Future Posts - How/when this will be posted?

Posted by తెలుగు'వాడి'ని on Wednesday, September 3, 2008
విషయ సూచికలు :


25 వ్యాఖ్యలు:

Dreamer on Sep 4, 2008, 1:00:00 AM   said...

మేష్టారూ, ప్రాక్టికల్ జోకులెయ్యడం ఎలా ? అన్న అంశం మీద మన బ్లాగరులకి శిక్షణ ఇవ్వటంలో ఇది మొదటి పాఠం కాదు కదా ???


Ramani Rao on Sep 4, 2008, 1:34:00 AM   said...

నాకయితే ఇక్కడ, పాండవులు, మయసభ, దుర్యోధనుడు, ఎక్కడో దాక్కుని నవ్వుతుందేమో అన్నట్లుగా ద్రౌపది అందరూ గుర్తొచ్చెస్తున్నారు. టైం మెషీన్ ఏమన్నా తయారు చేస్తున్నారా తెలుగు 'వాడి 'ని గారు ?

ఎవిటో! "నలుగురుతో నారాయణ, గుంపులో గొవిందా.." సెప్టెంబర్ 9 వ తారీఖు టపా అదిరింది/అదురుతుంది. ఇహనే 9 వ తారీఖు ముహుర్తం బాగానే వుంది మరి. ముందు వ్యాఖ్య తరువాత పొస్ట్ అన్నమాట. అవుడియా కూడా అదుర్స్.


సూర్యుడు on Sep 4, 2008, 6:11:00 AM   said...

May be I am lacking the context but I could not understand this post and the comments :(


Sujata M on Sep 4, 2008, 7:41:00 AM   said...

చాలా బావుంది !

ఇక్కడో పిట్టకధ చెప్పాలి మీకు. ఒకా రాజు గారు ప్రజలలో అసత్య వచనం ఎక్కువ అయిందని చెప్పి అందర్నీ ఒక రోజు కూడగట్టి 'ప్రజలారా ! నేను సత్యం పలకడం పట్ల లాభాల గురించి ఈ పుస్తకం రాశాను - రేపు ఉదయం ఈ పుస్తకం లో 17 వ అధ్యాయానికి సంబంధించి ప్రసంగించ బోతున్నాను.. కాబట్టి మీరందరూ 17వ అధ్యాయాన్ని చదువుకుని రండి !' అని తను రాశిన పుస్తకాన్ని పంచాడట.

మరుసటి రోజు - సమావేశం మొదలయింది. ప్రజలందర్నీ ఉద్ద్యేశ్యించి, రాజుగారు 'ఒకే ! మీరంతా 17వ అద్యాయం చదివి వచ్చుంటారనుకుంటా.. ఇక మొదలు పెడదామా.. ?' అని అడిగారంట. జనం అంతా 'చదివేమండీ ! ' అని బదులిచ్చేరట !

అప్పుడు రాజుగారు ఒక్క గెంతు గెంతి - ఈ సభ మీకోసమేనర్రా.. నా పుస్తకంలో అసలు 17వ అద్యాయం లేనే లేదు ! అన్నారంట.


Unknown on Sep 4, 2008, 11:17:00 AM   said...

పాపం తెలుగువాడిని గారు బ్లాగరు ఫీచరుని టెస్టు చేస్తున్నట్టున్నారు. అది పని చెయ్యనట్టుంది :)


Anil Dasari on Sep 4, 2008, 3:31:00 PM   said...

@ప్రవీణ్

నేను మాత్రం ఇదేదో రాజు గారి దేవతా వస్త్రాల టెస్టింగులాంటిదేమో అనుకుని భళి భళీ అన్నా. ఏదేమైనా ఇంత తక్కువ కంటెంటుతో ఇన్ని కామెంట్లొచ్చిన టపా బ్లాగుల చరిత్రలో ఇదేనేమో :-)


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 4:58:00 PM   said...

అబ్రకదబ్ర గారు : మీ బోణీ అదిరింది. ఆ బోణీ/చేతి చలవ మహత్యమేనండీ ఇన్ని వ్యాఖ్యలు రావటానికి కారణం. ప్రత్యేక ధన్యవాదములు.


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 5:03:00 PM   said...

Dileep.M గారు : మీరు ఈ టపా చదివినప్పటి సమాచారం ప్రకారం September 9 అన్నది సరైన సమాధానమే. కానీ అది చాలా సులభంగా మార్చవచ్చు.


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 5:09:00 PM   said...

ప్రవీణ్ గారు : మొన్నీ మధ్యనే బ్లాగర్ లో వచ్చిన ఫీచర్ ఒకటి కూడలి మొదటి పేజ్ లోని టపాలు చూపించటంపై ప్రభావితం చూపించగలిగేదిగా ఉండటంతో దాని అంతు ప్రాక్టికల్ గా తేలుద్దామని ఈ టపా రాశాను. అది నిజమేనని తేలింది. :-)


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 5:16:00 PM   said...

@శ్రీవిద్య : :-) ధన్యవాదాలు.

@Motorolan : ప్రాక్టికల్ జోకులా నా బొందా ... అయినా మన వాళ్లకి శిక్షణ అవసరం అంటారా :-)

@సూర్యుడు : Only two people know the context :-(. FYI : Just checking one of the blogger features introduced recently which I found/thought that it might effect the way the posts will be displayed in Koodali main page and proved to be correct.


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 5:19:00 PM   said...

రమణి గారు : ఏదో మీ అభిమానం గానీ, నాకు టైమ్ మెషీన్ అంత సీన్ లేదు లేండి :-) మీరు ఎలాగూ తొమ్మిదో తారీఖు టపా అదిరే టపా అన్నారు కాబట్టి అదిరినా. అదరక పోయినా మీకు బాకీ ఉన్న 'బ్లాగుల్లో వ్యాఖ్యలు' పై టపా ఆ రోజు ప్రచురిస్తా.


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 5:27:00 PM   said...

@జ్యోతి: !!!!!!!!!! ఇంకో వ్యాఖ్యలో దీనికి సమాధానం ఇస్తాను. వీలుంటే చూడండి.


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 6:11:00 PM   said...

వ్యాఖ్యానించిన ప్రతి ఒక్కరికీ మరొక్కసారి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు.

నేను బ్లాగర్ ఫీచర్ ను ప్రాక్టికల్ గా చెక్ చేద్దామనుకోవటానికి వెనుక ముఖ్య కారణం ఏమిటంటే అందుకు కారణం అయిన బ్లాగర్ తన టపాలు కూడలి మొదటి పేజ్ లో ఎక్కువ రోజులు కనపడాలని (హిట్స్, వ్యాఖ్యలు, ప్రాచుర్యం లాంటి వాటి కోసం) చూసే/ఆలోచించే వ్యక్తి అసలు కానే కాదు. తన పని ఏదో తను చేసుకునే రకం .. అలాగే తను చేయగలిగినంతలో 'తెలుగు' కు అవిరళ కృషి చేస్తున్న వ్యక్తి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండకపోతే బ్లాగర్ లోని ఆ ఫీచర్ అలా పనిచేసి కూడలి మొదటి పేజ్ లో టపాలు ఎక్కువ కాలం అన్నింటికన్నా పైనే చూపించవు కదా ...

ఇకపోతే రెండు రోజులు పోయిన తరువాత ఈ టపాను డిలీట్ చేద్దామని అనుకున్నా ... తీరా చూడబోతే టపటపా ఒక 10 వ్యాఖ్యలు వచ్చి పడ్డాయి .. ఇక తప్పలేదు నేను కూడా తిరిగి స్పందించక .. చూడబోతే ఇలాంటి టపాకు మొదటి వ్యాఖ్య రాసిన అబ్రకదబ్ర గారిదే (ఏదో సరదాకేనండోయ్) తప్పంతా నాతో పాటు ...


జ్యోతి on Sep 4, 2008, 11:32:00 PM   said...

ఐదురోజులనుండి చూస్తున్నా. వంశిగారి టపా కూడలిలో పైన ఉందేమిటా అని. అదేంటి మొన్నే కదా వీవెన్ మార్పులు చేసాడు. ఆ టపాను డిలీట్ చేసి మళ్ళీ పబ్లిష్ చేసే వ్యక్తి కాదు వంశీగారు. ఇప్పుడు మీ టపా కూడా అలాగే వస్తుంది. సో ఇద్దరికీ ఒకేరకం తాయిలం దొరికినట్టుంది. ఇదే విషయం అడుగుదామని ఇక్కడికి వచ్చేసరికి మీ సమాధానం కనపడింది.
అందుకే అన్నారు. తాడితన్నేవాడుంటే వాడి తలతన్నేవాడు పుడతాడని.


తెలుగు'వాడి'ని on Sep 4, 2008, 11:53:00 PM   said...

జ్యోతి గారు : మీరన్నట్టు తను అలాంటి వ్యక్తి కాదు ... అందులో ఇలాంటి వాటిలో వేలు పెట్టే వ్యక్తి అసలు కాదు .. అని నాకు అనిపించటంతో మరియు నేను పైన చెప్పినట్టు తన బ్లాగ్/సైట్ వాటి గురించి తన పనేదో తను చేసుకునే వ్యక్తిగా తనపై నాకున్న గౌరవంతో నేను పైన టపాలో గానీ కింద వ్యాఖ్యలలో గానీ నేను తన పేరు ప్రస్తావించటానికి ఇష్టపడలేదు.

ఇకపోతే ఇక్కడ మీరు ప్రస్తావించిన సామెత ఇక్కడ సరైనది కాదులేండి ఎందుకంటే నేను ఆ ఉద్దేశ్యంతో ఈ టపా రాయలేదు కాబట్టి.

మొన్నీ మధ్యే కూడలిలో ఒక సమస్య పరిష్కరించబడితే మరలా ఇదొక కొత్త సమస్య కాకూడదని అందుకే దీని అంతు తేల్చి, వీవెన్ గారికి దీని గురించి చెప్పి అప్రమత్తం చేద్దామనే ఉద్దేశ్యంతో రాశాను ఈ టపాను.


జ్యోతి on Sep 5, 2008, 1:33:00 AM   said...

అయ్యో ! నేను మిమ్మల్ని తప్పు పట్టటం లేదు. మనమేమో ఈ సమస్య తీరిపోయింది అనుకున్నాముకదా. కాని బ్లాగర్ లోనే ఈ అవకాశం ఉండి, అది ప్రతి ఒక్కరు కాకపోయినా. చాలా మంది ప్రయత్నిస్తే ఏమవుతుంది? అందుకే ఆ సామెత ప్రస్తావించాను. సారీ !!.కానీ దీనికి కూడా ఏదో ఒక కిటుకు ఉంటుందిలెండి.. నేను ఈ విషయంలో ఎవ్వరినీ తప్పు పట్టడం లేదు.


మాగంటి వంశీ మోహన్ on Sep 5, 2008, 10:09:00 AM   said...

teluguvADini garu

Yes, for some reason the post I published using the blogger feature (Usually I write quite a few posts at a time and schedule them. And to my surprise strangely that was the only post which did mess up and stayed on top of koodali for a while - Don't know the reason though). Anyways - hopefully veeven will look into it, if it's a KOODALI issue. :)..


తెలుగు'వాడి'ని on Sep 5, 2008, 10:37:00 AM   said...

Vamsi Garu : The feature you were referring to in the Blogger got messed up last week :-) and now it's functioning properly so no issues there.


Post a Comment

స్వాగతాభినందన ధన్యవాదములు

ప్రేరణ

తెలుగు గడ్డ మీద నుంచి అమెరికా పయనమయినది మొదలు గుండె గదుల్లో, మది పొరలలో నిద్రాణమైన అగ్నిపర్వతపు తెలుగు భాషాభిమాన భావావేశం సమకాలీన రాజకీయాలను, రాజకీయ నాయకుల చిత్తచాంచల్య పైత్యప్రకోపిత అనునిత్యపు ప్రవర్తనను, వాగ్ధానాల వాగ్భాణాల మాటల గారడీలను, తెలుగు సినీ పరిశ్రమ, అనుబంధ వ్యక్తుల పోకడలను, సగటు మనిషి జీవనశైలిని-స్థితిగతులను-పరిస్థితులను-ప్రవర్తనను పరికించి, పరిశీలించి, విశ్లేషించి, అవలోకించినపుడు ఒక్క సారిగా పెల్లుబికే ఆ లావావేశపు జ్వాలలే ఇలా నా

          మనోభావ సంకలనంగా ....
          ఊహాక్షర రూపంగా ....
          ఆలోచనల సమాహారంగా ....
Posts RSSComments RSS
Bloggerized by : GosuBlogger and GosuTrailers | By Custom Theme Design for Lyrics, SUV, Web Hosting