Indian Portal For Environmental Info

Posted by తెలుగు'వాడి'ని on Tuesday, August 12, 2008

నేను బత్తీబంద్/గ్లోబల్ వార్మింగ్ అనే కార్యక్రమానికి సంబంధించి వ్రాసిన ఒక టపా గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన లో మనకు అందుబాటులో ఉన్న సమాచారం అంతా ఒకే చోట ఉండేలా ఒక పోర్టల్ ఏర్పాటు యొక్క ఆవస్యకతను చెప్పాను. ఇన్ని రోజులకు అదే ఉద్దేశ్యంతో/ఆలోచనలతో, నేను చెప్పినవి చాలా వరకు కుడిఎడంగా 90% ఈ సైట్ లో ఉండటం మరియు ఇండియాలో ఇలాంటి పోర్టల్స్ కి ఉన్న ఆవస్యకతను గుర్తించి వేసిన తొలి అడుగుగా అనిపించటం చాలా ఆనందంగా ఉంది. ఈ సైట్ నిన్ననే మొదలయ్యింది కాబట్టి ఇంకా ముందు ముందు మరిన్ని మార్పులు/చేర్పులతో, సరికొత్త హంగులతో దినదినాభివృధ్ధి చెంది నలుగురుకీ ఉపయోగపడేలా నిలవాలని ఆశిస్తున్నాను.

ప్రస్తుతానికి ఈ సైట్ లోని సమాచారం అంతా ఆంగ్లములోనే ఉన్నది కానీ అతి త్వరలో మిగతా భాషలలో కూడా ఉంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇంతకూ ఆ సైట్ లంకె ఇక్కడ : Indian Portal For Environmental Info

More Info on this site :

A one-stop online shop for all that you want to know about environment issues - from how to install a solar water heater, to waste management and even government papers on environment - was launched Monday. An initiative of the National Knowledge Commission (NKC) and a green group, it will not only teach people how to be environment friendly but also give information to researchers, students and even lay men on environment.

ఉత్సాహం ఉన్న వారు ఒక సారి ఆ సైట్ కి వెళ్లి చూడండి మీకు ఉపయోగపడే సమాచారం ఏమన్నా ఉందేమో ...... !!!!!!!!



విషయ సూచికలు :


1 వ్యాఖ్యలు:

Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting