజ్ లో ఈ విషయాలు అన్నీ ఇవ్వాలి .. అలాగే వీవెన్ గారు పంపించే activation ఈమెయిల్ లో కూడా ఈ వివరాలన్నీ ఇవ్వాలి.

ఆ బ్లాగులో మన తోటి బ్లాగర్లు (చిన్నమయ్య, కొత్తపాళీ, సిబి రావు, సత్యప్రసాద్ అరిపిరాల గార్లు) వ్రాసిన వ్యాఖ్యలలో నాకు కొంచెం తీవ్రంగా ఉన్నట్టు అనిపించిన వ్యాఖ్య (ఇది మీరు తెలియక చేసిన తప్పు అని తలుస్తాను. కావాలని చేస్తే, మీ బ్లాగుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సుంటుంది. ) సిబిరావు గారిది మాత్రమే. ఊకదంపుడు గారు మాత్రం ఆ టపాలో ఉన్న కొన్ని వ్యాఖ్యలకు ఆశ్చర్యాన్ని వ్యక్తపరచటమే కాకుండా కూడలిలో చేయదగిన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అభినందనలు మరియు ధన్యవాదములు సరైన రీతిలో ఆలోచించటమే కాకుండా వాటిని సరళంగా వ్యక్తపరచినందులకు.[ సరస్వతీకుమార్ గారు బ్లాగింగ్ లో రాగింగ్ అనే టపాలో కూడా కొన్ని మంచి సూచనలు చేశారు ]

ఇక్కడ వాళ్ల పేర్లు ప్రస్తావించటానికి ముఖ్యకారణం ఏమిటి అంటే ...
  • నేనేదో వాళ్లకి వ్యతిరేకమనీ, వాళ్లని అవమానించాను అనీ ... మీలో ఎవరో ఒకరు వారి తరుపున వకాల్తా పుచ్చుకోని, వారి మనసుల్లో/ఆలోచనల్లోకి దూరి అన్నీ తెలుసుకున్నట్టుగా, వారికేదో సపోర్ట్ అన్నట్టుగా (ఈ మధ్య ఇలా మా సపోర్ట్ మీకే అనే బాపతు బాగా ఎక్కువై పోయారు), నేను ఇలా వ్రాయటం తప్పు అనీ, వ్రాయకుండా ఉండవలసింది అనీ ఇక్కడ సొల్లు/చెత్త వ్యాఖ్యలు వ్రాయకండి ...  తుప్పు వదలగొడతా ... నాకు మీకంటే ఎక్కువ గౌరవమే ఉంది వీళ్ల మీద ... 
  • అలాగే మీకెంత తెలుసో ఏది ఎంత వ్రాయాలో నాకు మీకన్నా ఎక్కువ తెలియక పోయినా ఖచ్చితంగా మీతో సమానంగా తెలుసు (అహంభావం అనుకున్నా I don't give a damn). అలాగే వారికి వారి స్పందన ఎలా వ్యక్తపరచాలొ మీకన్నా చాలా బాగా తెలుసు .. ఈ స్పందన, ప్రతిస్పందనలు అనేవి వాళ్లకి నాకు మధ్యన మాత్రమే ఉండనివ్వండి.
  • ఇంకొక అతి ముఖ్యమైన కారణం/విషయం ఏమిటి అంటే ఈ సపోర్ట్/తప్పు-ఒప్పులకు సంబంధించి వచ్చే వ్యాఖ్యలతో అసలు విషయం పక్కకు పోయే అవకాశాలే ఎక్కువ అని నేను అనుకోవటం కూడా ఒకటి.
  • Anonymous గా వ్యాఖ్యలు వ్రాసినా వదిలిపెట్టను .. ఎందుకంటే కొంచెం తేడాగా వ్రాసిన వాళ్లెవరూ అలా ఊరికే వ్రాసిపోరు .. ఖచ్చితంగా వెనక్కు వచ్చి చూసుకుంటారు ... అందుకే వాళ్లకైతే నా పల్లెటూరి మోటు భాష/సంస్కృతంలోనే నా సమాధానం.
కనుక మీ శక్తి, ఆసక్తి, తెలివితేటలు అన్నీ కూడలిని ఎలా అభివృధ్ధి పరచాలో మరియు దానికి మీరు ఏవిధంగా సహాయసహకారాలు అందించగలరో వాటిమీద కేంద్రీకరించండి. అలాంటివి మాత్రమే ఏమన్నా ఉంటే ఇక్కడ లేక కూడలి చాట్ / కబుర్లు లో లేక మరేదైనా టపా/చర్చలో అందరితో పంచుకునే ప్రయత్నం చేయండి. 

అలాకాకుండా ఈ టపా మీలోని ఆవేశకావేషాలను రెచ్చగొట్టబడితే రెండు నిముషాలు కళ్లు మూసుకుని ధ్యానించి ప్రశాంత చిత్తులై మరొక బ్లాగ్/వ్యాఖ్య చదవటానికి వెళ్లిపోండి. ఇంకా ఆవేశం తగ్గకపోతే మీ బ్లాగుల్లోకి వెళ్లి దీని గురించి రచ్చ రచ్చ చేసుకోండి ... అంతేకానీ ఇక్కడ కాదు.

ఈ టపా ద్వారా నేను చెప్పదలచుకొన్నది రెండే విషయాలు :
  • భావి ప్రణాళిక లేకుండా, 'తెలిసే' చేస్తున్నారనే దాని నిర్ధారణకు అవకాశం లేకుండా, కొత్తగా వచ్చే బ్లాగుల్లోనుంచి వచ్చే టపాలను automatic గా control చేసే అవకాశం తెలుసుకోకుండా ఇలా ప్రతి బ్లాగులోకి వెళ్లి ఇలా చేయద్దు అని చెప్పటం వలన ఉపయోగం చాలా చాలా తక్కువ ... ఎందుకంటే అప్పటికే జరగవలసిన damage జరిగిపోయింది కాబట్టి ... అందునా ఇలా చేస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవు అని చెప్పటం వలన ఎంత అనర్ధం అనేది పక్కన పెడితే ... నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా సమర్ధనీయం కాదు..
  • ఇప్పటికైనా కూడలిని సంపూర్తిగా ఆధునీకరించవలసిన అవస్యకతను ఏదో ఉబుసుపోక కబుర్లగా గుర్తించక చాలా సీరియస్ గా దీని గురించిన ఆలోచనలకు అక్షరరూపం ఒక కార్యరూప ఆచరణీయ ప్రణాళికగా అతిత్వరలో implementation phase లోకి తీసుకువెళ్లటానికి ప్రతి ఒక్కరూ సంసిధ్ధులు కావటం.
నేను ఆశించేది ఒక్కటే ...
  • ఇప్పటికైనా బ్లాగర్లందరూ వారు ఏ విధంగా ఈ మహత్తర కార్యానికి సహాయం చేయగలరో ...అది డబ్బు రూపేణా కావచ్చు, కొత్త కూడలిలో ఎలాంటి features ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలు అయ్యుండొచ్చు ... developers ని వెదికి పెట్టటం కావచ్చు ... మొత్తం site తయారు అయిన తరువాత కొన్ని రోజులు/గంటలు టెస్టింగ్ చేసిపెట్టటం ... FAQ లేదా How to - documents/posts/pages  వ్రాయటం ... కొత్త advertisers ని వెదికిపెట్టటం ... ఇలాంటి వాటన్నిటినీ సాధ్యమైనంత తొందరగా నలుగురితో పంచుకోవటం/చర్చించటం.
ఇంతే సంగతులు ... చిత్తగించవలెను .... Happy Blogging. 
............................................................................



విషయ సూచికలు :


44 వ్యాఖ్యలు:

Ramani Rao on Jul 27, 2008, 11:06:00 PM   said...

తెలుగు 'వాడి ' ని గారు: సాగారాన్ని మధిస్తే అమృతం వచ్చింది అన్నట్లు, వాడిగా, వేడిగా ఉండే మీ ఆలోచనల సాగరాన్ని మధించి, బ్లాగుల బాగోగుల అమృతాన్ని బాగా వెలికి తీసారు. నాకు నచ్చాయి మీ ఆలోచనలు. అయితే ఒక్క విషయం ఎదో ఒకసారి కూడలిని ఆధునీకరణ చేద్దామనో లేక మారుద్దామనో తలా కొంత అని సేకరించేకన్నా, ఒక సభ్యత్వం లాంటిది ఏర్పాటు చేసి ఎవరికి తోచినంత/ఇవ్వగలిగినంత అని తీసుకొంటే, కూడలిలో సభ్యత్వమనో లేదా బ్లాగ్ సభ్యత్వమనో అని ఉంటుంది(కాకపోతే వచ్చిన చిక్కల్లా ఒక్కటే, డబ్బులిచ్చాము కాబట్టి ఏమి రాసిన పడాలి అనే తత్వం లేకుండా అయితే బాగుంటుంది అక్కడా కొన్ని పరిమితులు పెడితే మంచిది). అప్పుడు పాత కొత్తా ఏమి ఉండదు, అందరం మెంబర్స్ మే, అందరం బ్లాగర్స్ మె. ఆలోచించండీ. సేకరించిన ఆ డబ్బుతో కూడలి సమావేశంలో చర్చించుకొని కొత్తగా రూపొందించుకోడమో ఇంకోటో,ఇంకోటో అని ఓ ప్రణాలిక వేసుకొంటే బాగుంటుంది. కూడలి మారుతుంది వీవెన్ గారి శ్రమకి ఫలితం దక్కుతుంది. (ఇది కొత్తగా వచ్చే వాళ్ళకే కాదు పాతవారికి కూడా వర్తిస్తుంది) ఇది నా ఆలోచన. లేదు అలా కష్టం అనుకొని మీ ప్రాతిపదికని అమలుపరిచి డబ్బులు సేకరిస్తున్నారు అంటే, ఒకసారి నా బ్లాగుకు(నాకు) తెలియ జేస్తే, ఉడతా భక్తిగా అంతో, ఇంతో, కొంతో నా వంతు కృషి తప్పక ఉంటుంది.


తెలుగు'వాడి'ని on Jul 27, 2008, 11:24:00 PM   said...

రమణి గారు : ముందుగా మీ వ్యాఖ్యకు మరియు ప్రోత్సాహానికి వేనవేల హృదయపూర్వక కృతజ్ఞతాభినందన ధన్యవాదములు.

డబ్బులు ఇచ్చాము కాబట్టి అనే దాని గురించి ... అలాగే సభ్యత్వం గురించి మీరు నా ఆలోచనలలో రెండో భాగాన్ని చక్కగా చదివేసినట్టుగా అంతే చక్కగా చెప్పారు .. వీలుంటే వీటి గురించి కూడా సాధ్యమైనంత వివరంగా అతి త్వరలోనే వ్రాస్తా... ఇప్పటికే మీకు ఒక టపా బాకీ ఉన్నా :-(


సుజాత వేల్పూరి on Jul 27, 2008, 11:33:00 PM   said...

తెలుగు వాడి ని గారు,
వాడిగా వేడిగా ఉంది టపా! ఈ డబ్బుల సంగతి నాకు కూడా అంగీకారమేనండీ! అయితే వ్యాఖ్యలు రాసేవాళ్లకు కూడా భలే వాతలు రెడీగా ఉంచారన్నమాట! ముఖ్యంగా అనోనీమస్సులకు!

కూడలి మెరుగుపడటానికి టెక్నికల్ గా నేనేం చెయ్యలేను గానీ(మీ బ్లాగులో టెంప్లేట్ మార్చడం గురించి అంత వివరంగా చదివినా, ఇంప్లిమెంట్ చెయ్యడానికి బద్ధకం)మీరు చెప్పినట్టు ఆర్థికంగా చేయి వేయడానికి రెడీయే నేను!

ఘాటు ఘాటు టపాకి మరో సారి కుడోస్!


Anonymous on Jul 28, 2008, 12:18:00 AM   said...

మీ అభిప్రాయాలు నిర్మాణాత్మకంగా బాగున్నాయి.
బ్లాగర్లందరికీ శుభవార్త .
నేను గత రెండు సవత్సరములుగా తెలుగు వారి కోసం సోసియల్ మీడియా & నెట్ వర్క్ సైట్ తయారు చేస్తున్నా.. ఆగష్టులో విడుదల అవ్వచ్చు. అందులో Digg.com లాంటి సదుపాయం కూడా ఉంది.
పూర్తి వివరాలు త్వరలో అందిస్తాను.


Saraswathi Kumar on Jul 28, 2008, 12:39:00 AM   said...

తెలుగు వాడిని గారూ నేను చెప్పాలనుకున్నది రమణి గారు చెప్పివేశారు.సో..నేనింకేమీ చెప్పలేను.ధన్యవాదాలు తప్ప.

@సుజాతగారూ!కుడోస్ అంటే?

@శివ గారూ..!ప్రొసీడ్.


ఏకాంతపు దిలీప్ on Jul 28, 2008, 1:09:00 AM   said...

@ తెలుగు 'వాడి 'ని గారు
నిన్న కూడలి లో చర్చ జరిగింది... దాదాపుగా ఇవే విషయాలు నేనూ లేవనెత్తాను... కూడలి కోసం మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనమంతా గట్టిగా ప్రయత్నించాలి. డొనేషన్ తో పాటు ప్రకటనలు పెట్టడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి.. కూడలికి ఆర్ధికంగా వనరులు సమకూర్చగలదు అనుకుంటే నా బ్లాగులో ప్రకటనలు పెట్టడానికి నేను సిద్ధం.


సిరిసిరిమువ్వ on Jul 28, 2008, 1:11:00 AM   said...

మంచి వేడి వేడి టపా. నిజమే ఎదో ఒకటి చేయాలి. ఏది చేసినా అందరు కలిసి ఆలోచించి చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా టెక్నికల్ విషయాలు తెలిసినవాళ్ళు (Shiva-Speaks లాంటి వాళ్ళు) తలా ఓ చేయి వేస్తే ఇదేమంత కష్టం కాదు అనుకుంటా!


శరత్ కాలమ్ on Jul 28, 2008, 2:28:00 AM   said...

నేనే ఇలాంటి టపా రాద్దామనుకున్నాను. మీరు రాసేసారు. అభినందనలు. నా మనస్సులోని మాటలు మీరే చెప్పేసారు. చాదస్తపు బ్లాగరు పెద్దల బారిన పడి నా బ్లాగూ ఒకటి బ్లాక్ అయ్యింది.


Sujata M on Jul 28, 2008, 3:28:00 AM   said...

తిట్టుకుంటే తిట్టుకోండి గానీ - నా సపోర్ట్ మాత్రం మీకే!

నేనూ సభ్యత్వ రుసుము కడతాను. అయితే, నేను మీరు చెప్పే బొమ్మ కూడా ఎలైన్ చేసుకోలేని కుక్షిని! నన్ను మరీ ఎక్కువ తిట్టుకోబాకండి!


Anonymous on Jul 28, 2008, 6:43:00 AM   said...

superb sir! As usual you cover all the bases very well. All your articles on blogging, blog administration are probably the best resources in Telugu on this topic. You should translate some of these into English and publish them in some magazines/portals like readwriteweb.

My two cents worth:
1. There cannot be any restrictions on a blogger - they can write as many posts, as frequently as they wish, on any topic of their interest - and edit/republish their posts as frequently as they want. All open communities self-regulate themselves - it is a difficult idea to get used to, but self-regulation is possible only if we allow a place for everything to coexist.

2. If there are some loopholes in certain technical/infrastructure services like Koodali - the loopholes have to be plugged by the creators and administrators of those services. Some of us are working with veeven to this effect - and we will do that.

3. As the number of blogs increase - the shelf life of a post will reduce - this is only natural. Last year the shelf-life used to be one week, now it is about two days. One has to get used to this. Ultimately - koodali or anything else cannot make any blog popular. The only way to be in circulation is to create compelling and useful content.

Thank you once again,
Nagaraj


cbrao on Jul 28, 2008, 6:58:00 AM   said...

"శతకోటి టపాలలో ఇదో కొత్త బోడి టపాలే అని తన బ్లాగుకు రావటం లేదని భావించి ఒకేసారి ఒక 10-15 టపాలు ప్రచురిస్తే అన్నా ఆయా బ్లాగర్ల attention/interest కొంచెం ఇటువైపు వస్తుందని అనుకోవటంలో కూడా తప్పు ఉందంటారా? కొత్తవారికి ఆ మాత్రం అవకాశం ఇవ్వటం లేదా వారు అలాంటి అవకాశం తీసుకోవటం భావ్యం కాదా?" ఇలా జరిగినప్పుడు నష్టపోయే వారిలో మీ టపా కూడ వుంటుంది. మీరు కష్టపడి రాసిన టపా ఇలాంటి చర్యల వల్ల , కొద్ది గంటలలో కూడలి లోంచి మాయం అవుతుంది. ఇది మీకు జరగకూడదనే నేను ఆ వ్యాఖ్య రాసాను. ఆలోచించండి.
ఒక విషయం గమనించండి. కూడలి లోంచి ఎవరినీ తీసివెయ్యటం జరగదు. సభ్యులు కూడలి ని దుర్వినియోగ పరుస్తున్నట్లుగా భావిస్తే, వీవెన్ గారు, కొన్ని రోజులు ఆ బ్లాగ్ ను అచేతనం చేస్తారు. తీసివేయరు. కూడలి ప్రస్తుతం వాడుతున్న architecture లో మార్పులకు అవకాశం తక్కువ. కొత్త architecture కు migrate అయి మార్పులు చెయ్యటానికి ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్నో features ఉంచే విధంగా. ఉదాహరణకు ఒక బ్లాగరు రోజుకు 4 మించి టపాలు ప్రచురిస్తే వాటిని నిరోధించే విధంగా. అప్పటి దాకా కూడలి ఇస్తున్న సౌకర్యాన్ని జాగ్రత్తగా వాడుకోమని వేడికోలు.

e-తెలుగు తరపున e-telugu.org వెబ్సైట్ నిర్వహిస్తున్నాము. తెలుగు అనువాద ప్రాజెక్ట్స్, తెలుగును కంప్యూటర్ లో ప్రోత్సహించే పనుల నిమిత్తం పుస్తకాల ప్రచురణ, work shops నిర్వహణ లాంటి పనులు చేస్తున్నాము. http://etelugu.org/ నిర్వహిస్తున్న వీవెన్ కు e-తెలుగు తరపున నిర్వహణ ఖర్చులిస్తున్నాము. కూడలి నిర్వహణకు ధన సహాయ స్వీకరణకు వీవెన్ సిద్ధంగా లేరు.

e-తెలుగు Byelaws ను ఈ కింద ఇవ్వబడిన లింక్ నుండి దిగుమతి చేసుకొనగలరు.
http://www.esnips.com/web/e-Telugu
e-తెలుగు మిత్రులు తెలుగు భాషాభివృద్ధికై చేసే పనులలో మీరు సహాయపడాలనుకుంటే e-తెలుగు లో మీరు సభ్యులుగా చేరవచ్చు. సభ్యత్వ రుసుము Rs.300/- (చేరుటకు) ; సంవత్సర చందా Rs.200/- భారత దేశం లో ఉండే వారినుంచే సభ్యత్వ రుసుములు స్వీకరించబడతాయి. అమెరికా వంటి విదేశాలలో ఉండే వారినుంచి సభ్యత్వ రుసుము వసూలు చేయుటకు R.B.I. అనుమతి కావాలి. సభ్యులుగా చేరుటకు ఆసక్తి కలవారు చదువరి (అధ్యక్షుడు) గారిని సంప్రదించవచ్చును.


Sujata M on Jul 28, 2008, 10:32:00 AM   said...

CB Rao garu, Naga Raju Garu - I was unaware of these facts. These are certainly practical problems that we must give a thought to. But I think, we must come forward and support in whatever way possible, to improve the present situation. (We = all bloggers)

I hope that there should not be restrictions on the number of posts a blogger wishes to publish in one day. For many working class bloggers, the weekends are the most suitable to blog and they may wish to publish their drafts, together (more than one). They cant be restricted of this choice.

I hope koodali can accommodate more posts per day instead of some limited number of posts. If there can be a new moderator that accommodates more posts, it could be welcomed.

Unfortunately, (Or is it fortunate?) Telugu blogs(Many amongst them) are not earning any revenue by the means of ads . There is absolutely no point in running after Hits. (If there is any reason other than popularising ones' blog, Please let me know)


This is mostly just been a hobby or a ventilator for most of the bloggers out here. Unfortunately again, there is lot of 'unbecoming' [Fighting, arguing etc and unfriendliness] is prevailing. Ofcourse, blogging is all about sharing ideas etc. Ideas, differed are also ideas shared. However, I think - too much of any thing (bitterness) should not be welcomed.

I may not be technically good, to express my concerns (I even didnt know that koodali restricts bloggers to any extent at all), but, I suppose, we need a better (large) moderator at the moment.

Please check my opinions - may be they are not so awry.


cbrao on Jul 28, 2008, 11:46:00 AM   said...

@Sujata: నేను గమనించిన ఇంకో విషయము: తెలుగు వాడిని బుద్ధిశాలి, బుద్ధిమంతుడు ఇంకా ఆవేశపరుడు. ఈ ఆవేశాన్ని మనము ఇలా ఉపయోగించుకోవచ్చు. కూడలి కంటే మెరుగైన blog aggregator అమెరికా మిత్రుల సహాయముతో చెయ్యటానికి తన వంతు కృషి చెయ్యటం. జల్లెడ, తేనెగూడు, బ్లాగ్‌కుట్, చక్రదేవ్ లాంటి ఎన్నో అగ్గ్రిగేటర్ల కంటే మెరుగైనది తను సృష్టించాలని, బ్లాగరుల సమస్యలు తీరాలని మనస్పూర్తిగా కోరుకుంటా.


Unknown on Jul 28, 2008, 1:01:00 PM   said...

ఎంతో సమయం వెచ్చించి, బాగా ఆలోచించి చక్కని టపా రాసారు. ఇందులో అన్నీ నిజాలే, ఆలోచించదగ్గ విషయాలే...

కాకపోతే నిర్వహణ విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో ఆలోచన/తీరు ఉండవచ్చు. వీవెన్ ని గానీ ఇంకెవరిని గానీ ఇందులో తప్పు పట్టలేము. ఆఫ్టరాల్ మనం చెయ్యలేని దాన్ని వాళ్ళు చేసి చూపారు. మనం మాట్లాడుతున్న దానిని వారు చేతలలో చూపారు.

అలాగే సహాయం చెయ్యడానికి మనం ముందున్నా ఎంత వరకూ కుదురుతుందో లేదో ఏ కూడలో, జల్లెడో, ఇంకెవరో నోరు విప్పి చెబితే గానీ ఏమీ చెయ్యలేము. (అలాగని వారేమీ చెయ్యట్లేదని అనుకోలేము కూడా). It all depends on how open they want to be. They might want to be restrictive which is perfectly fine, and then viable alternatives need to come up.

అయితే ముందుకు సాగాలంటే కొంత ట్రాక్షన్ చాలా అవసరం. అది ఏ విధంగా వస్తుందో కూడా ఆలోచించాలి. తెలుగు బ్లాగులు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ఆంగ్ల బ్లాగులు ఎప్పుడో ఆ దశను దాటాయి. ఈ స్థితి నుంచి బయటపడి ఎలా మానెటైజ్ చెయ్యాలో ఆలోచించాలి. అందుకు వైవిధ్యంగా ఆలోచించడం మొదలుపెట్టాలి.

నేనొక ప్రయత్నం చేసాను. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం. కొత్త పుంతలు తొక్కుతూనే ఉందాం.


Anonymous on Jul 28, 2008, 2:30:00 PM   said...

ఆ మధ్య అదెదో అగ్రిగేటర్ లో చూసాను ఒక బ్లాగు ను0డి ఒకటికన్నా ఎక్కువ పోస్టులు వఛ్ఛినా ఒక ల0కెలోనే కనిపిస్తూ మిగిలిన టపాల హెడ్డి0గులు మాత్ర0 మైన్ హెడ్డి0గు కి క్రి0ద వఛ్ఛాయి.మరి అదెలా సాధ్యమో?అలాగే నెనెప్పుడూ చెప్పే ఆర్కివ్స్ పద్దతి గురి0చి ఎవరూ మాట్లాడట్లేదు..తేదీల వారీగా ఒక వార0,పది రోజుల ఆర్కివ్స్ ని పెడితే ఆ రోజులో వఛ్ఛిన టపాలేవీ మిస్ అయిపోవు.అలాగే టపాల వత్తిడి వల్ల గె0టేయబడడ0 జరగదు.లేత బ్లాగర్లు,కూడలి 100బ్లాగర్లన్న విభజన మానేస్తే బాగు0టు0దేమొ ఏ గొడవా లేకు0డా.ఈ కూడలి లోనే నియమావళి ల0కె,కబుర్ల ల0కే ఉ0టే బాగు0టు0దని నా అభిప్రాయ0.


తెలుగు'వాడి'ని on Jul 28, 2008, 2:56:00 PM   said...

సుజాత (మనసులో మాట) గారు :

పేరుని సార్ధకం చేద్దామని/చేసినట్లుంటుందని ఇలా వ్రాస్తూ ఉంటామన్న మాట :-(

సహాయం ఏ రూపేణా ఉన్నా మంచిదేనండీ ... అందరూ సాంకేతికంగా లేక అందరూ డబ్బులే అంటే, శ్రీరామనవమి రోజు పాలసేకరణ అయిపోతుంది :-)

రమణి గారి లాగే మీరు కూడా ఆర్ధికంగా ఒక చెయ్యి వేస్తాను అనటం చాలా ఆనందంగా ఉంది. అభినందనలు మరియు దన్యవాదములు.


తెలుగు'వాడి'ని on Jul 28, 2008, 5:30:00 PM   said...

@ shiva-speaks : మంచి ప్రయత్నం. Congrats and Good Luck. కానీ ఒక్క విషయం .. మీరు చెపుతున్న Digg లేక మరెలాంటి కొత్త Feed Aggregator అయినా ఈ సమస్యకు పరిష్కారం కాదు ... కూడలి కాక మరేదైనా దీనికి పరిష్కారం అనిపించాలి అంటే, తెలుగులో బ్లాగటం అనేది వ్యక్తిగత అభిరుచి, బాషాభిమానం మొదలగునవి అనే స్థాయి/చక్రం నుంచి బయటకు వచ్చి మరియు ధనార్జన, పేరు/కీర్తి/గుర్తింపు లాంటివి జత అయినప్పుడే సాధ్యం.. వీలుంటే దీని మీద ఇంకో టపా వ్రాస్తా ...


తెలుగు'వాడి'ని on Jul 28, 2008, 7:24:00 PM   said...

ఏకాంతపు దిలీప్ గారు : నేను జ్యోతి/సరస్వతీ కుమార్ గార్ల బ్లాగుల్లో నిన్న జరిగిన చర్చకు సంబంధించిన వివరాలు చదివానండి ఈ రోజే ... మీ సంసిధ్ధతను తెలియజేసినందుకు, కొన్ని విలువైన విషయాలను చర్చలో లేవనెత్తినందులకు అభినందనలు మరియు ధన్యవాదములు. చూద్దాం ఇప్పుడైనా ఈ చర్చలు, ఇలాంటి టపాల వలన ఎంత మంచి జరుగుతుందో ...


తెలుగు'వాడి'ని on Jul 28, 2008, 8:56:00 PM   said...

Saraswathi Kumar గారు : ధన్యవాదములు.

Kudos = Acclaim or praise for exceptional achievement.


తెలుగు'వాడి'ని on Jul 28, 2008, 8:57:00 PM   said...

సిరిసిరిమువ్వ గారు : ధన్యవాదములు.

తలా ఒక చెయ్యి వేస్తే ఖచ్చితంగా కూడలిని ఆధునీకరించవచ్చు అండీ కానీ సమస్యల్లా ఇప్పుడు చేయబోయే మార్పులు-చేర్పులు దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉండటంతో ప్రస్తుతం ఉన్న framework ని పూర్తిగా మార్చవలసి వస్తుంది . అలాగే ఇలా నిర్మించిన framework/architecture ని maintain చేయటమనేదే అతి పెద్ద సమస్య. చూద్దామండీ ముందు ముందు ఏమవుతుందో ..


తెలుగు'వాడి'ని on Jul 28, 2008, 9:06:00 PM   said...

శరత్ గారు : ధన్యవాదములు. మీరు కూడా వ్రాయండి. మీ టపాలోని విషయం మరియు చెప్పే విధానం, సరళత, స్పష్టత మరికొంత మందిలోనన్నా సరికొత్త ఆలోచనలను, ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహాన్ని కలుగజేయగలిగితే అదే పదివేలు కదా ...


తెలుగు'వాడి'ని on Jul 28, 2008, 9:17:00 PM   said...

సుజాత (గడ్డిపూలు) గారు : ధన్యవాదములు. మిమ్మల్ని ఎవరూ తిట్టుకోలేరు లేండి. అలా పడేవి ఏవన్నా ఉంటే అవి నాకే పడతాయి ... మనసుల్లో లేక ఈ కింద వ్యాఖ్యల్లో :-( మీ చేయూతకు, వ్యాఖ్యకు అభినందనలు మరియు ధన్యవాదములు.

నేను నా బ్లాగులోని టపాలకు వచ్చే వ్యాఖ్యలన్నింటికీ ఓపికగా స్పందించటంలో ఒకటో రెండో అన్నా miss అవుతానేమో గానీ, సాంకేతిక విషయాలకు సంబంధించి మాత్రం ప్రతి ప్రశ్నకు/వ్యాఖ్యకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాను కనుక మీరు ఎన్ని సార్లు ఎన్ని ప్రశ్నలు అడిగినా నా వరకు నాకు ఓకే అండీ ..


ప్రతాప్ on Jul 28, 2008, 11:46:00 PM   said...

తెలుగు వాడిని గారు,
ఆవేశంలో రాసినా బాగా ఆలోచించి రాశారు.
టెక్నికల్ గా ఎటువంటి సహాయం ఆయినా చెయ్యడానికి నేను రెడీ.
సభ్యత్వ రుసుము అలాంటివి కాని ఉంటే "కూడలి" ని వాడేవారు తగ్గిపోవచ్చు. మొదటికే మోసం వస్తుందేమో?


Sujata M on Jul 29, 2008, 4:00:00 AM   said...

Bravo ! I will come back to you.. because I am more or less, technically challenged. :D Thanks.


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 3:07:00 PM   said...

నాగరాజు (సాలభంజికలు) గారు : Million Thanks for your comment and I'm on cloud 9 :-) It's very easy to write these technical things in English as it's my bread and better but my intention/interest is to share those ideas with our Telugu readers/community.

Your thoughts/feedback is absolutely right on and extremely valuable. Very highly appreciated.

For the third point i.e, shell life of a post, I will come back with new set of ideas apart from what I posted in my earlier post titled తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 2. But this time these set of ideas/instructions will aim at instructing the Bloggers to do it from Koodali as a mandatory rather than suggesting as the options to the Bloggers.

Unfortunately I can't commit but for sure will come up with some thing asap.

Once again thanks a lot for your time and comment here.


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 5:00:00 PM   said...

cbrao గారు : ముందుగా మీ వ్యాఖ్యకు మరియు eTelugu గురించిన వివరాలకు ధన్యవాదములు.

ఇకపోతే, మీరు నా టపా/బ్లాగు గురించి ఆలోచించమన్న దానికి, నా టపా కూడలి మొదటి పేజ్ లో నుండి తొందరగా పోయినా నాకు ఓకే అని గుండె మీద చెయ్యివేసుకొని చెప్పగలను. ఎందుకంటే ఈ తెలుగు బ్లాగింగ్ మొదలు పెట్టబోయే ముందు, నా టపాలలో సాధ్యమైనంత వరకు ఆంగ్ల పదాలను తగ్గించ గలిగాను అనిపిస్తే నా లక్ష్యం నెరవేరినట్టే అనుకున్నాను .. కానీ ఈ బ్లాగ్లోకంలోకి వచ్చిన తరువాత కొత్తగా చేరిన లక్ష్యాలు ఏమిటి అంటే ... తెలుగు భాష మీద అభిమానాన్ని, వారి ఆలోచనలను, ఊహలను, ఊసులను, కబుర్లను తెలుగులో వ్యక్తపరచాలి అన్ని ఉత్సాహాన్ని, సాంకేతికంగా అన్నీ వివరంగా తెలియకపోవటం అన్న కారణంతో వారు నిరుత్సాహ పడకుండా, వెనకడుగు వేయకుండా నా వంతు సహాయం నేను చేద్దామనీ (దేముడిచ్చిన తెలివితేటలు కొన్ని, బ్రతుకుదెరువులో భాగమైన వాటి నుంచి నేర్చుకున్నవి మరి కొన్నింటితో), అలాగే కూడలి మొదటి పేజ్ లో తమ టపా ఎక్కువ కాలం ఉండకపోవటం వలన తమ టపా ఎక్కువ మందికి చేరటం లేదని ఆలోచించేవాళ్ల కోసమని నాకు తెలిసిన , నేను తెలుసుకుంటూ ఉన్న వివిధ రకాలైన మార్గాలు అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చేయటం .. అంతే ...

దీనికి మంచి ఉదాహరణ .. బ్లాగ్ లో templates మార్చడం ... మీరు వ్రాసిన బ్లాగరు మిత్రులకు: మీతో నేను - 1 అనే టపా ప్రేరణతో నేను వ్రాసిన Free and Premium Templates for your Blogger/Wordpress Blogs టపాతో మన బ్లాగర్లలో కనీసం ఒక 15-20 మంది వారి మార్చడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా కొన్నింటిని కొంత మందైనా ఆచరించటం జరిగింది.

నేను ఇంతకు మించి నా బ్లాగులో ఆశించేది ఏమీ లేదండి.

అలాగే నాకు నచ్చిన లేక interesting గా ఉంది అనిపించిన లేక future లో ఎక్కడైనా ఉపయోగ పడుతుందేమో అనిపించిన ప్రతి site/page/post/blog ని Bookmark గా save చేసుకోవటం నాకు బాగా అలవాటు .. అలా save చేసుకుని నలుగురికి పరిచయం చేస్తేనన్నా ఆ కొన్ని మంచి టపాలు మరికొంత మంది చదివే అవకాశం ఉంటుంది అనుకున్నంతలో, అప్పటికే మీరు బ్లాగ్వీక్షణం పేరుతో ఇలా చేయటం చూసి ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఇలాంటి చేస్తున్నా/చేద్దామనుకుంటున్నా ..


ఇప్పుడే చదివిన వీవెన్ గారి కొత్త టపా మార్చిన టపాలు ఇక కూడలిలో రావు! ప్రకారం ఇక మన టపాలలో ఎన్ని సార్లు అయినా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు కనుక ఇక నేను నా మొదటి లక్ష్యమైన 'అతి తక్కువ ఆంగ్ల పదాల వాడుక' కు పూర్తి సమయం కేటాయించుకుంటా ...


రవి వైజాసత్య on Jul 29, 2008, 7:17:00 PM   said...

అయ్యా తెలుగు వాడిని గారూ, సహాయం చేయటానికేమీ చాలామందే ముందుకొస్తారు..కానీ కూడలి అభివృద్ధిపై వీవెన్ గారు, ఆ సహాయము అక్కరలేదు, నేను చూసుకొగలను అన్నట్టు, మిగిలినవాళ్లందరూ మనం కూడలికి సహాయం చెయ్యాలి అని అంటుండడంతో కాస్త అయోమయం నెలకొన్నది అని నాకు అనిపించింది. ఇంతకు ముందు కూడా ఈ తెలుగు ఆధ్వర్యాన మూలనిధిని సేకరిస్తే దేనికోదానికి పనికొస్తుందని కూడా అన్నాను. ఎమంటారు హై.బ్లాగర్లు?


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 7:49:00 PM   said...

సుజాత (గడ్డిపూలు) గారు : Thanks a lot for your comments and thoughts.

The cuurent Koodali framework was just a plain/vanilla installation with minimal customization which was self-sufficient all these days. To make any changes to accommodate these requests and keeping the future needs, the architecture/framework has to be revised and if for some reason it can't we have to go for an alternative which is really a big task.

As of now few things like appreciation from other readers will give them self-satisfaction, encouragement to motivation, suggestions/feedback to refinement might be the factors why they want or expecting more readers to their Blogs.

For your 'unbecoming' I will try to present my perspective in the next few days if possible but can't commit. In the mean time if somebody else does it, that will be awesome and thanks in advance.


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 9:18:00 PM   said...

రావు గారు : :-) మరియు :-(

నేను ఈ విషయాలన్నీ ఇంకొక టపాలో చెపుదామని అనుకున్నా ... కాకపోతే వీటిని మరలా అక్కడ వాడుకోవచ్చు కదా అని ఇక్కడ కొంత వరకు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.

1. కూడలి కాకుండా మరి వేరే ఏ బ్లాగ్ ఎగ్రిగేటర్ ఎంత మంచి ఫీచర్స్ తో వచ్చినా (కనీసం తెలుగుకి సంబంధించినంత వరకైనా) ఖచ్చితంగా మనజాలదు. అలా అయితే కూడలి కన్నా better features కొన్ని ఉన్న జల్లెడ, అలాగే మరికొన్ని better features ఉన్న తేనెగూడు ఈపాటికి అంతో ఇంతో ప్రగతిని సాధించి ఉండేవి. కూడలి కాక మరేదైనా దీనికి పరిష్కారం అనిపించాలి అంటే, తెలుగులో బ్లాగటం అనేది వ్యక్తిగత అభిరుచి, బాషాభిమానం మొదలగునవి అనే స్థాయి/చక్రం నుంచి బయటకు వచ్చి మరియు ధనార్జన, పేరు/కీర్తి/గుర్తింపు లాంటివి జత అయినప్పుడే సాధ్యం ... అంతవరకు replacing Koodali is not a solution. As of now Koodali is a brand name and a synonym for Telugu Blogs, neither because of it's technical brilliance nor feature rich framework. It's purely and entirley because of Veeven's super fast responses , dedicated support, whole hearted involvement, friendly nature, one email/message away to help us out etc and also our social/personal/emotional attachment with him/Koodali.

2. నేను ఇంతకు ముందు టపాలో చెప్పినట్టు ... "మన బ్లాగులకు మరో వంద రెట్లు పాఠకులను పెంచుకునే క్రమంలో కూడలిని కూడా తీసుకువెళ్లాలి....ఈ క్రమంలో మాత్రం వీవెన్ గారి పై అతి తక్కువ భారం పడేలా చూడాలి మరియు లేఖిని స్వాంతనతో, కూడలి నీడన ఎదుగుచున్న ఇప్పుడే మొలిచిన మొక్కలలాంటి మన బ్లాగులు వటవృక్షాలై తీయని ఫలాలను అందించే సమయాన తొలి ఫలం కూడలి/లేఖిని కి అందేలా మనం చేసే ప్రయత్నాలుండాలి." This is one of the reasons I'm not interested to go for a Koodali replacement and thus taking away all of Veeven's hardwork and Koodali's steady progress so far.

3. To be honest with you, ఇంకొక విషయమేమిటి అంటే, నాకు ఉచితం మీద అంత నమ్మకం లేదు అండి ... ఉచితంగా అందిస్తే దాని విలువ తెలిసిన/తెలుసుకోవాలి అనుకునే వాళ్లు చాలా తక్కువ ఉంటారు. కానీ వీవెన్ గారికి, కూడలి అభివృధ్ధికి కావాలంటే మాత్రం నేను ఏమైనా చేయటానికి సిధ్ధం.


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 10:00:00 PM   said...

ప్రవీణ్ గారు : ధన్యవాదాలండీ.

ఇక్కడ తప్పు పట్టటం అన్నది అసలు చర్చే కాదండీ ఎందుకంటే అసలు మనం ఆ దిశగా ఆలోచించనే కూడదు .. అలాగే వాళ్లు అసలంటూ మనకు ఏదో ఒక platform create చేసి ఇచ్చారు కాబట్టి. మనకి కావలసిందల్లా/తెలుసుకోవలసిందల్లా మీరు ప్రస్తావించిన openness గురించి మాత్రమే .. అందుకు వాళ్లు సిధ్ధంగా (ఇప్పటికిప్పుడు లేదా మరి కొంత కాలం లేదా ఎప్పటికీ) లేరు అని తెలిసినప్పుడు, మన మందరం ఒక open source community(development team)లో బాధ్యతాయుతంగా, అలాగే centralized guidelines తో ఎలా పని చేస్తామో .. ఇక్కడ కూడా అలాగే చేయటానికి సర్వధా, శతధా ప్రయత్నం చేద్దాం. అదే నా ఆలోచన కూడా ... ఇప్పటిలా ప్రతి టపాలోకి వెళ్లి చెప్పటం కన్నా, నేను పైన టపాలో చెప్పినట్టు ఇలాంటి Guidelines అన్నింటినీ ప్రతి ఒక్కరికీ తెలియజేసి ఎవరైనా అతిక్రమించినట్లైతే గా వారి site feed ని disable చేసేలా చూద్దాం వీవెన్ గారి సహాయంతో.

ఈ guidelines లేకుండా ఇలా వేరు వేరు టపాలలోకి వెళ్లి ఒక పదో పదిహేనో మంది చెప్పిందే చెప్పుకుంటూ వెళుతుంటే, ఈ చెప్పిన వాళ్ల గురించి కొంచెం కూడా అంటే తెలుగు బ్లాగులకు, భాషకు, బ్లాగర్లకు వీరిచ్చే/వీరిచ్చిన ప్రోత్సాహం/అభివృధ్ధి గురించి తెలుసుకోకుండా వీరిని చటుక్కున ఏమన్నా అంటే(ఇది Internet ప్రప్రంచం అండీ . వీళ్ల చూసి, వీళ్ల బ్లాగుల్లోకి వెళ్లి, కొన్నైనా టపాలు చదివే ఓపిక, తీరిక చాల మందికి ఉండక పోవచ్చు .. అలా తెలుసుకుని వ్యాఖ్యానించాలి అని అనుకోవటంలో ఉన్నది అత్యాశే అని మనకందరికీ తెలిసందే) అందరం బాధ పడతాం (అసలు నా స్పందనకు ప్రధమ కారణం అదే) మరియు అది లేని పోని అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ...

మీ టపాలలో miss అయ్యింది బహుశా ఇదే అనుకుంటా ... చూడబోతే అతి ముఖ్యమైన టపానే miss అయ్యాను :-( ... చాలా బాగా వ్రాశారు. అభినందనలు మరియు ధన్యవాదములు ఆ లంకె ఇచ్చినందుకు.

చూద్దామండీ ఈ ప్రస్థానం ఎలా సాగుతుందో ..


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 10:09:00 PM   said...

రాధిక గారు : చాలా మంచి సూచనలు చేశారు. దన్యవాదాలండీ.

మీరన్నట్టు ఈ నియమావళి లంకె కూడలిలోనే పెట్టాలి సాధ్యమైనంత తొందరలో...అప్పుడు ఇలా ప్రతి బ్లాగులోకి వెళ్లి చెప్పే బాధ తప్పిపోతుంది.


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 10:17:00 PM   said...

ప్రతాప్ గారు : ముందుగా మీ వ్యాఖ్యకు, సాంకేతికంగా చేయగలనన్న సహాయానికి దన్యవాదములు. ఆవేశం నాలో, నా ఆలోచనల్లో భాగమై పోయిందేమో .. కాదని అందామని అన్నా అందరూ అదే అనుకుంటున్నట్టు ఉన్నారు కదా ! :-(

సభ్యత్వం మంచిదే గానీ అందుకు రుసుము అనేది ఖచ్చితంగా దీనికి అసలు పరిష్కారమే కాదండీ .. మీరన్నట్టు దీని వలన మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దీని గురించి వీలైనంత తొందరలో చర్చిద్దామండీ ..


తెలుగు'వాడి'ని on Jul 29, 2008, 10:42:00 PM   said...

రవి వైజాసత్య గారు : ధన్యవాదాలండీ ... కారణాలు ఏవైనా కానీయండి (అడిగి మనం వీవెన్ గారిని ఇబ్బంది పెట్టటం భావ్యం కాదు కనుక) ఒకవేళ వీవెన్ గారు ప్రస్తుతానికి తన తీరిక వేళల్లో కొంచెం కొంచెంగా అభివృధ్ధి పరచుకుటూ వెళ్లటానికే మొగ్గు చూపుతుంటే, అది కూడా మనకి ఒకే అండీ .. కాకపోతే అది తెలుసుకుంటే నేను పైన టపాలో మరియు వ్యాఖ్య రూపంలో రాధిక గారు చెప్పినట్టుగా, అందరికీ ఆమోదయోగ్యమైన నియమావళిని రూపొందించుకొని కూడలిలో ఎక్కడో ఒకచోట మరియు/లేదా వీవెన్ గారి activation email లోనే వీటి గురించి బ్లాగర్లకు తెలియ పరచి .. ఎవరూ వీటిని అతిక్రమించకుండా చూసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే అప్పుడే చర్యలు తీసుకునేలా చూడవచ్చు.

వేచి చూద్దామండీ వారి సమాధానాం కోసం .. ఇక్కడ కాకపోయినా మనలో ఒకరైనా తెలుసుకునే అవకాశం ఉందేమో ప్రయత్నించండి.


Anonymous on Jul 30, 2008, 4:13:00 AM   said...

కూడలి కి విరాళలకోసమో, చందాల కోసమో వీవెన్ ఎక్కడా ప్రస్థావించినట్టు కనబడదు. లేఖినికి కొంతమంది ఇచ్చినట్టున్నారు. అంగీకరించినట్టున్నారు. కూడలి విషయంలో వీవెన్‌కి ఉన్న ఆలోచనలు ఆయనే తెలియజేస్తే బాగుంటుందేమో!

ఒపెన్ సోర్స్ ద్వారా నే ఒక తెలుగు బ్ల్లాగ్ అగ్రిగేటర్ ఐతే బాగుంటుందేమో! వీవెను + మిత్ర కూడలి, కూడలికి ఇతరుల సహయ సహకారాలు అంగికరిస్తే కూడలినే ఆధునికరిస్తే అదే బాగుంటుందేమో!


జ్యోతి on Jul 30, 2008, 4:42:00 AM   said...

తెలుగు’వాడి’ని గారు,
చాలా మంచి విషయాలు చెప్పారు.నాకు ఎన్నో రోజుల నుండి ఈ సందేహం ఉండింది. మనందరి కోసం వీవెన్ ఎన్నో సదుపాయాలు చేసి ఇస్తున్నాడు అది తన స్వంత వెబ్‍సైట్ కి అనుబంధంగా. దానికి అయ్యే ఖర్చు అతనే పెట్టుకుంటున్నాడు. అది ఎంత అవుతుంది. ఇంతమంది కోసం అతనొక్కడే ఆ ఖర్చు భరించాలా. మనమందరం కలిసి పంచుకుంటే బావుంటుంది కదా. ఇంతవరకు ఆ ఆలోచన ఎవ్వరికీ రానట్టుంది. లేఖిని,కూడలి,ఇతెలుగు,కబుర్లు,ప్రమదావనం ఇవన్నీ ఎవ్వరూ ఉచితంగా ఇవ్వడం లేదు అని మనం తెలుసుకోవాలి.

నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. మీరు చెప్పండి .నేను ఏమి చేయాలో?


Anonymous on Jul 30, 2008, 8:14:00 AM   said...

తెలుగువాడిని గారు,

చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. కానీ సాఫ్టువేరు, మరియు డబ్బు విషయంలో నా అభిప్రాయాలు ఇవి. మొన్నవారం కబుర్లలోనే నేను విరాళాల ప్రసక్తి తెచ్చాను. కానీ పూర్తిగా మొదటినుంచీ సాఫ్టువేరు తయారుచేయటం అనేది కాస్త శ్రమ అంతకు మించి ఆలస్యం అయ్యే వ్యవహారం. ఒక లేదా రెండు లకారాలతో ఇది అయ్యే పనికాదు (మన అవసరాలతో). చాలా ఆగ్రిగేటర్ సాఫ్టువేర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అవసరాలకు తగినది ఎంచుకొని పోవటం ఉత్తమం, ఒక వేళ నిజంగా ఆ పని చేయాల్సొస్తే.

సరయిన సపోర్టు లేక(అన్ని రకాల సపోర్ట్లు టెక్నికల్ వగైరా), అల్లాటప్పాగా ఎవరో చేసి మన పెద్ద పెద్ద కంపనీలకి అమ్మి బిచాణా ఎత్తేసిన సాఫ్టువేర్లు మన మన నిత్యజీవితాల్లో ఆఫీసుల్లో ఎలా ఎలా కంపనీల కొంపలు ముంచుతున్నాయో మీకు తెలిసే ఉంటుంది. అంతేకాక, బ్లాగుల్లో ఇవాళ ఎవరుంటారో రేపెవరో ఎవరికీ తెలియదు. కాబట్టి, సాధ్యమైనంత సరళంగా వ్యవహారం ఉండాలన్నది నా అభిప్రాయం.

డబ్బుతో పాటు ఓ విధమయిన పెత్తనం, జవాబుదారీతనము కావాలనుకోవటాలు రావొచ్చు. కీడెంచి మేలెంచాలి కదా. ముందే చెప్పినట్లు ఇవ్వాల్టి మనుష్యులు రేపు ఉండకపోవచ్చు. వేరు వేరు మనుష్యులు వేరు వేరు అభిప్రాయాలు. ఆలోచిచండి.


తెలుగు'వాడి'ని on Jul 30, 2008, 10:08:00 AM   said...

నెటిజెన్ గారు : ముందుగా ధన్యవాదములు.

విరాళాలు, చందాలు అనేవి ఇక్కడ అసలు ప్రధాన సమస్య కాదండీ ... మనం ఆలోచించవలసింది/చేయవలసింది మీరన్న రెండవ పాయింట్ ... ఈ క్రమంలో మనం కూడా వీవెన్ గారికి తోడుంటాము అని చెప్పటమే కావలసింది. అందుకు ఇప్పటికే చాల మంది ముందుకు రావటం ఆనందించవలసిన విషయం.

మీరేమిటి Wordpress కి మారిపోయారు .. ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? JLT అయితే వదిలెయ్యండి. కానీ better features అనేది కారణం అయితే దాని మీద ఏదన్నా ఒక టపా వ్రాయొచ్చు కదా ?


తెలుగు'వాడి'ని on Jul 30, 2008, 10:59:00 AM   said...

జ్యోతి గారు : మీ వ్యాఖ్యకు మరియు సహాయానికి సిధ్ధమన్న మీ ఆలోచనకు ధన్యవాదాలండీ ....

మనం కూడా సహాయం చెయ్యలేమా అన్న దానికి పైన ప్రవీణ్ గారు అన్నట్టు అది వీవెన్ గారి మీద ఆధారపడి ఉంటుంది .... కాకపోతే మనం కూడా ఉన్నాము అనే భరోసాకే ఇదంతా ... ఏమో లేండి కొంత మంది తమ సైట్ తమకి ఇష్టం వచ్చినట్టు నడుపుకోవాలి అనుకోవటం కూడా తప్పులేదు ... కాకపోతే మనం కావాలి అనుకుంటున్న మార్పులు-చేర్పులు ఇప్పటిలో సాధ్యపడవు అని తెలిస్తే నేను పైన టపాలో చెప్పినట్టు (రాధిక గారి వ్యాఖ్యలో ఉన్నట్టు) ఈ నియమావళిని ఇంకొక రకంగా నలుగురికీ తెలియపరచవచ్చు .. అలాగే అమలుపరచవచ్చు.

ప్రస్తుతం దాదాపుగా అన్ని సైట్స్ వాళ్లు ఉచితంగానే ఇస్తున్నారు అండీ వాళ్ల flexibility/control కోసం .. అందులో తప్పేమీ లేదు. కాకపోతే నా బాధల్లా మనం వ్యక్తిగతంగా వెళ్లి వ్యాఖ్యలు చేయటం కన్నా ఆ కామెంట్స్ అనేవి కూడలి Administrator/Moderator గా వస్తే దానికి ఒక authenticity వస్తుంది .. లేకపోతే ఈ కామెంట్ చేసిన మనలాంటి వాళ్లని ఏదన్నా సీరియస్ వ్యాఖ్య చేస్తే అప్పుడు అందరం బాధపడవలసి వస్తుంది ... అక్కడ దాకా రాకూడదనే ఇదంతా ...


తెలుగు'వాడి'ని on Jul 30, 2008, 4:42:00 PM   said...

వికటకవి గారు : ముందుగా మీ వ్యాఖకు మరియు వివరణకు ధన్యవాదములు. పూర్తిగా మొదటి నుంచి అంటే మీరన్నది (శ్రమ, ఆలస్యం) నిజమే కానీ Veeven shouldn't be constrained by time, money and resources etc when doing an in-depth analysis of architectural/framework review to meet those on going demands and future needs. At least the support that we are (will be) there for/with him will give enough flexibility in doing so to get a better picture about it. End of the day whether he is going to accept it or not and which route he would like to go is purely his decision and we will respect that.

There are so many open source feed/blog aggregators and also CMS with free aggregator add-ons but need to estimate/understand how much customization is needed?

ఒకటో, రెండో లకారాలలో లేదా మనం సేకరించగలము అనుకుంటున్న మొత్తంలో మీరన్నట్టు ఏమీ రాకపోతే ... అంతా ప్రశాంతమే ... అసలు ఏ భాధా లేదు ... ఉన్న వాటితో సర్దుకు పోవటమే .. అదే సమయంలో మనం అనుకునే నియమావళిని అందరికీ తెలియ పరచటం .. ఆచరించబడేలా చూసుకోవటం (కూడలి moderator/administrator accounts ద్వారా) ...

సరళంగా ఉండాలి మరియు కంపెనీలు బిచాణా ఎత్తేయటం అన్నీ నిజమే అనుకోండి ... కానీ అదంతా మనం అనుకుంటున్న application ని బట్టి కదా ... ఎంత కాలం manage చెయ్యగలం అనే నమ్మకం/confidence/estimation కదా ముఖ్యం . ఒకవేళ మనం manage చెయ్యలేమేమో అనుకుంటే ముందే చేతులెత్తేస్తాము అంతే కదా ..

కనీసం ఇప్పటి వరకు ఉన్న బ్లాగర్లలో పెత్తనం/జవాబుదారీతనం కోరుకునే లేరు అనిపించటం వలనే ఇప్పుడు అంటే ఇదే సరైన సమయం అనిపించింది. మీరన్నట్టు ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేము కదా ...


Kathi Mahesh Kumar on Jul 31, 2008, 7:50:00 PM   said...

మీ సూచనలు ఆమోదయోగ్యంగా ఉన్నా..నా ఓటు మాత్రం సాలభంజికల నాగరాజుగారికే!

'self regulation' is the key for democratic blogging. బ్లాగులు రాసేవారందరూ, "కూడలి ఉందికదా అందరితో పంచుకోవచ్చు" అని మొదలెట్టుండరు.నేనలా మొదలెట్టలేదుకూడాను.స్వీయ ఆలోచనలో,అనుభవాలో,అభిప్రాయాలో ఒక డైరీలాగా రాయడం అక్షరబద్ధం చేయ్యడం బ్లాగింగుకు ఆద్యం.

కూడలి లాంటి ఒక వేదిక యాదృశ్చికమైనా,అభినందనీయం.పత్రికలూ,TVలు కూడా self regulation with an agreed guidelines అంటున్న తరుణంలో,వేడివేడిగా మీరు దాదాపు ‘రూల్స్’ లాంటి ‘గైడ్ లైన్స్’ సూచించేస్తే కష్టమే!

నాలాంటి చాలా మంది తెలుగు బ్లాగర్లకి బ్లాగువల్ల వచ్చే ఆదాయం గురించి అంతగా పట్టింపులేదు.తత్కారణంగా ‘హిట్ల’ గురించి బెంగలేదు. ఆ కారణం చేత కూడలిలో మళ్ళీమళ్ళీ కనిపించాలనే దుగ్ధకూడా లేదు.కాబట్టి, కాసుల వర్షం కోసం మాటిమాటికీ ‘పబ్లిష్’ నొక్కాల్సిన అవసరం చాలా మందికి లేదు.

కూడలిని మెరుగుపరచాలీ లేక ఒక రెవెన్యూమోడల్ గా నిలపాలి అని వివెన్ గారు అనుకున్నతడవు,సూచనప్రాయంగా తెలిపినా చాలు చాలా మంది ఔత్సాహికులు మా వంతు బాధ్యత నెరవేర్చడానికి సిద్దంగా ఉన్నాం.


తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 9:03:00 PM   said...

మహేష్ గారు : ముందుగా మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

మహేష్ గారు : ముందుగా మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

Self regulation అనేది అనుసరించవలసిన guidelines తెలిసినప్పుడు ప్రారంభమై అందరి సహకారంతొ దినదిన ప్రవర్ధమానమై సాగిపోయేలా చేయటంలో ప్రతి ఒక్కరిపై అంతో ఇంతో బాధ్యతను(గా) ఉంచుతుంది/మారుస్తుంది. అందులోనూ ఇది ఒక్క రోజులో సాధ్యపడేది కాదు మరియు తెలుగు బ్లాగ్లోకానికి కొత్తదయిన ఇలాంటివి ఆశించేటప్పుడు అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అనుసరించవలసిన ఆచరణీయ మార్గాలు ముందుగా నలుగురికీ తెలియపరచాలి. అంతే కానీ కూడలిలో ఇప్పుడే చేరిన వారికి మరియు/లేదా కొత్తగా బ్లాగింగ్ మొదలు పెట్టిన వారికి అతీంద్రీయ శక్తులు, అద్వితీయమైన తెలివితేటలు, అసాధారాణమైన సాంకేతిక ప్రతిభ ఉండాలని ఆశించటం అంత మంచి పధ్ధతి కాదు. అలాంటి guidelines అనేవి లేకుండా/తెలియజేయకుండా ఇలా ఎవరికివారు బ్లాగుల్లోకి వెళ్లి వాటి గురించి మాట్లాడటం మరియు పర్యవసానాలు చెప్పటానికి నేను పూర్తిగా వ్యతిరేకం.

నా టపాలో నాకు తెలియని/కనపడని 'రూల్స్' లాంటి 'గైడ్ లైన్స్' మీకు(రు) కనపడటం/కనిపెట్టటం కొంచెం వింతగానూ/ఆశ్చర్యంగానూ ఉంది. సరేలేండి మనిద్దరం వాటిని చూసిన, వాటి గురించి ఆలోచించిన దృక్కోణం వేరువేరు అయి ఉండొచ్చు.

(తెలిసి చేసినా, తెలియక చేసినా) ఎక్కువ మంది తమ టపాలు చదవాలని అయినా లేక కోసమని ఒక టపాలో ఉన్న ఒక ని నాలుగు/అయిదు సార్లు మార్చినా అక్కడ జరిగిన ఒకటే . సరే వీవెన్ గారు ఎలాగూ ఈ సమస్యను ఇప్పటికే పరిష్కరించారు కాఅట్టి ఇక దీని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు.

సమయం వచ్చినప్పుడు కూడలి అభివృధ్ధికి మీవంతు సాయం అందించటానికి సిధ్ధమని చెప్పినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. ఆ శుభతరుణం కనుచూపు మేరలోకి వచ్చేంతవరకు guidelines తెలియపరచబడిన self regulated open community గా బ్లాగింగ్ చేయటానికి ప్రయత్నిద్దాం.


Bolloju Baba on Sep 7, 2008, 10:38:00 AM   said...

ఈ టపా మిస్ అయ్యాను. ఇప్పుడు చదువుతుంటే చాలా విషయాలు తెలిసినయ్యి.

పైనెవరో అన్నట్లు i am a technically challenged person.
ఎందుకంటే కూడలిని నడపటానికి ఇంత తతంగముంటుందనీ, దానివెనుక ఎంతో శ్రమా, విచక్షణ అవసరమౌతాయని ఇంతవరకూ నాకు తెలియదు. (మీరన్నట్టు బ్రేవ్ మని త్రేంచుకుంటూ పోతున్న కనుక)
బ్లాగు క్రియేట్ చేసుకొన్నాక అదేదో ఒక మైల్ ఐడి లాగ అనిపించింది.
బ్లాగులో పోష్టులు కూడలిలో వస్తున్నాయంటే అదేదో ఒక మాయ లాగా ఉండేది.
దానివెనుక వీవెన్ గారి హస్తం ఇంతగా ఉంటుందనీ తెలియదు.
విషయాలు తెలిసినవి కనుక నా వంతు సహాయం చేయటానికి నేను సిద్దం. తెలియచేయగలరు.
భవదీయుడు.
బొల్లోజు బాబా


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting