నచ్చిన బ్లాగులు మరియు టపాలు (బ్లాగ్స్ అండ్ పోస్ట్స్) - 5
ఇది నేను గత కొద్ది రోజులలో చదివిన వాటిలో నాకు నచ్చిన బ్లాగులు/టపాల కు సంబంధించి ఐదవ భాగం .... ఒకవేళ ఇలాంటివే మరికొన్ని బ్లాగులు/టపాలు తెలుసుకోవాలి/చదవాలి అనుకుంటే మొదటి , రెండవ , మూడవ, నాలుగవ భాగాలుగా నేను ప్రచురించిన టపాలలో చదవవచ్చు/చూడవచ్చు.
ముందుగా ముచ్చటగా మూడు మాటలు :
హ హా హాసిని
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
blaagarla టపాలతో అమ్మ సంకలనం
"బరువు "బాధ్యతలు
అమ్మాయిలు - ఆంటీలు
బ్లాగరు మిత్రులకు: మీతో నేను - 1
నా డీసీ ప్రయాణం - 1
ఆదివారం అగచాట్లు
క్షుర ఖర్మ
ఉద్యోగ విజయం - 1/2
లేత సాఫ్టువేరు కుర్రోడి కష్టసుఖాలు
కామెంటు ఎటూ లేదు లుక్కైనా వెయ్యి బ్రదర్
ఉప్మా పురాణం
"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?
నల్లని చందమామ
నేను ఎందుకు ప్రేమించలేదంటే.....???
పుచ్చకాయ పచ్చడి చేద్దాం రా..!!!.( సినిమా..)
అనుకోకుండా ఒక రోజు ఏం జరిగిందంటే...!!!
ఎస్కలేటరోఫోబియా..
హిడింబి హిడింబి నడుమ నేను
ఇంగ్లీషన్నయ్య -- సులక్షణక్కయ్య
వేగంగా మారుతున్న మొబైలు విపణి ...
క్రొత్త పుంతలు తొక్కుతున్న మొబైల్
అంతర్జాలంలో వ్యాపారీకరణ
మైక్రోబ్లాగింగు... - కుచించుకుపోతున్న సమాచారం
పుస్తకంలోకి నడవటం అంటే.......
నా జ్ఞాపకాల పొరల్లో, బాల్యప్రేమల గుభాళింపులు
మీ బ్లాగెలా ఉండాలి !
మైనారిటీలది తప్పే కాదు
An Inconvenient Truth
ధర్మ సందేహాలు
కాకినాడ క్లూసెనర్!
అతివ ఆవేదన ...
ఏ రోజు నిన్ను మరువను......?
ఎందుకు రాస్తావ్?
Passport and PIO Card for your baby.
ఇంటర్ చదివిన విధంబెట్టిదనిన ...
బ్లాగింగ్ లో రాగింగ్
“చందమామ”కొక నూలు పోగు
మీరు సినిమాలు చూస్తారా ? అయితే మీరే టైపో ?
త్వమేవాహం
Bapu Bomma - Budugu
అప్పు ఎవరిస్తున్నారు? ఎందుకిస్తున్నారు?
సాఫ్ట్ వేర్ ఇంజనీరు కవిత
జాతి వివక్ష పై ఓ కవిత
తెలుగు బ్లాగులు ఎందుకు చదవాలి అంటే..
ఆకాశ వీధిలో ఆకుపచ్చ కన్నీరు
'నవ' అని పిలవబడేవి ఏమిటో తెలుసుకోండి
’ఐఫొను’ కి ధీటయిన జవాబు ’మిలాన్’
నమ్మ బెంగలూరు
నీకిది తెలుసా?
నిరీక్షణం
M.B.A Student (vs) B.Tech Student
10 most stupid questions' people usually ask in obvious
Think fast!!!
పరుగు సినిమా సమీక్ష
ఆటోవాలాల తో బెడదా?
A helping hand for women in distress
హెచ్1-బి జీవితం
Enjoy Reading and Happy Commenting !!!!
ఇంతే సంగతులు - చిత్తగించవలెను ... మరలా కలుద్దాం త్వరలో !
32
వ్యాఖ్యలు:
- Ramani Rao on Jul 31, 2008, 1:30:00 AM said...
-
తెలుగు 'వాడి ' ని గారు: ఎంతో శ్రమ తీసుకొని ఇలా 'నాకు నచ్చిన బ్లాగులు ' అంటూ ప్రతిసారి మీ బ్లాగులో ఆయా టపాలు ఉంచడంలో అన్నీ ఒకే చోట పొందుపరచడం వల్ల చదవడానికి వీలవుతుంది అన్న మీ ఉద్దేశ్యం మెచ్చుకో తగినదైనా, కొంచం ఆలోచించండి! ప్రస్తుతం బ్లాగులోకంలో వస్తున్న అంశాలు తీసుకొంటే 'నువ్వెంత అంటే నువ్వెంత ' అన్న అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. మరి అలాంటి టైం లో మీరు ఇలా నాకు నచ్చిన.. అంటూ ఇవ్వడం వల్ల నేనే గొప్ప అన్న ఇగొ తృప్తి పడుతుందేమో కదా. మీకు కోపం తెప్పించినా, నా ఆలోచన తప్పయినా క్షమించండి. కాని, ఇది కొత్తగా వస్తున్న బ్లాగర్లకైతే నేమి, ఉన్న వారికైనా ఇలాంటివి ప్రొత్సాహం లేదేమో అని కొంచం ఆశా నిరాశల మధ్య ఊగిసలాడడం అవుతుందేమో అని నా అభిప్రాయం.ఇది మరే దురుద్దెశంతో రాయలేదని మనవి. నేను మీ టపా ని ఖండించడంలేదు అర్ధం చేసుకోగలరు.
- జాన్‌హైడ్ కనుమూరి on Jul 31, 2008, 3:17:00 AM said...
-
మీరు చేస్తున్న పని అభినందనీయము
హృదయపూర్వక అభినందనలు
అమ్మ
- సుజాత వేల్పూరి on Jul 31, 2008, 5:27:00 AM said...
-
అమ్మ, నా టపాలు కూడా రెండున్నాయీ!
- మీనాక్షి on Jul 31, 2008, 7:31:00 AM said...
-
నా టపాలు మీరు చూడరేమో అనుకున్నానండి..
ఇలా పెట్టారు అంటే చూస్తారన్నమాట.హమ్మయ్య..
మీరు ఇలా అన్నీ టపాలు ఒకచోట పెట్టడం నిజంగా అభినందనీయం..
thanks.:)
- oremuna on Jul 31, 2008, 12:41:00 PM said...
-
రమణి గారూ,
ఇందులో అంత ఆలోచించటానికేమీ లేదు!
ఇది అన్ని భాషల వాళ్లూ చేసే పనే, మనలో కొద్ది మందే చేస్తున్నారు అంతే.
ఇలా చెయ్యకపోతే బ్లాగు టపాలు ఎలా పాపులర్ అవుతాయి? ఎలా చదువుతారు? ఇలాంటివి ఎన్నో చెయ్యాలో టపాలు ఎక్కువమంది చదవాలంటే.
- Anonymous on Jul 31, 2008, 12:42:00 PM said...
-
ఈ సారి నాకు నంది అవార్డ్ రాలేదా అయ్యో :)
- తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 2:20:00 PM said...
-
రమణి గారు : ముందుగా మీ అభిప్రాయానికి/వ్యాఖ్యకు ధన్యవాదాలండీ ... కనీసం నా బ్లాగు వరకైనా క్షమాపణలు లాంటివి వద్దండీ, మీరు చేసే వ్యాఖ్య నా టపా కి సంబంధించినంతవరకు అయితే ... మీరనుకున్నది మీరు నిరభ్యంతరంగా చెప్పచ్చు ఎప్పుడైనా .. కోపతాపాల ప్రసక్తి లేదండీ...
నేను ఇంతకు ముందు వ్రాసిన నాలుగు టపాలలో (ఇదే సిరీస్ కు సంబంధించి), ఈ టపాలో వ్రాసినట్టుగా నేను 'ముందుగా మూడు మాటలు' అనేది లేదు . మీరు గమనించే ఉంటారు. ఈ టపాలో అవి ప్రస్తావించటానికి ముఖ్య కారణం ఈ టపా వలన నేను ఆశించే ప్రయోజనం నెరవేరకపోయినా పర్వాలేదు గానీ కొత్త రకమైన ఆపోహలు కలగకూడదనే .. అయినా నేను వ్రాసే టపాలు/వ్యాఖ్యలు, నా పేరును బట్టి నేను వ్రాసే వాటికి కూడా ప్రామాణికత ఉంది అనుకునే వారు ఇంకా ఈ బ్లాగ్ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటారా!!! :-(
- తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 5:34:00 PM said...
-
జాన్‌హైడ్ కనుమూరి గారు : ధన్యవాదాలండీ ... మీకు నచ్చితే అదే పదివేలు ... తిరిగి నలుగురితో పంచుకుంటే అదే పదివేల కోట్లు :-)
సుజాత గారు : :-) అంటే మిగతావి నచ్చలేదని కాదండోయ్ !!!!!!!!
- Anonymous on Jul 31, 2008, 5:36:00 PM said...
-
thanks.miss ayinavi cadivaanu.thanks again
- తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 5:55:00 PM said...
-
మీనాక్షి గారు : నేను మీ బ్లాగులో వ్యాఖ్య వ్రాయలేదు కాబట్టి మీరు అలా అనుకోవటంలో తప్పులేదులేండి. కాకపోతే నేను చెప్పాలి అనుకున్నది పూర్తిగా చెప్పకుండా ఏదో ఒకటో రెండో ముక్కలు వ్రాయడం నాకు అంతగా ఇష్టం ఉండదు అలాగని ఏమీ చెప్పకుండా ఉండటం కూడా అంత మంచి పధ్ధతి కాదనుకోండి. చూద్దాం ముందు ముందు ఏమన్నా మార్పు వస్తుందేమో :-)
ఇంతటి చక్కని హాస్యాన్ని పండించే(మీవి, శ్రీవిద్య, సుజాత(మ.మా), జంబలకిడిపంబ మొదలగు వారి) టపాలు చదవకపోయినా, లేక చదివి ఆస్వాదించలేకపోయినా ... రగులుతున్న అగ్నిపర్వతం రోజుకో సారి పగిలిపోతుంది :-)
ఈ ప్రయత్నం మీకు నచ్చినదని చెప్పినందులకు ధన్యవాదాలు.
- తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 6:04:00 PM said...
-
oremuna గారు : ధన్యవాదాలండీ ...
తరచుగా సిబిరావు గారిలా మరియు పొద్దు లోలా మరికొంత మంది కూడా చేస్తూ పోతూ ఉంటే చాలా వరకు కొత్త టపాలను/బాగులను నలుగురూ తెలుసుకునే అవకాశం ఉంటుంది ...
- తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 6:14:00 PM said...
-
muralidharnamala గారు : నంది అవార్డ్స్ అని ఈ టపాను తుస్సుమనిపించారుగా .. ఇంకా నయం వజ్రోత్సవాలు అనీ ఢమాల్..ఢమాల్ చేయలేదు :-)
నా bookmarks లో నుంచి ఈ టపాలోకి copy/paste చేసిన వాటిని మూకుమ్మడిగా వేరే folder లోకి drag/drop చేసే ప్రక్రియలో మీ టపా దారితప్పి పోయింది. ఈ సారికి పెద్ద మనసుచేసుకుని నన్ను వదిలెయ్యండి.
హ హా హాసిని
- తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 6:17:00 PM said...
-
radhika garu : Thank you and You are most welcome :-)
- Rajendra Devarapalli on Jul 31, 2008, 11:16:00 PM said...
-
నా గురించి హెఖ్ఖడా లేదు వా.....
- Anonymous on Jul 31, 2008, 11:16:00 PM said...
-
అయ్ !!
దద్దినక జజ్జనక ఢంకుటిక జనారే.
నా టపాని కూడా పంక్తిలో కుర్చోపెట్టినందుకు thanx.
- తెలుగు'వాడి'ని on Jul 31, 2008, 11:50:00 PM said...
-
రాజేంద్ర గారు, అదేంటండీ 'వా' అని అలా అనేశారు. మీరేమో ఈ మధ్య కాలంలో ఏకబిగిన నాలుగు అయిదు బ్లాగులు వ్రాసేస్తున్నారు ... అన్ని బ్లాగుల మీద మామూలుగా కన్నేసి ఉంచితే కళ్లు గిరగిరా తిరిగి లో చేయాలి అనే అసలు విషయం మరచిపోతున్నాను. అందుకు ఒక గట్టి ఉదాహరణ 'జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై' అనే టపా ... అందులో మొదటి వ్యాఖ్య వ్రాసింది నేనేనండీ :-) అందుకే ఇకనుంచి మీటపాల మీద గట్టిగా రెండు కళ్లూ వేసి ఉంచుతా ... సరేనాండీ !:-)
- Anonymous on Aug 1, 2008, 2:26:00 AM said...
-
వా వా...
ఇందులో నా టపా లేదు. ఇదన్యాయం. నేనొప్పుకోను.
నాకేడుపు వస్తోంది. వా.......... :-)
- తెలుగు'వాడి'ని on Aug 1, 2008, 7:57:00 AM said...
-
కల గారు : మీ(ప్రతాప్ గారివి కూడా) కవితలు చాలా బాగుంటాయి ముఖ్యంగా అందులో వాడే పదాలు. నా లాగే వ్యాఖ్యలు వ్రాయకపోయినా (నచ్చీ వ్యాఖ్య వ్రాయకపోవటం అనేది అంత మంచిపధ్ధతి కాదనుకోండి) :-( వాటిని చదివే వాళ్లు, చదివి ఆనం(స్వా)దించే వాళ్లు చాలా మందే ఉంటారు. కనుక మీరు హాయిగా, ప్రశాంతంగా, చక్కగా వ్రాస్తూ ఉండండి. మరొక్కసారి అభినందనలు.
- తెలుగు'వాడి'ని on Aug 1, 2008, 8:08:00 AM said...
-
ప్రతాప్ గారు: ఒకే టపాలో ఇన్ని టపాలు ఇచ్చాను కదా అని కొంపదీసి నాకు ఇదేమీ టెస్ట్ కాదు కదా :-) :-( ........ మీ టపా ఉంది సార్ ... ' .. కల గారి టపా నిరీక్షణం పైన ఉన్న అనే టపా నీకిది తెలుసా? మీదే కదా ... :-) ... ఇలా చాలా కొండ గుర్తులు ఉంచుకునే వ్రాశానండీ ;-) .. అయినా మురళీ/రాజేంద్ర గార్ల టపాలు మర్చిపోయాను ...
- బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ on Aug 1, 2008, 8:56:00 AM said...
-
అయ్య బాబోయ్!! నా బ్లాగు కూడా లిస్టులో ఉంది. జజ్జనక జ్జనారె!!! జజ్జనక జ్జనారె!!!
చాలా థాంక్స్ అండి.
నా మొదటి టపాకి వచ్చిన మొదటి వ్యాఖ్య మీదే! కొత్త బ్లాగర్లకు మీరిస్తున్న ప్రోత్సాహం అభినందనీయం.
మీరిచ్చిన లింకు వేరే టపాకి వెళ్తోందండి. కరక్ట్ లింకు ఇక్కడ ఇస్తున్నాను.
"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?
- Purnima on Aug 1, 2008, 9:15:00 AM said...
-
ఒరెమునా గారన్నట్టు ఇలాంటి ప్రయత్నాల వల్ల.. ఇంతక ముందు చూడకపోయినా, చూసినా మరో సారి చదువుకునే వీలు కలిగిస్తుంది. మీ ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. కొన్ని పాత టపాలు కూడా కనిపించాయి. కూడలిలో ఓ టపా జీవితం మహా అయితే రెండు రోజులు. ఇలాంటి పరిచయాల వల్ల కలుగు లాభం అంతా ఇంతా కాదు!! నెనర్లు!! :-)
- Bolloju Baba on Aug 1, 2008, 10:30:00 AM said...
-
thank you sir
bollojubaba
- కొత్త పాళీ on Aug 1, 2008, 10:47:00 AM said...
-
This is a really nice and useful service you are doing.
I see it helps in two ways:
1. It presents some good quality blog posts in one place for readers .. esply helpful for new comers or occasional readers.
2. It encourages the mentioned bloggers too - it is always nice to be recognized by someone else, even for seasoned bloggers.
I appreciate your effort.
- Srividya on Aug 2, 2008, 9:46:00 PM said...
-
క్రితం సారి మీకు నచ్చిన బ్లాగుల లిస్టుని చూసిన అలాంటి పోస్టు నేనెప్పుడు రాస్తానా అనుకున్నాను. ఈ సారి నావి మూడు టపాలు చూసి అబ్బో తెగ సంతోషపడిపోయానండి.. ఇప్పటివరకు మీరు నావి చదువుతారని నాకు తెలీనే తెలీదు. Thanks for your encouragement :)
- తెలుగు'వాడి'ని on Aug 3, 2008, 8:43:00 PM said...
-
బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ గారు : మీ బ్లాగు కూడా ఏమిటండీ బాబు :-) మీరు ఇరగదీసి రాసేస్తుంటే ..
ధన్యవాదాలండీ మీ వ్యాఖ్యకు ... ఏదో నాకు తోచింది నేను చేద్దామనే ఓ చిన్న ప్రయత్నమిది అంతే ..
ఇప్పుడు కరెక్ట్ చేశానండీ ... సరైన లంకె చెప్పినందుకు మరొక్కసారి ధన్యవాదాలు.
- తెలుగు'వాడి'ని on Aug 3, 2008, 8:50:00 PM said...
-
Purnima గారు : ప్రత్యేక ధన్యవాదాలండీ మీ ప్రోత్సాహకర వ్యాఖ్యకు మరియు అభినందనలకు...
మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తానికి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నానండీ ... మధ్యలో వస్తున్న పొద్దు వారి మరియు సిబిరావు గారి టపాల వలన కూడా కొంచెం ఉత్సాహంగా ఇంకా కొనసాగిస్తున్నాను :-)
- తెలుగు'వాడి'ని on Aug 3, 2008, 8:53:00 PM said...
-
బొల్లోజు బాబా గారు : You are welcome and Thank you for your comment. Keep writing :-)
- తెలుగు'వాడి'ని on Aug 3, 2008, 9:05:00 PM said...
-
కొత్త పాళీ గారు : Thanks a lot for your comment and encouraging words. Those two points were exactly the ones that motivates me to do this. But I really want to write my comments and some description about the posts like cbrao garu was doing in his posts but no patience is the primary reason and the second one being there wasn't any summary for most of the posts and last one is, with the description and/or my comment with these many links this blog post becomes too long. Next time I will try to post it frequently with fewer links and add the description/comment.
- తెలుగు'వాడి'ని on Aug 3, 2008, 9:16:00 PM said...
-
శ్రీవిద్య గారు : మీ టపాలు నిజంగా చాలా చాలా హాస్యంగా ఉంటాయండీ ... నేను ఇంతకు ముందు మీనాక్షి గారి వ్యాఖ్యకు మరియు పైన టపాలో చెప్పినట్టు మన తోటి బ్లాగర్లు వ్రాసినవి నచ్చి కూడా ఏదో ఒక వ్యాఖ్య వ్రాయకపోవటం నిజంగా అంత మంచి పధ్ధతి కాదనుకోండి ... సాధ్యమైనంతవరకు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తానండీ ... You are very welcome and keep writing !:-)
- చైతన్య.ఎస్ on Aug 3, 2008, 11:33:00 PM said...
-
తెలుగువాడిని గారు , మీ లిస్ట్ లో నా టపా ఉన్నందుకు చాలా సంతోషం గా ఉంది. Thanks for your encouragement.
- Rajendra Devarapalli on Aug 3, 2008, 11:53:00 PM said...
-
ఇంతమంది మధ్యలో మౌనంగా ఉండటం ఎందుకని అలా రాసానన్నమాట,అయినా మీసంగతి నాకు తెలీదా?? :)
- ఏకాంతపు దిలీప్ on Jan 8, 2009, 11:15:00 AM said...
-
అరే ఇందులో నా చందమామ కూడా ఉంది... ఇప్పటి వరకూ చూసుకోనేలేదు... థాంక్స్ అండి... :-)