30 Hilarious Blogging Jokes
బ్లాగింగ్ మరియు బ్లాగర్ల మీద ఇప్పుడే చదివిన, 30 Hilarious Blogging Jokes అనే ఈ టపాను మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ...
మీరు కొంచెం ఉత్సాహంగా, ఆనందంగా ఆ టపాలోకి వెళ్లి చదవటానికో లేక తొక్కలో కార్టూన్స్, సమయం వృధా అనో అనుకునేలా చేయటానికో ... నాకు నచ్చిన కొన్ని cartoons ఇక్కడ ఇస్తున్నాను. మరి అవి ఏమన్నా మీకు ఆ సైట్ లోకి వెళ్లటానికి/వెళ్లకుండా చేయటానికి ఉపయోగపడుతాయేమో చూడండి.
ప్రేమలో పడటం :
పెళ్లి ప్రమాణాల సమయంలో :
పెళ్లి అయిన తరువాత :
పుట్టబోయే పిల్లలకు పేరు నిర్ణయించటానికి :
పిల్లలు ఆడుకోవటానికి పెట్టే కొత్త నియమం:
వాళ్ల తండ్రులు బ్లాగింగ్ చేస్తుంటే వారి పిల్లల మధ్య తగాదా వస్తే :
వృధ్ధాప్యంలో డేటింగ్ :
ఇప్పటిదాకా పైన ఉన్నవన్నీ ఒక sequence లో ఉండేలా తీసుకోవటం జరిగింది. మరి ఇప్పుడు కొన్ని వేరే వాటిని చూద్దామా ..






ఇంకా మీకు బ్లాగింగ్ కు సంబంధించిన Jokes/Cartoons ఎక్కువగా కావాలి అనుకుంటే BLaugh కు వెళ్లండి....ఆలస్యం చేయకుండా ... ఈ సైట్ మాత్రం మనమందరం తప్పక చూడ(చదవ)వలసినది. సందేహం లేదు. ఇందులో ఉన్న cartoons అన్నింటిలో తప్పక మనల్ని మనం చూసుకుని (కనీసం ఒక cartoon కి అయినా) హాయిగా నవ్వుకుంటాము అనటంలో సందేహం లేదు.
మరలా కలుద్దాం ... అతిత్వరలో . అంతవరకూ సరదాగా గడపండి.
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
మరికొన్ని అక్షర్ ధాం చిత్రాలు - కొంగొత్తవి
మొన్నీ మధ్య వికటకవి గారి బ్లాగ్ లో ఈ 'అక్షర్ ధాం' నకు సంబంధించిన చిత్రాలను చూసిన తరువాత, నా దగ్గర ఉన్న ఈ కొంగొత్త వాటిని మీకు చూపిద్దామనే ప్రయత్నమే ఇది.
ఈ slide show మొదలు కావటానికి కింద, ఎడమ వైపున మధ్యలో ఉన్న Play బటన్ నొక్కండి.
ఒకవేళ మీకు నచ్చిన వాటిని ఎంచుకుని వాటినే చూడాలి అనిపిస్తే, కుడి వైపున మధ్యలో ఉన్న బటన్ నొక్కండి.
ఒకవేళ మీకు ఈ చిత్రాలన్నింటినీ download చేసుకోవాలి అనుకుంటే ఇదిగోండి ఆ లంకె :
..........................................
అక్షర్ ధాం చిత్రాలు - కొంగొత్తవి
..........................................
వీలుంటే మరలా కలుద్దాం అతిత్వరలో :: ఎవరన్నా ఇలాంటి వాటిని నాకు forward చేసినప్పుడు !:-)
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
గూగుల్ వాడి తెలుగు తగలెయ్య !?
ఈ రోజు నేను, నా మిత్రుడు ఒకరు GChat లో ఫలానా సమయంలో మాట్లాడదామని ముందుగానే నిర్ణయించుకున్నాం. అనుకున్న సమయానికి ఇద్దరము GChat లోకి రావడం జరిగింది కానీ ఒకరికొకరం GChat లో on-line లో ఉన్నట్టు కనిపించకపోవటంతో తను Google లో కొత్త అకౌంట్ తెరవమని invitation పంపించాడు. ఇంతలో ఒకరికొకరు on-line లో చూసుకోవటంతో వెంటనే కబుర్లలో పడిపోయాము. కొంతసేపటి తరువాత సరే ఏదో కొత్త మెయిల్ వచ్చింది కదా అని open చేసి చూసా. ఆ invitation అంతా తెలుగులోనే ఉండటం ఒకటైతే, అందులోనూ ఇది నేను మొదటి సారిగా చూడటంతో కొంచెం ఓపిక చేసుకొని మెల్లగా చదవటం మొదలు పెట్టా. అందులో ఉన్న చాలా తెంగ్లీష్ పదాలు, ముఖ్యంగా సాంకేతిక పదాలు తెలుగులో వాడిన విధానం మనం కూడా వాడుతున్నాము కనుక అంత పెద్ద ఆశ్చర్యపరచలేదు కానీ ఒక్క పదం/వాక్యం మాత్రం దిమ్మతిరిగి పోయేటట్టు చేసింది.
అది మీకోసం ఇక్కడ ......
ఒకసారి మీరు అకౌంట్‌ని తెరిస్తే, <నా మిత్రుని పేరు ఇక్కడ> అది మీ ఇమెయిల్ అడ్రస్‌లో పొందుపరచబడుతుంది కాబట్టి మీరు Gmail తో సంపర్కంలో ఉండవచ్చు.
అందుకే అనిపించింది ఈ గూగుల్ వాడి తెలుగు/తెగులు తగలెయ్య అని. లేక నాకు తెలియని అర్ధం ఏమన్నా ఉందా ఈ పదానికి?
వాళ్ల ఉద్దేశ్యం 'touch' లో ఉండవచ్చు అనా?
చూద్దాం! ఎంత తొందరగా గూగుల్ వాళ్లు ఈ పదాన్ని మారుస్తారో? అదే సమయంలో ఈ గూగుల వాళ్లకి కనీసం కొన్ని పదాలకైనా అర్ధాలు, పర్యాయపదాలు, అనువాదాలు తెలియచెప్పవలసిన అవసరం ఉంది.
*****************************************
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
Indian Portal For Environmental Info
నేను బత్తీబంద్/గ్లోబల్ వార్మింగ్ అనే కార్యక్రమానికి సంబంధించి వ్రాసిన ఒక టపా గ్లోబల్ వార్మింగ్ .. ఒక “వాడి” పరిశీలన లో మనకు అందుబాటులో ఉన్న సమాచారం అంతా ఒకే చోట ఉండేలా ఒక పోర్టల్ ఏర్పాటు యొక్క ఆవస్యకతను చెప్పాను. ఇన్ని రోజులకు అదే ఉద్దేశ్యంతో/ఆలోచనలతో, నేను చెప్పినవి చాలా వరకు కుడిఎడంగా 90% ఈ సైట్ లో ఉండటం మరియు ఇండియాలో ఇలాంటి పోర్టల్స్ కి ఉన్న ఆవస్యకతను గుర్తించి వేసిన తొలి అడుగుగా అనిపించటం చాలా ఆనందంగా ఉంది. ఈ సైట్ నిన్ననే మొదలయ్యింది కాబట్టి ఇంకా ముందు ముందు మరిన్ని మార్పులు/చేర్పులతో, సరికొత్త హంగులతో దినదినాభివృధ్ధి చెంది నలుగురుకీ ఉపయోగపడేలా నిలవాలని ఆశిస్తున్నాను.
ఇంతకూ ఆ సైట్ లంకె ఇక్కడ : Indian Portal For Environmental Info
More Info on this site :
ఉత్సాహం ఉన్న వారు ఒక సారి ఆ సైట్ కి వెళ్లి చూడండి మీకు ఉపయోగపడే సమాచారం ఏమన్నా ఉందేమో ...... !!!!!!!!
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..
Logitech నుండి త్రివర్ణాల మౌస్
Plug & Play గా పనిచేసే ఇప్పుడే విడుదల చేయబడిన ఈ మౌస్ గురించి కొన్ని వివరాలు :
ధర ........ రూ: 640.
వారంటీ : మూడు సంవత్సరాలు
టెక్నాలజీ : స్విస్
ఎక్కడ లభ్యమౌతుంది అనే దాని గురించి ఇంకా తెలియదు ....
పూర్తిగా చదవాలని ఉందా . నొక్కండి మరి ఇక్కడ ఆలస్యం చేయకుండా ..