WordPress బ్లాగ్ లో వ్యాఖ్యల Fields ను Autofill చేయటం ఎలా?

Posted by తెలుగు'వాడి'ని on Monday, September 15, 2008

ఇంతకు ముందు టపాలో మనం ... టపాలలో, వ్యాఖ్యలలో హైపర్ లింక్స్ ఇవ్వటం ఎలా అనేది చూశాము కదా .. ఈ టపాలో బ్లాగ్ లో వ్యాఖ్యలకు సంబందించిన Text Fields లో పేరు, ఈమెయిల్, సైట్/బ్లాగ్ అడ్రస్ automatic గా fill చేయటం ఎలా అనేది చూద్దాం.

[ ఈ Greasemonkey Add-on వలన ఇదొక్కటే ఉపయోగం కాదండీ .. ఇంకా చాలా చాలా ఉన్నాయి ... నిదానంగా వాటి గురించి కూడా తెలుసుకుందాం ]


1. ముందుగా మీరు Greasemonkey అనే Firefox Add-on ను install చేయండి.

Greasemonkey : Firefox Add-on

మీరు పైన ఉన్న లింక్ ను నొక్కినప్పుడు Greasemonkey కు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది.

ఇప్పుడు Add to Firefox అనే బటన్ మీద నొక్కండి.

అప్పుడు open అయ్యే కొత్త window లో 'Install' అనే బటన్ ను నొక్కండి.

2. ఇప్పుడు మనం అసలు Script : Blog Comment Auto Fill ను install చేయాలి.

Script : Blog Comment Auto Fill

ఇప్పుడు కుడి వైపున కనిపించే Install this script అనే ఇమేజ్/బటన్ ను నొక్కండి.

అప్పుడు open అయ్యే కొత్త window లో install అనే బటన్ ను నొక్కండి.

ఈ script మొట్ట మొదటి సారి లోడ్ అయినప్పుడు మీ పేరు, ఈమెయిల్, బ్లాగ్/సైట్ అడ్రస్ అడుగుతుంది.

అంతే ... ఇక అప్పటి నుంచి మీరు ఏ Wordress or Typepad బ్లాగ్ కు సంబంధించిన వ్యాఖ్యల పేజ్ లోకి వెళ్లినా అందులోని పేరు, ఈమెయిల్, బ్లాగ్/సైట్ అడ్రస్ గా fఇల్ల్ అయి ఉంటాయి. మీరు హాయిగా వ్యాఖ్య రాసుకోవటమే ...

[ మీకు కొంచెం ఉత్సాహం ఉంటే పైన ఇవ్వబడిన అనే UserScrips.org  సైట్ లో అంతర్జాల విహారానికి అంటే మీరు బ్రౌజ్ చేసే సైట్స్/బ్లాగ్స్ లో చాలా వాటిని మీకు నచ్చిన రంగులలోకి మార్చుకోవచ్చు .. వీటి గురించి కూడా వీలైతే త్వరలో చూద్దాం ]

చివరిగా ఎలా ఉంటుంది అంటే ..


ఏమైనా సందేహాలున్నా ... ఇక్కడ ఇచ్చిన instructions సరిగా పనిచేయకపోయినా వ్యాఖ్యగా అడగండి. సాధ్యమైనంత త్వరగా సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తా ...



విషయ సూచికలు :


1 వ్యాఖ్యలు:

Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting