టపాలలో, వ్యాఖ్యలలో Hyperlinks ఇవ్వటం ఎలా?

Posted by తెలుగు'వాడి'ని on Sunday, September 7, 2008

మనమందరం కలసికట్టుగా ఈ బ్లాగింగ్ కు సంబంధించి కొన్ని Basic Features ను సరిగా ఉపయోగించగలిగితే తోటి బ్లాగర్లకు, అవి చదివే వారికి ఒక సులభమైన, సరికొత్త అనుభవాన్ని అందివ్వగలుగుతామేమో అనే ఉద్దేశ్యంతో .... అలాగే మనం అంతర్జాలంలో తరచూ చూసే Web Sites ని కూడా సరికొత్త రంగులు, హంగులతో ఒక కన్నుల పండుగగా ఎలా చూడవచ్చో కూడా చెప్పాలనే ఉద్దేశ్యంతో ... ఈ టపాను మొదలు పెడుతున్నాను.


ఇందులో భాగంగా వీలైనంత తొందరగా ఒక దాని వెంట ఒకటి మీకు పరిచయం చెయ్యటానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను. మీకు ఏవైనా సందేహాలుంటే మొహమాటపడకుండా అడగవచ్చు ఎన్నిసార్లు అయినా ...

సరే ... ముందుగా వ్యాఖ్యలలో, అలాగే టపాలలో నొక్కగలిగిన Links ఎలా చేయవచ్చో చూద్దామా ..

నాలో ఉన్న బద్దకాన్ని వదలగొట్టి, ఈ టపాను రాయించటానికి ప్రేరణ/కారణం అయిన sujata గారి గడ్డిపూలు బ్లాగ్ లో ఈద్గా - మున్షీ ప్రేంచంద్ అనే టపాకు పూర్ణిమ గారి వ్యాఖ్య నే ఇక్కడ ఉదాహరణగా తీసుకుంటున్నా ...

అసలు వ్యాఖ్య ఇలా కనిపిస్తుంది:

ఇలా వ్యాఖ్యలలో గానీ లేక టపాలలో గానీ ఇచ్చే లంకెలు చిన్నవి అయితే పాఠకులు ఆ లంకెను copy చేసుకొని వారి Browser లో Paste చేసి చూసుకోవచ్చు .. కొంచెం సమయం తీసుకుంటుందనే కానీ కనీసం ఆ లంకెను చేరుకోవటానికి మరియు ఆ లంకెలో ఏముందో తెలుసుకునే అవకాశం ఉంది ..............

కానీ ఈ వ్యాఖ్యలో ఇచ్చిన లంకెలు కొంచెం పెద్దవి అవటంతో మీరు ఆ లంకె copy చేసినా పని చెయ్యదు .. ఎందుకంటే కనపడేంతవరకే copy చేస్తుంది ... అప్పుడు ఏమి చెయ్యాలి అంటే ... ఇలాంటి పెద్ద లంకెలు ఉన్నప్పుడు లేదా మీరు copy చేసిన లంకె పనిచేయనప్పుడు, ఆ లంకె కింద ఉన్న వాక్యాన్ని కూడా copy చేయండి ... దానిని మీరు Notepad/Wordpad లో Paste చేసి చూస్తే మీకు పూర్తి లంకె కనపడుతుంది.

========================================
http://video.google.com/videoplay?docid=-5016652019240432545

హావెల్ ఆడ్స్ పై ఒక బిజినెస్స్ వ్యాసం:
http://www.thehindubusinessline.com/catalyst/2008/07/03/stories/2008070350160400.htm

మీ వల్లే దొరికిందీ వ్యాసం, అందుకు మీకు ధన్యవాదాలు!
========================================

ఇప్పుడు పైన ఉన్న Image లో ఉన్న వ్యాఖ్యలో ఉన్న లంకెలు మరియు ఇక్కడ Paste చేసిన దానిలో ఉన్న లంకెలను తరచి చూస్తే తేడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది.

...... సరే ఈ తలనొప్పి అంత లేకుండా సులభంగా చేయటం ఎలా అంటారా .... చూడండి మరి ......

  • ఇందుకు మనం వాడవలసింది Anchor Tag మరియు href అనే attribute .... టపాలలో మాత్రమే అయితే target అనే attribute కూడా వాడవచ్చు ...
  • ముందుగా ఆ లంకె దేనికి సంబందించిందో మీకు తెలిసే ఉంటుంది కదా . ఉదాహరణకు మొదటి లంకె Havells Cables గురించి ...
  • ఇక పోతే మీ దగ్గర లంకె ఎలాగూ సిధ్ధంగానే ఉంది కదా ...
ఇప్పుడు వాటిని మారిస్తే ఇలా ఉంటుంది :::::

Havells Cables
What does the mother brand stand for?

ఎలా చేయాలి అనేది తెలుసుకోవటానికి కింద ఉన్న Image ను చూడండి... [ నేను పైన చెప్పినది అంతా చూసో/చదివో .. కష్టమనుకోవద్దు .. కంగారు పడకండి .. నిజ్జంగా చాలా సులభం .. ]


ఇక చివరిగా ఇదే విషయాన్ని టపాలలో చేయటం ఎలా అనేది కూడా చూద్దామా .. అంటే ఇలా మన సొంతంగా కాకుండా .. బ్లాగర్ వాళ్లు ఇచ్చిన options ద్వారా ..

మీరు బ్లాగర్ లో ఉన్న Post Editor లో ఉన్నప్పుడు Edit HTML mode లో గానీ లేక Compose mode లో గానీ ఉండే అవకాశం ఉంది.


పైన చెప్పిన ఏ mode లో ఉన్నా అందులో కనిపించే Link అనేదే మీరు ఉపయోగించవలసింది ...

1. ఏ పదాన్ని/వాక్యాన్ని అయితే మీరు అంటే నొక్కటానికి వీలుగా చేయదలచుకున్నారో ముందుగా వాటిని చేసుకొండి.

2. తరువాత మీరు ఆ Link అనే option ను నొక్కండి ... అప్పుడు వచ్చే window లో ఆ లంకెకు సంబంధించిన లంకె అడ్రస్ ను టైప్/పేస్ట్ చేయండి. [ OK నొక్కాలి సుమా :-) ]


ఇంక అంతే ... అయిపోయింది మరి ... ఇక ఏదైతే అదే అవుతుంది :-)

ఇదే విషయాన్ని రెండు మూడు రకాలుగా(tinyURL, Blogger Advanced Comment Editor) కూడా చేయవచ్చు .. వచ్చే టపాలలో వాటి గురించి కూడా చెప్పటానికి ప్రయత్నిస్తాను

:::::::::::::::::::::::::::::::::::::::::

నేను మొదటిగా అనుకున్న టైటిల్ ఇది : Colorful Browsing ... Spicy Blogging ... దానిని తెలుగులోకి మారిస్తే అంతర్జాల విహారానికి రంగులద్దండి ... బ్లాగింగ్ కు మసాలా దట్టించండి అయ్యింది :-)

:::::::::::::::::::::::::::::::::::::::::



విషయ సూచికలు :


15 వ్యాఖ్యలు:

Unknown on Sep 8, 2008, 12:15:00 AM   said...

మంచి విషయం చెప్పారు. HTML తెలియని పాఠకులకు యిది ఎంతో ఉపయోగపడుతుంది. ఇవి వాడి వారి వారి బ్లాగుల్లోని, వ్యాఖల్లోని లంకెలను ఎక్కువ ఊపయోగకారులుగా చేయవచ్చు.


Ramani Rao on Sep 8, 2008, 1:32:00 AM   said...

నాకు కావాల్సిన సమాచారమే ఇది నేను ఈ లింక్ ల విషయంలో చాలా వెనకబడి ఉన్నాను. అర్ధం కాలేదు మళ్ళీ ఇంకోసారి చదవాలి.


Purnima on Sep 8, 2008, 10:56:00 AM   said...

నా బద్ధకం మీకు పని పెట్టింది మాట! ;-)

మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు! మరిన్ని టపాల కోసం ఎదురు చూస్తుంటాను.


Ramani Rao on Sep 17, 2008, 4:26:00 AM   said...

నెనర్లు తెలుగు 'వాడి ' ని గారు! నిజానికి నాకసలు ఈ వ్యాఖ్యల్లో గాని, పోస్ట్ లో కాని పేర్ల ద్వారా లింక్ ఇవ్వడం అసలు రాదు ఇప్పుడే నేర్చుకొన్నా మీ ఈ టపా ద్వార. జస్ట్ ఇక్కడే చేస్తున్నా చూడండి నా పేరు క్లిక్ చేస్తే నా టపాలోని కామెంట్స్ వస్తున్నాయా, రావట్లేదా అన్నది మీరే చెప్పాలి.



రమణి


Ramani Rao on Sep 17, 2008, 5:15:00 AM   said...

తెలుగు వాడిని గారు మీకు చాలా చాలా అభినందనలు + ధన్యవాదములు. మీరు ఇప్పుడు కింద ఇచ్చిన నా పాత పోస్ట్ చూడండి.
నివేదిక
అందులో పేర్లన్నిటికి లింకులు చేర్చాను మీ దయవల్ల.

మరీ బలవంతంగా పాత పోస్ట్ లు చదవమంటున్నానని తిట్టుకోకండి. కొత్తగా నేర్చుకొంటున్నా కదా! కొత్త బిచ్చగాడు పొద్దెరగడట కదా సో!! ....

మళ్ళీ ఇంకోసారి నెనర్లు.


తెలుగు'వాడి'ని on Sep 17, 2008, 7:12:00 AM   said...

రమణి గారు : రెండిటికీ(లో) మీరు ఇచ్చిన/చేసిన లింక్స్ చక్కగా పనిచేస్తున్నాయి. కార్యసాధకులు. అభినందనలు. చేయటమే కాకుండా మరలా వచ్చి ఇక్కడ వ్యాఖ్యానించినందులకు మీకు ధన్యవాదములు.

తిట్టు కోవటం ఏమీ లేదు లేండి. ఇంత చిన్న వాటికి, ఇలాంటి వాటికి తిట్టుకుంటానా :-( సాంకేతికపరమైన విషయాలకు సంబంధించి మీరు ఎన్ని సార్లు అయినా, ఎన్ని విషయాలు అయినా అడగండి. నేను ఖచ్చితంగా ఓపికగానే సమాధానాలు ఇస్తాను.

సూచన : మొదటిసారి కాబట్టి సాధనకు బాగా ఉపయోగపడి ఉంటుంది కాబట్టి ఓకే .. కాకపోతే మీ నివేదిక టపాలో ఒక పేరుకి ఒక సారి లింక్ ఇస్తే చాలు ... ప్రతిసారీ అవసరం లేదు (ఇవ్వగలిగే ఓపిక ఉంటే మంచిదే :-)


Anonymous on Sep 18, 2008, 1:25:00 AM   said...

సర్,ఈమద్యనే బ్లాగ్ మొదలు పెట్టాను అన్ని సందేహాలే. మీ నుండి శ్రీధర్ గారి కొన్ని విషయాలు నేర్చుకున్నను.
కొంతమంది పెద్ద మనసు గల బ్లాగర్లునన్ను ప్రొత్సహించదానికి కొన్ని సలహాలు కుడా ఇచ్చారు
ఇప్పుడు మీరు చెప్పిన విష యం కుడా చాల రొజులుగా నేను బుర్ర బధలు కొట్టుకున్నదే. మీరు ఒకసరి శ్రమ అనుకోకుండ నా బ్లాగు కు
వచ్చి దానిలోని లోపలు మర్పులు తెలియ చేయ గలరా? please.....please....please.


తెలుగు'వాడి'ని on Sep 18, 2008, 7:41:00 PM   said...

lalitha గారు :

1. ముందుగా మీ టెంప్లేట్ ను మార్చటానికి ప్రయత్నించండి అంటే 3- ఉండేటట్లు చూడండి . దీని వలన ఎక్కువ తో మీ బ్లాగ్ లోని సమాచారాన్ని చూపించటానికి వీలౌతుంది.

Columsn Template
Dicas Template
Girly Pink Template
Genkit Template

Few More 3-Columns Templates

2. మీ Header Image చాలా పెద్దదిగా ఉంది. కొంచెం చిన్నది చేయండి.

3. మీ బ్లాగ్ లోని Text Font Size కొంచెం తగ్గించండి. అక్షరాలు మరీ పెద్దవిగా కనిపిస్తున్నాయి.

4. కుడివైపు సైడ్ బార్ లో లేబుల్స్ కూడా చూపించండి. అలాగే Recent Comments అనే Page Elements ని కూడా జతచేయండి

For Labels :

Layout -> Page Elements -> Add a Gadget or Page Element -> Labels

For 'Recent Comments' :

Layout -> Page Elements -> Add a Gadget or Page Element -> Feed

URL : http://naaspandhana.blogspot.com/
feeds/comments/default

మీకు నచ్చితే ముందు ఇవి చేసి చూడండి. అప్పుడు మీ బ్లాగ్ ను చూసి మరిన్ని మార్పులు చేర్పుల గురించి ఆలోచిద్దాం.


తెలుగు'వాడి'ని on Sep 18, 2008, 7:45:00 PM   said...

@madhu : మీరు పోస్ట్ రాసేటప్పుడు ఎడిటర్ లో కింద Labels అని ఉంటుంది చూడండి. అక్కడ ఇవ్వండి. ఒకటి కన్నా ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే, కామా(,) తో సెపరేట్ చేయండి.


Anonymous on Sep 19, 2008, 1:29:00 AM   said...

THANKYOU
ఇంత వివరం గా ఇన్ని వివరాలు చెప్పిన మీకు ఎన్ని థేంక్సులు చెప్పిన తక్కువేనేమో !
మీరు చెప్పినట్టు font sige తగ్గించాను.
లేబుల్స్ పెట్టాను.
recentcomment లో url ఏది type చేయలి?
URL : http://naaspandhana.blogspot.com/ అని చేస్తే invalid అని వస్తుంది?
header image సైజ్ తగ్గించడం రాలేదు.
అందుకే image తీసేసాను.
ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది, template మార్చడం కొంచెం రిస్క్ అనిపించి JYOTHI గారి helpఅడిగాను.
మీ వివరణ నా లాంటి కొత్త బ్లాగరులకు చాల మందికి ఉపయోగ పడుతుంది.
thankyou soo much ఇంత కంటే పెద్ద మాట తెలియదు.


తెలుగు'వాడి'ని on Sep 19, 2008, 10:00:00 AM   said...

lalitha గారు : You are most(always) welcome. మీరు చాలా వేగంగా మార్పులు చేశారే .. ఇప్పుడు చాలా బాగుంది మీ బ్లాగ్, font size తగ్గించిన తరువాత.

Recent Comments Feed URL :

URL రెండు లైన్స్ లో ఇచ్చింది మొత్తం కలిపి ఇవ్వాలి.

http://naaspandhana.blogspot.com/feeds/comments/default

టెంప్లేట్ మార్చాలి మరియు అందులో మార్పులు/చేర్పులు చేయాలి అని ఉరకలేసే ఉత్సాహానికి జ్యోతి గారి సహాయసహకారాలు తోడైతే మీ బ్లాగ్ సర్వాంగసుందరంగా మారటాం క్షణాల పని. Good Luck.

టెంప్లేట్ మార్చిన తరువాత ఇంకా ఏవైనా మార్పులు చేర్పుల గురించి ఆలోచిద్దాం. కానీ చేయటానికి ఏమన్నా మిగిలి ఉంటుందా అనేది నాకు సందేహమే ఎందుకంటే మీకు సహాయం చేసేది జ్యోతి గారు కాబట్టి. మీరు ఊహించిన వాటికన్నా ఎక్కువ options తో మీ బ్లాగ్ ను కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేస్తారంటే నమ్మండి.


Anonymous on Sep 19, 2008, 11:39:00 PM   said...

మీకు వేల వేల నెనర్లు.
మీరు చెప్పినట్టే comments element add చేసాను. ఇక template మార్పు
కోసం జ్యోతి గారి వెంట పడాలి. వుంటానండీ.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting